Nuvvunte Naa Jathaga Serial Today August 20th: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథునకు దేవా ఇస్తానన్న సర్‌ఫ్రైజ్ ఏంటి? జడ్జి దేవాని అంగీకరిస్తాడా? ఆదిత్య మాస్టర్ ప్లాన్!
Nuvvunte Naa Jathaga Serial Today Episode August 20th మిథున భర్త్‌డే సెలబ్రేషన్స్‌లో దేవా మిథునకు ఐలవ్యూ చెప్పాలని అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున పుట్టిన రోజుని హరివర్ధన్ వాళ్లు అర్ధరాత్రి సెలబ్రేట్ చేస్తారు. దేవా చూసి ఈ రోజు మిథున భర్త్‌డేనా అనుకొని మిథున వస్తుంటే విష్ చేస్తాడు. మిథున చాలా ఎగ్జైట్ అవుతుంది. చాలా మంది విష్ చేశారు కానీ కొంత మంది విష్ చేస్తే చాలా స్పెషల్‌గా ఉంటుంది. నువ్వు నా మనసులో ఉండటం వల్ల నువ్వు విష్ చేయడం కొత్తగా ఉందని సంతోషంతో మిథున ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది.
మిథున మనసులో దేవా నువ్వు పుట్టిన రోజు విష్ చేస్తేనే నా మనసు ఇంతలా ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నా అని చెప్తే ఇంకెంత పొంగిపోతుందో నా మనసు ఎప్పుడెప్పుడు ఐలవ్‌యూ మిథున అని చెప్తావా అని వెయిట్ చేస్తున్నా దేవా అని అనుకుంటుంది. ఇక దేవా మనసులో మిథున నువ్వు ఏ మాట కోసం ఎదురు చూస్తున్నావో నాకు తెలుసు నీ మనసుకి ఎక్కడలేని సంతోషం ఇచ్చే మాట చెప్పాలని నేను చాలా ప్రయత్నిస్తున్నా కానీ ఏదో తెలియని దిగులు ఆ మాటని నా గొంతు దాటనివ్వడం లేదు కానీ నీ పుట్టిన రోజు సెలబ్రేషన్స్‌లో అందరి ముందు ఐలవ్‌యూ మిథున అని చెప్తాను. నీ కళ్లలో కనిపించే వెలుగుని జీవితాంతం అపురూపంగా మంచి జ్ఞాపకంగా దాచుకుంటా అనుకుంటాడు.
మిథున దేవాతో ఏమైనా చెప్పాలా అంటే అవును చెప్పాలి చాలా చెప్పాలి అంటే అయితే చెప్పు అని మిథున అంటే కొన్ని మాటలు ఏకాంతంలో చెప్పాలి కొన్ని ప్రపంచానికి తెలిసేలా చెప్పాలి అందుకే నీ భర్త్‌డే సెలబ్రేషన్స్‌లో చెప్తా అంటాడు. మిథున చాలా సంబర పడిపోతుంది. దేవా మిథునతో నేను పుట్టిన రోజు విష్ చేసి చాలా ఏళ్లు అయిపోయింది. నా గుండె బండరాయిగా మారిపోయింది. చాలా ఏళ్ల తర్వాత నేను విష్ చేసింది నీకే. నీ భర్త్‌డే సెలబ్రేషన్స్‌లో నీకు అదిరిపోయే గిఫ్ట్ ఇస్తా ప్రామిస్ అని అంటాడు. మిథున చాలా సంబర పడిపోతుంది. అక్క సంతోషం చెల్లి చూస్తుంది.
అలంకృత వచ్చి అక్కని గిరగిరా తిప్పేసి నీకు అర్థమైంది కదా బావ నీకు ప్రపోజ్ చేయబోతున్నాడు అని చెప్తుంది. నాన్న కూడా బావని నీ భర్తగా ఒప్పుకోబోతున్నాడు.. బావ కూడా మనసులో మాట చెప్పబోతున్నాడు.. ఇదే నీకు బెస్ట్ భర్త్‌డే అక్క అని అంటుంది. హరివర్ధన్ దేవా గురించి ఆలోచిస్తుంటాడు. ఆదిత్య వచ్చి మామయ్య ఏం ఆలోచిస్తున్నారు అని అడిగితే దేవా కోసం ఆలోచిస్తున్నా అని అంటాడు. దేవా గురించి మీరు ఆలోచించడం ఏంటి అని అడుగుతాడు. దేవాకి చాలా రుణపడిపోయాం అని హరివర్ధన్ అంటే దానికి ఆదిత్య మామయ్య మిమల్ని చూస్తుంటే దేవాని అల్లుడిగా ఒప్పుకునేలా ఉన్నారు. దేవా విషయంలో ఇంతలా పాజిటివ్‌గా మారిపోయారు అని అంటాడు. నోర్ముయ్‌రా అనుకుంటూ ఆదిత్య అక్క త్రిపుర ఎంట్రీ ఇస్తుంది.
త్రిపుర ఆదిత్యతో మామయ్య స్థాయి ఏంటి పరపతి ఏంటి నీ లాంటి వాడిని అల్లుడిగా చేసుకుంటారు కానీ పోయి పోయి ఆ రౌడీని అల్లుడిగా ఎలా అంగీకరిస్తారు అని అనుకుంటున్నావ్ అని ప్రశ్నిస్తుంది. మామయ్య గారు మౌనంగా ఉంటే డౌట్ వచ్చిందని ఆదిత్య అంటే మామయ్య గారు పిచ్చోళ్లు అనుకున్నావా ఆ రౌడీని మామయ్య గారు చచ్చినా అల్లుడిగా అంగీకరించరు.. అంతే కదా మామయ్య గారు అంటుంది. హరివర్ధన్ సైలెంట్‌గా వెళ్లిపోతాడు. ఆదిత్య త్రిపురతో అక్క భయం వేస్తుంది మామయ్యగారు అంగీకరిస్తారేమో అంటాడు. దానికి త్రిపుర అంతసీన్ లేదు వాడిని చంపేసి అయినా నిన్ను మిథున భర్తని చేస్తానని త్రిపుర అంటుంది. దాంతో ఆదిత్య ఈ సౌండ్ బాగుంది వాడిని చంపేస్తా అని అనుకుంటాడు.
మిథున పుట్టిన రోజు ఏర్పాట్లు జరుగుతాయి. మిథున అందమైన లంగావోణిలో రెడీ అయి వస్తుంది. మిథునని చూస్తూ దేవా అలాగే ఉండిపోతాడు. ఇంతందం దారి మళ్లిందా.. అంటూ సాంగ్ మిథున అందాన్ని రెట్టింపు చేసేస్తుంది. దేవా తనని అలా చూడటం మిథున చూస్తూ ఉంటుంది. హరివర్ధన్ పెద్ద పెద్ద గెస్ట్‌లను రిసీవ్ చేసుకుంటూ నా కూతురు ప్రిన్సెస్‌లా ఉందని చూస్తూ మురిసిపోతాడు. ఎవరి గెస్ట్‌లను వాళ్లు రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. దేవా కళ్లార్పకుండా మిథునని చూడటం త్రిపుర చూసి తన ఫ్రెండ్స్‌ని వదిలేసి ఇప్పుడే వస్తానని వెళ్లిపోతుంది. త్రిపుర ఫ్రెండ్స్ దేవాని చూసి బేరర్ అనుకొని జ్యూస్‌లు తీసుకురమ్మని చెప్తారు. మరో అమ్మాయి తను మిథున భర్త అని చెప్పగానే ఇతనేంటి ఇలా ఉన్నాడు ఆ డ్రస్ ఏంటి మిథున ఇతను భర్త ఏంటి అని అస్సలు సెట్ అవ్వలేదు. భార్య భర్తడేకి ఎవరైనా ఇలా ఉంటారా రౌడీలా ఉన్నాడు. పనోళ్లు కూడా రిచ్‌గా ఉంటానే అని అనుకుంటారు. దేవా ఆ మాటలకు చాలా బాధ పడతాడు. మిథున దేవా దగ్గరకు వచ్చి దేవాని తీసుకొని వెళ్లిపోతుంది.
ఆదిత్య రౌడీలకు దేవా ఫొటో చూపించి చంపేయమని చెప్తాడు. డబ్బు కూడా ఇస్తాడు. దేవాని చంపేస్తే ఎప్పుడూ చూడనంత డబ్బు ఇస్తానని చెప్తాడు. ఈ రోజు వీడు చావకపోతే ఈ జన్మలో నా భార్య నాకు దక్కదు అని అంటాడు. అస్సలు మిస్ అవ్వడు అని రౌడీ అంటాడు. రాహుల్ త్రిపురతో వాడిని మా నాన్న అంగీకరించేలా ఉన్నాడు అని అంటే ఆ దేవా గొడవ పెట్టుకొని వెళ్లిపోతాడు ప్లాన్ చేశానని త్రిపుర అంటుంది. మరోవైపు సత్యమూర్తి ఇద్దరు కొడుకులు కోడళ్లతో మిథున పుట్టింటికి వస్తాడు. శ్రీరంగం మిథున పుట్టిళ్లు చూసి దేవా తంతే బూరెల గంపలో పడినట్లు గొప్పింటి అల్లుడు అయిపోయాడు అని అంటాడు. ఆనంద్ కూడా చూసి వాడికి అదృష్టం తెనే పట్టులా మారింది అనుకుంటాడు. ఇద్దరితో సత్యమూర్తి కొడుకులకు సంస్కారం ముఖ్యం అని అంటుంది. కాంతం బయటకు వెళ్లి త్రిపుర మంచి ప్లాన్ వేశానని చెప్పింది అందర్నీ తీసుకురమ్మని చెప్పింది ఏం చేసిందో అనుకుంటుంది. ఇక మిథున దేవాని షూట్ బూట్లో రెడీ చేసి ఎవరైతే బాలేడు అన్నారో వాళ్ల ఎదురుగా తీసుకొచ్చి స్టైల్గా నిల్చొపెడుతుంది. సూపర్ అని వాళ్లు దేవానే చూస్తూ ఉంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















