అన్వేషించండి

Trinayani Serial Today January 19th: విక్రాంత్‌కు హాని తలపెట్టినున్న సుమన.. గాయత్రీ దేవిని చూశానని ఒప్పుకున్న విశాల్!

Trinayani Serial Today Episode: పాయసం తిన్న విశాల్ పునర్జన్మలో పుట్టిన గాయత్రీ పాప జాడ తనకు తెలుసు అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Today Episode: అందరూ హాల్‌లో కూర్చొంటే విశాలాక్షి అందరికీ పాయసం వడ్డించేందుకు సిద్ధమవుతుంది. ఇక సుమన పిడకల మీద వండిన పాయసం ఎలా తింటారు అని విసుక్కుంటుంది. దానికి హసిని తినకపోతే మానేయ్ అంటుంది. విక్రాంత్ నిజం చెప్పకుండా తప్పించుకోవడానికి ఇలా చేస్తుందని అంటాడు. ఇక విశాలాక్షి సంగతి ఏంటో తేల్చేస్తాను అని తనకు ముందు పాయసం పెట్టు అని సుమన అడుగుతుంది. దీంతో విశాలాక్షి సుమనకు పాయసం వడ్డిస్తుంది. తినడానికి సుమన జంకుతుంది.

విశాల్: ఆవు పేడ పిడకలతో చేసిన పాయసాన్ని తినాలా వద్దా అని ఆగిపోయింది సుమన. 
సుమన: బావగారు కరెక్ట్‌గా చెప్పారు.
డమ్మక్క: అంతే కానీ ప్రాణం పోతుంది అనే భయం మాత్రం లేదు కదా..
ఎద్దులయ్య: చిట్టిమాతకు ప్రాణం మీద తీపి లేదు కానీ ఆకులో ఉన్న తీపితో ప్రాణం విలువ తెలుస్తుంది.
సుమన: తింటాను కానీ నా ప్రాణం మాత్రం నిజంగా పోతే దానికి బాధ్యురాలు విశాలాక్షినే.
తిలోత్తమ: సుమన అన్నదాంట్లో నిజమే ఉంది. విశాలాక్షి తాను చెప్పింది నిజం అని నిరూపించడానికి ఈ పాయసంలో ఏమైనా కలుపుకొని వచ్చిందేమో.
నయని: మీకు వచ్చే ఆలోచనలు ఇంకెవరికీ రావు అనుకుంటా.. విశాలాక్షి అలా చేస్తుందా..
విశాలాక్షి: మీకు అంత అనుమానంగా ఉంటే ఎద్దులయ్యే రుచి చూస్తాడు. తిన్న తర్వాత విశాలాక్షి ఎద్దులయ్యకు ప్రశ్న అడుగుతుంది. ఎద్దులయ్య నీ గురించి చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు అందుకే నీ గురించి అడుగుతున్నాను. నీ భార్య పేరేమిటి. 
ఎద్దులయ్య: నా ధర్మపత్ని నామధేయం సుయాస. 
డమ్మక్క: ఎద్దులయ్య నిజం చెప్పినందుకు తనకు ఏం కాలేదు అని గ్రహించండి..
సుమన: నేను తింటాను కానీ నాకు ఎవరూ ఏం అడగొద్దు నా పాపకు పాలివ్వాలి.. అని సుమన తినేసి వెళ్లబోతే పాయసం గొంతులో ఇరుక్కొని సతమతం అవుతుంది. 
విశాలాక్షి: ప్రశ్న అడగకుండా హడావుడిగా వెళ్లినా ప్రాణం మీదకు వస్తుంది అని చెప్పాను కదా.. సుమన నువ్వు ఎవరికి అన్యాయం చేయదలిచావో వాళ్ల వైపు వేలు చూపించు.
సుమన: షాక్ అవుతూనే.. విక్రాంత్‌ వైపు చేయి చూపుతుంది. అప్పుడు సుమనకు ఆయాసం తగ్గుతుంది.
తిలోత్తమ: నా కొడుకుకే అన్యాయం చేయాలి అనుకున్నావా.. ఏం చేయాలి అనుకున్నావ్.
నయని: కోప్పడకండి అత్తయ్య.. నిజం అయితే చెప్పింది కదా.. నష్టం ఏం జరగలేదుగా.. విక్రాంత్ బాబు జాగ్రత్తగా ఉంటారు.   
విక్రాంత్: పర్వాలేదు నీ మనసులో ఏముందో తెలుసుకున్నానో కదా థ్యాంక్స్.
తిలోత్తమ: తనకు చాలా అనుమానాలు ఉన్నాయని తాను వడ్డిస్తాను అని పాయసం కుండ తీసుకుంటుంది. తాను విశాల్‌కు పాయసం వడ్డిస్తాను అని అంటుంది. విశాల్‌కి వడ్డించి ప్రశ్న వేస్తుంది. విశాల్ నీకు ఏదైనా జరిగితే ఈ ఇళ్లే గల్లంతు అవుతుంది. అలాంటప్పుడు నువ్వు చెప్పే నిజం బట్టే అందరి భవిష్యత్ ఆధారపడిఉందని నాకు అనిపించింది. తిను నాన్న. 
విక్రాంత్: అమ్మా అన్నయ్య తినేశాడు ఆ ప్రశ్న ఏంటో అడుగు.
తిలోత్తమ: విశాల్ పునర్జన్మ ఎత్తిన గాయత్రీ దేవి అక్కని నువ్వు చూశావా.. 
విశాల్: మనసులో.. చూశాను అంటే ఎక్కడ అని అడుగుతుంది.
హాసిని: చూడలేదు అంటే అది అబద్ధమై విశాల్ ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. ఇప్పుడు ఏం చేస్తావ్ విశాల్.
నయని: గాయత్రీ అమ్మగారిని చూశారా..
విశాల్: చూశాను. 
తిలోత్తమ: చూశావా ఎక్కడ విశాల్..
వల్లభ: ఏయ్ చూసినా ఎందుకు చెప్పలేదు.
విక్రాంత్: వదినకు కూడా ఎందుకు చెప్పలేదు బ్రో.
విశాలాక్షి: ఆగండి ఆగండి.. ఒక్కసారే అడగాలి అదికూడా ఒకే ప్రశ్న అడగాలి. రెండో ప్రశ్నకు తావులేదు. 
వల్లభ: ఈ పాయసం ప్రోగ్రామ్ అయ్యాక అయినా చెప్పాలి కదా ఎలా తప్పించుకుంటాడో..
సుమన: కన్న కూతురుని చూసి ఇంటికి తీసుకురాకుండా ఉన్నారంటే బావగారి హృదయం ఎంత కఠినమైందో చూడండి..

సుమన: బుల్లిబావగారు మీరేనా.. ఉలూచి దగ్గరకు కూడా వెళ్లని మీరు తనని ఎత్తుకొని ఆడిస్తున్నారా.. ఆశ్చర్యం కంటే ఆనందమే ఎక్కువ ఉంది.
విక్రాంత్: ఇందులో అంత ఆశ్చర్యం ఏం లేదు. రేపటి నుంచి పసి పాప బాధ్యతలు నేనేగా చూసుకోవాలి. ఇప్పటి నుంచి చూసుకుంటే మంచిది అని దగ్గరకు తీసుకున్నాను. 
సుమన: అయితే నన్ను స్వేచ్ఛగా ఉండాలి అనుకుంటున్నారా.. 
విక్రాంత్: నీకు అంత దయలేదు.. కాబట్టి నువ్వు దయచేస్తే మంచిది.
విశాల్: సుమన ఈ ఇళ్లు వదిలి వెళ్లిపో. నేను అనడం లేదు విక్రాంత్ ఉద్దేశాన్ని నీకు అర్థమయ్యేలా చెప్పాను.
సుమన: నేను ఎందుకు వెళ్లాలి.
విక్రాంత్: నువ్వు వెళ్లకపోతే నేను ప్రాణాలతో ఉండను కాబట్టి.
విశాల్: సుమన నీ మనసులో మాట చెప్పాక ఎవరైనా ఇబ్బంది పడతారు.
నయని: ఎందుకని బాబుగారు మీ తమ్ముడికి మా చెల్లెలు అన్యాయం చేయబోతుంది అని తెలిశాక. చాలా బాగా చెప్పారు. ఒక తల్లి కడుపున పుట్టకపోయిన మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి అంత ప్రేమ ఉంటే.. ఒకే కడుపున పుట్టిన మేమిద్దరం ఎలా ఉండాలి. 
విక్రాంత్: మీరు మంచిగా ఉన్నా సుమన ఉండటం లేదు కదా వదినా.
నయని: అది అనవసరం విక్రాంత్ బాబు. తను అలా అనుకుంటే మీ బ్రో నాతో ప్రాణానికి ప్రాణంగా ఉంటూ కూడా తన ప్రాణమైన అమ్మగారి జాడ తెలిసి కూడా నాకు ఎందుకు ఇప్పటి వరకు చెప్పకుండా ఉన్నారు. 
సుమన: అబ్బా ఎంత కరెక్ట్‌గా అడిగావ్ అక్కా.. బావగారు మీ తమ్ముడికి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీరు మా అక్క అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తారా చెప్పరా. 
విశాల్: నేను ఎందుకు చెప్పానో లోతుగా ఆలోచిస్తే మీకే తెలుస్తుందని విశాల్ అంటే అంతేకాని మీరు మాత్రం నిజం విడమర్చి చెప్పరు కదా అని నయని ప్రశ్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: నాగపంచమి సీరియల్ జనవరి 18th: నాగమణిని తాకలేక చంద్రకాంత మొక్కతో పారిపోయిన కరాళి.. ప్రాణాలతో పోరాడుతున్న మోక్ష!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget