Nuvvunte Naa Jathaga Serial Today August 21st: నువ్వుంటే నా జతగా సీరియల్: సత్యమూర్తిని వియ్యంకుడిగా అంగీకరించిన జడ్జి.. మిథున కల నెరవేరడానికి అడుగు దూరం!
Nuvvunte Naa Jathaga Serial Today Episode August 21st హరివర్ధన్ సత్యమూర్తిని వియ్యంకుడిగా అంగీకరించి మర్యాదలు చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున దేవాని త్రిపుర ఫ్రెండ్స్ అవమానించారని దేవాని తీసుకెళ్లి రాజులా రెడీ చేసి జడ్జి గారి అల్లుడురా అనేలా రెడీ చేసి తీసుకొచ్చి వాళ్లు ముందు నిల్చొపెడుతుంది. “సాహసమే శ్వాసగా సాగిపో మూవీలోని తాను నేను కలువా కొలను.. తాను నేను పైరు చేను” బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో ఎంట్రీ వేరే లెవల్‌లో ఉంటుంది.
మిథున దేవాని వాళ్ల దగ్గరకు తీసుకెళ్లి ఇందాక చీప్‌గా ఉన్నాడు అని అన్నారు.. ఇప్పుడేమో హ్యాండ్‌సమ్ అని అంటున్నారు. మంచి బట్టలు వేసుకుంటే హీరో అనడం మామూలు బట్టలు వేసుకుంటే చీప్ అనడం దీని బట్టే తెలుస్తుంది మీ క్యారెక్టర్ అని ఫుల్ క్లాస్ ఇస్తుంది. దెబ్బకి త్రిపుర, రాహుల్ కూడా సైలెంట్ అయిపోతారు. నా భర్త కాబట్టి సైలెంట్‌గా ఉండిపోయాడు.. అదే ఇంకెవరు అయింటునా.. సంస్కారం విషయంలో నా భర్త మీ కంటే చాలా రిచ్.. మా ఆయన్ను అవమానిస్తే అది ఎవరు అయినా చూడను అని ఫుల్గా ఇచ్చిపడేస్తుంది.
ప్రమోదిని మామతో చూశారా మామయ్య దేవాని ఒక్క మాట అన్నందుకు మిథున ఎలా సమాధానం చెప్పింది దేవాకి ఇంత కంటే మంచి భార్య ఎక్కడ దొరుకుతుందని అని అంటుంది. మిథున మామయ్య దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకుంటుంది. ఎలా ఉన్నారు మామయ్య అని మిథున అడిగితే గర్వంగా ఉన్నానమ్మా అని అంటారు. అందరూ మిథునకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తారు. దేవాని సూట్‌లో చూసి అన్నలు సూపర్‌రా అని అని అంటారు. ఇక ప్రమోదిని దేవాతో మిథున గెలిచేసింది దేవా మీ మామయ్య గారు నిన్ను అల్లుడిగా అంగీకరిస్తారు అని అంటుంది.
మిథున దేవా ఒకర్ని ఒకరు చూసుకుంటారు. ఇద్దరిని ఆదిత్య చూస్తాడు. ఈ రోజు మిథున పుట్టిన రోజు కాదు దేవా చావు అని అనుకుంటాడు. ఆదిత్య దేవాని చంపడానికి వస్తున్నా రౌడీ కోసం ఎదురు చూస్తుంటారు. రౌడీ రాగానే సెక్యూరిటీ వాళ్లు చెక్ చేస్తుంటే ఆదిత్య ఆపుతాడు. అతన్ని తీసుకెళ్తాడు. మరోవైపు కాంతాన్ని త్రిపుర పిలిచి గొడవ మొదలు పెట్టమని అంటుంది. కాంతం ఏం చేయాలి అని అనుకుంటే త్రిపుర కాంతంతో గొడవ మొదలు పెట్టమని అంటే జ్యూస్ తాగుతావేంటి అని అంటుంది. దాంతో సూర్యకాంతం త్రిపుర ముఖం మీద జ్యూస్ కొడుతుంది. గొడవ మొదలు పెట్టమని అంటుంది. ఇద్దరూ గొడవ మొదలు పెడతారు. సత్యమూర్తి వచ్చి ఎందుకు ఈవిడతో గొడవ పడుతున్నావ్ అంటే ఆవిడ మాటలకు గొడవ పడాలి అని ఇద్దరూ గొడవ పడతారు.
త్రిపుర సత్యమూర్తి వాళ్లతో చీప్‌గా ఎక్కడో ఉండాల్సిన మీరు వీఐపీలు కూర్చొనే ముందు వరసలో కూర్చొంటారా.. అని తిడుతుంది. లలిత పిన్ని గారు రమ్మని చెప్తే వచ్చామని ప్రమోదిని చెప్తుంది. త్రిపుర వాళ్లతో ముందు ఇక్కడ నుంచి నడవండి.. పిలవగానే వచ్చేయడమే కాదు.. సిగ్గు లేదా పోండి అని అంటుంది. సత్యమూర్తి వాళ్లు తల దించుకొని వెళ్లిపోతుంటే జడ్జి గారు వచ్చి మాస్టారు అంటారు. సత్యమూర్తి ఆపి.. రండి సత్యమూర్తి గారు వచ్చి కూర్చొండి అంటారు. లేదండీ పని ఉంది అని సత్యమూర్తి అంటే ఈ రోజు మిథునకు తండ్రిగా నా ఆశీర్వాదం ఎంత ముఖ్యమో మీది అంతే ముఖ్యం అని అంటారు. త్రిపుర షాక్ అయిపోతుంది. ముక్కూ ముఖం తెలియని వాళ్లు అని అంటుంది. దాంతో హరివర్ధన్ వీళ్లు ముక్కూ ముఖం తెలియన పరాయి వాళ్లు కాదు మనకు బాగా కావాల్సిన వాళ్లు నా వియ్యంకులు అని అంటారు. సత్యమూర్తి వాళ్లు చాలా సంతోషపడతారు.
హరివర్ధన్ సత్యమూర్తిని స్వయంగా తీసుకెళ్లి ముందు కూర్చొని జ్యూస్ ఇచ్చి మర్యాద చేస్తారు. ప్రమోదిన మామతో జడ్జి గారు ఒకప్పుడు ఓరేయ్ అని మీ కాలర్ పట్టుకున్నారు ఇప్పుడు మిమల్ని వియ్యంకుడు అన్నారు. ఈ మార్పునకు దేవానే కారణం అని అంటుంది. ఇక జడ్జి అందరితో మాట్లాడుతారు. నా కూతురు జీవితానికి సంబంధించి ముఖ్యమైన విషయం చెప్పనున్నానని అంటారు. నా కూతురు నాకు 22 ఏళ్లుగా తెలుసు తన ఇష్టాలు అన్నీ నాకు తెలుసు అన్ని విషయాల్లో ఒకేలా ఉండే మేం తన జీవిత భాగస్వామి విషయంలో ఇద్దరి అభిప్రాయాలు మారిపోయావి. 22 ఏళ్లు అపురూపంగా పెంచుకున్న నా కూతురి మెడలో ఓ బజారు రౌడీ తాళి కడితే నేను అతన్ని అల్లుడిగా ఒప్పుకుంటానా నేను అయినా ఎందుకు ఒప్పుకుంటాను. ఈ సమాజంలో నా అల్లుడికి ఒక పేరు ప్రతిష్ఠ ఉండాలి అనుకున్న నేను ఒక రౌడీ చేతిలో నా కూతురిని ఎలా పెడతాను.. రౌడీతోనే నా జీవితం అని నా కూతురు అంటే నేను ఎలా ఒప్పుకుంటాను అని అంటారు. హరివర్ధన్ మాటలకు మిథున వాళ్లు షాక్ అయిపోతారు. త్రిపుర, ఆదిత్య హ్యాపీగా ఫీలవుతారు.
దేవా తన కూతురికి తగిన భర్త కాదు అని హరివర్ధన్ అంటాడు. ఒక వ్యక్తిగా కూడా దేవాకి మంచి లక్షణం లేదు అని అంటాడు. అతనితో ఉంటే నా కూతురి ప్రాణానికి ప్రమాదం ఏర్పడొచ్చు అని అంటాడు. ఈ పెళ్లిని నేను ఎలా ఆశీర్వదించగలను.. అతన్ని నా అల్లుడిగా ఎలా అంగీకరించగలను అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Before You Go
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
ట్రెండింగ్ వార్తలు





















