Trinayani september 2nd: తిలోత్తమతో నిజం కక్కించిన నయని, అందరి లెక్కలు తేలుస్తానన్న చంద్రశేఖర్
విశాల్ వయసు మీద పడ్డ వ్యక్తిలా మారడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Trinayani September 2nd: సుమనకి పుట్టింది ఆడపిల్ల అని మీరు అనుకుంటున్నారా అని డమ్మక్క అందరిని అడుగుతుంది. అవును అని అందరూ అనడంతో కాదు సుమనకి పుట్టింది ఆడపిల్ల కాదు ఆడ పాము. పురిటి సమయంలో పెద్దబొట్టమ్మ చెప్పొద్దన్నాది అందుకే ఇప్పుడు చెప్తున్నాను అని అంటుంది. ఆ మాటలకు అందరూ షాక్ అవుతారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? సుమనకి పాము పుట్టడం, విశాల్ ముసలివాడుగా మారడం దీనంతటికీ మూలం ఏమై ఉంటుంది అని అనుకుంటారు. అప్పుడు హాసిని.. దీనికి మూలం ఏదైనా సరే ఇకనుంచి మన కుటుంబానికి క్లిష్ట పరిస్థితులు వస్తున్నాయి అని అర్థమైంది అని అంటుంది. దానికి డమ్మక్క ఇది మాత్రం నూటికి నూరు శాతం కరెక్ట్ అని చెప్తుంది.
ఆ తర్వాత రోజు ఉదయం సుమన తన పాపని ఒళ్లో పెట్టుకొని హాల్లో అందరి మధ్య కూర్చుని ఉంటుంది. ఇంతలో పెద్దబొట్టుమ్మ ఒక మూల నుంచి ఆ చిన్ని పాపను చూస్తూ ఉంటుంది. ఎప్పుడొచ్చారు పెద్దమ్మ అని నయని అడగగా పాపను చూద్దామని వచ్చాను అని పెద్దబొట్టమ్మ అంటుంది. మీరే కదా ప్రసవన చేసింది పాప ని చూసే హక్కు మీకు ఉన్నది అని నయని అంటుంది. సుమన ఒక మనిషితో అవసరం అయిపోయిన తర్వాత వాళ్ళకి విలువ ఇవ్వని మనిషి.ఇప్పుడు నేను వెళ్తే బాగోదు అని ఉండిపోయాను అని అంటుంది పెద్దమ్మ. అప్పుడు నయని పక్కనే ఉన్న బుట్ట తెచ్చి నువ్వు ఇందులో దాక్కో పెద్దమ్మ నేను పాప దగ్గరికి తీసుకెళ్తాను అప్పుడు నువ్వు పాపని చూడు అని అనగా పెద్దబొట్టుమ్మ పాములా మారి ఆ బుట్టలోకి వెళ్తుంది.నయని ఆ బుట్టని తీసుకుని హాల్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే అక్కడికి చంద్రశేఖర్ వస్తాడు.
నన్ను నమ్మండంటూ విశాల్ ఆవేదన
నయని చంద్రశేఖర్ ని పలకరించి సుమనకు పాప పుట్టింది అని చెప్తుంది.దానికి చంద్రశేఖర్ ఆనందించి తను ఎందుకు వచ్చాడో చెప్తాడు. తనే విశాల్ అని అందరినీ నమ్మించి ఎవరో పెద్దాయన ఇంట్లోకి వచ్చారట తనని ఇంటరోగేట్ చేయమని కేసు వేశారు అందుకే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లాలి అని అంటాడు. ఎవరు కేసు వేశారు అని అడిగితే తిలోత్తమే వేసింది అని తెలుస్తుంది. నాకు ఇతను విశాల్ అని నమ్మకం లేదు అందుకే కేసు వేశాను అని అంటుంది తిలోత్తమా. నా భర్త గురించి నాకు నమ్మకం ఉంది. మీ నమ్మకంతో నాకు పని లేదు అని నయని అంటుంది. తనకే కాదు నాకు కూడా నమ్మకం లేదు అని సుమన అంటుంది. నేను విశాల్ నే నన్ను నమ్మండి నా అన్న తల్లి కూడా నన్ను గుర్తుపట్టని స్థితిలో ఉన్నాను అని బాధపడుతూ అంటాడు విషయాలు.అప్పుడు కోపంతో నయని చంద్రశేఖర్ దగ్గర గన్ తీసుకొని తిలోత్తమ నుదిట వైపు గురిపెడుతుంది.దానికి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. నిజం చెప్పండి చెరువు దగ్గర చేప నుంచి బాబు గారు బయటకు రావడం మీరు చూశారు కదా. నిజం చెప్పకపోతే గన్ షూట్ చేసేస్తాను అని అంటుంది.
Also Read: హెల్ప్ అడిగిన రిషి - మాటిచ్చిన వసు, శైలేంద్ర అరాచకాన్ని సపోర్ట్ చేసిన ఫణీంద్ర!
నిజం బయటపెట్టిన తిలోత్తమ
నాకు ఆస్తి ఇవ్వకూడదని తను ఇలాగా అబద్ధాలు చెప్తుంది అక్క అని అంటుంది సుమన. ఇంక ట్రిగ్గర్ నొక్కేస్తే అదేమో అని భయపడి తిలోత్తమా నిజం చెప్తుంది. నేను ఆరోజు నయిని ని వెంబడించాను ఆరోజు చేపలో నుంచి విశాల్ రావడం కూడా నేను చూశాను అని అనగా సుమనతో పాటు ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఇంక చంద్రశేఖర్ ఇన్నిమంది సాక్ష్యాలు ఉన్నందువలన కేసు కొట్టేస్తున్నాను అని నయనకి జాగ్రత్తలు చెప్పి అలాగే విషయాన్ని చంపాలి అనుకున్న వాళ్ళని వదిలిపెట్టను. ఇన్వెస్టిగేషన్ చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ మాటలన్నీ బుట్టలో నుంచి పెద్దబుట్టమ్మ వింటుంది. ఆ తర్వాత నయని ఆ బుట్టని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో విశాల్ నయని దగ్గరికి వచ్చి నన్ను ఎవరు ఈ ముఖం చూసి గుర్తు పట్టడం లేదు నా శరీరం మీద నాకే చిరాకు వస్తుంది అని అనగా ఆత్మ సౌందర్యమే అన్నిటికన్నా అందమైనది బాబు గారు. మీరు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా భార్యకి నచ్చినంత కాలం కాలర్ ఎగరేసుకొని తిరగవచ్చు అని అంటుంది. నేను ఇక్కడే ఉంటాను నయిని. అవసరమైతే గాని గది దాటను దీనికి ఒక పరిష్కారం తేలాలి అని అంటాడు విశాల్. ఆ తర్వాత తిలోత్తమా గన్ తీసుకొని తనకి తానే గన్ గురి పెట్టుకుంటుంది. దాన్ని తన పెద్ద కొడుకు చూసి అమ్మ నువ్వు గురి పెట్టుకోవద్దు అమ్మ, నువ్వు చనిపోవద్దమ్మా, నన్ను ఒంటరి వాడిని చెయ్యొద్దు అని గట్టిగా అరుస్తూ ఉంటే ఆపరా అని అంటుంది తిలోత్తమా.
Join Us on telegram: https://t.me/abpdesamofficial