Trinayani Serial August 10th: 'త్రినయని' సీరియల్: విశాలాక్షి కళ్లలో కారం కొట్టిన సుమన.. విగ్రహంలా మారిన విశాలాక్షి, ఆ పువ్వు విశాల్‌కే!
Trinayani Today Episode విశాలాక్షి దగ్గరున్న తామర పువ్వు దొంగతనం చేయడానికి వచ్చిన ముగ్గురు తోడు దొంగలు విశాలాక్షి కళ్లలో కారం కొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Serial Today Episode తిలోత్తమ, వల్లభ, సుమనలు పని చేశారని అందుకే ముఖం చేతులు మొత్తం మసి అయ్యాయని అందరూ అనుకుంటారు. ముగ్గురు మాత్రం మేం చేయలేదని అంటారు. ఇక విక్రాంత్ పని చేసి మర్చిపోయారా అని అడిగితే విశాలాక్షి అవునని చెప్తుంది. విశాలాక్షి గారడి చేసిందని సుమన వాళ్లు అంటే సాక్ష్యం చూపిస్తానని అంటుంది. తన చేతిలో ఉన్న కలువ పువ్వుతో అసలేం జరిగిందో అని చూపిస్తుంది. తిలోత్తమ, వల్లభ, సుమనలు నవ్వుతూ సరదాగా పాత్రలు అన్నీ తోమేసి క్లీన్ చేస్తున్నట్లు చూస్తారు. అందరితో పాటు ముగ్గురు బిత్తర పోతారు. విక్రాంత్ నవ్వుతాడు. బాగా తోమారని సెటైర్లు వేస్తారు.
తిలోత్తమ: మనం ఈ పని చేసినట్లు మనకే తెలీదు కదా.
సుమన: అవును అత్తయ్య.
విశాలాక్షి: చెప్పాను కదా మీ ధ్యాస అంతా తిండి మీద ఉంది.
నయని: సంతోషం చెల్లి విశాలాక్షి ఒక్కర్తే ఈ పని ఎలా చేస్తుందా అని కంగారు పడ్డాను కానీ చాలా థ్యాంక్స్ మీకు.
విక్రాంత్: బాల కార్మికుల చట్టం గురించి చెప్పగానే సుమన వణికిపోయినట్లు ఉంది. అందుకే బాగా సాయం చేసింది..
విశాలాక్షి: నేను వెళ్దామనుకునేలోపు వీళ్లే క్లీన్ చేసేశారు. వీళ్లు కూడా మంచి చేస్తారని నాకు తెలీదు.
విక్రాంత్: మనకి సర్‌ప్రైజ్ ఇద్దామని దాచిపెట్టారు.
సుమన: ఛీ మా పుట్టింట్లో కూడా ఎప్పుడూ నేను చేయలేదు.
తిలోత్తమ మేకప్ అవుతుంటే హాసిని వచ్చి నువ్వు మీ కొడుకు ఎంత రెడీ అయినా సామాన్లు అంత మెరుపు రాదు అని అంటుంది. వెటకారంగా హాసిని నవ్వుతుంది. ముగ్గురు కలిసి సంతోషంగా నవ్వుతూ మాట్లాడుతూ పని చేశామని గారడీ పిల్ల అంటుందని నాకు అక్కడికి వెళ్లి నట్లు కూడా గుర్తు లేదని తిలోత్తమ అంటుంది. ఇక హాసిని తన కొంగు నుంచి చెరొ వంద తీసి భర్త, అత్త చేతిలో పెడుతుంది. అన్ని సామాన్లు క్లీన్ చేసినందుకు అని ఇస్తుంది. తిలోత్తమ సైగ చేస్తే వల్లభ హాసిని వీపు విమానం మోత మోగిస్తాడు. మరోవైపు పడుకునే ముందు మేకప్ వేసుకుంటున్న సుమనను విక్రాంత్ తిడతాడు. సుమన కోపంతో రగిలిపోతుంది.
ఇక హాల్లో డమ్మక్క, విశాలాక్షి పడుకొని ఉంటే తిలోత్తమ, వల్లభ అక్కడికి ఎవరూ చూడకుండా వస్తారు. సుమన కూడా వస్తుంది. కారం పొడి చేతిలో పట్టుకొని విశాలాక్షి లేస్తే కళ్లలో కారం కొట్టేస్తానని అంటుంది. తిలోత్తమ కాలు డమ్మక్కకు తగిలినా డమ్మక్క లేవదు. విశాలాక్షి పక్కనే ఉన్న కలువ పువ్వుని తిలోత్తమ లాగబోతే విశాలాక్షి కదులుతుంది. డమ్మక్కకి మెలకువ వస్తుంది. డమ్మో డమ్మా అంటూ హడావుడిగా లేవడంతో సుమన తన చేతిలో ఉన్న కారాన్ని విశాలాక్షి కళ్లలో కొట్టేస్తుంది. దాంతో విశాలాక్షి పడుకున్న పరుపు మీదే అమ్మవారి విగ్రహంలా మారిపోతుంది. అమ్మా ఎక్కడున్నావ్ తల్లీ అని డమ్మక్క కేకలు వేస్తే అందరూ బయటకు వస్తారు. గాటు వస్తుంది ఎవరో కారం చల్లినట్లు ఉందని అంటారు. విశాలాక్షి పడుకొని ఉండాలి ఎక్కడుందని చూస్తే అక్కడ అమ్మవారి విగ్రహం ఉండటం చూసి షాక్ అయిపోతారు. విగ్రహం మీద ఎవరో కారం చల్లారని విశాలాక్షి ఎక్కడుందని అనుకుంటారు. ఇంతలో విశాలాక్షి ముఖం మీద కారంతో వస్తుంది. తనని చూసి అందరూ షాక్ అవుతారు. పడుకునే దానివి ఎక్కడి నుంచి వచ్చావ్ అని అడుగుతారు సుమన వాళ్లు. విగ్రహాన్ని తీసుకెళ్లి కడగమని విక్రాంత్ చెప్తే సుమన కడగనని చెప్తుంది. ఇక విశాల్ నేను కడుగుతానని అంటాడు. విశాల్ కడుగుతాను అని ముందుకు వచ్చాడు కాబట్టి అతనికే తామర పువ్వు ఇవ్వాలని డమ్మక్క అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.