కొత్త సంవత్సరంలో, డిసెంబర్ 31 సమయంలో చాలామంది పార్టీలు చేసుకుంటారు.

కొందరు రాత్రంతా తాగి.. ఉదయాన్నే హ్యాంగోవర్​తో ఇబ్బంది పడుతుంటారు.

ఆ సమయంలో కొన్ని టిప్స్ ఫాలో అయితే హ్యాంగోవర్​ని దూరం చేసుకోవచ్చట.

డీహైడ్రేషన్​కి గురికాకుండా.. నీటిని ఎక్కువగా తీసుకోవాలి. ఇది హ్యాంగోవర్​ని తగ్గిస్తుంది.

కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి తీసుకుంటే శరీరంలో ఎలక్ట్రోలైట్స్ పెరుగుతాయి.

హ్యాంగోవర్ సమయంలో ఆస్ప్రిన్ మెడిసిన్​ను అస్సలు తీసుకోవద్దట. ఇది పరిస్థితిన మరింత దారుణం చేస్తుంది.

అల్లం టీ, అల్లంతో చేసి ఫుడ్స్, అల్లంతో చేసి క్యాండీలు తింటే వాంతులు కాకుండా ఉంటాయి.

నూనె ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే.. కడుపు నొప్పి, హ్యాంగోవర్ రెండూ ఎక్కువ అవుతాయి.

మీ శరీరానికి తగినంత రెస్ట్ ఇచ్చేందుకు చూడండి. దీనివల్ల హ్యాంగోవర్​ ఇబ్బంది తగ్గుతుంది.

చల్లని నీటితో తలస్నానం చేయడం వల్ల రక్తప్రసరణ పెరిగి హ్యాంగోవర్ కంట్రోల్ అవుతుంది.