Trinayani September 1 Written Update: విభూది రాయగానే మారిపోయిన విశాల్, సుమన పాముకు జన్మనిచ్చిందని తెలుసుకున్న నయని!
ఆస్తి కోసం సుమన, తిలోత్తమా గొడవలు పెంచడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Trinayani September 1: ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని సొంత అక్కే తన భర్తను దాచిపెట్టి ఇప్పుడు కట్టుకథలు చెబుతుందంటూ సుమన నయనితో గొడవకు దిగుతుంది. ఆస్తి ఇచ్చే వరకు తన బిడ్డను ముట్టుకోవద్దని నయనికి వార్నింగ్ ఇస్తుంది సుమన. అదేంటి సుమన అలా అంటావు సొంత చెల్లి బిడ్డను ముట్టుకోవద్దంటే ఎలా అని ఇంట్లో వాళ్ళు వాదిస్తే విశాల్ బావను బయటకు తీసుకెళ్లి మార్చినట్టే నా బిడ్డను కూడా బయటకు తీసుకెళ్లి మారిస్తే అని సుమన అనేసరికి ఇంట్లో అందరూ షాక్ అవుతారు.
ఆ మాటలకూ తిలోత్తమా, వల్లభ కూడా వత్తాసు పలుకుతారు. అన్నీ మాటలు పడిన తర్వాత కూడా నయని మళ్లీ పాపని ఒక్కసారి ఎత్తుకుంటా అని అడిగితే సుమన కుదరదని అంటుంది. మరోవైపు నయని కూతురు గాయిత్రి నాగులమ్మ వైపు నడుస్తూ వెళ్తుంది. అక్కడ నాగులమ్మ కూడా నయని, సుమన తనను చూస్తే కోప్పడతారు అని భయపడుతూ ఉంటుంది. అప్పుడే బయటకు వచ్చిన ఎద్దులయ్యా గాయిత్రి దేవిని ఎత్తుకుని నాగులమ్మా ఇక్కడకు ఎందుకు వచ్చావు? ఇంట్లో వాళ్ళు చూస్తే నువ్వు సుమనకు ప్రసవం చేశావు అనే కృతజ్ఞత కూడా లేకుండా మాటలు అంటారు వెళ్ళిపో అని చెప్తాడు.. అప్పుడే నయని బయటకు రావడంతో నాగులమ్మ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
Also Read: 'హ్యాపీ' ఎండింగ్.. వేద కడుపు పండింది- అభిమన్యు మీద పగ తీర్చుకున్న నీలాంబరి
మరో సీన్ లో నయని రూపం మారిన విశాల్ ను తన రూమ్ కు తీసుకువస్తుంది. అప్పుడు విశాల్.. నన్ను ఇక్కడకు ఎందుకు తీసుకోచ్చావ్ నయని.. నా రూపం మారిన తర్వాత నన్ను ఇక్కడకు తీసుకురావాల్సింది.. చూడు ఇంట్లో వాళ్ళు అంతా ఎలా మాట్లాడుతున్నారో అని అంటే.. అదేంటి విశాల్ బాబు అలా అంటారు.. మీ రూపం మారిందని నేను ఇప్పుడు మీ భార్యను కాకుండా పోతానా? మీరు నా పిల్లలకు తండ్రి కాకుండా పోతారా అని అంటుంది. అప్పుడు విశాల్ మాట్లాడుతూ నన్ను నేను అద్దంలో చూసుకోగలనా.. 60 ఏళ్ళు పైబడిన వ్యక్తిలా కనిపిస్తున్న నన్ను నేను అద్దంలో చూసుకోగలనా అంటూ బాధపడితే..
నయని తన చీర కొంగులో నుంచి విబుదిని తీసి చూపిస్తూ.. ఈ విబుది రాస్తే మిమ్మల్ని మీరు మునపాటి విశాల్ లా చూసుకోగలరు అని అనడంతో విశాల్ షాక్ అవుతాడు. అతర్వాత విశాల్ నుదిటిన విబుది రాసి అమ్మవారిని తలుచుకుంటూ పడుకోవాలని విశాల్ కు నయని చెప్తుంది. అలా పడుకున్న విశాల్ మూడు నిమిషాల తర్వాత ముసలి దేహం వదిలి బయటకు వస్తాడు. అలా మునపటి విశాల్ గా మారగానే నయనిని హత్తుకొని పద నయని బయటకు వెళ్లి చెపుదాం.. నిన్ను ఇంకొకసారి ఎవరు అనుకూడదు అంటూ వెళుతుండగా ఇంకో 2 నిమిషాలు మాత్రమే మీరు ఇలా ఉంటారు అని, ఆ విభూదిని కేవలం రెండు సార్లు మాత్రమే వాడగలానని నయని చెప్తుంది. ఆతరువాత మీరు శాపవిమోచనం అయ్యే వరకు మీరు ఆ వృద్ధారూపంలో ఉంటారని చెప్తుంది.
అదంతా తెలుసుకున్న విశాల్ బాధపడుతూ నువ్వు అయినా ఎన్నాళ్ళు వాళ్ళ మాటలు పడుతావు నయని పద ఎలాగోలా ఇంట్లో వాళ్ళకు చెప్పేద్దాం అని అంటే మీ ఈ రూపం కేవలం నాకు నా పిల్లలకు మాత్రమే కనిపిస్తుంది. మిగితా ఇంట్లో వారెవరికి మీ రూపం కనిపించదు అని చెప్తుంది. శాప విమోచనం కోసం దారి వెతుకుతాను అంతా వరకు ఓపిక పట్టండి అని నయని చెప్తుంది. మూడు నిమిషాలు పూర్తవడంతో విశాల్ మళ్లీ ముసలి వ్యక్తిగా మారిపోతాడు.
Also Read: వసుకి మనసులో మాట చెప్పిన రిషి, చిరాకు తెప్పిస్తోన్న శైలేంద్ర బిహేవియర్!
మరోవైపు సుమన భోజనం చెయ్యకుండా కూర్చొని ఉంటుంది. ఎందుకు భోజనం చెయ్యలేదని డమ్మక్క అడుగుతుంది.. ఏ మాట చెప్పకుండా ఉండేసరికి ఇంట్లో అందరూ బయటకు వస్తారు.. సుమన ఆస్తి రాలేదని షాక్ లో ఉంది.. అన్నిటికంటే పెద్ద షాక్ విశాల్ ను అలా తీసుకురావడం అంటూ చెప్తారు. అందులో షాక్ ఏం ఉంది నిజంగానే విశాల్ అలా మారి ఉండొచ్చు, నయని చెప్పే మాటలు మనం నమ్ముతాం కదా అని హాసిని అంటే అన్నీ నమ్మచ్చు కానీ విశాల్ బావ విషయంలో మాత్రం నేను నమ్మను.. నాకు ఆస్తి రాకూడదని అక్కసుతోనే ఆ నయని బావను దాచింది అంటూ సుమన మాట్లాడుతుంది.
సుమన మాటలకూ వత్తాసు పలుకుతూ ఆజ్యం పోసినట్టు మాట్లాడుతారు తిలోత్తమ, వల్లభ. వారి ఇద్దరినీ వారిస్తూ సుమనకు బిడ్డకు పాలు ఇవ్వమని హాసిని చెప్తుంది. అదే మాట విక్రాంత్ కూడా అంటే వెళ్లి పాపను ఎత్తుకో అని ఇద్దరు గొడవ పడుతారు. అప్పుడే డమ్మక్క మాట్లాడుతూ విక్రాంత్ మాత్రమే కాదు కొన్నిరోజులకి సుమన కూడా పాపను ఎత్తుకొలేదు.. ఎత్తుకొవాలనుకున్న జరిపోతుంది అంటూ డమ్మక్క మాట్లాడుతుంది. అదేంటి అలా మాట్లాడుతావ్ అని అంటే నిజం తెలియాలంటే ఇక్కడ నుంచి సుమన బయటకు వెళ్ళాలి అని డమ్మక్క చెప్తుంది. దీంతో తిలోత్తమ్మా సుమనను అక్కడ నుంచి పంపించేస్తుంది.. ఇప్పుడు చెప్పు అంటే సుమన కన్నది ఆడపిల్ల అనుకుంటున్నారు కానీ సుమన కన్నది ఆడా పామును అని చెప్పి డమ్మక్క అందరికి షాక్ ఇస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial