Trinayani Serial Today December 7th: 'త్రినయని' సీరియల్: మచ్చలతోనే మొత్తం చెప్పేస్తానంటోన్న అఖండ.. నయని డబుల్ యాక్షన్ బయట పడుతుందా!
Trinayani Today Episode ఇంట్లో ఉన్నది నయని కాదని త్రినేత్రి అని నిరూపించడానికి అఖండ స్వామిని తిలోత్తమ ఇంటికి తీసుకురావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Serial Today Episode తిలోత్తమ అఖండ స్వామిని కలవడానికి వెళ్లిందని వల్లభ ఇంట్లో వాళ్లకి చెప్తాడు. త్రినేత్రి నయని అని మీకు ఎలా నమ్మకం కలిగిందని అంటే సుమన నమ్మకం కలిగించిందని అంటుంది. దానికి వల్లభ తాను నయని కాదని రుజువు చేయడానికే మమ్మీ అఖండ స్వామిని తీసుకొస్తుంది. ముంచేయడానికి వచ్చి అమ్మాయిని అరెస్ట్ చేయిస్తుందని అంటాడు. అఖండ స్వామి వస్తున్న విషయం నయని వదినకు తెలుసా అని విక్రాంత్ అడుగుతాడు. తెలీదని వల్లభ అంటాడు. ఇంతలో తిలోత్తమ వాళ్ల కార్ సౌండ్ వస్తే వల్లభ బయటకు వెళ్తాడు.
ముందు తిలోత్తమ ఒక్కర్తే లోపలికి వస్తుంది. ఇక హాసిని విశాల్‌తో అఖండ స్వామి వస్తున్నారని చెప్తుంది. ఇంతలో అఖండ స్వామి ఇంట్లోకి వస్తాడు. త్రినేత్రి అఖండ స్వామిని వింతగా చూస్తే విశాల్ షాక్ అయిపోతాడు.
అఖండస్వామి: నయని కాదు తిలోత్తమ.
విశాల్: అమ్మా మళ్లీ ఏంటి.
విక్రాంత్: వదినను పరీక్షించడానికి వచ్చారంట బ్రో.
త్రినేత్రి: నన్నేనా నన్ను పరీక్షించడానికి నాకు ఏమైంది.
తిలోత్తమ: నాన్న విశాల్ నీ పక్కన మనిషి ఉండాల్సిన మనిషి ఉన్న మనిషి మారిపోయారు నాన్న.
సుమన: తను మా అక్క కాదు కొత్త అక్క అని నిరూపించడానికి అత్తయ్య ఈ స్వాముల వారిని తీసుకొచ్చారు.
విక్రాంత్: ఇంకెన్ని సార్లు కన్ఫ్యూజ్ అవుతారమ్మ.
తిలోత్తమ: ఈ సారికి క్లారిటీ ఇస్తే మీరు అయోమయానికి గురి కారని నా తాపత్రయం.
త్రినేత్రి: నేను నయని కాదు త్రినేత్రి అని నేనే చాలా సార్లు చెప్పాను కదా మీరే వినడం లేదు.
అఖండస్వామి: తిలోత్తమ తనే ఒప్పుకున్నప్పుడు నేను వచ్చి మిమల్ని నమ్మించేలా చేయడానికి ఏముంటుంది.
విశాల్: స్వామి మీరు ఇంతకు ముందు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడిన విషయం గుర్తుంచుకోండి.
అఖండస్వామి: నాకు ఏమైనా పర్లేదు మీరు మాత్రం ఏం జరిగిందో తెలుసుకోకుండా తనకి ఇక్కడ స్థానం కల్పించారు.
విశాల్: మీకు ఎంత దివ్యదృష్టి ఉందో నాకు తెలీదు కానీ తను మాత్రం నా భార్య నయనినే.
త్రినేత్రి: మనకు ఇంకా పెళ్లి కాలేదు కాదా బాబుగారు. అప్పుడే భార్య అని చెప్తున్నారు.
హాసిని: అయ్యో నువ్వు ఆగు చెల్లి.
అఖండస్వామి: స్పష్టంగా తను నయని కాదని తనకి ఇంకా వివాహం కాలేదని చెప్తున్నా మీరు నమ్మరా. తను కొన్ని రహస్యాలు తెలుసుకొని వచ్చి మిమల్ని ఏమార్చుతుంది. నేను ఒక్కసారి చెప్పినా వంద సార్లు చెప్పినా ఒక్కటే తను మాత్రం నయని కాదు.
తిలోత్తమ: అఖండస్వామి వీళ్లకు ఓ ఆధారం చూపిస్తే కానీ నమ్మేలా లేరు.
అఖండస్వామి: చూపిస్తా పది నిమిషాలు టైం ఇవ్వండి.
అఖండస్వామి, తిలోత్తమ, వల్లభలు మాట్లాడుకుంటారు. రంగుతోనే నయని జాడ ఈ ఇంట్లో లేదని రుజువు చేద్దమని అఖండస్వామి అంటారు. మనిషిని పోలిన మనిషి ఉన్నా సరే పుట్టు మచ్చల్లో తేడా ఉంటుందని అఖండస్వామి అంటే దానికి వల్లభ నయనికి ఉన్నట్లే మెడ మీద త్రినేత్రికి మచ్చ ఉందని అది చెప్తే ఒప్పుకోరని అంటాడు. దాంతో అఖండస్వామి ఇంతకు ముందు నయని ఎక్కడైనా వేలిముద్రలు వేస్తే వాటిని తీసుకురమ్మని చెప్తాడు. దాంతో వల్లభ ఆలోచించి దసరా అప్పుడు రంగు అద్ది పేపర్ మీద ముద్రలు వేశారని వాటిని తీసుకొస్తానని అంటాడు. ఎవరికీ తెలీకుండా వాటిని తీసుకురమ్మని అఖండస్వామి చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: పాపం జ్యోత్స్న.. మనవరాలి కోసం కూతురి ఇంటికి తాత.. ఘోరంగా అవమానించిన కార్తీక్!