Trinayani Serial Today September 25th: 'త్రినయని' సీరియల్: కనికరించిన అడవితల్లి.. భర్త బిడ్డల్ని భుజాన మోసుకెళ్లిన నయని.. ఫాలో అవుతున్న గజగండ!
Trinayani Today Episode అడవి తల్లి దయతో నయని విశాల్, గాయత్రీ పాపలను కావిడలో మోసుకెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Serial Today Episode నయని ఎవరితో మాట్లాడిందో తనకు తెలీదని కనిపించలేదని విశాల్ నయనితో చెప్తాడు. దాంతో నయని షాక్ అయి అవ్వ తన పేరు కామసాని అని ప్రేమగా కాములమ్మ అని పిలుస్తారని చెప్పిందని అంటుంది.
నయని: నాకు కనిపించిన అవ్వ ఆత్మ మీ పూర్వీకులు బాబుగారు. గరుడాంకబేధసాని గారి మేనత్త కామసాని దేవి గారు బాబుగారు.
విశాల్: అవును నయని మానసాదేవి ఆలయంలోని రాజ్య సంపదను భద్రంగా దాచి పెట్టింది ఆవిడే అని చరిత్రలో ఉంది.
నయని: ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఆవిడ దర్శనం దొరకదు. నా అదృష్టం బాబుగారు.
విశాల్: మనసులో.. నిన్ను చూడటానికి వచ్చింది అనుకుంటా అమ్మ(పాపకి) నయని సాధనకు మీరంతా సాయం చేస్తున్నారని అర్థమవుతుంది అమ్మ.
మరోవైపు గజగండ అడవిలో తిరిగి తిరిగి అలిసిపోతాడు. ఇక పంచకమణి పట్టుకొని అలకని అంతం చేసే శక్తి ఇవ్వమని కోరుకుంటాడు. మరోవైపు విశాల్ అడుగులు ముందుకు పడవు చాలా ఇబ్బంది పడతాడు. ఇక దారిలో రాయి కాళ్లకి తగిలి పడిపోతాడు. కాలికి గాయం అయి రక్తం వస్తుంది. నయని ఏడుస్తుంది. నడవలేనని విశాల్ కూర్చొండిపోతాడు.
గజగండ: గాయత్రీదేవి నన్ను దారి మళ్లించి తన కోడలిని మానసాదేవి ఆలయానికి పంపిందనుంకుంటా. ఎలా అయినా రాత్రి అయ్యేలోపు గుడికి చేరుకోవాలి.
చిలుకశివ: ఓయ్ నయని హలో బుల్లబ్బాయ్.. మణికాంత గిరి చూడాలని నాకు కోరిక కలిగింది.
విశాల్: వద్దు శివ ఎప్పుడూ అలాంటి కోరిక కోరుకోవద్దు మేమే చేరుకోగలమో లేదో.
చిలుక: అయ్యయ్యో అంత మాట అనేశావ్ ఏంటి.
నయని: అక్కడికి వెళ్లాలి అంటే అడవితల్లి అమ్మ దగ్గరకు వెళ్లమని చెప్పింది కామసాని అమ్మ.
చిలుక: మీరు సరిగానే వచ్చారు వంద అడుగుల దూరంలో ఆ గుడి ఉంది రండి వెళ్దాం.
విశాల్ షూ అక్కడ వదిలేసి అతి కష్టం మీద నయని వెంట వెళ్తాడు. గజగండ అటుగా వచ్చి ఆ షూ చూసి అవి విశాల్ వని గుర్తించి అటుగా వెళ్తాడు. మరోవైపు ఇంట్లో దురంధర పూజ చేసి హారతి ఇస్తుంది. పావనా మూర్తి సెటైర్లు వేస్తాడు. చాలా సార్లు స్నానం చేసి చాలా సార్లు పూజ చేశావ్ ఏంటి అని తిలోత్తమ అడుగుతుంది. దాంతో దురంధర వాళ్లు క్షేమంగా రావాలి అని పూజలు చేస్తున్నానని అంటుంది. దానికి తిలోత్తమ దురంధర వాళ్లిద్దరి గురించి ఎక్కువ భయపడి దాన్ని మర్చిపోవడానికి పూజలు చేస్తుందని అంటుంది.
నయని, విశాల్, గాయత్రీ పాపతో పాటు చిలుక శివ కూడా అడవి తల్లి దగ్గరకు వచ్చేస్తారు. అమ్మవారికి దండం పెట్టుకుంటారు. నయనితో విశాల్ అమ్మవారికి బొట్టు పెట్టమని అంటాడు. బొట్టు ఎలా పెట్టాలని నయని అనుకుంటే విశాలాక్షి ఇచ్చిన కుంకుమ నీ కొంగున ఉంది కదా అది పెట్టు అని అంటాడు. దాంతో నయని బొట్టు పెడుతుంది. తన భర్త పిల్లని తీసుకొని వచ్చానని చేయి బాలేని తన భర్త ఇప్పుడు కాలికి కూడా గాయం అయిందని నువ్వే మాకు దారి చూపించని వేడుకుంటుంది. దాంతో ఉన్నట్టుండి పెద్ద గాలి వస్తుంది. దానితో రెండు బుట్టలు వస్తాయి. దాంతో నయని ఆ బుట్టుల్లో బాబుగారిని పాపని తీసుకెళ్లమని అమ్మవారి సూచించిందని నయని అంటుంది.
ఆ రెండు బుట్టల్ని ఓ కర్రకు కట్టి కావిడ సిద్దం చేస్తుంది. ఇక చిలుక నయనితో ఒక వైపు విశాల్ కూర్చొన్న మరోవైపు పాప కూర్చొంటే బ్యాలెన్స్ అవ్వదు కదా అని అంటుంది. దానికి నయని అమ్మవారే ఏదో మార్గం చూపిస్తుందని అంటుంది. ఇంతలో అమ్మవారి నుంచి ఏ వెలుగు వచ్చి ఓ చోట పడుతుంది. నయని అక్కడ మట్టి తొలగించి చూస్తే అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది. అది చాలా బరువుగా ఉంటుంది. నయని విశాల్‌ని బుట్టలో కూర్చొమని చెప్తుంది. మరోవైపు పాపని ఆ విగ్రహాన్ని పెడుతుంది. ఇక అమ్మవారి నుంచి ఓ వెలుగు వచ్చి మానసాదేవి ఆలయానికి దారి చూపిస్తుంది.. నయని అతి కష్టం మీద ఇద్దరినీ భుజాన మోస్తుంది. అమ్మవారు కూడా శక్తి ప్రసాదిస్తుంది. ఇంతలో గజగండ అక్కడికి వస్తాడు. ఆ కాంతి మార్గం చూసి ఫాలో అవుతాడు.
విక్రాంత్ ఆరుబయట వెన్నెలను చూస్తుంటాడు. సుమన అక్కడికి వస్తుంది. గాయత్రీ పాపని నయని వాళ్లు అడవిలో జంతువులు తమని తినడానికి వస్తే పాపని ఆ జంతువులకు ఇచ్చి తాము పారిపోతారని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.