Etv Sadguru Sai Serial: ఈటీవీ లాంగెస్ట్ రన్నింగ్ సీరియల్‌కు శుభంకార్డు - 1552 ఎపిసోడ్స్‌తో ముగిసిన మైథలాజికల్ సీరియల్
Sadguru Sai Serial OTT: ఈటీవీలో లాంగెస్ట్ రన్నింగ్ సీరియల్‌గా కొనసాగుతున్న 'సద్గురు సాయి'కి మేకర్స్ సడెన్‌గా ఎండ్ కార్డు వేశారు. 1552 ఎపిసోడ్స్‌తో ఐదేళ్ల పాటు ఈ సీరియల్ ప్రసారమైంది.

ఇప్పటి వరకు ఈటీవీలో టెలికాస్ట్ అయిన, అవుతున్న సీరియల్స్‌లో లాంగెస్ట్ రన్నింగ్ సీరియల్ ఏది? అంటే 'సద్గురు సాయి' సీరియల్ టాప్ 10లో ఒకటి అని చెప్పాలి. ఎపిసోడ్స్ పరంగా మిగిలిన సీరియల్స్‌ను దాటేసిన 'సద్గురు సాయి' టాప్ ప్లేస్‌లో ఉంది. ఇటీవలే 1550 ఎపిసోడ్స్ పూర్తి చేసుకొని రికార్డ్ క్రియేట్ చేసిన ఈ సీరియల్‌కు మేకర్స్ సడెన్‌గా ఎండ్ కార్డు వేశారు.
ఐదేళ్లు కంటిన్యూ అయిన సీరియల్!
ఐదేళ్ల పాటు తెలుగు ప్రేక్షకులను 'సద్గురు సాయి' సీరియల్ అలరించింది. ఈ సీరియల్‌ను 1552 ఎపిసోడ్స్‌తో మేకర్స్ ముగించారు. ఎలాంటి ముందస్తు అనౌన్స్‌మెంట్ లేకుండా సడెన్‌గా 'సద్గురు సాయి'కి ఎండ్ కార్డు వేయడంపై సీరియల్ ఫ్యాన్స్ హర్టయ్యారు.
2020లో మొదలైన 'సద్గురు సాయి'...
'సద్గురు సాయి' సీరియల్ 2020లో మొదలైంది. హిందీ సీరియల్ 'మేరే సాయి'కి డబ్బింగ్ వెర్షన్‌గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాయిబాబా జీవిత చరిత్రను, ఆయన మహిత్యాన్ని, లీలలను అద్భుతంగా ఆవిష్కరించిన సీరియల్స్‌లో ఒకటిగా 'సద్గురు సాయి' ఆకట్టుకుంది.
జెమిని నుంచి ఈటీవీకి వచ్చిన సాయి!
ఈటీవీ కంటే ముందుగా ఈ సీరియల్ జెమిని టీవీలో 'షిరిడి సాయి' పేరుతో కొన్నాళ్లు టెలికాస్ట్ అయ్యింది. కానీ మూడు వందల ఎపిసోడ్స్‌లోపే ఈ సీరియల్‌ను జెమిని టీవీ నిలిపివేసింది. 2020లో ఈ సీరియల్‌ను 'సద్గురు సాయి' పేరుతో ఈ టీవీ డబ్బింగ్ చేసింది.
డబ్బింగ్ సీరియల్స్‌లో భారీ హిట్...
తెలుగు డబ్బింగ్ సీరియల్స్‌లో పెద్ద హిట్‌గా సద్దురు సాయి నిలిచింది. తొలుత ఆరున్నర గంటల స్లాట్‌లో మొదలైంది. ఆ తర్వాత సీరియల్ టైమ్‌ను సాయంత్రం 5.30 గంటలకు మార్చారు. ఈ సీరియల్‌లో సాయిబాబా పాత్రలో 2017 నుంచి 2019 వరకు అబీర్ సూఫీ నటించాడు. ఆ తర్వాత తుషార్ దల్వీ ఈ పాత్ర చేశాడు. సాయిబాబాను ద్వేషించి ఆ తర్వాత అతడి పరమభక్తుడిగా మారిపోయే పాత్రలో కులకర్ణి సర్కార్ కనిపించాడు. సద్గురు సాయి సీరియల్‌కు సచిన్ ఆంబ్రే, హర్ష్ అగర్వాల్ దర్శకత్వం వహించారు.
ఈటీవీలో 'అభిషేకం' సీరియల్ టాప్...
ఈటీవీలో ఎక్కువ కాలం టెలికాస్ట్ అయిన సీరియల్‌గా 'అభిషేకం' పేరిట రికార్డ్ ఉంది. 2008లో మొదలైన ఈ సీరియల్ 2022లో ముగిసింది. 4000 ఎపిసోడ్స్‌తో ఎక్కువ కాలం ప్రాసరమైన తెలుగు సీరియల్‌గా రికార్డ్ నెలకొల్పింది. లాంగెస్ట్ రన్నింగ్ ఈటీవీ సీరియల్స్‌లో సద్గురు సాయి తొమ్మిదో ప్లేస్‌లో ఉంది. ఈ సీరియల్ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read: గుండె నిండా గుడి గంటలు బాలు సక్సెస్... మరో సీరియల్ ఫ్లాప్ - విష్ణుకాంత్ కెరీర్‌లో ఊహించని మలుపు





















