Intinti Ramayanam Avani: ఎవరీ పల్లవి రామిశెట్టి? సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న 'ఇంటింటి రామాయణం' అవని - మైథలాజికల్ మూవీలో సుభద్రగా
Pallavi Ramisetty Enters Into Movies: 'ఇంటింటి రామాయణం' సీరియల్ యాక్టర్ పల్లవి రామిశెట్టి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. 'వసుదేవసుతం' మూవీలో సుభద్ర పాత్రలో కనిపించబోతున్నది.

Pallavi Ramisetty Telugu Movie: తెలుగు సీరియల్ యాక్టర్ పల్లవి రామిశెట్టి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. తెలుగు మూవీ 'వసుదేవసుతం' సినిమా (Vasudeva Sutam Telugu Movie)లో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నది. మైథలాజికల్ టచ్‌తో సాగే ఈ మూవీలో సుభద్ర పాత్రలో పల్లవి రామిశెట్టి కనిపించబోతున్నది. ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. చెంపలపై రంగులతో చిరునవ్వులు చిందిస్తూ ఈ పోస్టర్‌లో పల్లవి రామిశెట్టి సింపుల్ లుక్‌లో కనిపిస్తోంది. ఆమె వెనుక పురాతన ద్వారక నగరం సముద్రంలో మునిగిపోతున్నట్లుగా కనిపించడం ఆసక్తిని పంచుతోంది.
ఐదు భాషల్లో 'వసుదేవసుతం'
'వసుదేవసుతం' మూవీలో మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటిస్తున్నాడు. వైకుంఠ్ బోన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, ఒరియా భాషల్లో రిలీజ్ కాబోతుంది. పోస్టర్ చూస్తుంటే హీరో సోదరిగా పల్లవి రామిశెట్టి కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతోనే పల్లవి రామిశెట్టి ఫస్ట్‌టైమ్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనుంది.
'ఇంటింటి రామాయణం'లో అవనిగా!
తెలుగులో ప్రస్తుతం 'ఇంటింటి రామాయణం' సీరియల్ చేస్తుంది పల్లవి రామిశెట్టి. ఈ సీరియల్‌లో అవనిగా ఉమ్మడి కుటుంబం పరువు కాపాడే కోడలి పాత్రలో నాచురల్ యాక్టింగ్‌తో బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తోంది. పల్లవి రామిశెట్టి పాత్ర ప్రధానంగా 'ఇంటింటి రామాయణం' సీరియల్ సాగుతోంది.
Also Read: ఈటీవీ లాంగెస్ట్ రన్నింగ్ సీరియల్‌కు శుభంకార్డు - 1552 ఎపిసోడ్స్‌తో ముగిసిన మైథలాజికల్ సీరియల్
'ఇంటింటి రామాయణం' సీరియల్ ప్రస్తుతం స్టార్ మాలో టీఆర్‌పీ రేటింగ్‌లో టాప్‌లో ఉంది. లేటెస్ట్ రేటింగ్‌లో 11.85 టీఆర్‌పీని సొంతం చేసుకున్నది. 'కార్తీక దీపం 2', 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' తర్వాత టాప్ త్రీ సీరియల్‌గా నిలిచింది.
Pallavi Ramisetty Telugu Serial List: 'ఇంటింటి రామాయణం' కంటే ముందు తెలుగులో పలు సీరియల్స్ చేసింది పల్లవి రామిశెట్టి. 'శ్రీ శ్రీమతి కళ్యాణం' సీరియల్‌లో స్మాల్ స్క్రీన్‌పైకి అడుగు పెట్టింది. 'ఆడదే ఆధారం', 'వసుంధర', 'మాటే మంత్రము', 'భార్యామణి', 'పాపే మా జీవనజ్యోతి', 'అత్తారింటికి దారేది'తో పాటు పలు తెలుగు సీరియల్స్‌లో లీడ్ రోల్స్ చేసింది. 'భార్యామణి' సినిమాకుగాను బెస్ట్ యాక్టర్‌గా నంది అవార్డును అందుకుంది. పల్లవి రామిశెట్టి హీరోయిన్‌గా నటించిన 'ఆడదే ఆధారం' సీరియల్ దాదాపు పదకొండేళ్ల పాటు టెలికాస్ట్ అయ్యింది. 3300 ఎపిసోడ్స్‌తో తెలుగులో హయ్యెస్ట్ ఎపిసోడ్స్ రన్ అయిన సీరియల్‌గా నిలిచింది.





















