అన్వేషించండి

Ammayi garu Serial Today September 24th: అమ్మాయి గారు సీరియల్: దీపక్, విరూపాక్షి, రాఘవలకు యాక్సిడెంట్.. విరూపాక్షిని తప్పుగా చిత్రీకరించిన విజయాంబిక!

Ammayi garu Today Episode రాఘవ నిజం చెప్పేస్తాడని తెలుసుకున్న విజయాంబిక రూప, రాఘవ, విరూపాక్షిలకు యాక్సిడెంట్ చేయించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రాఘవని విరూపాక్షి, రూప, రాజులు తప్పించి తీసుకెళ్లిపోయారని విజయాంబిక దీపక్‌తో చెప్తుంది. వాళ్లు ఇంటికి వస్తే తమ జీవితాలు నాశనం అయిపోతాయని వాళ్లు ఇంటికి వచ్చి సూర్యప్రతాప్‌తో నిజం నిరూపించకుండా చేయాలని కొడుకుతో చెప్తుంది. ఇక రాజు సూర్యప్రతాప్‌తో వెళ్తూ ఈ రోజుతో పెద్దయ్యగారికి నిజం తెలిసి అమ్మగారిని క్షమించి దగ్గరకు తీసుకుంటారని అమ్మాయి గారు అనుకున్నది జరుగుతుందని అనుకుంటాడు. 

దీపక్: మమ్మీ అదే జరిగితే త్వరలో మన కథ ముగిసిపోతుంది కదా.
విజయాంబిక: అందుకే వాళ్ల కథ ముగించేద్దాం. ఏదో ఒకటి చేసి వాళ్లని లేపేయాలి దీపక్. బండి వెనక్కి పోనీ. దీపక్ తాను ముందే సెట్ చేసిన రౌడీలతో మాట్లాడి లారీ ఏర్పాటు చేయమని అంటాడు. ఇక దీపక్ తన డ్రస్‌ని అందరూ గుర్తు పట్టేస్తారని వేరే డ్రస్ వేసుకొని వెళ్తాడు.

దీపక్ ఎవరూ గుర్తు పట్టకుండా డ్రస్ వేసుకొని లారీ నడుపుకుంటూ వస్తాడు. మరోవైపు రూప తల్లికి, రాఘవకి సీట్‌ బెల్ట్ పెట్టుకోమని తాను పెట్టుకుంది. రాఘవ సీట్ బెల్ట్ పెట్టుకునే లోపు లారీ వచ్చి గుద్దేస్తుంది. కారు లోయలో పడిపోతుంది. దీపక్, విజయాంబికలు హ్యాపీగా ఫీలవుతారు. రూప చనిపోతే మామయ్య నమ్మడని దీపక్ అంటే వాళ్లతో పాటు రాఘవ కూడా ఉన్నాడు కాబట్టి ఏదో ఒకలా నమ్మిద్దామని విరూపాక్షి, రాఘవ కలిసే ఉన్నారని వాళ్లతో పాటు రూప కూడా ఉందని చెప్దామని అంటుంది. 

ఇక కారులో రూపకి మెలకువ వస్తుంది. తల్లిని లేపుతుంది. రూప, విరూపాక్షి లేచి బయటకు వచ్చి రాఘవకు ఏమైందో అని చూడటానికి వెళ్తారు. రాఘవకి చాలా గాయాలు అవుతాయి. రూప ఆంబులెన్స్‌కి కాల్ చేస్తుంది.  రూప రాజుకి కాల్ చేసి విషయం చెప్తే రాజు షాక్ అయిపోతాడు. సూర్యప్రతాప్ వాళ్లు ఇంటికి వచ్చేస్తారు. విజయాంబిక, దీపక్ కూడా ఇంటికి వస్తారు. 

ఇంటికి రాగానే ఏదో నిరూపిస్తా అన్నావ్ కదా నిరూపించని సూర్యప్రతాప్ అంటే రాజు ఇంటికి రావాల్సిన వాళ్లు ఏదో చిన్న యాక్సిడెంట్ అయి హాస్పిటల్‌లో ఉన్నారు. అందుకే  నం హాస్పిటల్‌కి వెళ్దామని అంటాడు. రాఘవ హాస్పిటల్‌లో కొన ఊపిరితో ఉన్నాడని ఈ ఒక్కసారికి నన్ను నమ్మితే ఈ విజయాంబిక గారు మీకు చేసిన అన్యాయం నిరూపిస్తాను అంటాడు. దాంతో సూర్యప్రతాప్ ఈ ఒక్కసారి వీడి మాట నమ్మితే రూపని వీడి నుంచి కాపాడొచ్చని వెళ్తాడు. రాఘవ నోరు తెరవ కుండా ఆపాలని విజయాంబిక, దీపక్ బయల్దేరుతారు. మరోవైపు రూప, విరూపాక్షిలు రాఘవని హాస్పిటల్లో చేర్చుతారు. 

తన భర్తకి నిజం తెలుస్తుందనే టైంలో ఇలా జరగడంతో విరూపాక్షి చాలా ఏడుస్తుంది. దాంతో రూప తల్లికి ధైర్యం చెప్తుంది. ఇదంతా విజయాంబిక చేసుంటుందని తన బ్యాడ్ లక్ రాఘవ ప్రాణాలతో ఉన్నాడని అంటుంది. ఇంతలో రాజు వాళ్లు హాస్పిటల్‌కి వస్తారు.

రూప: నాన్న ఈ అత్తయ్య చేసిన చాలా ఘోరాలకు సాక్ష్యం దొరికింది నాన్న. ఆ సాక్ష్యాన్ని తీసుకొని ఇంటికి వస్తుంటే చిన్న యాక్సిడెంట్ అయింది.
సూర్యప్రతాప్: రూప తన నుంచి మనం నష్టపోయింది చాలు.

ఇంతలో డాక్టర్ వచ్చి రాఘవ బతకడం చాలా కష్టం అని అంటాడు. విజయాంబిక చాలా సంతోషిస్తుంది. ఇక మాట్లాడటానికి రాజు అందరినీ తీసుకెళ్తాడు. ఆ రోజు ఏం జరిగిందో చెప్పమని అంటారు. నిజం చెప్పమని విరూపాక్షి ఏడుస్తుంది. రాఘవ నిజం చెప్తూ మధ్యలో కోమాలోకి వెళ్లిపోతాడు. అందరూ షాక్ అయిపోతారు. దాంతో విరూపాక్షి ఇంకా రాఘవతో ఉందని విజయాంబిక తమ్ముడికి ఎక్కిస్తుంది. విజయాంబిక మాటలకు విరూపాక్షి విజయాంబికకి ఒక్కటిస్తుంది. దాంతో సూర్యప్రతాప్ మా అక్కనే కొడతావా అని విరూపాక్షిని కొడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: తల్లిదండ్రులకు తన చేతిలో తినిపించి కన్నీళ్లు పెట్టుకున్న కనకం.. చీర కానుక!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget