Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial August 9th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీని చూసేసిన మనీషా.. జున్ను మీద మిత్రకు ఇంత ప్రేమ ఉందా ఏకంగా అలా చేసేశాడు!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode లక్ష్మీని మనీషా చూసి ఆ విషయం మిత్రకు చెప్పడం మిత్ర మనీషా మాటల్ని కొట్టి పడేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీగా సంయుక్త వస్తుంది. లక్కీని కలుస్తుంది. లక్కీ, జున్నులను ఆడుకోమని తాను అర్జున్ గారితో మాట్లాడి వస్తానని లక్ష్మీ పిల్లల్ని పంపేస్తుంది. ఇక లక్కీ ఎలా అయినా జున్ను మదర్ సంయుక్త ఒక్కరే అని నిరూపిస్తానని అనుకుంటుంది.
అర్జున్: లక్ష్మీ ఇప్పుడు లక్కీ నిన్ను జున్ను తల్లిగా చూసింది కాబట్టి సంయుక్త ఎక్కడుందా అని వెతుకుతుంది. ఇప్పుడు నువ్వు సంయుక్తగా కనిపించకపోతే లక్కీకి ఉన్న అనుమానాలు రెట్టింపు అయిపోతాయి. నువ్వు ముందు వెళ్లి సంయుక్తగా వాళ్ల ముందు ప్రత్యక్షం అవు. ఇక్కడ నేను మ్యానేజ్ చేస్తా.
లక్ష్మీ: మిమల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నా అర్జున్ గారు.
లక్ష్మీ తనని ఎవరూ చూడకుండా జాగ్రత్త పడాలి అనుకుంటూ ఎక్కువ మంది ఉంటే వారితో కలిసి వెళ్తుంది. అటుగా వచ్చిన మనీషా లక్ష్మీని చూసి బిత్తరపోతుంది. లక్ష్మీ అని చెమటలు పట్టేస్తుంది. లక్ష్మీ అని పెద్దగా అరిస్తూ వెతకడానికి పరుగులు తీస్తుంది. మొత్తం వెతుకుతుంది మనీషాని చూసి లక్ష్మీ దాక్కుంటుంది. మిస్ అయిపోయిందని మనీషా అనుకుంటే మిత్ర వచ్చి ఏమైందని అడుగుతాడు. తాను లక్ష్మీని చూశానని మనీషా చెప్తుంది. మిత్ర మనీషా మాటల్ని కొట్టిపడేస్తాడు. చనిపోయిన లక్ష్మీని నువ్వేలా చూస్తావని అంటాడు. మరోవైపు లక్కీ దేవయాని దగ్గరకు వెళ్లి సంయుక్త గురించి అడుగుతుంది. ఖుషి వెయిట్ చేయలేను అని ప్రదక్షిణలు పూర్తి అయితే వెళ్లిపోతా అని అంటుంది. ఇక లక్ష్మీ మిత్రని చూసి దాక్కుంటుంది. మిత్ర దగ్గరకు లక్కీ వచ్చి సంయుక్త ఆంటీని చూశావా నాన్న ఎక్కడుందని అడుగుతుంది.
ఇక జున్ను పడిపోతాడు లక్ష్మీ జున్ను దగ్గరకు వెళ్లబోయి ఆగిపోతుంది. మిత్ర కంగారు పడి జున్నుని దగ్గరకు తీసుకుంటాడు. లక్కీ జున్ను మీద హతాత్తుగా ఇంత ప్రేమ పెరిగిపోయింది అని అడుగుతుంది. దానికి మిత్ర చిన్న పిల్లలు ఎవరు పడిపోయిన పెద్ద వాళ్లు ఇలాగే వెళ్తారని అంటుంది. ఇక లక్కీ మిత్రతో నిన్ను చూస్తే కన్నకొడుకుకు ఏదో అయిపోతే పరుగుపెట్టిన వాడిలా ఉన్నావని అంటుంది. ఇక లక్కీ, జున్నులు సంయుక్తని వెతకాలి అని వెళ్తారు. లక్ష్మీ కూడా తాను సంయుక్తగా మారాలి అని వెళ్తుంది. మనీషా దగ్గరకు దేవయాని వస్తే లక్ష్మీని చూశాను అని లక్ష్మీ సంయుక్త ఇద్దరూ ఒక్కరే అని అంటుంది. కామెడీ చేయకని దేవయాని అంటుంది. ఇంతలో సంయుక్తగా లక్ష్మీ రెడీ అయి మిత్రని గుద్దేస్తుంది. ఎందుకు అంత కంగారు అని సంయుక్త మిత్రని అడిగితే లక్ష్మీని చూశానని మనీషా చెప్పిందని చెప్తాడు. ఇక మిత్ర రెండో సారి తలని ఢీ కొట్టమని అంటాడు. ఇక మిత్ర, సంయుక్త ఇద్దరూ మనీషా దగ్గరకు వస్తారు. లక్ష్మీని చూశావంట ఎక్కడ అని సంయుక్త అంటుంది. లేక నన్నే చూసి లక్ష్మీ అనుకున్నావా అని అడుగుతుంది. మనీషా మాత్రం తాను చూసింది లక్ష్మీనే అని అనుకుంటుంది.
వివేక్ జానుల ప్రదక్షిణలు పూర్తి అయిపోతాయి. హారతి ఇస్తుంటే వివేక్ జానులు తీసుకుంటుండగా మనీషా వచ్చి ఆపుతుంది. వివేక్‌ని పెళ్లి చేసుకునే దానిలా వివేక్‌తో కలిసి హారతి తీసుకుంటున్నావ్ ఏంటి నీ స్థాయి తెలుసుకొని మసలుకో అని తిడుతుంది. ఖుషిని వివేక్ పక్కకి పంపి జానుని పక్కకి తప్పుకోమని అంటుంది. మనీషా మాటలకు జాను ఏడుస్తూ వెళ్లిపోతుంది. మిత్ర మనీషాని తిడతాడు. మనీషాని ఛీ కొట్టి మిత్ర వెళ్లిపోతాడు. సంయుక్త జాను దగ్గరకు వెళ్లి ఓదార్చుతుంది. మరోవైపు దేవయాని మనీషాని పక్కకి తీసుకెళ్లి క్లాస్ పీకుంతుంది. జానుని నువ్వు రెచ్చగొట్టొద్దని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.