Kalavari Kodalu Kanaka Mahalakshmi August 9th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: కనకమహాలక్ష్మి, విహారిల ఫస్ట్ మీటింగ్ అదుర్స్.. ఆదికేశవ్ మీద అవినాష్, ఆశ్రితలు ఫైర్!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode కనకమహాలక్ష్మీ, విహారి మొదటి పరిచయం ఇద్దరూ కలిసి పూజ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా మారింది.
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి అడుగు జాడల్లో కనకమహాలక్ష్మీ నడుస్తుంది. ఇద్దరూ చెట్టు దగ్గర దేవుడికి పూజ చేస్తారు. పంతులు లోపలకి వెళ్లి దీపం పెట్టమని చెప్తే కనకమహాలక్ష్మీ, విహారి వెళ్తారు. అక్కడ పిండితో ప్రమిద చేయడం విహారికి రాకపోవడంతో పక్కనే చేస్తున్న కనకం వైపు చూసి తను చేసినట్లు ఫాలో అవుతాడు. కనకం కూడా విహారి చూడటం చూస్తుంది. సైగలతో ఎలా చేయాలో చెప్తుంది. విహారి ఫాలో అవుతాడు. ఇక దీపం నూనె మొత్తం విహారి పడేస్తే కనకం తాను తెచ్చుకున్న నూనె విహారి దీపంలో పోసి తాను విహారితో కలిసి దీపం వెలిగిస్తుంది. బయట విహారి తల్లి విహారి ఫ్రెండ్‌తో తన కొడుకు మంచి వాడు వాడిని అర్థం చేసుకునే అమ్మాయి ఎక్కడుందో తన ఇంట్లో ఎప్పుడు దీపం పెడుతుందో అని అంటే ఆ మాటలకు కనకం, విహారితో కలిసి దీపం పెట్టడం లింక్ చేస్తారు.
విహారి: చాలా థ్యాంక్స్ అండీ మీరు లేకపోతే చాలా ఇబ్బంది పడేవాడిని.
కనకమహాలక్ష్మీ: మీరు లేకపోతే నేను చాలా ఇబ్బంది పడేదాన్ని బయట మొత్తం బురద కదా మీ అడుగులో నాకు దారి చూపించాయి.
ఇక ఆదికేశవ్ దంపతులు, అతని చెల్లి సౌధామణి కుటుంబం కలిసి దేవుడికి అర్చన చేయిస్తారు. ఆది కేశవ్ తన కూతురు, అల్లుడిని చేసుకోవాలి అనుకుంటున్న అవినాష్ జాతకాలు దేవుడి దగ్గర పెట్టమంటే సౌధామణి అడ్డుకుంటుంది. అయినా ఆదికేశవ్ పట్టుపట్టి జాతకాలు దేవుడి దగ్గర పెట్టిస్తాడు. ఇంతలో కనకం అక్కడికి వస్తుంది. పంతులు నవగ్రహాల దగ్గరకు వెళ్లి ప్రదక్షిణలు చేయమని అంటాడు. సౌధామణి కూతురు ఆశ్రిత ప్రదక్షిణలు చేయను అంటుంది.
కనకమహాలక్ష్మి: ఆశ్రిత దేవతల్ని దైవ స్వరూపాల్ని అలా అవమానించకూడదు.
ఆశ్రిత: నువ్వు చెప్తే నేను వినే పరిస్థితిలో లేను.
సౌధామణి: అన్నయ్య ఆశ్రిత వినదు తనకు నచ్చకపోతే చేయదు వదిలేయండి.
ఆది కేశవ్ భార్య గౌరి కనకమహాలక్ష్మిని తీసుకెళ్లి నవగ్రహాలకు అభిషేకం చేయమని అంటుంది. ఇక విహారి కూడా నవగ్రహాలకు అభిషేకం చేయడానికి వెళ్తాడు. కనకమహాలక్ష్మిని చూసి విహారి సంతోషంగా వెళ్తాడు. కనకం ఎదురుగా వెళ్లి నిల్చొంటాడు. ఇద్దరూ సైగలు చేసుకుంటారు. కనకమహాలక్ష్మి వెనక విహారి తిరుగుతాడు. విహారి పడిపోబోతే కనకమహాలక్ష్మి పట్టుకుంటుంది. విహారి కాళ్ల కింద ఉన్న అరటి తొక్కలను తీస్తుంది. అది చూసి పంతులు కాబోయే దంపతుల మధ్య ఎంత భక్తి శ్రద్ధలు ఎంత అన్యోన్యత అనుకుంటారు. ఇద్దరితో కలిసి పూజ చేయిస్తారు.
పంతులు: అమ్మా మీ కాబోయే భర్త పేరు చెప్పు.
కనకమహాలక్ష్మి: అయ్యో పంతులు మీరు పొరపడుతున్నారు నన్ను పెళ్లి చేసుకోబోయేది మా బావగారు ఆయన గుడిలో ఉన్నారు.
కనకమహాలక్ష్మి వెళ్తూ ఉంటే జడలో నుంచి పువ్వు పడిపోతుంది. విహారి కనకమహాలక్ష్మి గారు అని పిలిచి పువ్వు చేతికి ఇచ్చి జడలో నుంచి పడిపోయిందని సైగ చేస్తాడు. కనకం తీసుకొని జడలో పెట్టుకుంటుంది. థ్యాంక్స్ చెప్తుంది. ఇక ఆశ్రిత, అవినాష్‌లు తల్లితో మామ క్యారెక్టర్ గురించి చెప్పుకొని చిరాకు పడతారు. దానికి సౌధామణి కేవలం నీ పెళ్లి కోసం భరిస్తున్నానని అంటుంది. ఇంతలో ఆదికేశవ్ గుమ్మడికాయ తీసుకొచ్చి అందరి కళ్లు మీ మీద పడ్డాయని కనకాన్ని అవినాష్‌ని పక్కపక్కన నిల్చపెట్టి దిష్టి తీస్తాడు. అవినాష్ తనకు ఇలాంటివి నచ్చవని కింద వాచ్ పడిపోవడంతో కిందకి వంగుతాడు. అదే టైంలో విహారి అక్కడ ఫోన్ మాట్లాడుతూ నిల్చొంటాడు. ఆది కేశవ్ కళ్లు మూసుకొని దిష్టి తీస్తాడు. మరోవైపు విహారి తల్లి, కనకమహాలక్ష్మి పక్కపక్కన నిల్చొని దేవుడికి దండం పెడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.