Trinayani Serial Today November 25th: 'త్రినయని' సీరియల్: త్రినేత్రికి గున్ గురిపెట్టిన తిలోత్తమ.. సీమంతం జరిగితే విషయం తెలుస్తుందన్న గురువుగారు!
Trinayani Today Episode ఇంట్లో ఉన్నది నయనినా త్రినేత్రినా తెలియాలి అంటే దురంధర సీమంతం జరగాలి అని గురువుగారు ఇంట్లో వాళ్లకి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Serial Today Episode గాయత్రీదేవి తనకు అత్త అవుతారని పాప కూతురు అవుతుందని కానీ అవన్నీ విశాల్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత అని త్రినేత్రి చెప్పడంతో అందరూ షాక్ అయిపోతారు. విశాల్‌నే ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావ్ అని గురువుగారు అడిగితే నన్ను చూసుకోవడానికి విశాల్ బాబుగారు వచ్చారు అందుకే చేసుకుంటే ఆయన్నే చేసుకోవాలి అప్పుడే ఫిక్స్ అయ్యానని త్రినేత్రి చెప్తుంది. దాంతో విశాల్ గతంలో నయని తనని యాక్సిడెంట్ నుంచి కాపాడటం పెళ్లి చేసుకోవడం గుర్తు చేసుకుంటాడు. అసలు నాకు నయనికి పెళ్లి చూపులే కాలేదు కదా అనుకుంటాడు.
తిలోత్తమ: ఏంటి విశాల్ నిన్ను చూడటానికి వచ్చాడా.
విశాల్: ముక్కంటి పురం నాటి సంగతి చెప్తుందనుకుంటానమ్మా.
త్రినేత్రి: ముక్కంటి పురం కాదు బాబుగారు దేవీపురం. అందరూ షాక్ అయిపోతారు.
విక్రాంత్: దేవీ పురమా బ్రో ఇప్పటి వరకు పేరు త్రినేత్రి అనడం ఊరు పేరు అడిగితే ఏం చెప్పకపోవడమే జరిగింది ఇప్పుడు దేవీపురం అన్నారు చూశారా.
సుమన: ముక్కంటిపురం కదా అక్క.
త్రినేత్రి: దేవీ పురం అన్నాను కదా. ఆ పేరు ఎందుకు అనేశాను.
గురువుగారు: అది మీ ఊరు కాబట్టి. నువ్వు చెప్పు త్రినేత్రి.
త్రినేత్రి: మాది ముక్కంటి పురం కాదు దేవీపురమే.
పావనా: అక్కడే యాక్సిడెంట్ అయింది కాబట్టి ఆ పేరు చెప్పిందా.
గురువుగారు: ఇంకా ఏమైనా గుర్తొస్తున్నాయా త్రినేత్రి.
త్రినేత్రి: దేవీపురంలో బాబుగారి కోసం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లాను.
విశాల్: ఎస్ అవును నయని నా కోసం నడుచుకుంటూ వస్తున్నప్పుడే కదా యాక్సిడెంట్ అయింది.
త్రినేత్రి: నాకు ఏ యాక్సిడెంట్ అవ్వలేదు బాబుగారు.
గురువుగారు: నిజమే నీకు ఆ రోజు ప్రమాదం జరగలేదు. త్రినేత్రి ప్రమాదం అప్పుడు జరగలేదు తర్వాత జరిగింది. మనుషులు మాత్రమే తప్పు చేస్తారు అనుకోకూడదు దైవాంశ శంభూతులు కూడా తప్పులు చేస్తారు. అలా జరిగిన తప్పు వల్లే త్రినయని త్రినేత్రి అయింది. కొన్ని సార్లు అన్నీ తెలిసినట్టే ఉంటుంది అన్నారు కదా.
వల్లభ: అప్పుడు మాములుగా ఉండదు అందరినీ వరసలు పెట్టి పనులు చేస్తుంది.
హాసిని: చేతికి వాచ్ కట్టుకొని మరీ పనులు చేస్తుంది.
గురువుగారు: గడియారం చూసినప్పుడు దగ్గరగా పరిశీలించు హాసిని. ఇక దురంధరకు సీమంతం జరిగితే త్రినయనీనా త్రినేత్రినా అనే ఈ సమస్యకు ఓ దారి దొరుకుతుంది.
విశాల్: అయితే వెంటనే ఒక మంచి రోజు చూసి చేద్దాం.
తిలోత్తమ: తప్పకుండా నాన్న.
విక్రాంత్ వెళ్తుంటే సుమన వెళ్లి విక్రాంత్‌ని ఆపుతుంది. మా అక్కకి నయం చేస్తామని చెప్పి ఏం చేశారు. ఎందుకు మా అక్క ఇలా మారిపోతుందని అంటుంది నాకే అర్థం కావడంలేదు నువ్వు ఏంటి అంటాడు. మా అక్క అని సుమన అంటే తను మీ అక్క అని నువ్వు అనుకుంటున్నావ్ కానీ నేను కాదు అనుకుంటున్నాను అని అంటాడు. పోలీస్‌కి చెప్పి ఎంక్వైరీ కూడా మొదలు పెట్టానని చెప్తాడు. ఇక పోలీస్ దేవీపురంలో అందరినీ యాక్సిడెంట్ గురించి అడుగుతుంటాడు. మరోవైపు బామ్మ పోలీసు దగ్గరకు వెళ్తుంది. దాంతో ముక్కోటి, వైకుంఠం టెన్షన్ పడుతూ పరుగులు తీస్తారు. తన మనవరాలు త్రినేత్రి కనిపించడం లేదని చెప్పి పోలీస్‌కి ఫొటో చూపిస్తుంది. నయనిలా ఉన్న త్రినేత్రి ఫొటో చూసి పోలీస్ చంద్రశేఖర్ షాక్ అయిపోతాడు. ఇంతలో ముక్కోటి, వైకుంఠం వచ్చి బామ్మకి పిచ్చి అని తీసుకెళ్లిపోతారు.
మరోవైపు తిలోత్తమ, వల్లభలు త్రినేత్రిని ఆపి రెండు నిమిషాల్లో నువ్వు ఎవరో చెప్పు అని గన్ గురిపెడుతుంది. అందరూ అక్కడికి చేరుకుంటారు. దీపావళి తుపాకీనా అని త్రినేత్రి ధైర్యంగా నిల్చొంటుంది. నయనికి ఏమైనా అయితే ఊరుకోనని విశాల్ అంటాడు. ఇక తిలోత్తమ ఈ దొంగ నయని సంగతి తేల్చేస్తా అంటాడు. తను నయని కాదనడానికి సాక్ష్యం ఉందా అని విక్రాంత్ అడుగుతాడు. లేదు అని తిలోత్తమ అంటుంది. ఎవరు నువ్వు అని తిలోత్తమ అడిగితే త్రినేత్రి అని త్రినేత్రి చెప్తుంది. ఇక గాయత్రీ పాప అక్కడికి వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.