Nuvvunte Naa Jathaga Serial Today August 14th: నువ్వుంటే నా జతగా సీరియల్: దేవాకి పంచె కట్టిన మిథున.. ఒకేలా రెడీ అయిన మామఅల్లుడు.. అలంకృత ఏం చేస్తుంది?
Nuvvunte Naa Jathaga Today Episode August 14th మిథున దేవా, జడ్జికి ఒకేలాంటి బట్టలు తేవడం, శారద వాళ్లు మిథున ఇంటికి రావడం కాంతం ఇళ్లు చూసి నోరెళ్ల బెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా వ్రతం కోసం పంచె కట్టుకోవడానికి తిప్పలు పడుతుంటాడు. మిథున వచ్చి ఏం చేస్తున్నావ్ ఇంకా అని అడిగితే నాకు పంచె కట్టుకోవడం రాదు.. ఇప్పటి వరకు నేను ఎప్పుడూ కట్టుకోలేదు అని అంటాడు. వెంటనే మిథున దేవాకి పంచె కడుతుంది.
దేవా సిగ్గుతో అరిచి గోల చేస్తాడు. మిథున దేవాకి పంచె కడుతుంది. ఇక దేవా లుక్ చూసి బుద్ధిమంతుడిలా కనిపించాలి అంటే లుక్ మార్చాలా అని దేవాని అద్దం ముందు కూర్చొపెట్టి హెయిర్ స్టైల్ మార్చాలి అని చెప్పి దేవాకి పిలక వేస్తుంది. దేవా చూసి బిత్తర పోతాడు. మిథున నవ్వుకుంటుంది. ఇప్పుడు సెట్ చేస్తా అని దేవా హెయిల్ స్టైల్ మార్చేసి కుంకుమ పెడుతుంది. దిష్టి చుక్క కూడా పెడుతుంది.
మరోవైపు అలంకృతకి ఆమె ఫ్రెండ్ విక్రమ్ కాల్ చేసి గెస్ట్ హౌస్‌లో ఉండాలి అని బెదిరిస్తాడు. గతంలో అలంకృత విక్రమ్ తన ఫ్రెండ్ కావడంతో అందరితో పాటు భర్త్‌డే పార్టీకి వెళ్తుంది. అక్కడ విక్రమ్ కూల్ డ్రింక్ డ్రస్ మీద పడేలా చేసి అలంకృత బట్టలు మార్చుకునేటప్పుడు వీడియోలు తీసి బెదిరిస్తుంటాడు. ఇలా ఫ్రెండ్ అయి చేయడం తప్పు విక్రమ్ అని అలంకృత ఏడుస్తూ తనని వదిలేయమని బతిమాలుతుంది. గెస్ట్ హౌస్‌కి వస్తే డిలీట్ చేస్తానని అంటాడు. అలంకృత ఎంత చెప్పినా విక్రమ్ వినకుండా చెప్పిన టైంకి రాకపోతే వీడియో సోషల్ మీడియాలో పెట్టేస్తా అని బెదిరిస్తాడు.
మిథున పుట్టింట్లో జరగనున్న వరలక్ష్మీ వ్రతానికి ప్రమోదిని శారద, సూర్యకాంతాన్ని తీసుకొని వస్తుంది. సూర్యకాంతం మిథున వాళ్ల ఇళ్లు చూసి ఇది ఇళ్లా ఇంద్ర భవనమా.. ఈ ఇంట్లో నన్ను పని మనిషిగా కూడ చేసుకోరు. మిథున గొప్పింటి పిల్ల అని తెలుసు కానీ ఇంత గొప్పింటి పిల్ల అని తెలీదు అని నోరెళ్ల బెడుతుంది. శారద వాళ్లు మాట్లాడుకుంటూ ఉంటే సెక్యూరిటీ వచ్చి వివరాలు అడిగి లోపలికి తీసుకొస్తుంటే త్రిపుర చూసి సెక్యూరిటీ ఎవరిని పడితే వాళ్లని లోపలికి తీసుకొచ్చేస్తావా.. పిలిచారని వచ్చేయడమేనా ఇలాంటి వాళ్లు గేటు బయట ఉండాలి పంపించేయ్ అంటుంది. దాంతో సెక్యూరిటీ శారద వాళ్లని పదండి మేడం అని అంటాడు.
శారద వాళ్లు వెళ్లిపోతుంటే మిథున చూసి అత్తయ్యా అని పిలకరించి ఏంటి బయటకు వెళ్లిపోతున్నారు అని అంటుంది. సెక్యూరిటీ ఏంటి మా అత్తయ్య వాళ్లని నువ్వు లోపలికి పంపలేదా నీతో వాళ్లు చెప్పుంటారే నా అత్తవాళ్లు అని మిథున అంటుంది. సెక్యూరిటీ అతను త్రిపురను చూడటం మిథున చూసి సీన్ అర్థం చేసుకుంటుంది. శారద వాళ్లని లోపలికి పిలిస్తే పని ఉంది వెళ్తామని చెప్పేస్తారు. మిథున శారద వాళ్లకి సారీ చెప్పి ఇది మీ కోడలి పుట్టిళ్లు మీరు ఎప్పుడైనా రావొచ్చు అని అంటుంది. మిమల్ని రావొద్దు అని ఆపే హక్కు ఎవరికీ లేదు అని చెప్పి లోపలికి తీసుకెళ్తుంది. సెక్యూరిటీతో వీళ్లు నా వాళ్లు నాకు ఎంత హక్కు ఉందో వీళ్లకి అంతే హక్కు ఉంది ఈ సారి వీళ్లు వస్తే నువ్వే లోపలికి తీసుకొని రా ఎవరో చెప్పారని పంపేస్తే అస్సలు ఊరుకోను అని అంటుంది.
దేవా, హరివర్ధన్ ఇద్దరూ పట్టు బట్టలు కట్టుకొని మిథున భలే సెలక్ట్ చేసింది అనుకుంటారు. ఇద్దరూ బయటకు వచ్చి ఇద్దరూ సేమ్ డ్రస్‌లు వేసుకుంటారు. ఇద్దరికీ ఒకేలాంటి డ్రస్‌లు ఎందుకు తీసుకుందా అని అనుకుంటారు. ఇక మిథున లలిత దగ్గరకు అత్తింటి వాళ్లని తీసుకెళ్తుంది. కాంతం షాక్ అయిపోతుంది. సినిమాల్లోనే ఇలాంటి ఇళ్లు చూశామని అనుకుంటుంది. శారద దేవా పంచెకట్టులో హుందాగా రావడం చూసి శారద వాళ్లు చాలా సంతోషపడతారు. దేవాని పట్టుకొని చాలా సంతోషపడుతుంది. నా కొడుకుని కొత్తగా మార్చేశావమ్మా వాడినే వాడికి కొత్తగా పరిచయం చేశావు నువ్వు మీ జంట నూరేళ్లు చల్లగా ఉండాలని అంటుంది. ఇంతలో జడ్జి రావడంతో శారద పలకరిస్తుంది. పలకరింపులు ఇలా ఎందుకు మామయ్య గారు ఊరేగించి హారతి ఇచ్చి ఆహ్వానిస్తే సరిపోతుంది.. అసలు వీళ్లు ఎవరు మామయ్య గారు అని అంటుంది. మిథున త్రిపురతో ఈవిడ మా అత్తయ్య గారు మా తోటి కోడళ్లు అని అంటుంది. మామయ్య గారు ఒప్పుకోలేదు కదా మీ నిర్ణయాన్ని కాదని అత్తయ్య గారు ఎందుకు పిలిచారో చెప్పమని అడగండి అని త్రిపుర అంటుంది. లలిత త్రిపురతో నేను బంధువులుగా పిలవలేదు వాయినం తీసుకోవడానికి పిలిచాను చాలా అని అంటుంది. ఇక ఈ విషయం గురించి మాట్లాడకు వ్రతానికి తాంబూలం ఇవ్వడానికి ఇంటి పెద్దకి చెప్పాల్సిన అవసరం లేదు వ్రతం అయిన వరకు ఇంకేం మాట్లాడకు అని చెప్తుంది. త్రిపుర మనసులో ఏం ప్లేట్ తిరగేశావు అత్త అని అనుకుంటుంది. మరోవైపు అలంకృత టెన్షన్ పడుతూ బయటకు వెళ్లడం దేవా చూస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















