Trinayani Serial Today October 23rd: 'త్రినయని' సీరియల్: బిల్లతో ఆలోచనలో పడ్డ నయని.. చనిపోయేది త్రినేత్రినా.. అచ్చం నయనిలా ఉండటం ఏంటి?
Trinayani Today Episode నయని మెడలో ఉన్న అమ్మవారి తాయొత్తు చనిపోయిన తన ఫొటోలో లేదని నయని ఆలోచనలో పడటం నయని లాంటి త్రినేత్రి మరోచోట ఉండటంలో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
![Trinayani Serial Today October 23rd: 'త్రినయని' సీరియల్: బిల్లతో ఆలోచనలో పడ్డ నయని.. చనిపోయేది త్రినేత్రినా.. అచ్చం నయనిలా ఉండటం ఏంటి? trinayani serial today october 23rd episode written update in telugu Trinayani Serial Today October 23rd: 'త్రినయని' సీరియల్: బిల్లతో ఆలోచనలో పడ్డ నయని.. చనిపోయేది త్రినేత్రినా.. అచ్చం నయనిలా ఉండటం ఏంటి?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/23/b11a33fd88e12f13c99f62a4562b8a6c1729646019956882_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Trinayani Serial Today Episode విశాలాక్షి చెప్పిన పాత్రలో విశాల్ చేయి పెట్టడంతో రంగు మారుతుంది. విశాల్ వల్లే నయనికి గండం అని అందరూ షాక్ అయిపోతారు. దాంతో విశాలాక్షి హాసినితో పెద్దమ్మ ఇప్పుడు చెప్పు నిజం నీకు పుస్తకంలో ఎవరి పేరు కనిపించింది అంటే హాసిని విశాల్ అని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. విశాల్ షాక్ నుంచి తేరుకోలేకపోతాడు. నయని ఏడుస్తుంది. విశాలాక్షి తగిన జాగ్రత్తలు తీసుకొని అమ్మవారి మీద భారం వేయండని చెప్పి వెళ్లిపోతుంది.
తిలోత్తమ: ఏంటి నాన్న అలా ఢీలా పడిపోయావ్.
వల్లభ: నువ్వు లేకపోతే నేను లేను అని చెప్పే తమ్మినే భార్య చావుకి కారణం అవుతాడని ఎవరైనా అనుకుంటారా.
నయని: బాబు గారు అనుకున్నాక మీకు ఏంటి సమస్య బావగారు.
విశాల్: నయని నువ్వు కూడా ఏంటి అలా అంటున్నావ్.
తిలోత్తమ: ఇది వండర్ నయని. నువ్వు ఇలా అంటావ్ అని నేను ఊహించలేదు.
విశాల్: నయని నీరు రంగు మారి నందుకు నన్ను అపార్థం చేసుకుంటున్నావా.
నయని: బాబు గారు మీరు ఏం ఆలోచించకండి రేపో మాపో కాదు ఈ క్షణమే మీ వల్ల నా ప్రాణం పోయినా నాకు ఇష్టమే.
విశాల్: నయని ప్లీజ్ దయచేసి నువ్వు అలా మాట్లాడకు. నేను తట్టుకోలేను.
తిలోత్తమ: ఇంత ప్రేమ ఉన్న నువ్వు నయని చావుకి కారణమే నా నింద ఎలా మోస్తావు నాన్న.
హాసిని: మీ లాంటి వాళ్లు పక్కన ఉంటే ఎవరైనా మారాల్సిందే.
నయని: ఇది మా భార్యాభర్తల బంధం విశాలాక్షి చెప్పినా విశాలాక్షి అమ్మవారే చెప్పినా ఎవరూ మమల్ని విడదీయలేరు. మా ఆయన చేతిలో ప్రాణాలు పోగొట్టుకోవడానికి నేను సిద్ధమే.
విశాల్: నయని ఇది జరగదు మేం జరగనివ్వం.
హాసిని: అవును చెల్లి.
నయని: తన ప్రమేయం లేకుండా జరగొచ్చేమో.
విశాల్: అలాంటి సంకేతాలు తెలిస్తే నాకు ముందు చెప్పు నయని.
తిలోత్తమ: ఇంత క్లారిటీగా ఉంటే మిమల్ని ఎవరు విడదీయలేరు నయని.
మరోవైపు సుమన విక్రాంత్‌తో బాధ పడొద్దు బుల్లిబావగారు మా అక్క చనిపోతే మళ్లీ మీ పెద్దమ్మలా పుడుతుందేమో అని అంటుంది. మా అక్క చావుకి మా బావ కారణం అని తెలియడంతో మనసు తేలికగా మారిందని సుమన అంటుంది. దానికి విక్రాంత్ నువ్వు ఇంత శాడిస్టు అని అనుకోలేదని అంటాడు. నయని ఆయురారోగ్యాలతో ఉంటేనే ఈ ఇంట్లో అందరూ క్షేమంగా ఉంటామని అంటాడు. వదినను కాపాడుకోవడానికి ఏమైనా చేస్తానని అంటాడు విక్రాంత్. అందరిలా కాకుండా నేను కొత్తగా ఆలోచిస్తా అది నీతో అయితే అస్సలు చెప్పనని విక్రాంత్ అంటాడు. మరోవైపు గాయత్రీ పాప పూసలదండ తీసుకొచ్చి నయనికి ఇస్తుంది. దాంతో నయని నీ మెడలో వేయాలా అని వేసి విశాల్‌కి చూపించి పాప మెడలో ఈ దండ బాగుంది కదా అని అంటుంది. దానికి సుమన బతికున్నప్పుడు మెడలో ఏ దండ అయినా బాగుంటుందని అంటుంది. దానికి విక్రాంత్ ఏమన్నావ్ ఏమన్నావ్ అని అంటే విశాల్ తను నయనినే అన్నది అని అందరికీ తెలుసు గొడవ చేయకురా అని అంటుంది.
నయని: ఫొటోకి దండ వేసిన సీన్ గుర్తించి.. మా చెల్లి ఆ మాట అనడం మంచిదే అయింది. అవును అక్క చనిపోయాక ఫొటోకి దండ వేస్తారు. నాకు కలలో కనిపించిన పొటోకి దండ ఉంది కానీ మెడలో నేను వేసుకున్న అమ్మవారి దండ లేదు.
నయని అలా అనగానే అందరూ షాక్ అవుతారు. మరోచోట నయని కొత్త క్యారెక్టర్ కనిపిస్తుంది. పెళ్లి కాని నయనిలా ఉన్న మరో క్యారెక్టర్ దేవుడికి పూజ చేస్తుంది. బామ్మ బయట బియ్యం చెరుగుతూ ఉంటుంది. ముక్కోటి అనే ఓ వ్యక్తి బామ్మ దగ్గరకు వస్తాడు. ఎలుక చచ్చిన కంపు అని అల్లుడు ముక్కోటిని బామ్మ తిడుతుంది. ఇక నయనిలా ఉన్న ఆ అమ్మాయి త్రినేత్రి పూజ చేసి దేవుడికి హారతి ఇస్తుంది. ముక్కోటి డబ్బులు అడిగితే నువ్వు కూడా ఇవ్వొద్దని బామ్మ త్రినేత్రికి చెప్తుంది. ఇక త్రినేత్రి ముక్కోటికి 500 రూపాయలు ఇస్తే నా మేనకోడలు బంగారం అని ఏకంగా కాళ్ల మీదే పడిపోతాడు. అమ్మానాన్న లేని ఆడపిల్లవి నేను పోతే నిన్ను ఎవరు చూసుకుంటారని బామ్మ అంటుంది. దాంతో త్రినేత్రి నాకోసం రాజీ వస్తాడని అంటుంది.
ఇక సీన్ నయని వాళ్లు ఇంటికి వస్తుంది. అందరూ నయని నువ్వు ఆలోచిస్తున్నావు అంటే అందులో ఏదో తెలుసుకోవాల్సిన విషయం ఉందని విశాల్ అంటాడు. అద్దంలో చూసినప్పుడు, చనిపోయిన తర్వాత ఫొటోకి దండ వేసినప్పుడు కూడా బిల్ల మెడలో లేదని నయని అంటుంది. మెడలో బిల్ల లేనప్పుడు చనిపోయినట్లు కనిపించింది అంటే నువ్వు అది పోగొట్టుకుంటున్నావనా అది లేనప్పుడు ప్రాణ గండం వస్తుందనా అని విశాల్ అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: పచ్చబొట్టేసినా ప్రయోజనం లేకున్నదే: మామని చూసి సత్య పాటలు, చిన్న కొడుకు ఎంట్రీ!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)