అన్వేషించండి

Nuvvunte Naa Jathaga Serial Recap August 18th to 22nd:నువ్వుంటే నా జతగా సీరియల్ రీక్యాప్: మిథున-దేవా లవ్ స్టోరీలో ట్విస్ట్.. ఆదిత్య ఊరుకుంటాడా! జడ్జి ఏం చెప్తారో?

Nuvvunte Naa Jathaga Serial August 18th to 22nd Recap దేవా మంచితనం హరివర్ధన్ గుర్తించి అల్లుడిగా అంగీకరించడానికి సిద్ధం పడటంతో ఈ వారం ఎపిసోడ్స్ ఆసక్తికరంగా మారాయి.

Nuvvunte Naa Jathaga Serial August 18th to 22nd Weekly Episode మిథున-దేవా లవర్స్‌కి ఈ వారం ఎపిసోడ్స్ మొత్తం పీక్స్‌లో ఎంట్రర్‌టైన్ చేశాయి. దేవాని హరివర్ధన్ ఎప్పుడెప్పుడు అల్లుడిగా అంగీకరిస్తారా.. దేవా మిథునకు ఎప్పుడు ప్రపోజ్ చేస్తాడా అని వేయి కళ్లతో చూసిన ఎదురు చూపులకు తెర దింపేశారనే చెప్పొచ్చు. అలంకృత పుణ్యమా అని ఆల్మెస్ట్ దేవాని హరివర్ధన్ అల్లుడిగా ఓకే చెప్పేశాడు. అసలు ఈ వారం మొత్తం ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. 

అలంకృతని మినిస్టర్ కొడుకు బ్లాక్ మెయిల్ చేయడంతో అలంకృత సూసైడ్ చేసుకోవడానికి వెళ్తుంది. చివరి నిమిషంలో దేవా వెళ్లి అలంకృతని కాపాడుతాడు. అలంకృతతో బ్లాక్ మెయిల్ గురించి ఇంట్లో ఎవరికీ చెప్పొద్దని దేవా చెప్తాడు. దేవా మిథునల వరలక్ష్మీ  వ్రతం పూర్తయిన తర్వాత పోలీసులు ఎంట్రీ ఇస్తారు. జడ్జి పోలీసుల దగ్గరకు వెళ్లి నా పర్మిషన్ లేకుండా మీరు ఈ టైంలో వచ్చారేంటని అడుగుతారు. దాంతో పోలీసులు దేవాని అరెస్ట్ చేయడానికి వచ్చామని దేవా మినిస్టర్ కొడుకుని కొట్టి బట్టలు లేకుండా అతన్ని ఫొటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడతా అని బెదిరించాడని చెప్తాడు. త్రిపుర ఇదే అలుసుగా దేవా వల్ల పరువు పోయిందని తిట్టి ఇలాంటి వాడిని అల్లుడిగా అంగీకరించొద్దని మామతో చెప్తుంది. 

హరివర్ధన్ తన పరువు తీసేశాడని దేవాని లాగిపెట్టి కొడతాడు. దేవా మౌనంగా ఉంటాడు కానీ విషయం చెప్పడు. జడ్జి ఇంట్లో ఉంటూ రౌడీయిజం చేసి రావడానికి ఎంత ధైర్యంరా నీకు అని దేవా కాలర్ పట్టుకొని నువ్వు ఇంకొక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండటానికి వీల్లేదని దేవాని ఈడ్చుకెళ్లి బయటకు తోసేస్తాడు. మిథున ఎంత బతిమాలినా దేవాని క్షమించడు. ఆ మినిస్టర్ కొడుకుని ఎందుకు కొట్టాడో చెప్పమను అని అంటాడు. మిథున ఎంత అడిగినా దేవా కారణం చెప్పడు. చివరి నిమిషంలో అలంకృత తండ్రితో విషయం చెప్తుంది. బావ లేకపోయి ఉంటే ఈ రోజు మీకు నా శవం కూడా దొరికేది కాదు అని అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. దేవా చిన్నగా అలంకృత మాట్లాడకు లోపలికి వెళ్లు అంటాడు. అందరూ దేవా వైపు ఆశ్చర్యంగా చూస్తారు. ఏంటి బావ నేను మాట్లాడకుండా ఉండాలా.. నా ప్రాణాలు కాపాడి నువ్వు జైలు పాలవుతుంటే నేను మాట్లాడకుండా ఉండాలా.. నా జీవితం నిలబెట్టి నువ్వు నిందలు పడుతుంటే నేను సైలెంట్‌గా ఉండాలా అని జరిగింది అంతా చెప్తుంది. హరివర్ధన్, మిథునలు దేవా వైపు కృతజ్ఞతగా చూస్తారు. లలిత దేవాకి రెండు చేతులు జోడించి దండం పెడుతుంది. హరివర్ధన్ దేవాని కొట్టడం గుర్తు చేసుకొని కుప్పకూలిపోతాడు.  ఇక శారద పట్టరాని సంతోషంతో ఏడుస్తూ జరిగింది అంతా సత్యమూర్తి వాళ్లకి చెప్తుంది.  

దేవా ఒంటరిగా కూర్చొని ఉంటే హరివర్ధన్ వెళ్లి దేవా పక్కనే కూర్చొని భుజం మీద చేయి వేసి ఒక్క నిమిషం గుండె ఆగిపోయినంత పనైంది.. నా కూతురు చనిపోవడానికి ప్రయత్నించింది అన్న ఆలోచనే నా గుండె తట్టుకోవడం లేదు. మా కుటుంబం ఈ రోజు సంతోషంగా ఉండటానికి కారణం నువ్వే. ఒకప్పుడు నేను నిన్ను కొట్టించి జైలులో పెట్టాను. దానికి ఎవరైనా బదులు తీర్చుకోవాలి అనుకుంటారు. కానీ భుజం భరోసాగా ఇవ్వాలి అని ఎవరూ అనుకోరు. కానీ నువ్వు బదులు తీర్చుకోవాలి అనే ఆలోచనే చేయలేదు. మాకు కడుపు కోత కన్నీటి కోత రాకుండా చేశావు. నువ్వు చేసిన సాయానికి థ్యాంక్స్ చెప్పడం చిన్న మాట రుణ పడి ఉంటాను అని చెప్పడమే సరైన మాట అని దేవా చేతులు పట్టుకుంటాడు. మిథున సంతోషంగా దేవా దగ్గరకు వచ్చి మనసు పట్టలేని అంత సంతోషంగా ఉందని చెప్పి దేవా భుజం మీద వాలిపోతుంది. గడువులో గెలుస్తానో లేదో అని భయంగా ఉన్నాను కానీ నేను గెలిచాను దేవా.. నువ్వే నన్ను గెలిపించావు. లవ్‌యూ దేవా అని దేవాని వాటేసుకుంటుంది.  

మిథున హరివర్ధన్‌తో ఎదుటి వారికి హాని చేయకుండా ఉండటం సాయం చేయడం మంచి అయితే ఓ ఆడపిల్ల జీవితం కాపాడటం కోసం తన జీవితాన్ని పణంగా పెట్టాలి అనుకున్న వాడు ఇంకెంత మంచోడు అయింటాడు నాన్న. ఆడపిల్ల నలుగురిలో నవ్వుల పాలు అవ్వకూడదు అని ఆలోచించి తన భవిష్యత్ కూడా ఆలోచించలేదు. ఒక ఆడపిల్ల కోసం ఇంత ఆలోచించిన దేవా తాళి కట్టిన భార్య గురించి ఇంకెంత ఆలోచిస్తాడు మీరే ఆలోచించండి. రౌడీలు మామూలుగా ఎవరి గురించి ఆలోచించరు ఇలా తన గురించి ఆలోచించకుండా పక్కవారి గురించి ఆలోచించే దేవా రౌడీ ఎలా అవుతాడు.. దేవా గురించి ప్రత్యేకించి నేను మీకు నిరూపించాల్సిన అవసరం లేదు అనుకుంటా నాన్న అని మిథున చెప్పి వెళ్లిపోతుంది. అప్పుడే లలిత వచ్చి కరుడు కట్టిన నేరస్తులకే మారే అవకాశం ఇచ్చిన మీరు దేవాకి ఓ అవకాశం ఇవ్వలేరా. మిథునకు దేవాని దూరం చేయొద్దు అని చెప్తుంది. 

మిథునకి అందరూ అర్ధరాత్రి భర్త్‌డే విష్ చేస్తారు.  హరివర్ధన్ మిథునకు పడవంత కారు గిఫ్ట్ ఇస్తాడు. మిథున వద్దని తనకు దేవా కావాలని అడుగుతుంది. దేవా దూరం నుంచి చూసి ఈ రోజు మిథున భర్త్‌డేనా అనుకొని మిథున వస్తుంటే విష్ చేస్తాడు. మిథున చాలా ఎగ్జైట్ అవుతుంది. చాలా మంది విష్ చేశారు కానీ కొంత మంది విష్ చేస్తే చాలా స్పెషల్‌గా ఉంటుంది. నువ్వు నా మనసులో ఉండటం వల్ల నువ్వు విష్ చేయడం కొత్తగా ఉందని సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. మిథున దేవాతో ఏమైనా చెప్పాలా అంటే అవును చెప్పాలి చాలా చెప్పాలి కొన్ని మాటలు ఏకాంతంలో చెప్పాలి కొన్ని ప్రపంచానికి తెలిసేలా చెప్పాలి అందుకే నీ భర్త్‌డే సెలబ్రేషన్స్‌లో చెప్తా అంటాడు. దేవా ఐలవ్‌యూ చెప్తాడని మిథున చాలా సంబర పడిపోతుంది. హరివర్ధన్ దేవా గురించి పాజిటివ్‌గా ఆలోచిస్తుంటే ఆదిత్య వచ్చి దేవా గురించి మీరు ఆలోచించడం ఏంటి అని అడుగుతాడు. దేవాకి చాలా రుణపడిపోయాం అని హరివర్ధన్ అంటే దానికి ఆదిత్య మామయ్య మిమల్ని చూస్తుంటే దేవాని అల్లుడిగా ఒప్పుకునేలా ఉన్నారు. దేవా విషయంలో ఇంతలా పాజిటివ్‌గా మారిపోయారు అని అంటాడు. ఇంతలో త్రిపుర వచ్చి మామయ్య స్థాయి ఏంటి పరపతి ఏంటి నీ లాంటి వాడిని అల్లుడిగా చేసుకుంటారు కానీ పోయి పోయి ఆ రౌడీని అల్లుడిగా ఎలా అంగీకరిస్తారు అని అనుకుంటున్నావ్ అని ప్రశ్నిస్తుంది.  మామయ్య గారు పిచ్చోళ్లు అనుకున్నావా ఆ రౌడీని మామయ్య గారు చచ్చినా అల్లుడిగా అంగీకరించరు. అని అంటుంది.  

ఆదిత్య దేవాని చంపేయాలని అనుకుంటాడు. అందుకు ఓ సీరియల్ కిల్లర్‌ని పురమాయిస్తాడు. ఇక భర్త్‌డే వేడుక మొదలవుతుంది. మిథున అందమైన లంగావోణిలో రెడీ అయి వస్తుంది. మిథునని చూస్తూ దేవా అలాగే ఉండిపోతాడు. త్రిపుర ఫ్రెండ్స్‌ దేవాని చూసి బేరర్ అనుకొని జ్యూస్‌లు తీసుకురమ్మని  అవమానిస్తారు. దాంతో మిథున దేవాని తీసుకెళ్లి అదిరిపోయేలా జడ్జిగారి అల్లుడురా అనేలా సూటు బూట్‌లో రెడీ చేస్తుంది. ఎవరైతే అవమానించారో వాళ్ల దగ్గరకు తీసుకొచ్చి వార్నింగ్ ఇస్తుంది. 

సత్యమూర్తి ఇద్దరు కొడుకులు కోడళ్లతో మిథున పుట్టింటికి వస్తాడు. శ్రీరంగం మిథున పుట్టిళ్లు చూసి దేవా తంతే బూరెల గంపలో పడినట్లు గొప్పింటి అల్లుడు అయిపోయాడు అని అంటాడు. ఆనంద్ కూడా చూసి వాడికి అదృష్టం తెనే పట్టులా మారింది అనుకుంటాడు. కాంతం అయితే కుళ్లుకుంటుంది. అందరూ మిథునకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తారు. దేవాని సూట్‌లో చూసి అన్నలు సూపర్‌రా అని అని అంటారు. ఇక ప్రమోదిని దేవాతో మిథున గెలిచేసింది దేవా మీ మామయ్య గారు నిన్ను అల్లుడిగా అంగీకరిస్తారు అని అంటుంది. త్రిపుర కాంతంతో ఏదైనా గొడవ పెట్టమని అంటే కాంతం కావాలనే త్రిపురతో గొడవ పెడుతుంది కానీ అది అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది.  

సత్యమూర్తి వాళ్లని త్రిపుర వెళ్లిపోమని పంపేస్తే హరివర్ధన్ ఆపి రండి సత్యమూర్తి గారు వచ్చి కూర్చొండి అని మర్యాదలు చేస్తాడు. మీరు మాకు బాగా బాగా కావాల్సిన వాళ్లు నా వియ్యంకులు అని అంటారు. సత్యమూర్తి వాళ్లు చాలా సంతోషపడతారు. హరివర్ధన్ సత్యమూర్తిని స్వయంగా తీసుకెళ్లి ముందు కూర్చొని జ్యూస్ ఇచ్చి మర్యాద చేస్తారు. ఇక పార్టీలో హరివర్ధన్ దేవాని అల్లుడిగా అంగీకరించి దేవా మిథునలను కలిపేసినట్లు ఆదిత్య కలకంటాడు. దేవాని అల్లుడిగా అంగీకరిస్తే నాకు జీవితమే లేదని దేవాని చంపేయాలని అనుకుంటాడు. దేవా మిథునకు తన మనసులో మాట ఎలా చెప్పాలా అని తెగ కంగారు పడుతుంటాడు. ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం అనుకొని చేతిలో గులాబి పట్టుకొని కళ్లు మూసుకొని ప్రపోజ్ ప్రాక్టీస్ చేస్తాడు. మిథున అటుగా వెళ్తూ ఆగుతుంది. మిథున అంటూ దేవా చెప్పడం మొదలు పెడితే సరదాగా నవ్వుకుంటుంది. దేవా ధైర్యం తెచ్చుకొని చెప్పే టైంకి మిథున ఇప్పుడు నాకు వినాలి అని లేదు అని చెప్పేసి దేవాని ఆటపట్టిస్తుంది. సూటిగా చూడకు సూదిలా నవ్వకు అని దేవా సాంగ్ వేసుకుంటూ సిగ్గు పడుతూ స్టెప్పులేస్తూ మిథున వెనకాలే తిరుగుతూ ఉంటాడు. మిథున ఎంజాయ్ చేస్తుంటుంది. ఓ చోట మిథునని ఆపి కాళ్లకి పట్టీలు పెడతాడు. ఇక కాంతం సీరియల్ కిల్లర్‌ దగ్గర గన్‌ చూసి ప్రశ్నిస్తుంది. ఇవి ఈ వారం హైలెట్స్. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Pragathi : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
Embed widget