Trinayani Serial Today September 4th: 'త్రినయని' సీరియల్: నయనితో పాటు మణికాంత ప్రాంతానికి వెళ్లనున్న గురువుగారు.. గాయత్రీ పాప ఆపడం వెనక అర్థం ఏంటి?
Trinayani Today Episode నయనతో పాటు మణికాంత ప్రాంతానికి గురువు గారు కూడా వెళ్తానని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Serial Today Episode నయని తనని మణికాంత ప్రాంతానికి సాగనంపమని విశాల్‌కి చెప్తుంది. దానికి విశాల్ పౌర్ణమి ఘడియలు మొదలయ్యాయి అనుకునేలోపు నీ మాటలతో చీకటి నింపుతున్నావని అంటాడు. నిన్ను పంపించడం నా వల్ల కాదని విశాల్ కూడా ఎమోషనల్ అవుతాడు.
నయని: నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను అనే దాని కంటే మీరు పంపించారు అనేది నాకు కొండంత ధైర్యం ఇస్తుంది.
విశాల్: ఏమైనా జరిగితే జీవితాంతం నేను పశ్చాత్తాప పడాలని ఇలా చేస్తున్నావా నయని.
నయని: ఏం జరిగినా నేను గర్వపడటానికి మిమల్ని ఇలా చేయమని అంటున్నాను.
విశాల్: సరే నయని సూర్యాస్తమయం అయితే వెళ్దువుగానీ.
నయని: ఈలోపు స్వామీజీ గారిని ఒకసారి కలిసి వస్తాను బాబుగారు.
విక్రాంత్ ఫైల్స్ చూస్తుంటే సుమన వచ్చి సంతకం పెట్టే పవర్ మీకు ఇచ్చేశారా అని అడుగుతుంది. దానికి విక్రాంత్ రేపు నయని విశాల్ చేయి తగ్గించేస్తే విశాల్ బ్రో మొదటి సంతకం ఈ ఫైల్స్ మీద పెడతాడని అంటాడు. దానికి సుమన ఆ మణికాంత ప్రాంతానికి వెళ్లిన వాళ్లు ఎవరూ తిరిగి రారు అని గాయత్రీ దేవి వెళ్లినా సరే తిరిగి రాలేరని అంటుంది. దానికి విక్రాంత్ నయని వదినకు మాత్రమే ఆ హక్కు ఉందని ఆవిడ మాత్రమే ఆ ప్రాంతానికి వెళ్లగలదని నీ లాంటి వాళ్లు వెళ్లలేరని అంటాడు. ఇక నయని గురువు గారి దగ్గరకు వెళ్తుంది.
నయని: స్వామి తేలు కుట్టిందని ఎన్ని చేయాలో అన్ని చేసినా ఫలితం లేకుండా పోయింది. బాబు గారు బాధ పడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆ చేతికి చలనం లేకుండా పోయింది. తేలు కుడితే అలా అవుతుందా.
గురువుగారు: తన దివ్యదృష్టితో చూసి.. వృశ్చికాన్ని మచ్చిక చేసుకొని దానికి మాయా ప్రయాగం చేసినందుకే అలా జరిగింది నయని.
నయని: ఎవరు చేసుంటారు స్వామి ఇది తిలోత్తమ అత్తయ్య పనినే ఇప్పుడే ఆవిడ సంగతి చెప్తా.
గురువుగారు: ఆగు నయని ఆవేశ పడకు. వాళ్ల దుర్మార్గాన్ని తెలిసిన దానికి నువ్వే శిక్షించాలి అనుకుంటే ఎప్పుడో తిలోత్తమ కన్నుమూసేది కదా.
నయని: అవును స్వామి గాయత్రీ అమ్మగారి చేతిలో తిలోత్తమ అత్తయ్య ప్రాణాలు పోవాలని ఇన్నాళ్లు చూశాను కానీ బాబుగారి ప్రాణం నలిపేయడమే తిలోత్తమ అత్తయ్య ఉద్దేశం అయితే చూస్తూ ఎలా ఊరుకోమంటారు.
గురువుగారు: నయని నీకు నీ బిడ్డలకు తప్ప ఎవరికైనా ఏమైనా ఆపద వస్తే గుర్తించే నువ్వు ఈ సారి ఎందుకు కనిపెట్టలేకపోయావా అని ఆలోచించావా. నువ్వు విశాల్‌కి ఎదురయ్యే ప్రమాదం పసిగట్టకుండా నిలువరించారు అమ్మా. రోజు రోజుకు ఆరోగ్యం క్షీణించిపోతుంటే నువ్వు దిగులు పడకుండా అతని నయం అయ్యే మార్గం అన్వేసిస్తావని అందరి నమ్మకం. ఇప్పుడు నువ్వు మణికాంత ప్రాంతానికి వెళ్లినా అది అంత సులభంగా ఫలించదు. తీరా నువ్వు అక్కడికి వెళ్లినా అక్కడ ఆ తల్లి ఎదురుగా ఉండే నీటి దీపం వెలిగించాలి.
నయని: నీటి దీపమా అది ఎలా వెలుగుతుంది స్వామి. నీరు పడితే దీపం ఆరిపోతుంది కదా.
గురువుగారు: ఈ పరీక్షలో నువ్వు నెగ్గితేనే పంచకమణి దక్కించుకోగలవు తల్లీ.
నయని: అసాధ్యం అయిన పని చెప్పి దాన్ని పూర్తి చేయడం ఎలా స్వామి. నీటి దీపం ఎలా వెలిగించాలో చెప్పండి స్వామి.
గురువుగారు: మానసాదేవి దగ్గరకు వెళ్లిన తర్వాత నువ్వు రాయాలి. ఇంతకు మించి నేను ఏం చెప్పలేను నయని. నేను సూచించన మార్గం బట్టి నువ్వు సమయస్ఫూర్తితో ఆలోంచించు. నువ్వు మణికాంత ప్రాంతానికి వెళ్లే ముందు నేను కలుస్తాను.
నయని ఎక్కడికి వెళ్లిందని తిలోత్తమ హాసినిని అడుగుతుంది. ఇంతలో నయని వస్తుంది. కనిపించడం లేదా అని హాసిని అంటుంది. స్వామీజీ రాత్రికి మణికాంత ప్రాంతానికి వెళ్లమన్నారని నయని వాళ్లతో చెప్తుంది. అక్కడ నీటి దీపం గురించి నయని చెప్తుంది. గురువుగారు చెప్పింది నయని చెప్తే తిలోత్తమ వాళ్లు షాక్ అవుతారు. ఏం రాయమన్నారా అని అందరూ ఆలోచిస్తారు. రాత్రి అవుతుంది. గాయత్రీ పెట్టె దగ్గరకు వెళ్తే దురంధర పట్టుకొంటుంది. గురువుగారు వస్తారు. అందరూ నయనికి జాగ్రత్తలు చెప్తే నయనితో పాటు నేను వెళ్తానని గురువుగారు చెప్తారు. అందరూ సంతోషిస్తారు. తనకి ఏమైనా అడిగేవాళ్లు ఎవరూ లేరని నేను వస్తానని గురువుగారు అంటారు. మీకు ఏమైనా అయితే ఎలా అని నయని వద్దని అంటుంది. ఇక గురువుగారు పెట్టె దగ్గరకు వెళ్తుంటే గాయత్రీ పాప గురువుగారి కండువా పట్టుకొని వదలదు. దాంతో గురువు గారు పెట్టె పట్టుకోకుండా నయనికి తీయమని అంటారు. నయని పత్రాలు ఆధారంగా వెళ్దామని గురువుగారు చెప్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.