Nuvvunte Naa Jathaga Serial Today August 18th: నువ్వుంటే నా జతగా సీరియల్: నిజం చెప్పేసిన అలంకృత.. ఏడ్చేసిన హరివర్ధన్.. దేవాతో ఏం చెప్పాడు!
Nuvvunte Naa Jathaga Serial Today Episode August 18th దేవాని హరివర్ధన్ కొట్టి ఇంటి నుంచి తరిమేయడం, అలంకృత అందరితో నిజం చెప్పేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode అలంకృతని కాపాడి దేవా ఇంటికి తీసుకొస్తాడు. తర్వాత దేవా, మిథునలు కలిసి వరలక్ష్మీ వ్రతం చేస్తారు. గడువు రేపటితో ముగుస్తుంది. ఎలా అయినా తన తండ్రి దేవాని అల్లుడిగా అంగీకరించేలా చేయమని మిథున అమ్మవారిని కోరుకుంటుంది. వ్రతం పూర్తయి మిథునని దేవా దీవించే టైంకి పోలీసులు ఎంట్రీ ఇస్తారు.
పోలీసులు రావడంతో దేవా ఆశీర్వదించడం ఆపేస్తాడు. జడ్జి వెళ్లి నా పర్మిషన్ లేకుండా మీరు ఈ టైంకి వచ్చారేంటి అని అడుగుతారు. దాంతో పోలీసులు దేవాని అరెస్ట్ చేయడానికి వచ్చామని దేవా మినిస్టర్ కొడుకుని కొట్టి దౌర్జన్యం చేశాడని బట్టలు లేకుండా అతన్ని ఫొటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడతా అని బెదిరించాడని గౌరవనీయులైన న్యాయమూర్తి అయిన మీ ఇంట్లో రౌడీ ఉండటం ఏంటి సార్ అని పోలీసులు అడుగుతారు.
త్రిపుర మామయ్యతో ఇప్పుడు ఏమంటారు మామయ్య మీ పరువు మొత్తం రోడ్డు మీద పడిపోతుంది. అందుకు మీరే కారణం అవుతారు. వాడో బజారు వాడని తెలిసి కూడా ఇంట్లో పెట్టుకున్నారు అని అంటుంది. హరివర్ధన్ కోపంతో దేవాని కొడతాడు. అలంకృత విషయం చెప్పాలి అనుకుంటుంది కానీ దేవా ఆ విషయం తండ్రికి చెప్పొద్దు అన్నాడని గుర్తు చేసుకొని ఆగిపోతుంది. దేవాతో జడ్జి అవకాశం ఇస్తే మారుతావని నమ్మాను కానీ రక్తం మరిగిన నువ్వు రౌడీయిజం మానవని అర్థమైంది. జడ్జి ఇంట్లో ఉంటూ రౌడీయిజం చేసి రావడానికి ఎంత ధైర్యంరా నీకు అని దేవా కాలర్ పట్టుకొని నువ్వు ఇంకొక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండటానికి వీల్లేదని దేవాని ఈడ్చుకెళ్తాడు. మిథున వద్దని బతిమాలుతుంది. దేవాని తీసుకెళ్లమని పోలీసులతో చెప్తారు.
దేవా కారణం లేకుండా ఎవరినీ కొట్టడు అని మిథున చెప్తుంది. ఆ మినిస్టర్ కొడుకు ఏదో చేసుంటాడు అని మిథున అంటుంది. వీడిని వెనకేసుకురావడానికి సిగ్గు లేదా అని హరివర్ధన్ అడుగుతాడు. దానికి మిథున దేవా ఏ తప్పు చేయడని నమ్మకం నాన్న అని అంటుంది. అయితే ఎందుకు కొట్టాడో చెప్పమను అని అంటాడు. మిథున ఎంత అడిగినా దేవా కారణం చెప్పడు. అందరూ ఎంత కారణం అడిగినా దేవా నోరు విప్పడు. దేవా రేపటితో మన గడువు గడిసిపోతుంది ఇలా నువ్వు మౌనంగా ఉండి మన బంధం విడిపోయేలా చేయకు అని బతిమాలుతుంది. అలంకృత తండ్రిని ఆపుతుంది.
హరివర్ధన్ అలంకృతని నువ్వు వాడిని ఆపుతున్నావేంటి బుద్ధుందా అని అడుగుతాడు. అలంకృత తండ్రితో బావ లేకపోయి ఉంటే ఈ రోజు మీకు నా శవం కూడా దొరికేది కాదు అని అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. దేవా చిన్నగా అలంకృత మాట్లాడకు లోపలికి వెళ్లు అంటాడు. అందరూ దేవా వైపు ఆశ్చర్యంగా చూస్తారు. ఏంటి బావ నేను మాట్లాడకుండా ఉండాలా.. నా ప్రాణాలు కాపాడి నువ్వు జైలు పాలవుతుంటే నేను మాట్లాడకుండా ఉండాలా.. నా జీవితం నిలబెట్టి నువ్వు నిందలు పడుతుంటే నేను సైలెంట్‌గా ఉండాలా అని అడుగుతుంది. మిథున ఏమైందని అడుగుతుంది. దేవా ఏం లేదని చెప్పి పోలీస్ స్టేషన్‌కి వెళ్దామని అంటాడు. బావ ఆగు నువ్వు నా కోసం ఆలోచిస్తున్నావ్ ఇప్పుడు కూడా నిజం చెప్పకపోతే తప్పు అని అలంకృత తండ్రితో నాన్న బావ మినిస్టర్ కొడుకుని కొట్టారు అన్నారు కదా అసలు బావ ఎందుకు కొట్టాడో తెలుసా అని జరిగింది అంతా చెప్తుంది.
హరివర్ధన్, మిథునలు దేవా వైపు కృతజ్ఞతగా చూస్తారు. అలంకృత ఏడుస్తుంది. లలిత కూడా ఏడుస్తుంది. హరివర్ధన్ కూడా ఏడుస్తాడు. అలంకృత ఏడుస్తూ తల్లిని వాటేసుకొని నా పరిస్థితి ఎవరికీ చెప్పుకోలేక చచ్చిపోవాలని అనుకున్నాను అని అంటుంది. లలిత దేవాకి రెండు చేతులు జోడించి దండం పెడుతుంది. బావ రాకపోయి ఉంటే నేను ఈ పాటికే చనిపోయే దాన్ని నాన్న మీకు ఈ విషయం తెలిస్తే తట్టుకోలేరని నా దగ్గర మాట తీసుకున్నారు.. మన కోసం బావ తల వంచాడు కానీ తన గురించి ఆలోచించుకోలేదు.. అది నాన్న బావ మంచితనం సంస్కారం.. నాన్న మనకు ఏదైనా కష్టం వస్తే అండగా ఉండి రక్షించేవాడిని దేవుడు అంటారు. బావ మన ఇంటికి నిజంగా దేవుడు నాన్న అని అలంకృత ఏడుస్తుంది.
హరివర్ధన్ దేవాని కొట్టడం గుర్తు చేసుకొని కుప్పకూలిపోతాడు. నాన్న అని రాహుల్, మిథున, అలంకృత వెళ్తారు. రాత్రి శారదని చూసి వ్రతానికి వెళ్లొచ్చినప్పటి నుంచి పట్టరాని సంతోషంతో ఉన్నావ్ ఏమైంది అని సత్యమూర్తి అడుగుతాడు. సంతోషంతో ఏడుస్తూ మన దేవా ఎంత మంచి పని చేశాడో తెలుసా అని శారద అంటుంది. ప్రమోదిని జరిగింది అంతా అందరికీ చెప్తుంది. ఆనంద్ తల్లితో అమ్మా వాడితో ప్రవహించేది హెడ్ మాస్టర్ గారి రక్తం ఆ డీఎన్‌ఏలోనే నిజాయితీ ఉందని తమ్ముడి గురించి చెప్పి పొంగిపోతాడు. వాడిలో ఇంత మార్పు వచ్చిందంటే నమ్మలేకపోతున్నా అని సత్యమూర్తి అంటాడు. దేవా ఒంటరిగా కూర్చొని ఉంటే హరివర్ధన్ అక్కడికి వెళ్తాడు. దేవా పక్కనే కూర్చొంటాడు. దేవా భుజం మీద చేయి వేసి ఒక్క నిమిషం గుండె ఆగిపోయినంత పనైంది.. థ్యాంక్యూ అని అంటాడు. మిథున చాలా సంబరపడిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















