(Source: ECI/ABP News/ABP Majha)
Trinayani Serial Today October 11th: 'త్రినయని' సీరియల్: గజగండతో పోటీకి నయని, విశాల్.. పంచకమణి దక్కించుకుంటారా.. ఆస్తి రాసివ్వమన్న సుమన!
Trinayani Today Episode పంచకమణి దక్కించుకోవడానికి నయని, విశాల్‌లు గజగండ దగ్గరకు బయల్దేరడం, సుమన వాళ్లు తిరిగి రారు అని ఆస్తి రాసివ్వమని అడగటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Serial Today Episode సుమన దుప్పటి కప్పుకొని కిచెన్ దగ్గర కూర్చొని కునుకు తీస్తుంటుంది. విక్రాంత్ చూసి ఏమైందని డైనింగ్ టేబుల్ దగ్గర ఇలా ఎందుకు కునుకు పాట్లు పడుతున్నావ్ అని అంటాడు. దానికి సుమన కొత్త ఇంట్లో నాకు ఓ గది ఇచ్చినప్పటికీ సొంతంగా ఏం లేదు అనే బెంగతో నిద్ర పట్టడం లేదని అంటుంది. జీవన్‌కి నయని తొలిబిడ్డను ఎత్తుకుపోమని చెప్పింది అహల్య అత్తయ్యే అని అందుకే తాను కబురు పెట్టినప్పుడు వస్తే పాప ఆచూకి చెప్తానని అందని అంటుంది. విక్రాంత్ కూడా వెటకారంగా అవునా నిజమా అని సుమనతో మాట్లాడుతాడు.
నయని ఆరు బయట కూర్చొని పెన్ను పేపరు మీద తాను చేయాల్సిన పనులను రాసుకుంటుంటుంది. ఇంతలో విశాల్ వచ్చి ఏం రాస్తున్నావ్ అని అడుగుతాడు. జోగయ్య శాస్త్రిని కలుస్తానని అంటుంది. అందరూ గాయత్రీ పాప గురించే అడుగుతున్నారని పాప ఎవరు అని అడుగుతానని అంటుంది. అలా అడిగితే ఆయన బాధ పడతారు అని అలా చేయడం వల్ల అనుమానాలు అభిప్రాయ బేధాలు వస్తాయని విశాల్ అంటాడు.
నయని: అందరూ పాపని ఎందుకు వేరు చేస్తున్నారో తెలుసుకోవాలి కదా.
విశాల్: గాయత్రీ గురించి తెలుసుకోవాలి అంటే నిదానంగా ఆచితూచి ఆలోంచాలి. మనం తన గురించి ఎంక్వైరీ చేస్తున్నాం అని తర్వాత తెలిస్తే ఎంత బాధ పడుతుందో కదా.
నయని: అందరి గురించి ఇంత ఆలోచించే మీరు పురిటిలో బిడ్డను దూరం చేసుకున్న నా గురించి ఎందుకు ఆలోచించడం లేదు. ఆరు నెలల క్రితం వరకు ఉరుకులు పరుగులు తీశారు తర్వాత ఆ ఊసే లేదు రిలాక్స్ అయిపోయారు. ఎందుకు.
విశాల్: మా అమ్మ నాదగ్గరకు వస్తుందనే నమ్మకం నాకు ఉంది నయని. కొంచెం ఓపిక పట్టు.
నయని: సరే సరిగ్గా నాలుగు రోజులు ఓపిక పడతా బాబు గారు అంతే.
తిలోత్తమ, వల్లభలు గజగండని కలుస్తారు. నయని భుజంగమణిని గాయత్రీ పాప ఆటబొమ్మల్లో పెట్టి మమల్ని ఫూల్స్‌ని చేసిందని తిలోత్తమ గజగండతో చెప్తుంది. చీరలో పెట్టినా చూసుకోలేకపోయానని చాలా బాధపడుతుంది. ఎంత పని చేశావ్ తిలోత్తమ అని గజగండ అంటాడు. నయని తెలివి తేటలకు మనం సిగ్గు పడాలని అంటాడు. ఇక తిలోత్తమ పంచకమణి తమకి ఇవ్వమని దాన్ని తీసుకెళ్లి నయనికి ఇచ్చినట్లే ఇచ్చి భుజంగమణిని కూడా తీసుకొచ్చేస్తా అంటుంది. మిమల్ని నమ్మనని గజగండ అంటాడు. పంచకమణి చేతులు మారితే ఏం జరుగుతుందో తనకు తెలుసని అది ఎవరికీ ఇవ్వనని భుజంగమణి తనకు దొరికితే అప్పుడు మీకు సాయం చేస్తా అంటాడు.
నయని విశాల్‌లు భుజంగమణి మానసాదేవి ఆలయంలో పెట్టేస్తాం అని అందరితో చెప్తారు. ఇక పంచకమణి కోసం గజగండని మర్యాదగా అడుగుతామని ఇవ్వకపోతే అప్పుడు కథ వేరేలా ఉంటుందని అంటారు. అందరూ నయనికి ఆల్ ది బెస్ట్ చెప్తారు. సుమన మాత్రం ఆస్తి తమకు ఇచ్చినట్లు సంతకాలు పెట్టమని గజగండ జోలికి వెళ్లిన మీరు తిరిగి రాకపోతే వాటిని మేం అనుభవించేలా చేయమని అంటుంది. విక్రాంత్, హాసిని, దురంధరలు సుమనను తిడతారు. ఇక విశాల్ విక్రాంత్‌కి ఇప్పటికే ఆస్తి ముగ్గురు పిల్లలకు రాసి ఇచ్చేస్తామని అంటారు. ఇక నయని, విశాల్ బయల్దేరుతారు. సుమన మనసులో వాళ్లు తిరిగి రాకపోతే బాగున్ను నా బిడ్డకు ఆస్తి వస్తుందని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.