Trinayani Serial Today february 23rd: ‘త్రినయని’ సీరియల్ : ప్రసాదం తినకుండా ఆపిన నాగయ్య - సుమనకు వార్నింగ్ ఇచ్చిన విక్రాంత్
Trinayani Today Episode: ప్రసాదంలో విషం కలిపింది సుమన అయ్యుండొచ్చని అనుమానంతో విక్రాంత్ సుమనకు వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా జరిగింది.
Trinayani Serial Today Episode: అమ్మవారి ప్రసాదం అరటి అకుల్లో మూడు జంటలు తినబోతుంటే శివ వచ్చి నయని అని పిలిచి నాగయ్య వస్తున్నాడు అంటూ నాగయ్యను కిందకు వదులుతుంది. నాగయ్య నయని చేతిలోని ప్రసాదం మీద పడగానే ప్రసాదం కిందపడుతుంది. దీంతో అందరూ షాక్ అవుతారు.
నయని: నాగయ్య ఏంటిది ఇది అమ్మవారి ప్రసాదాన్ని నేలపాలు చేశావు.
గురువుగారు: నయని నాగయ్యే ఇలా చేశాడంటే ఈ ప్రసాదంలోనే ప్రాణగండం ఉందేమో?
అందరూ ప్రసాదాన్ని తీసి పక్కన పెడతారు.
తిలోత్తమ్మ: అలా అంటే ఎలా స్వామి అది ఇంటి నుంచి తెచ్చింది మేమే
సుమన: మా ప్రాణాలు మేమే తీసుకుంటామా?
వల్లభ: అలా చేస్తారా ఎవరైనా?
విశాల్: అన్నయ్య ఒకరినొకరు ఎవరినీ ద్వేషించుకోకుండా ఏం జరిగినా మన మంచికే అనుకోండి. అమ్మవారు ఇలా జరగాలనే చేసుంటారు.
హాసిని: అవును అంతా అమ్మ దయ జరిగింది మంచికే అనుకుందాం.
రాత్రికి వల్లభ ఇంట్లో కూర్చుని పాము గాలిలోంచి ఎలా ఎగిరివచ్చింది అని ఆలోచిస్తుంటాడు. ఇంతలో తిలొత్తమ్మ వచ్చి హనుమంతుడి అండ ఉందని అర్థం తమలపాకులు ఉన్నాయి. అందుకే శివ పామును తీసుకుని వచ్చిందని చెప్తుంది తిలొత్తమ్మ. ఇంతలో రూం లోపలికి ఎద్దులయ్య వస్తాడు. వల్లబ వెటకారంగా ఎద్దులయ్యతో మాట్లాడతాడు. తిలోత్తమ్మ వల్లభను చెంప పగులగొడుతుంది.
విశాల్: నయని నన్ను చూడగానే స్మైల్ ఇచ్చేదానివి. లేదంటే ఏదో ఆలోచిస్తున్నావు.
నయని: అమ్మవారి ప్రసాదాన్ని విషంగా ఎవరో మార్చి ఉంటారని ఆలోచిస్తున్నాను.
విశాల్: ఇంట్లో వాళ్లే ఎవరో అయ్యుంటారు.
నయని: అందరూ ప్రసాదం తింటే అందరం చనిపోయేవాళ్లం. అలాంటప్పుడు ఎవరు కలుపుతారు.
విశాల్: ఎవరైనా ఏమనుకుంటారు. ఎవరికి గండం వచ్చినా నయనికి తెలుస్తుంది అంటారు. మరి అంతమంది ప్రసాదం తినాలి అనుకున్నప్పుడు నీకెందుకు తెలియకుండా పోయింది అని
నయని: ఇది కూడా కరెక్టే అందులో విషం లేదంటారా?
విశాల్: ఇది మరీ బాగుంది. కీడు లేకపోతే నాగయ్య కానీ శివ కానీ అంత రిస్క్ చేసేవాళ్లే కాదు.
నయని: అవును బాబు గారు పైనుంచి ఎందుకు రావాల్సి వచ్చింది.
విశాల్: శివనే అడగాలి.
నయని: అర్థం అవుతుంది ఇప్పుడు. గురువుగారు నాగయ్య అక్కడికి కచ్చితంగా రావాలి అన్నప్పుడు రాకుండా ఎవరో ప్లాన్ చేశారు.
అని ఇద్దరూ మాట్లాడుకుంటుంటే ఇంతలో నయనికి సిక్త్ సెన్స్ యాక్టివేట్ అవుతుంది. నాగయ్య ఎవరినో కాటు వేసినట్లు కనబడుతుంది. దీంతో రేపు అందరూ జాగ్రత్తగా ఉండాలని విశాల్‌కు చెప్పి లోపలికి వెళ్తుంది నయని.
సుమన: ఎంటలా చూస్తున్నారు.
విక్రాంత్: కాలికి మెట్టెలు లేవు. చేతులకు గాజులు తీసేశావు. మెడలో మంగళసూత్రాలు కూడా తీసేసినట్టున్నావు. కారణం ఏంటో తెలుసుకోవచ్చా?
సుమన: నుదుట బొట్టు, తలలో పూలు కూడా లేవు గమనించారా?
విక్రాంత్: అదే ఎందుకు?
సుమన: అలంకరించుకుని ముత్తదువులా ఉన్నంత మాత్రాన నాకొచ్చే లాభం కానీ సుఖం కానీ ఏమైనా ఉందా?
విక్రాంత్: అవి పెట్టుకుంటే డబ్బులు ఇవ్వరు కానీ గౌరవం మాత్రం కచ్చితంగా ఇస్తారు.
సుమన: ఈ టైంలో బయటకు వెళితే ఊరేగడానికా? అంటారు.
విక్రాంత్: ఇంట్లో అయినా నీ పరువు ఉండాలిగా
అంటూ ఇద్దరూ గొడవ పడతారు. ప్రసాదంలో విషం కలిపింది నువ్వేనని ఏదో ఒకరోజు ఆధారాలు దొరికిన రోజు నీ సంగతి చెప్తాను. అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు విక్రాంత్. విక్కికి అనుమానం వచ్చినట్లుంది అని సుమన మనసులో అనకుంటుంది. మరునాటి ఉదయం పెద్దబొట్టమ్మ ఇంటికి రావడంతో ఎద్దులయ్య, శివ వచ్చి ఎందుకు వచ్చావని అడుగుతారు. ఉలూచి పాపను ఎత్తుకోవడానికి వచ్చిందని డమ్మకు చెప్తుంది. లోపలికి వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అని పెద్దబొట్టమ్మ చెప్పగానే ఆలోచన ఎందుకు లోపలికి వెళ్లి ఉటూచిని ఎత్తుకోపో అని ఎద్దులయ్య, డమ్మక్క చెప్పడంతో పెద్దబొట్టమ్మ లోపలికి వెళ్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.