Trinayani Serial Today December 27th: 'త్రినయని' సీరియల్: నయని స్థానంలో హాసిని అందరూ షాక్.. నయని ఇంటికి త్రినేత్రి ఫ్యామిలీ!
Trinayani Today Episode నయని, విక్రాంత్ నయని దేహాన్ని తరలించడం ఫ్యామిలీ మొత్తం చూసేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Serial Today Episode నయని సజీవ దేహాన్ని గుడి దగ్గరకు తీసుకెళ్లాలని రాత్రి అందరూ పడుకున్న తర్వాత విక్రాంత్, నయని, పెద్దబొట్టమ్మ ప్రయత్నిస్తారు. దురంధర వాళ్ల గదిలోకి వెళ్లి బెడ్‌లో దేహం చుట్టి బయటకు వస్తారు. సరిగ్గా అప్పుడే ఇంట్లో అందరూ అక్కడికి చేరుకుంటారు. ఏంటి అది అని విశాల్ నయని, విక్రాంత్‌లకు అడుగుతారు. ఏం లేదు అని చెప్తారు.అందరూ ఆ బెడ్‌లో ఏముందో చూపించమని అడుగుతారు. నయని, విక్రాంత్‌లు కిందకి దించుతారు. వల్లభ ఆ బెడ్ విప్పుతాడు.
నయని, విక్రాంత్, పెద్దబొట్టమ్మ చాలా టెన్షన్ పడతారు. ఇంతలో అందులో నుంచి హాసిని బయటకు వస్తుంది. నయని వాళ్లతో పాటు అందరూ షాక్ అయిపోతారు. మనసులో నయని వదిన బాడీ ఉండాల్సిన స్థానంలో హాసిని ఉందేంటి అని అనుకుంటారు. నయని, విక్రాంత్, పెద్ద బొట్టమ్మ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. నువ్వు ఎందుకు ఉన్నావ్ అని విశాల్ అడిగితే చీకటిలో ఇద్దరూ మాట్లాడుకుంటూ ఎవరినో తీసుకెళ్లాలి అనుకుంటే నేను వెళ్లి అందులో పడుకున్నా అని అంటుంది. నయని వాళ్లు ఎవరిని తీసుకెళ్లాలని అనుకున్నారా అని అందరూ అడుగుతారు. నాకు తెలీదు అని హాసిని అంటే నయని పావనా మూర్తి బాబాయ్‌ని అనుకున్నాం అని అంటుంది. దానికి హాసిని ఆయనకు అమ్మవారి గుడికి ఎందుకు తీసుకెళ్లాలి అనుకున్నారు అంటే నాటు పసరు కోసం అని చెప్తారు. మందు ఎక్కువగా తాగుతున్నారని అది మంచిది కాదని ఇలా చేయాలి అనుకున్నాం అని నయని కవర్ చేస్తుంది. అసలు వాళ్లు గదిలో ఉన్నారా లేదా అని అనుమానంగా ఉంది అని సుమన చూడటానికి వెళ్తే ఇంతలో ఆ గదిలో నుంచి గాయత్రీ పాప వచ్చి డోర్ వేసేస్తుంది. వల్లభ ఎంత ప్రయత్నించినా డోర్ తీయలేకపోతాడు. గాయత్రీ చేతిలో లాక్ కూడా లేకపోవడంతో తీయలేకపోతారు. పెద్దబొట్టమ్మ వెళ్లిపోతుంది.
తిలోత్తమ వాళ్లు నయని, విక్రాంత్ చేతులు కలిపి ఏదో చేస్తున్నారు అని అనుకుంటారు. హాసిని ఆ గదిలోకి వెళ్లకపోయి ఉంటే ఎవర్ని ఎత్తుకుపోయేవారో అది మనం తెలుసుకోవాలని తిలోత్తమ అంటుంది. ఇద్దరూ ఏదో చేస్తున్నారు తెలుసుకోవాలని అంటుంది. వల్లభ ఇప్పుడే దేవీపురం వెళ్లి త్రినేత్రి వాళ్ల కుటుంబాన్ని తీసుకొస్తానని అంటాడు. వల్లభ రాత్రే బయల్దేరుతారు. నయని, విక్రాంత్‌లు మాట్లాడుకుంటూ ఉంటారు. కొంచెంలో తప్పించుకున్నాం అని అనుకుంటారు. ఇక హాసిని, సుమన అక్కడికి వస్తారు. ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటున్నాం అని చెప్తుంది నయని. ఇక సుమన పావనా మూర్తి బాబాయ్ ఇంటికే రాలేదు కదా మరి మీరు తీసుకెళ్లాలని ఎలా ప్లాన్ చేశారని అడుగుతుంది. తాగేసి గదిలో ఉంటారని అనుకున్నాం అని చెప్తుంది. ఇక హాసిని దురంధర పిన్నికి ఈ విషయం తెలుసా అంటే తెలీదని నయని చెప్తుంది. దురంధర పిన్ని కూడా లేదని సుమన అంటుంది. ఇద్దరూ లేకపోయినా ఉన్నారని అనుకొని ఎలా ప్లాన్ చేస్తారని అంటుంది హాసిని. తలుపు తాళాలు ఇవ్వని వాళ్లు మీకు ఎలా ఇచ్చారని సుమన అంటే నయని నువ్వే తాళాలు తీసుకొని గది శుభ్రం చేసుకో అంటే సుమన వద్దని వెళ్లిపోతుంది.
ఉదయం అందరూ హాల్‌లో ఉంటారు. నయని సంతకం పెట్టాల్సి ఉందని 40 కోట్లు కట్టాలని అనుకుంటారు. నయని అవునో కాదో తేల్చుకొని సంతకం పెట్టించమని సుమన, తిలోత్తమ వాళ్లు అనుకుంటారు. హాసిని నయనికి సంతకం పెట్టమంటుంది. నయని సంతకం పెడుతుంది. ఇక వల్లభ త్రినేత్రి ఫ్యామిలీని తీసుకొని వస్తాడు. ఇంటిని చూసి ముక్కోటి, వైకుంఠం ఇంద్రభవనం అనుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.