Karthika Deepam 2 Serial Today November 25th: కార్తీకదీపం 2 సీరియల్: దీప కార్తీక్‌ల చనువు చూసి మురిసిపోయిన అక్కాచెల్లెళ్లు.. కార్తీక్.. కార్తీక్.. అంటోన్న శౌర్య!
Karthika Deepam 2 Serial Today Episode కార్తీక్, దీప కలిసి భోజనం చేయడం కాంచన, అనసూయ, శౌర్య చూసి మురిసిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
![Karthika Deepam 2 Serial Today November 25th: కార్తీకదీపం 2 సీరియల్: దీప కార్తీక్‌ల చనువు చూసి మురిసిపోయిన అక్కాచెల్లెళ్లు.. కార్తీక్.. కార్తీక్.. అంటోన్న శౌర్య! karthika deepam idi nava vasantham serial november 25th episode written update in telugu Karthika Deepam 2 Serial Today November 25th: కార్తీకదీపం 2 సీరియల్: దీప కార్తీక్‌ల చనువు చూసి మురిసిపోయిన అక్కాచెల్లెళ్లు.. కార్తీక్.. కార్తీక్.. అంటోన్న శౌర్య!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/25/3cede2f76b03dd3c2194779db4af381d1732507470421882_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దాసు కుభేర గురించి తెలుసుకొని వెళ్లడంతో స్వప్న, కాశీలు దాసు గురించి మాట్లాడుకుంటారు. ఎప్పుడూ ఏదో డ్రాయింగ్ దాసు చేతిలో ఉందని దేని కోసమో వెతుకుతున్నాడని అనుకుంటారు. ఇక మరోవైపు శివనారాయణ దీప తనకు చేసిన అవమానం తలచుకొని బాధ పడుతుంటాడు. ఇంతలో సుమిత్ర అక్కడికి వస్తుంది.
సుమిత్ర: మామయ్య గారు ఏ అర్థరాత్రి లేచి చూస్తున్నా జ్యోత్స్న గది లైట్ వెలిగే ఉంటుంది. కార్తీక్ పెళ్లి అయిన నాటి నుంచి అది ప్రశాంతంగా పడుకున్నదే లేదు. దానికి ఇష్టమైన వాడితో పెళ్లి చేయలేకపోయాం కనీసం మనం అనుకున్న సంబంధం అయినా తొందరగా చేసేస్తే అది ఫారెన్ వెళ్లిపోతుంది. ఇక్కడివన్నీ మర్చిపోతుంది.
శివనారాయణ: చూడమ్మా విశ్వనాథం మన సంబంధం వద్దు అనుకున్నంత మాత్రానా నీ కూతురు పెళ్లి అవ్వదు అనుకోకు. నేను మనవరాలు గురించే ఆలోచిస్తున్నా. నా మనవరాలి జీవితంతో పాటు మన పరువు కూడా పెరిగేలా చేస్తా. నువ్వు బాధ పడకమ్మా. నేను ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నా. ఇక కొడుకుని పిలిచి బిజినెస్ డెవలప్ మెంట్‌కి ఓ నిర్ణయం తీసుకున్నానని బోర్డ్ మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్తాడు.
కార్తీక్‌కి దీప భోజనం వడ్డిస్తుంది. అందరూ ఎక్కడని కార్తీక్ అడిగితే అందరూ తినేశారని శౌర్యని పిలవమని కార్తీక్ అంటే తన కోసం అన్నం తీసుకెళ్లారని చెప్తుంది. బయట నుంచి కాంచన వాళ్లు చూస్తుంటారు. కార్తీక్ దీపని తనతో కలిసి తినమంటే దీప వద్దని కార్తీక్ పొలమారినా దగ్గర వరకు వెళ్లి ఆగిపోవడంతో అనసూయ అక్కడ యాక్షన్‌కి ఇక్కడ శౌర్య మీద రియాక్షన్ చూపిస్తుంది. ఇక కాంచన అనసూయని నేను అక్కా అని పిలుస్తానని నవ్వు నన్ను చెల్లి అని పిలవమని అంటుంది. అలా పిలవలేను అని అనసూయ అంటే చెల్లెమ్మా అని పిలవమంటుంది. శౌర్య మాత్రం అక్క నానమ్మ చెల్లి నానమ్మ అంటానని అంటుంది.
కార్తీక్ దీపతో ఈ రోజు నా పుట్టిన రోజు ఇన్ని వంటలు చేశావ్ కానీ ఏవీ బాలేవని అంటాడు. అది విన్న శౌర్య, కాంచన, అనసూయలు ఒకేసారి దీప వంట బాలేదా అని అనుకుంటారు. ఏం బాలేదని ఏం తగ్గిందని దీప అడిగితే ప్రేమ తగ్గిందని కార్తీక్ చెప్తాడు. తన పుట్టిన రోజుకు తండ్రి బిజీ అయినా తల్లి మాత్రం కలిసి తినేదని ఇప్పుడు ఎవరూ లేరు ఒంటరిగా ఉన్నానని నువ్వు కూడా తినడం లేదని బాధ పడతాడు. దాంతో దీప కూర్చొంటుంది. ఇద్దరూ ఒకరికి ఒకరు వడ్డించుకుంటారు.
దీప వంటలు బాగున్నాయని కార్తీక్ అంటాడు. దీప సిగ్గు పడుతుంది. కాంచన, అనసూయ ఇద్దరూ సంతోషంగా ఉంటారు. ఇద్దరూ అసలైన భార్యాభర్తల్లా ఉన్నారని అనుకుంటారు. ఇద్దరినీ కలపాలి అంటే మీ నాన్నని కార్తీక్ అని పిలవాలి అని కాంచన అంటుంది. మీ అమ్మ కార్తీక్‌ని నాన్న అని పిలవమని చెప్పే వరకు నువ్వు కార్తీక్ అని పిలవాలి అని అంటుంది. ఇక తను కార్తీక్ అని పిలవమన్నట్లు ఎవరికీ చెప్పొద్దని అంటుంది. ఇక కార్తీక్ తినేసి దీపకి థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోతాడు.
కాంచన వచ్చి కార్తీక్ దగ్గరకు వచ్చి నువ్వు దీపతో మేడ మీదకు వెళ్లి వాకింగ్ చేయమంటుంది. ఇక కార్తీక్ కాంచనతో మీ అన్నయ్య నాతో పరుగులు పెట్టిస్తున్నాడు. రేపు మీటింగ్ ఉంది నేను సీఈఓగా వెళ్లాలని అంటాడు. ఇక నాకు వాళ్లతో బిజినెస్ ఇష్టం లేదు విడిగా వ్యాపారం చేసుకోవాలని ఉందని కార్తీక్ అంటాడు. మీటింగ్ తర్వాత నిర్ణయించుకో అని కాంచన అంటుంది. ఇంతలో శౌర్య వచ్చి కార్తీక్‌ని కావాలనే కార్తీక్ కార్తీక్ అని అంటుంది. దీప, కార్తీక్ ఇద్దరూ ఇదేంటి నాన్న అనకుండా కార్తీక్ అంటుందని అనుకుంటాడు.
ఇక కాంచన, అనసూయలు అక్కా చెల్లెమ్మ అనుకోవడం విని వీళ్లేంటి ఇలా పిలుచుకుంటున్నారని అనుకుంటారు. కార్తీక్ మనసులో వీళ్లని ప్రశ్నించకుండా సైలెంట్‌గా వెళ్లిపోతే బెటర్ అని వెళ్లిపోతాడు. ఇక దీప అనసూయతో నువ్వేంటి కాంచనమ్మగారిని చెల్లమ్మా అంటున్నావ్ అని అని అడుగుతుంది. దాంతో అనసూయ నీ వల్ల మాకు వచ్చిన బంధాలు ఇవి అని అంటుంది. మీ మాటలు చేతలు అర్థమవుతున్నాయని దీప అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: విహారి, లక్ష్మీలకు సంబంధం ఉందని రచ్చ రచ్చ చేసిన పద్మాక్షి.. ఫుటేజ్‌లో అంబిక దొరికిపోతుందా!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)