అన్వేషించండి

Trinayani Serial Today October 24th: 'త్రినయని' సీరియల్: నయనిని చంపేయాలంటోన్న తిలోత్తమ.. వల్లభ గొంతు పట్టేసిన గాయత్రీ దేవి!

Trinayani Today Episode తిలోత్తమ గాయత్రీ దేవి ఆత్మని చూసి నయనిని చనిపోతుంది దండేస్తా అనడంతో కోపంతో గాయత్రీదేవి ఆత్మ వల్లభ గొంతు పట్టుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తిరంగా మారింది.

Trinayani Serial Today Episode నీ మెడలో అమ్మవారి బిల్ల నీకు కనిపించిన ఫొటోలో లేదు అంటే అది లేనప్పుడు నీకు ఆపద వస్తుందనా లేదంటే అది పొగొట్టుకుంటున్నావనా అని విశాల్ నయనిని అడుగుతాడు. అదే అర్థం కాదు అని నయని అంటుంది. వేరే చీర కూడా కనిపించిందని చెప్పావు కదా చెల్లి హాసిని అంటుంది. దానికి సుమన పోనీ ఆ చీర నీ దగ్గర ఉందా అక్క అంటే అలాంటిది లేదని చెప్తుంది నయని.

విక్రాంత్: దీనికి ఎప్పుడు చీరల గొడవే.
విశాల్: ఒక్కనిమిషంరా సుమన అడిగిన ప్రశ్ని చాలా దూరం ఆలోచించేలా చేస్తుంది. 
తిలోత్తమ: వెరీ ఇంట్రస్టింగ్ నయని నీ మెడలో అమ్మవారి బిల్ల ఉండదు. ఆ చీర కూడా నీ దగ్గర లేదు. 
విశాల్: నయని నీకు ఏమైనా ఆలోచన దక్కిందా.
సుమన: పోనీ అలాంటి చీర కొంటే ఏమైనా క్లూ దొరుకుతుందా.
విక్రాంత్: పిచ్చి మాలోకం.
విశాల్: విక్రాంత్ సుమన అన్నది పాయింటేరా. 
విక్రాంత్: నువ్వు మాట్లాడుతుంటే భేష్ అంటుంటే ఆశ్చర్యంగా ఉంది.
వల్లభ: అలాంటి చీర కొని బిల్ల మెడలో తీసేస్తే ఇదే సమయం అని మృత్యుదేవత వస్తే ఏం చేస్తాం
హాసిని: అవును అవును ఇన్నాళ్లకు మా ఆయన కరెక్ట్‌గా చెప్పారు.
నయని: ఏది ఏమైనా ఆ ఆపద ఏంటో తెలుసుకుంటే ఆ ఆపద తొలగించడానికి మార్గం ఉంది.
విశాల్: రిస్క్‌ అనుకుంటా.
విక్రాంత్: లేదు బ్రో అలా చేస్తేనే ఏమవుతుందో తెలిసేది పైగా నింద కూడా నీ మీదే ఉంది.
సుమన: అయితే ఆ చీర కూడా బావనే తీసుకురావాలి.
తిలోత్తమ: తొందరగా నువ్వు ఆ చీర కట్టుకోవాలి నయని.

మరోవైపు తిలోత్తమ, వల్లభ నయనికి వచ్చిన ఆలోచన గురించి ఆలోచిస్తారు. మెడలో ఆ తాడు లేకపోతే కదా నయని చనిపోయేది కాబట్టి మనం ఆ తాడు తన మెడలో నుంచి తీసేద్దామని అంటుంది. నయని ఆ చీర కట్టుకున్నాక తాడు తీసేయమని చెప్దామని అంటుంది. ఏదో ఒకలా ప్లాన్ చేసి నయని అడ్డు తొలగించుకుందామని అంటుంది. మరోవైపు విక్రాంత్ ఫైల్స్ కోసం ఫోన్ మాట్లాడుతూ అక్కడికి వచ్చిన సుమనను వాళ్ల మీద పెట్టి తిడతాడు. ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతుంటే వయ్యారాలేంటి అని అడుగుతాడు. దానికి సుమన అక్కలు ఇద్దరూ చీర కొనడానికి వెళ్లున్నారు నేను కూడా పట్టు చీర కొనుకుంటాను డబ్బులు ఇవ్వమని అడుగుతుంది.

ఇక రాత్రి విశాల్ ఆరు బయట కూర్చొని ఉంటే హాసిని కుర్రో మొర్రో అనుకుంటూ వస్తుంది. ఏమైందని విశాల్ అడిగితే నీ భార్యకి కలలో కనిపించిన చీర కొనుక్కు రావడానికి చాలా షాపులు తిరిగామని పెళ్లి షాపింగ్‌ కూడా ఇంత చేయలేదని అంటుంది. మొత్తానికి దొరికింది కదా అని నయని అంటే నువ్వు బాగానే చెప్తావు చెల్లి కానీ నాకే చుక్కలు కనిపించాయని రంగు చెప్పావని బోర్డర్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని చాలా షాప్ వాళ్ల ప్రాణాలు చెల్లి తీసి దాన్ని తీసుకొచ్చిందని అంటుంది. హాసిని వాలకం చూసి నవ్వొస్తుంది. మొత్తానికి నయని హాసిని గదిలోకి తీసుకెళ్లి పడుకోపెడుతుంది.

 ఉదయం గాయత్రీ దేవి ఆత్మ వచ్చి తన ఫొటో తానే చూసుకుంటుంటే వెనక వచ్చి తిలోత్తమ నిల్చొంటుంది. ఏంటి అక్కా నీ ప్రియమైన కోడలు కన్ను మూస్తే మేం కళ్లారా చూసే ఫొటో నీ ఫొటో కంటే పెద్దగా ఉండాలని చూస్తున్నావా అని అడుగుతుంది. నయని చనిపోతే పూటకో ఫ్రెష్ పూల దండ వేస్తాం ఏమంటావ్ అని అడుగుతుంది. దాంతో గాయత్రీ దేవి తిలోత్తమ వైపు తిరుగుతుంది. కోపం వస్తుందా అక్క అని అంటుంది. ఇంతలో వల్లభ, హాసినిలు అక్కడికి వస్తారు. పెద్దమ్మ ఫొటో చూసి ఏం మాట్లాడుతున్నావ్ అంటే నీ వెనకాలే గాయత్రీ పెద్దమ్మ ఉందని అంటుంది. ఇంతలో గాయత్రీ దేవి వల్లభ గొంతు పట్టుకుంటుంది. వద్దు అక్కా అని తిలోత్తమ కోరుతుంది. అందరూ హాల్‌లోకి చేరుకుంటారు. వల్లభ విలవిల్లాడిపోతాడు. విశాల్‌తో మీ అమ్మ వల్లభని చంపేస్తుంది నాన్న అని చెప్తుంది తిలోత్తమ. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: సత్య మీద సంజయ్ కళ్లు, వంకర మాటలు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి భర్తకి కంప్లైంట్ ఇచ్చిన సత్య!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget