Nuvvunte Naa Jathaga Serial Today August 13th: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథున, దేవాల రొమాన్స్.. అలంకృతని ఏడిపించిందెవరు? మిథున అత్తింటికి పిలుపు!
Nuvvunte Naa Jathaga Serial Today Episode August 13th మిథున అత్తింటి వారిని వరలక్ష్మీ వ్రతానికి లలిత పిలవడం దేవా, మిథునల మధ్య రొమాంటిక్ సీన్స్ జరగడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథునని తనకి ఇచ్చేయమని ఆదిత్య దేవాకి చెప్తాడు. నా భార్యని నీకు ఇవ్వడం ఏంటి మిథున నాది కేవలం నా మిథున అని దేవా అంటాడు. ఎంత కావాలి అంటే అంత డబ్బు ఇస్తానని ఆదిత్య అంటే దేవా ఆదిత్య కాలర్ పట్టుకొని మిథున నా భార్య.. డబ్బు కోసం భార్యని అమ్ముకునే వాడిలా కనిపిస్తున్నానా.. నా ఊపిరి ఆగిపోయే చివరి క్షణం వరకు నా భార్యని వదిలిపెట్టను. ఇంకో సారి నా భార్య గురించి తప్పుగా మాట్లాడితే నిన్ను కూడా వదిలిపెట్టను అని దేవా కోప్పడతాడు.
దేవా ఆవేశంలో సిగరెట్ కాల్చుతాడు. ప్రాణం పోయే వరకు మిథునని వదిలి పెట్టవా అయితే ఆ ప్రాణమే వదిలి పెట్టరా అని ఆదిత్య దేవాకి గన్ గురి పెడతాడు. ఇంతలో మిథున అటుగా వచ్చి హలో అనడంతో ఆదిత్య గన్ దాచేస్తాడు. మిథున ఇద్దరి మధ్యలోకి వచ్చి ఏంటి మీ ఇద్దరూ రెండు గంటల నుంచి మాట్లాడుకుంటున్నారు ఏంటి అది తెలుసుకోవచ్చా అని అడుగుతుంది. నీ గురించే మాట్లాడుకుంటున్నాం అని ఆదిత్య అంటాడు. నా గురించే కదా నాకు చెప్పండి అని మిథున అంటే ఇద్దరూ మాకు సవాలక్ష ఉంటాయి అవి నీతో చెప్పమని అంటారు. మిథున సంతోషంతో మీ ఇద్దరూ ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలి అదే నేను కోరుకునేది అని మిథున అంటుంది. దాంతో ఆదిత్య నీ కోసమే మేం కలిశాం కదా నీ కోసం కలిసే ఉంటాం అని అంటాడు. మిథున దావా చేయి పట్టుకొని వెళ్లడం చూసి ఆదిత్య రగిలిపోతాడు.
మిథున గడువు గురించి తండ్రి మాటలు తలచుకొని బాధ పడుతూ ఉంటుంది. మిథున దగ్గరకు లలిత వచ్చి ఏమైందని అడిగితే ఇంకా రెండు రోజులే ఉంది కదా టెన్షన్‌గా ఉందని మిథున చెప్తే ఆ పార్వతి పరమేశ్వరులే మీ బంధాన్ని ముడి వేస్తారు మీ నాన్న మీ బంధాన్ని అంగీకరిస్తారు అని ధైర్యం చెప్తుంది. ఇక మిథునతో రేపు వరలక్ష్మీ వ్రతానికి మీ అత్తయ్య వాళ్లని పిలుస్తున్నానని చెప్తుంది. మిథున చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో త్రిపుర వచ్చి ఎలా వస్తారు వాళ్లని మన ఇంటికి ఎలా పిలుస్తారు. ఇదేం పెద్దలు కుదిర్చిన పెళ్లి కాదు వాళ్లు మన ఇంటికి రావడానికి అని అంటుంది. మీ మామయ్య గారు దాదాపుగా దేవాని అల్లుడిగా అంగీకరించారు అని అంటుంది. వాళ్లని మన ఇంటికి పిలవడానికి వీల్లేదు అని త్రిపుర అంటుంది. ముక్కూ ముఖం తెలియని వాళ్లని ఇంటికి రానివ్వకండీ అని త్రిపుర అంటుంది. రెండు కుటుంబాల మధ్య సఖ్యతకి రేపు జరిగే వరలక్ష్మీ వ్రతం పునాది అవుతుంది ఏం సమస్య వచ్చినా నేను చూసుకుంటా అని లలిత అంటుంది. వాళ్లని పిలుస్తారా పిలవండి పిలవండి అసలు వ్రతం ఎలా జరుగుతుందో నేను చూస్తా అని త్రిపుర అనుకుంటుంది.
దేవా షవర్ బాత్ చేస్తూ మిథున గురించి ఆదిత్య మాటలు తలచుకుంటూ ఉంటాడు. ఇంతలో మిథున దేవాని పిలుస్తుంది. దేవా బయటకు వస్తూ ఇద్దరూ ఒకర్ని ఒకరు తగిలి మిథున పడిపోబోతే దేవా పట్టుకుంటాడు. ఇద్దరూ రొమాంటిక్‌గా ఒకర్ని ఒకరు చూసుకుంటారు. దేవా అలాగే మిథునని పట్టుకొని ఏంటి ఇంత ఎగ్జైట్ అవుతున్నావ్ అని అడుగుతాడు. విషయం చెప్తే నువ్వు ఇంకా సంతోషిస్తావు అని మిథున అంటుంది. దాంతో మిథున మీ అమ్మా, వదినలు ఇక్కడికి వస్తారు నేను వరలక్ష్మీ వ్రతం చేస్తానని వస్తున్నారు అని అంటుంది. దేవా షాక్ అయి మీ నాన్న ఒప్పుకున్నారా అంటే మా అమ్మ ఒప్పిస్తుంది అని మిథున అంటుంది. మన రెండు కుటుంబాలు దగ్గర కాబోతున్నాయి నాకు చాలా సంతోషంగా ఉందని మిథున అంటుంది. దేవా నేను దాదాపు గెలిచేశాను నా గెలుపు నీ చేతిల్లో ఉంది నువ్వే నన్ను గెలిపించాలి అని అంటుంది. మిథున పరుగులు తీస్తుంటే ఏయ్ జాగ్రత్త కింద నీళ్లు ఉన్నాయి పడిపోతావ్ అంటాడు. నువ్వు ఉన్నావ్ కదా పట్టుకోవడానికి అని మిథున అంటుంది. దేవా నువ్వు ఉంటే నా జతగా కలలో కూడా నా దగ్గరకు ఓటమి భయం రావు.. నువ్వు నా ధైర్యం అని చెప్తుంది.
లలిత మిథున అత్తింటికి వెళ్తుంది. సూర్యకాంతం వచ్చి మా దేవా ఏం చేశాడు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారా అంటే లలిత కాదని పిలుపు చేయడానికి వచ్చామని అంటుంది. ఇంతలో సత్యమూర్తి కూడా వస్తాడు. లలితను ప్రశ్నిస్తాడు. మా కోడలు ఎలా ఉందని అడుగుతాడు. లలిత శారద, ప్రమోదిని, సూర్యకాంతాలకు బొట్టు పెట్టి వ్రతానికి పిలుస్తుంది. దేవాని అల్లుడుగా జడ్జిగారు ఒప్పుకున్నారా అంటే దాదాపు ఒప్పుకున్నారని లలిత అంటుంది. సూర్యకాంతం నోరెళ్లబెడుతుంది. లలిత వెళ్తుంటే సూర్యకాంతం ఆపి జడ్జిగారు మనసు మార్చుకునే అవకాశమే లేదా అంటుంది. కాంతానికి ఎదురుగా ప్రమోదిని, శారద ఆపి చీపురు, గరిట పట్టుకొని వాళ్లు అంటే నీకు ఎందుకే అంత కడుపు మంట ఇంకోసారి వాళ్ల జోలికి వెళ్తే మూతి కాల్చేస్తా అని అంటుంది.
మిథున పుట్టింట్లో వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లు జరుగుతాయి. మిథున రావడం వల్లే ఈ సంతోషం అంతా అని లలిత భర్తతో చెప్తుంది. ఇక మిథున, అలంకృతలు ఇళ్లంతా పరుగులు పెడుతుంటారు. జడ్జి గారు సంబర పడిపోతారు. మిథున తండ్రితో మాట్లాడుతుంటే మిథున మిథున అని దేవా పిలుస్తాడు. మిథున తండ్రితో మీ అల్లుడు గారు ఇంతే నాన్న ప్రతీ దానికి నేనే ఉండాలి అంటుంది. లలిత మిథునని పిలిచి చూస్తూ మాట్లాడవే అని హరివర్ధన్‌ని చూపిస్తుంది. ఇక అలంకృతకి ఒకబ్బాయి కాల్ చేసి తప్పుగా మాట్లాడుతాడు. అలంకృత ఏడుస్తుంది. అరగంటలో గెస్ట్ హౌస్‌లో ఉండకపోతే నీ పొటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని అంటాడు. అలంకృత ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















