Trinayani Serial Today November 6th: 'త్రినయని' సీరియల్: విశాలే తనకు కాబోయే భర్త అని ఫిక్స్ అయిపోయిన త్రినేత్రి.. బ్రేక్ ఫెయిల్!
Trinayani Today Episode విశాలే తనని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన పెళ్లి కొడుకు అనుకొని త్రినేత్రి విశాల్‌ని చూసి ఇష్టపడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Serial Today Episode విశాల్ దేవీపురం బయల్దేరితే వెళ్లొద్దని గాయత్రీ పాప రెండు చేతులు ఊపుతూ సైగలు చేస్తుంది. ఇక విశాల్ పాపని పిలిచి హగ్ చేసుకొని నిన్నూ అమ్మని వదిలి నేను ఎక్కడికి వెళ్లనని దేవీపురం వెళ్లి సాయంత్రంలో వచ్చేస్తానని చెప్పి పాపని నయనికి అప్పగిస్తాడు. ఇక నయని నాన్నకి బాయ్ చెప్పమని అంటే పాప చెప్పనని తలాడిస్తుంది.
విశాల్ దేవీపురం బయల్దేరుతాడు. ఇక నయనీకి భవిష్యత్ కనిపిస్తుంది. త్రినేత్రి పరుగున వస్తుంటే బ్రేక్ ఫెయిల్ అయిన కారు త్రినేత్రి వైపు దూసుకొచ్చి ఢీకొట్టినట్లు కనిపిస్తుంది. గులాబి రంగు చీర కట్టుకున్నాకే ఆపద వస్తుందని నయని అంటుంది. ఎవరూ నమ్మరు నువ్వు కంగారు పడి మమల్ని కంగారు పెడుతున్నావని సుమన అంటుంది. గండం ఈ రోజే వచ్చేలా ఉందని ఆ చీర కట్టుకొని నేను ఇప్పుడే దేవీపురం వెళ్తానని అంటుంది. విశాల్ నిన్ను రావద్దు అన్నాడు కదా వద్దని అందరూ చెప్తారు. ఎవరెన్ని చెప్పినా నయని ఆ చీర కట్టుకొని వెళ్తానని అంటుంది. గాయత్రీ పాపని హాసినికి ఇచ్చేసి చీర కట్టుకోవడానికి పరుగులు తీస్తుంది నయని.
మరోవైపు త్రినేత్రిని చూడటానికి ఓ అబ్బాయి గులాబి రంగు షర్ట్ వేసుకొని కారులో బయల్దేరుతాడు. ఊరు వచ్చేసరికి కారు ఆగిపోతుంది. మరోవైపు విశాల్ కూడా అదే రూట్‌లో అదే రంగు షర్ట్ వేసుకొని వస్తాడు. పెళ్లి కొడుకు కారు ఆగిపోవడం చూసి సాయం చేయడానికి వెళ్తాడు. విశాల్ రిపేర్ చేస్తాడు. ఇక ఆ అబ్బాయికి అతని తల్లి వెనక్కి వచ్చేయ్ సంబంధం అనుకోగానే ఇలా జరిగిందని అంటుంది. వెనక్కి రాకపోతే నా మీద ఒట్టే అని ఆవిడ చెప్పడంతో ఆ అబ్బాయి వెనక్కి వెళ్లిపోతాడు. ఇక విశాల్ ఊరిలోకి వెళ్తాడు.
మరోవైపు విక్రాంత్ గాయత్రీ పాపని ఆడిపిస్తుంటే సుమన వచ్చి మీకు ఈ డ్యూటీ వేశారా బుల్లిబావగారు అని అంటుంది. నయని వదిన ఏం చేసినా మంచే చేస్తుందని విక్రాంత్ అంటాడు. గాయత్రీ పాపని ఎత్తుకోవడం వల్ల అమ్మవారి ఉత్సవ విగ్రహం ఎత్తుకున్నంత సంతోషమని విక్రాంత్ అంటాడు. మిమల్ని ఎవరూ బాగు చేయలేరు అని సుమన అని వెళ్లిపోతుంది. మరోవైపు వల్లభతో తిలోత్తమ కారు బ్రేక్‌లు తీయిస్తుంటుంది. ఇంతలో హాసిని అక్కడికి వస్తే తిలోత్తమ కంగారు పడుతుంది. హాసినిని లోపలికి వెళ్లమంటే వెళ్లదు. హాసిని వెళ్లిపోగానే తిలోత్తమ వల్లభను బయటకు రమ్మని చెప్తుంది.
ఇక విశాల్ మంచి నీరు కావాలని అడుగుదామని త్రినేత్రి ఇంటి ముందు కారు ఆపుతాడు. బామ్మ ముక్కోటి, వైకుంఠంలను పిలిచి పెళ్లి కొడుకు అయింటాడు అని వెళ్లి చూడమని అంటుంది. ఇక త్రినేత్రి కూడా పెళ్లి కొడుకుని చూడటానికి రెడీగా తలుపు చాటున ఉంటుంది. ఇక వల్లభ ప్లాన్ సక్సెస్ అయిందని చెప్తాడు. విశాల్ ఇంట్లోకి వెళ్లడం చూసిన త్రినేత్రి విశాలే పెళ్లి కొడుకు అనుకొని విశాల్‌ని చూసి ఫిదా అయిపోతుంది. బామ్మ కూడా చాలా బాగున్నాడు అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

