Trinayani Serial Today January 18th: ‘త్రినయని’ సీరియల్ : దురందరను షాక్ గురి చేసిన గాయత్రి పాప – టీ విషం ఉందన్న విశాలాక్షి
Trinayani Today Episode: దురందర పడుకుని ఉండగా గాయత్రి పాప వెళ్లి పొట్టమీద చేయి వేయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Trinayani Serial Today Episode: ఇంతలో నయని మా అత్తయ్య ప్రాణం పోతే మోక్షం లభిస్తుందా..? అని అడిగితే లభించదని తిలొత్తమ్మ చనిపోయి దురందర కడుపులో పుడుతుందని చెప్తుంది. అందరూ షాక్ అవుతారు. దురందర మాత్రం బాధపడుతుంది. వెళ్లి సోపాలో పడుకుంటుంది. నిద్రపోయిన దురందర దగ్గరకు గాయత్రి పాప వెళ్లి పొట్టమీద చేయి పెడుతుంది. అప్పుడే అక్కడకు వచ్చిన రత్నాంభ ఏం చేస్తున్నావు పాప అని అడుగుతుంది. రత్నాంభ మాటలకు దురందర నిద్ర లేస్తుంది.
దురందర: పాప ఇక్కడేం చేస్తుంది.
రత్నాంభ: నీ కడుపు మీద చేయి పెట్టి సుతారంగా రాస్తుంటే ఏం చేస్తున్నావు అని అడుగుతున్నానమ్మా..?
దురందర: వామ్మో నా కడుపులో బిడ్డకు ఏం కాదు కదా
ఇంతలో నయని వస్తుంది.
నయని: అదేంటి పిన్ని అలా అంటావు
దురందర: ఏమో నయని ఆ విశాలాక్షి ఏం చెప్పింది. తిలొత్తమ్మ వదిన నాలుగు రోజుల్లో కన్ను మూస్తే నాలుగు నెలలో మళ్లీ నా బిడ్డగా పుడుతుంది అన్నది కదా..?
నయని: పోయిన వాళ్లు మళ్లీ జన్మ ఎత్తితే మన వాళ్లు దూరం కానట్టు ఉంటుంది కదా పిన్ని
రత్నాంభ: దురందర భయం అది కాదు నయని.. గాయత్రి పాపకు తెలిసిందేమోనని..
నయని: ఏ విషయం బామ్మా..
రత్నాంభ: దురందర కడుపులో మళ్లీ విశాలాక్షి పుడుతుందన్న విషయం. ఎందుకైనా మంచిది ఆ పాపకు కొంచెం దూరంగా ఉండమ్మా
నయని: మీకు చాదస్తం ఎక్కువై పోయింది బామ్మా..
దురందర: నిజం గాయత్రి ఇప్పటి వరకు ఎప్పుడు నా దగ్గరకు రాలేదు. ఎప్పుడైతే విశాలాక్షి ఆ మాట చెప్పిందో కానీ గాయత్రి పాప నా దగ్గరకు రావడం ఏంటి..?
అని దురందర చెప్పగానే.. నయని గాయత్రి పాపను తీసుకుని వెళ్లిపోతుంది. మరోవైపు తిలొత్తమ్మ ఆలోచిస్తూ కూర్చుంటే వల్లభ వస్తాడు.
వల్లభ: నువ్వేంటి నీ గ్లామర్.. ఆ వెయిట్.. ఆ గ్రేస్.. శ్రీమతి తిలొత్తమ్మ వస్తుంది అంటే ర్యాంపు షోలో ఉన్నట్టు ఉంటుంది. అలాంటి లెజెండరీ పర్సనాలిటీ పోయి పోయి దురందర అత్తయ్య కడుపులో పుడుతావంటే ఊహించుకోవడానకే ఆసహ్యంగా ఉంది. పావణమూర్తి మామయ్య నీకు డాడీ అబ్బా ఏంటి మమ్మీ నీ కర్మ కాకపోతే..
తిలొత్తమ్మ: రేయ్ ఆపరా ఇంక నువ్వు చెప్తుంటే.. నాకు ఇంకా బతకాలని ఉంది. ఈ జన్మను పొడిగించుకుంటే తప్పా.. నువ్వు చెప్తున్న ఊబిలో పడకుండా ఉండగలను అనిపిస్తుంది.
వల్లభ: పొరపాటున ఈ నాలుగు రోజుల్లో చచ్చావనుకో..
తిలొత్తమ్మ: రేయ్ ఆపరా..
వల్లభ: ఈ రాత్రంతా నువ్వు మేల్కోని అత్తయ్య కడుపున పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో ఆలోచించు మమ్మీ.. నన్ను ఏం చేయమన్నా చేస్తాను.
తిలొత్తమ్మ: సరే రేపు పొద్దునే ఆలోచించుకుని చెప్తాను. ఇప్పుడు నువ్వు వెళ్లిపో
అని చెప్పగానే వల్లభ వెళ్లిపోతాడు. విక్రాంత్ వర్క్ చేసుకుంటుంటే.. సుమన వచ్చి ఎదురుగా అటూ ఇటూ తిరుగుతుంది.
విక్రాంత్: ఏయ్ నువ్వు ఇక్కడే క్యాట్ వాక్ చేయాలా..?
సుమన: అయితే మీరు నా మీద దృష్టి పెట్టారన్నమాట
విక్రాంత్: చెత్తను పంచుకోరు సుమన పారేస్తారు
సుమన: ఇప్పుడు నా కోసం కన్నా దురందర పిన్ని గురించి ఎక్కువ ఆలోచించాలి.
విక్రాంత్: ఎందుకు ఏం పాపం
సుమన: మీ అమ్మకు మోక్షం రాకుండా తన ప్రాణం పోతే ఆ జీవం పిన్ని కడుపులో పెరుగుతున్న పిండంలో కలిసి తిలొత్తమ్మ అత్తయ్య మళ్లీ పుడుతుందట కదా..? అది సరే కానీ ఆరు నెలల గర్బవతి అయిన పిన్ని కడుపులో ఏదో ఒక పిండం పెరుగుతుంది కదా..? ఇక తిలొత్తమ్మ అత్తయ్య ఎలా పుడుతుంది
విక్రాంత్: విశాలాక్షి చెప్పింది నాలుగు రోజుల్లో గాయత్రి పాప చేతిలో చనిపోతే ఈ ఇంట్లో పుడుతుంది. అంతే కానీ మళ్లీ జన్మ ఉండదు.. చావు ఉండదు అని కాదు.
అని విక్రాంత్ చెప్పగానే సుమన అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత హాసిని అందరికీ టీ తీసుకొస్తుంది. తిలొత్తమ్మను ఆ టీ తాగొద్దని విశాలాక్షి చెప్తుంది. ఎందుకు అని అడగ్గానే.. ఆ టీ తాగితే నువ్వు చనిపోతావని చెప్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. టీలో విషం కలిపిన విషయం గుర్తు చేసుకుంటుంది హాసిని. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















