Nuvvunte Naa Jathaga Serial August 11th to 15th Recap నువ్వుంటే నా జతగా సీరియల్ వీక్లీ: దేవా-మిథున ప్రేమలో ఊహించని మలుపు! ఆదిత్య, త్రిపుర ఏం చేశారు? జడ్జి ఆలోచన ఇదే!
Nuvvunte Naa Jathaga Serial August 11th to 15th Recap దేవాని హరివర్ధన్ అర్థం చేసుకుంటూ ఉండటం మిథునకు దేవాని తండ్రి అంగీకరిస్తాడనే నమ్మకం రావడంతో ఈ వారం ఎపిసోడ్స్ ఆసక్తికరంగా మారాయి.

Nuvvunte Naa Jathaga Serial August 11th to 15th Weekly Episodes నువ్వుంటే నా జతగా సీరియల్ ఈ వారం మొత్తం ఆసక్తికరంగా జరిగింది. దేవాని హరివర్థన్ అర్థం చేసుకోవడం.. అల్లుడుగా అంగీకరిస్తాడు అని అందరూ అనుకుంటూ సంతోషంగా ఉంటారు. ఈ టైంలోనే అలంకృత వల్ల దేవా చిక్కుల్లో పడతాడు. అసలు వారం మొత్తం ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
మిథున దేవా చేతికి కంకణం కడుతుంది. నాకు ఇలాంటివి నచ్చవు అని దేవా అంటే కొన్ని ముందు మనకు నచ్చవు దేవా కానీ తర్వాత విడదీయలేనంతగా ముడి పడిపోతాయి మన బంధంలా అని అంటుంది. ఇద్దరి బంధం గురించి మిథున చెప్తూ నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నేను చాలా బాధ పడ్డాను నా జీవితానికి ఇలాంటి పరీక్ష ఏంటా అని ఏడ్చాను. కానీ నీ కంటే గొప్ప భర్త దొరకడు.. నీలా గొప్పగా చూసుకునే వాళ్లు ఉండరు అని అర్థమైంది. నువ్వు నన్ను భార్యగానే అంగీకరించను అన్నావ్ కానీ నేను నమ్మాను.. అందుకు బలమైన సాక్ష్యమే నువ్వు నాతో మా ఇంటికి రావడం. నీలో చాలా మార్పు వచ్చింది అది నాకు అర్థమైంది కానీ చాలా మందికి అర్థం కాలేదు. నా మీద ప్రేమ ఉందని నీతో చెప్పించమని మా నాన్న చెప్పినప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా నువ్వు మౌనంగా ఉన్నావ్ కానీ నీ మౌనం వెనక చాలా మంది నువ్వు నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావ్ అంటున్నారు. ఎందుకో నీ మౌనం నాకు భయపెడుతుంది. ఒక ఆడపిల్లగా నేను సిగ్గు విడిచి నిన్ను ప్రేమిస్తున్నా అని నేను చెప్పినా నువ్వు ఎందుకు చెప్పడం లేదు.. నీ మౌనం వెనక కారణం ఏదైనా అయితే ఒకే కానీ నన్ను వదిలించుకోవడానికే అయితే నేను తట్టుకోలేను. నన్ను మోసం చేసి అందరి ముందు తలదించుకునేలా చేయకు. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ పవిత్ర బంధాన్ని ఎగతాళి చేయకు అని మిథున దేవాకి తన మనసులో మాటలు చెప్తుంది.
మిథున మాటలకు దేవా పరుగులు తీసి ఎవరూ లేని ప్లేస్‌కి వెళ్లి నా మౌనం నీకు భయపెడుతుంది అన్నావ్ కదా నా వెనక ఉన్నదేంటో తెలుసా అని మిథున ఐలవ్‌యూ.. మిథున ఐలవ్యూ అని గట్టిగా అరుస్తాడు. దేవా అలా చెప్పడం చూసి ఆదిత్య కోపంతో ఊగిపోతాడు. కానీ కూల్‌గా దేవా దగ్గరకు వెళ్లి భుజం మీద చేయి వేస్తాడు. ఆదిత్య దేవాతో భయ్యా నువ్వు మిథునని లవ్ చేస్తున్నావా షాకింగ్‌గా ఉంది అని అంటాడు. దేవా మిథున తనని మార్చేసిందని ఇప్పుడు మిథున లేకుండా ఉండలేని పరిస్థితికి వచ్చేశానని మిథునతోనే కడ వరకు ఉంటానని దేవా అదిత్యకు చెప్తాడు. మిథున అంటే ఇష్టం మిథున అని చెప్పాలని ఉంది కానీ మాట గొంతు దాటడం లేదు. అందుకు కారణం ఒక తెలియని పశ్చాత్తాపం. తనని ఎంత బాధపెట్టానో.. నా కోసం నేను కట్టిన తాళి కోసం తన అద్బుతమైన జీవితం నాశనం చేసేశాను అంటూ దేవా ఆదిత్య దగ్గర బాధ పడతాడు. మిథునకు తన ప్రేమ చూపిస్తానని.. తన కోసం తనతో కలిసి బతకడానికి బతుకుతాను. ఇన్నాళ్లు మిథున నా కోసం పడిన తపనకు చూపించిన ప్రేమకు నా ప్రేమతో రుణం తీర్చుకుంటా అని దేవా చెప్తాడు.
దేవా మిథునకు తన ప్రేమ చూపించాలి అని ప్రేమతో మల్లెపూలు కొని మిథునకు ఇస్తాడు. మిథున చాలా సంతోషపడుతుంది అయితే దేవా ప్రేమ అర్థం చేసుకున్న మిథున దేవాతో లవ్‌యూ మిథున అని చెప్పించడానికి గట్టిగానే ప్రయత్నిస్తుంది. పువ్వులు ఎందుకు తీసుకొచ్చావ్ ప్రేమతో తీసుకొచ్చావ్.. మొక్కు బడిగా ఇస్తాను అంటే కాదు నా మీద ప్రేమతో తీసుకొచ్చా అని చెప్పి తీసుకుంటా అంటుంది. దేవా మాట గొంతు దాటదు దాంతో మిథున పువ్వులు దేవుడి దగ్గర పెట్టేస్తుంది. దేవా తన ప్రేమని చెప్పలేకపోయినందుకు మిథున పువ్వులు దేవుడి దగ్గర పెట్టేసినందుకు ఫీలవుతాడు.
ఆదిత్య ఫుల్‌గా మందు తాగుతూ ఏరా మిథునని ప్రేమిస్తున్నా అని చెప్తావా.. ప్రాణం పోయే చివరి వరకు తన చేయి వదలవా అయితే నేనేం చేయాలిరా.. నా ప్రాణానికి ప్రాణం అయిన మిథున చేయి నువ్వు వదలను అంటే నేనేం చేయాలిరా.. మిథునని ప్రాణంగా ప్రేమించానురా.. నువ్వు మా మధ్య లోకి రాకపోయి ఉంటే మిథున నా భార్య అయ్యేది. నా భార్య మిథునతో నేను హ్యాపీగా ఉండేవాడిని ఇప్పటికీ ఎప్పటికీ ఈ జన్మకి మిథున నా భార్యరా.. మా మధ్యలోకి వచ్చిన వాళ్లని ఈ భూమ్మీద ఉండనివ్వను. అని గన్ పట్టుకొని దేవా దగ్గరకు వెళ్తాడు. ఆదిత్య దేవాతో నాకు మిథున కావాలి భయ్యా.. మిథున లేకుండా నేను బతకలేను.. నా మిథునని నాకు వదిలేయ్ అంటాడు. మిథున నా భార్య నా భార్యని నన్ను వదిలేయ్ అంటావ్ ఏంటి బుద్ధి లేకుండా అని దేవా అంటాడు. మిథునకు నీకు అసలు పెళ్లే జరగలేదు.. నువ్వు బలవంతంగా తాళి కట్టావ్. దేవా ఆదిత్యతో హే ఆపు నా భార్యని నువ్వు నా భార్య అంటుంటే నేను వినలేకపోతున్నా అని అంటాడు. దానికి ఆదిత్య నువ్వు నా భార్యని నా భార్య అని అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నా అని అంటాడు. నువ్వు తనని తీసుకెళ్లమని చేతకాని వాడిలా ఉంటావేంటి అని నన్నే తిట్టావ్ మరి ఇప్పుడు నువ్వు ఇలా మాట మార్చేసి డబుల్ గేమ్ ఆడితే ఎలా అని ఆదిత్య అడుగుతాడు. నీ మాటకు నువ్వు మాట మార్చేసి మనసు మార్చుకొని మిథున కావాలి అంటే నేను రోడ్లు పట్టుకొని పిచ్చోడిలా తిరగాలా అని అడుగుతాడు. ఏంటి భయ్యా ఇలా మాట్లాడుతున్నావ్ నీ ప్రవర్తనలో మార్పు వస్తుంది ఏంటి భయ్యా అని దేవా అంటాడు. దాంతో ఆదిత్య ప్రేమించిన అమ్మాయిని వదులుకోవడం అంటే ప్రాణం పోవడమే.. రెండు రోజుల్లో నా భార్య కావాల్సిన భార్య మెడలో నువ్వు తాళి కట్టి మిథునని లాక్కెళ్లిపోయావ్ ప్రాణం లేకుండా అయినా బతకగలను కానీ మిథున లేకుండా బతకలేను. నా మిథునని నాకు వదిలేయ్ అంటాడు ఆదిత్య. తను నా మిథున కేవలం నా మిథున అని దేవా అంటాడు. ఎంత డబ్బు కావాలి అని ఆదిత్య అడుగుతాడు. దేవా ఆదిత్య కాలర్ పట్టుకుంటాడు. మిథున జోలికి వస్తే ఊరుకోనని దేవా అంటాడు. ఇద్దరూ గొడవ పడతారు.
మిథున ఇంట్లో అందరితో సరదాగా నవ్వుకుంటూ ఉంటే దేవా చూసి మురిసిపోతాడు. మిథున దేవాని చూడటం అలంకృత చూసేసి అక్కని ఆటపట్టిస్తుంది. ఇంతలో హరివర్ధన్ వస్తాడు. దేవా మామని చూసి కంగారు పడి వెళ్లిపోబోతూ పడిపోతుంటే హరివర్ధన్ పట్టుకుంటాడు. తర్వాత దేవా భుజం తట్టి వెళ్లిపోతాడు. మిథున చాలా సంతోషిస్తుంది. అలంకృత అయితే అక్క నాన్నని బావ మీద కోపం పోయింది అని సంబర పడిపోతుంది. త్రిపుర, రాహుల్‌లు హరివర్ధన్లో సాఫ్ట్ కార్న్ ఉందని వెంటనే వాడిని తరిమేయాలని అనుకుంటాడు. వెంటనే కాంతం భర్తని తండ్రి గదిలోకి పంపిస్తుంది. శ్రీరంగం ఇంటి డాక్యుమెంట్స్ కొట్టేస్తాడు.
మిథున, దేవాలతో వరలక్ష్మీ వ్రతం చేయిస్తానని చెప్తుంది. వ్రతానికి శారద వాళ్లని లలిత పిలుస్తుంది. త్రిపుర వాళ్లని పిలవొద్దని వాళ్లు ఎలా వస్తారు ఇదేం పెద్దలు కుదిర్చిన పెళ్లి కాదు వాళ్లు మన ఇంటికి రావడానికి అని అంటుంది. మీ మామయ్య గారు దాదాపుగా దేవాని అల్లుడిగా అంగీకరించారు అని లలిత అంటుంది. వాళ్లని మన ఇంటికి పిలవడానికి వీల్లేదు అని త్రిపుర అంటుంది. ముక్కూ ముఖం తెలియని వాళ్లని ఇంటికి రానివ్వకండీ అని త్రిపుర అంటుంది. రెండు కుటుంబాల మధ్య సఖ్యతకి రేపు జరిగే వరలక్ష్మీ వ్రతం పునాది అవుతుంది ఏం సమస్య వచ్చినా నేను చూసుకుంటా అని లలిత అంటుంది. మిథున పుట్టింట్లో వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లు జరుగుతాయి. మిథున రావడం వల్లే ఈ సంతోషం అంతా అని లలిత భర్తతో చెప్తుంది. ఇక మిథున, అలంకృతలు ఇళ్లంతా పరుగులు పెడుతుంటారు. జడ్జి గారు సంబర పడిపోతారు. మిథున తండ్రితో మాట్లాడుతుంటే మిథున మిథున అని దేవా పిలుస్తాడు. మిథున తండ్రితో మీ అల్లుడు గారు ఇంతే నాన్న ప్రతీ దానికి నేనే ఉండాలి అంటుంది. లలిత మిథునని పిలిచి చూస్తూ మాట్లాడవే అని హరివర్ధన్‌ని చూపిస్తుంది.
అలంకృతకి మినిస్టర్ కొడుకు విక్రమ్ వీడియోలు సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించి గెస్ట్ హౌస్‌కి రమ్మని చెప్తాడు. అలంకృత చాలా ఏడుస్తుంది. ఇంటి పరువు పోతుందని ఏడుస్తూ కంగారు పడుతుంటుంది. దేవా అలంకృతని గమనిస్తాడు. అలంకృత భయంతో పరుగులు తీయడం దేవా చూసి వెనకాలే వెళ్తాడు. అలంకృత సూసైడ్ చేసుకోవడానికి చెరువు దగ్గరకు పరుగులు తీస్తుంది. ఏడుస్తూ చెరువులో దూకేయాలి అని అనుకుంటుంది. భర్త్‌డే పార్టీకి పిలిస్తే క్లోజ్ ఫ్రెండ్స్అని వెళ్లాను ఇలా చేస్తారు అనుకోలేదు.. ఆ వీడియో బయటకు వస్తే నేను బతకలేను నాన్న నాకు చావు తప్ప మరో దారి లేదు సారీ అమ్మానాన్నఅక్క సారీ అని దూకేయాలని అనుకుంటుంది. అలంకృత దూకేసే టైంకి దేవా చేయి పట్టి లాగి ఒక్కటి కొడతాడు. ఏదైనా సమస్య వస్తే ప్రాణం తీసుకోవడమేనా నువ్వు ఇలా ప్రాణం తీసుకుంటే మీ అమ్మానాన్న అక్కలు ప్రాణాలతో ఉండరు అని తెలీదా నీకు అని అంటాడు. ఏమైంది అని దేవా అడుగుతాడు. చచ్చిపోవడం తప్ప నేనేం చేయలేను అని అలంకృత ఏడుస్తుంది. నా బాధ నా పరిస్థితి ఎవరికీ చెప్పుకోలేను అని ఏడుస్తుంది. ఇదే మీ బ్రదరో ఇంకెవరో అయితే ఇలాగే అంటాడు. నన్ను నిజంగా మీ కుటుంబంలో ఒకడిని అనుకుంటే నిన్ను చావు వరకు తీసుకొచ్చిన సమస్య ఏంటో చెప్పు ఆ సమస్య జీవితంలో రాకుండా చేస్తాను అని దేవా అంటాడు. అలంకృత జరిగింది అంతా చెప్తుంది దేవా కోపంతో రగిలిపోతాడు. ఎవడు వాడు అని అడిగి వాడి దగ్గరకు వెళ్లి చితక్కొడతాడు. దేవా అలంకృతకు సాయం చేయడానికి వెళ్లిపోవడం వ్రతం దగ్గర లేడని మిథున ఇష్టం లేక వెళ్లిపోయాడని అందరూ గొడవ చేస్తారు. శారద వాళ్లని త్రిపుర అవమానించి వెళ్లిపోమని చెప్పి తిడుతుంది. ఇక దేవా రావడంతో మిథున అందర్ని ఆపి చక్కగా వ్రతం చేసుకుంటుంది. ఇది ఈ వారం జరిగి ఇంట్రస్టింగ్ సీన్స్.





















