Trinayani Serial Today November 7th: 'త్రినయని' సీరియల్: విశాల్ వెనుక త్రినేత్రి పరుగులు.. ఒకేలాంటి చీరల్లో నయని, త్రినేత్రి.. బలి కాబోతుంది ఎవరో?
Trinayani Today Episode త్రినేత్రి కట్టుకున్న చీర లాంటి చీరే నయని కట్టుకొని దేవీపురం వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Serial Today Episode విశాల్ మంచి నీటి కోసం త్రినేత్రి ఇంటి దగ్గర ఆగి లోపలికి వస్తాడు. అప్పటికే పెళ్లి కొడుకు రాక కోసం ఎదురు చూస్తున్న త్రినేత్రి వాళ్లు గులాబి రంగు షర్ట్ వేసుకొని విశాల్ లోపలికి రావడం చూసి విశాలే పెళ్లి కొడుకు అనుకుంటారు. త్రినేత్రికి విశాల్ బాగా నచ్చేస్తాడు. విశాలే పెళ్లి కొడుకు అనుకొని ముక్కోటి, వైకుంఠం మర్యాదలు చేస్తారు. విశాల్‌కి వైకుంఠం నీరు ఇస్తుంది. ఇక త్రినేత్రి విశాల్ కోసం కాఫీ చేయడానికి వెళ్తుంది. మరోవైపు తిలోత్తమ, వల్లభలు కారు దగ్గర ఉంటే విక్రాంత్, సుమనలు అక్కడికి వస్తారు. నయని త్రినేత్రి కట్టుకున్న చీర లాంటి చీర కట్టుకొని వస్తుంది.
సీన్ కట్ చేస్తే విశాల్ పల్లెటూరి మర్యాదలు బాగున్నాయి అంటాడు. ఇక విశాల్‌కి ముక్కోటి బిజినెస్ విషయాలు అడుగుతాడు. ఇక త్రినేత్రి కాఫీ కలుపుతుంది. వైకుంఠం వెళ్లి ఇవ్వమంటే నాకు సిగ్గు అని త్రినేత్రి వెళ్లదు. అబ్బాయి తనకు బాగా నచ్చాడని మెలికలు తిరిగిపోతుంది. పేరు అడగమని తన అత్తకి చెప్తుంది. విశాల్ పేరు చెప్పగానే త్రినేత్రి మురిసిపోతుంది. బామ్మకి సైగలు చేసి కాఫీ బాగుందా లేదా అని అడగమని అంటుంది. ఫస్ట్ క్లాస్‌గా ఉందని విశాల్ చెప్తే త్రినేత్రి మురిసిపోతుంది. వచ్చేవారం మళ్లీ వస్తాను అని చెప్పి విశాల్ వెళ్లిపోతాడు. విశాల్ బాబుని మరోసారి చూడాలని నా మనసు కోరుకుంటుందని త్రినేత్రి అనుకుంటుంది.
మరోవైపు నయనిని హాసిని తీసుకురావడంతో పెళ్లి చూపులా అని వల్లభ అడుగుతాడు. దానికి అలాగే అనుకో అని హాసిని అనగానే దేవీపురంలో విశాల్ మరో పెళ్లి చేసుకుంటాడా ఏంటి అని వల్లభ అడుగుతాడు. అందరూ సరదాగా నవ్వుకుంటారు. అందరూ నయనికి జాగ్రత్తలు చెప్పి దేవీ పురం సాగనంపుతారు. ఇంట్లో అందరూ మాట్లాడుకుంటారు. మృత్యువు ముంచుకొస్తుందేమో అని తిలోత్తమ అంటుంది. మంచి మాట్లాడమని విక్రాంత్ అంటాడు. ఆపద తెలుసుకోవడానికి వెళ్లిన నయనికి కారు యాక్సిడెంట్ అవ్వొచ్చు.. పాము కాటేయొచ్చు అని సుమన అంటే విక్రాంత్ లాగి పెట్టి కొడతాడు. తననిల తాను కాపాడుకోవడానికి వెళ్లిన వదిన మంచి కోరుకోవాలని విక్రాంత్ అంటాడు. నయని చచ్చిపోతుంది అని అంటే వల్లభని విక్రాంత్ నెట్టేస్తాడు. అన్నయ్యని నెట్టేస్తావా అని విక్రాంత్‌ని తిలోత్తమ కొడుతుంది. నయని గడపదాటి మనలో మనం కొట్టుకునేలా చేసిందని సుమన అంటుంది.
ఇక విశాల్ అమ్మవారి దగ్గరకు ఎలా వెళ్లాలని ఓ వ్యక్తిని అడిగితే అక్కడ అమ్మవారి విగ్రహం మాత్రమే ఉందని విషపాములు ఉంటాయి వెళ్లొద్దని చెప్తాడు. మరోవైపు నయని దేవీ పురం చేరుకుంటుంది. సీన్ యమలోకానికి వెళ్తుంది. చిత్రగుప్తుడు చూస్తాడు. ఈ రోజు త్రినేత్రి బలి అవ్వబోతుందని అని త్రినేత్రి పేరు చెరిపేయాలి అంటాడు. ఇక త్రినేత్రి విశాల్‌ని చూసి బాబుగారు అనుకుంటూ మరోసారి చూడాలని పరుగులు తీస్తుంది. మరోవైపు త్రినేత్రిని చంపేయమని ముక్కోటి ఓ వ్యక్తి చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

