News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Trinayani September 9th: వరలక్ష్మి స్థానంలో కొలువైన విశాలాక్షి.. సుమన మెడను చుట్టుకున్న పాము?

వరలక్ష్మి దేవి స్థానంలో విశాలాక్షి దేవి కొలువవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

Trinayani September 9th Written Update: ఈరోజు ఎపిసోడ్ లో వరలక్ష్మీ వ్రతానికి ఇంట్లో అందరూ సిద్ధమవుతారు.అందరూ లలిత కోసం ఎదురుచూస్తారు.

తిలోత్తమ: లలితక్క వచ్చేముందు మీరు గొడవపడితే ఆవిడ తిట్టిపోతుంది. 

మరోవైపు లలిత బయట వరలక్ష్మి విగ్రహాన్ని చూసి దండం పెట్టుకుంటుంది.

లలిత: అమ్మా వరలక్ష్మి ,పూజలో కొలువై ఉండవలసిన దానివి ఇక్కడ ఉన్నావంటమ్మా. అని అంటుంది. ఇంతలో అక్కడికి విశాలాక్షి వస్తుంది.

విశాలాక్షి: వరలక్ష్మి తానుగా రాలేదమ్మా. నయని ఇంట్లో వరలక్ష్మిని దొంగలించారు అని శివయ్య నన్ను వెళ్ళమని పురమాయించారమ్మ .

లలిత: ఆ శివయ్య ఎవరో కానీ మంచి పని చేశారు. రా తల్లి విగ్రహాన్ని తీసుకొని ఇంట్లోకి వెళ్దాం.

విశాలాక్షి: వద్దమ్మా వరలక్ష్మిని సంరక్షణ చేసే అంత సమయం లేదు. ఇంట్లోనేమో అమ్మ వాళ్ళు శుభముహూర్తంలో పూజ మొదలు పెట్టాలనుకుంటున్నారు.

లలిత: మరి విగ్రహం లేకుండా పూజ ఎలా చేస్తారు. అని అంటుంది.

 మరోవైపు హాల్లో పూజ కోసమని అందరూ లలిత కోసం ఎదురు చూస్తారు.

నయని: శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతం చేద్దాము అని మీ అందరిని కంగారు పెట్టేసాను.

హాసిని: ఏం పర్లేదు చెల్లి, ఇలాంటి పూజలు చేస్తే పాపిష్టి మొగుడిని కట్టుకున్నాను అన్న బాధ, పాపాత్మురాలు అయిన అత్తకి కోడలు అయ్యాను అన్న బాధ తగ్గిపోతాయి.

తిలోత్తమ: ఏయ్! అంత పాపం ఏం చేశామే?

డమ్మక్క: మీకు తెలుసు కదమ్మా. వాళ్లని ఎందుకు అడుగుతారు.

వల్లభ: పెద్దమ్మ వచ్చింది. అని అనగా అందరూ లలిత వైపు చూస్తారు. అప్పుడే లలిత లోపలికి వస్తుంది.

నయిని: మిమ్మల్ని చూడడం మాకు పండగలా ఉంటుంది అమ్మగారు.

లలిత: సంతోషం. ఏంటి తిలోత్తమా అలా చూస్తున్నావు.

హాసిని: వంటి నిండా నగలు వేశారు కదా పెద్ద అత్తయ్య. కళ్ళు వాటి మీద పడ్డాయేమో. 

తిలోత్తమ: వరలక్ష్మి దేవిని చూడాలా మిమ్మల్ని చూడాలని ఆలోచిస్తున్నాను. అని అనగా లలిత సిగ్గుపడుతుంది.

లలిత: శాపగ్రస్తుడైన విశాల్ ని చూడకముందే అమ్మవారిని చూద్దామనుకున్నాను.

విక్రాంత్: మరెందుకు ఆలస్యం. వదిన అమ్మవారి పైన ఉన్న ఆ వస్త్రాన్ని తీయండి. అని అనగా హాసిని, నయనీలు అమ్మవారి మీద ఉన్న వస్త్రాన్ని తీస్తారు. తీరా తీయగా అక్కడ విశాలాక్షి కూర్చుని ఉంటుంది. దానికి అందరూ ఆశ్చర్యపోతారు. వరలక్ష్మి ఉండాలి కదా విశాలాక్షి ఉందేంటి అని అనుకుంటారు నయని, హాసినిలు.

వల్లభ: మమ్మీ కాస్త ఏం జరుగుతుందో చెప్పవా.

తిలోత్తమ: విగ్రహం ఉండాల్సిన చోటులో విశాలాక్షి, అమ్మవారి వేషంలో కూర్చుని ఉందిరా.

విక్రాంత్: మరి ఆ విగ్రహం ఎక్కడుంది?

లలిత: బయట ఉంది. అని అనగా దానికి అందరూ ఆశ్చర్యపోతారు.

నయని: అమ్మవారి విగ్రహం బయట ఉండడమేంటి.

హాసిని: మేమే కదా స్వయంగా అమ్మవారిని అలంకరించి అక్కడ పెట్టాము. దిష్టి తగలకుండా గుడ్డ కప్పారేమో అనుకున్నాము. అని అంటుంది. విగ్రహం ఎవరు బయటపెట్టారు అని అడిగేలోగా,

విశాలాక్షి: వారా వీరా అని నిందలు వేస్తున్నారు. మరి పూజలు ఎవరు చేస్తారు?

తిలోత్తమ: అలాగని ఇప్పుడు నీకు పూజలు చేస్తామా?

లలిత: చేస్తే తప్పేంటి?చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం తిననే అమ్మవారు అనుకుని పూజ చేద్దాము. లక్ష్మీదేవి, పార్వతి దేవి, విశాలాక్షి దేవి అందరూ ఒకటే పూజ మొదలుపెడదాము.

సుమను: అలాగని ఎవరికి పడితే వాళ్లకి పూజ చేయడం ఏంటి? ఐ డోంట్ కేర్. అని అక్కడ నుంచి వెళ్ళిపోదామని చూస్తుంది.

లలిత: ఇక్కడి నుంచి కదిలితే కాళ్లు ఇరక్కొడతాను. పూజ అయ్యేంతవరకు ఇక్కడ నుంచి ఒక్క మనిషి కూడా వెళ్లే ప్రసక్తే లేదు. ఇక పూజ మొదలు పెడతాము.

విశాలాక్షి: మీ చెల్లెలి సవతికి ఏదో అభ్యంతరం ఉన్నట్టు ఉంది.

తిలోత్తమ: తప్పు చేస్తున్నావేమో అక్క. పూజ చేయాలి కానీ మరి వయసు, ఎవరో ఏంటో అనేది కూడా చూడాలి కదా.

లలిత: మనం పూజ చేస్తుంది సాక్షాత్తు అమ్మవారికి అని విశాలాక్షి దేవిని వర్ణిస్తూ ఉంటుంది లలిత.

విక్రాంత్: పెద్దమ్మ అంత చెప్పాక కూడా పూజ ఆలస్యం దేనికి మొదలుపెడతాము.

సుమన: మిమ్మల్ని ఎదురిస్తున్నాను అని అనుకోవద్దు అత్తయ్య కానీ ఇంతగా రెడీ అయింది అమ్మవారి విగ్రహం లేకుండా పూజ చేయడానికి కాదు. నేను వెళుతున్నాను.

విశాలాక్షి: ఎక్కడికి వెళ్తున్నావు సుమన? నువ్వు వెళ్లాలనుకున్నా కదల లేవు. ఇంత అందంగా వచ్చిన దానివి అందమంతా పోయి వెళ్లలేవు కదా.

సుమన: నా అందం ఎక్కడికి పోతుంది? ఇన్ని నగలు వేసుకున్నాను కదా.

డమ్మక్క: వేసుకున్నవి నగలు అనుకుంటుంది. కానీ అది పాము అని అనగా సుమన మెడ లోకి ఒక పాము వచ్చి చుట్టుకుంటుంది. ఒకేసారి దాన్ని చూసి అందరూ ఉలుక్కు పడతారు.

విక్రాంత్: ఇప్పుడు కదులు. ఒక్కడుగు వేస్తే పాము కాటుకి చస్తావు.

దురంధర: ఇంక ఎవరు ఇక్కడి నుంచి కదలరు. పూజ మొదలు పెడదాము.

నయని: అమ్మగారు అమ్మ వారి కీర్తన పాడండి అని లలితని అడుగుతుంది. లలిత కీర్తనలు పాడుతూ ఉండగా హాసిని, నయనీలు అమ్మవారికి పూజ చేసి హారతి ఇస్తారు. ఆ హారతిని అందరూ తీసుకుంటారు. 

హాసిని: అమ్మవారి విగ్రహం లేకపోయినా సరే పూజ చాలా బాగా అయింది.

సుమన: పూజ అయింది కదా ఇంక ఈ పాములు వెళ్ళిపోమని చెప్పరా అని భయపడుతూ అడుగుతుంది.

లలిత: పాము ఎక్కడుంది? నీ మెడలో నగలే కదా ఉన్నాయి అని అనగా సుమన మెడలో నుంచి పాము మాయమైపోతుంది.

సుమన: చెప్పానా ఈ గాయని విశాలాక్షి ఈ పని చేస్తుంది అని.

తిలోత్తమ: ఎలా వచ్చిందో కానీ వచ్చినప్పుడు నుంచి అందరినీ భయగ్రాంతులకు గురిచేస్తుంది.

విశాలాక్షి: భయం లేకుండా పాపపు పనులు చేస్తున్నప్పుడు బ్రాంతికి గురి చేస్తేనే మనిషి అదుపులో ఉంటాడు. లేకపోతే రాక్షస గుణాన్ని అలవర్చుకుంటాడు.

లలిత: అమ్మ విశాలాక్షి పూజకు ముందే అపశకునం జరిగింది అని లెంపలు వేసుకుంటుంది.

విశాలాక్షి: పర్వాలేదు అమ్మ మా వదిన లక్ష్మీదేవికి నేను చెప్పకుంటానులే.

వల్లభ: చూశారా ఈ పిల్ల పిచ్చిపిచ్చిగా ఎలా మాట్లాడుతుందో.

లలిత: నోరు ముయ్యు. ఎవరికి పరీక్ష పెట్టాలి అని విగ్రహాన్ని బయట కూర్చోబెట్టారు. అని అనగా ఆ మాటకి అందరూ ఆశ్చర్యపోతారు.

నయని: మీరేనా ఈ పనిచేసింది. అని కోపం తో అంటుంది.

హాసిని: త్రిశూలం ఇలా ఇవ్వండి పొడుచి పారేస్తాను.

విశాలాక్షి: పాపం, పరీక్షించబోయి తెల్లబోయారు.

తిలోత్తమ: మేమే చేసాము అని అలా ఎలా చెప్తున్నారు.

లలిత: మీరే చేశారు అని నాకు బాగా తెలుసు.

విశాలాక్షి: వద్దమ్మా వదిలేయండి.

తిరుత్తమా: సాక్షదారాలు లేకుండా మా మీద నింద వేయొద్దు. ఇలా ఆరోపిస్తే బాధేస్తుంది.

నయని: విశాలాక్షి అమ్మవారు కూర్చోవలసిన చోటులో నువ్వే కూర్చున్నావు కాబట్టి ఆ పని చేసిన వారిని నువ్వే క్షమించాలి. అని అనగా విశాలాక్షి ఒక శ్లోకం చదువుతుంది. అప్పుడు లలిత విశాలాక్షికి దండం పెట్టుకుంటుంది.

సుమన: మీరు అంత పెద్దవారు ఈ చిన్న పిల్లలకి మర్యాద ఇస్తూ దండం పెట్టుకుంటారు ఏంటి?

లలిత: ఆదిపరాశక్తి ముందు అందరూ చిన్నవాళ్ళమే. నిజమే తెలుసుకోలేని నీలాంటి వాళ్లు సత్యాన్ని ఏ గ్రహిస్తారు.

విశాలాక్షి: పూజ బ్రహ్మాండంగా చేశారు. మా వదిన ఇంటి బయటే ఉన్నా నన్ను ఇంట్లో ప్రతిష్టించి పూజ చేసినందుకు మీకు ప్రతిఫలంగా ఏమైనా ఇవ్వాలనుకుంటున్నాను. అడగండి అమ్మ.

నయని: మీ చల్లని చూపు ఉంటే చాలు అమ్మ.

డమ్మక్క: అమ్మ అడగమన్నప్పుడు అడగాలి నయని అని చెప్తుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.

Published at : 09 Sep 2023 10:49 AM (IST) Tags: Trinayani serial Trinayani telugu serial Trinayani zee telugu serial Trinayani

ఇవి కూడా చూడండి

Suma Adda : సుమను ఘోస్ట్ అనేసిన సుధీర్ బాబు - ‘అల్లూరి’ డైలాగ్‌తో అదరగొట్టేశాడు!

Suma Adda : సుమను ఘోస్ట్ అనేసిన సుధీర్ బాబు - ‘అల్లూరి’ డైలాగ్‌తో అదరగొట్టేశాడు!

Bigg Boss Telugu 7: దొంగలుగా మారిన ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్లు - శోభాశెట్టి, యావర్ ఫైట్, చివాట్లు పెట్టిన పెద్దాయన!

Bigg Boss Telugu 7: దొంగలుగా మారిన ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్లు - శోభాశెట్టి, యావర్ ఫైట్, చివాట్లు పెట్టిన పెద్దాయన!

Extra Jabardasth Latest Promo: పల్లకి ఎక్కిన ఫైమా, మరీ ఓవర్ చేసిన ఇమ్మూ- ‘ఎక్స్‌ ట్రా జబర్దస్త్‌’లో ‘మ్యాడ్’ టీమ్ సందడే సందడి!

Extra Jabardasth Latest Promo: పల్లకి ఎక్కిన ఫైమా, మరీ ఓవర్ చేసిన ఇమ్మూ- ‘ఎక్స్‌ ట్రా జబర్దస్త్‌’లో ‘మ్యాడ్’ టీమ్ సందడే సందడి!

Bigg Boss Captaincy Task: కన్నీళ్ళు పెట్టుకున్న యావర్, శోభా శెట్టి- కెప్టెన్సీ టాస్క్ లో అసలు ఏం జరిగింది?

Bigg Boss Captaincy Task: కన్నీళ్ళు పెట్టుకున్న యావర్, శోభా శెట్టి- కెప్టెన్సీ టాస్క్ లో అసలు ఏం జరిగింది?

Gruhalakshmi October 4th: రత్నప్రభ నిజస్వరూపం తెలుసుకున్న తులసి- దివ్యని బుజ్జగించే పనిలో విక్రమ్!

Gruhalakshmi October 4th: రత్నప్రభ నిజస్వరూపం తెలుసుకున్న తులసి- దివ్యని బుజ్జగించే పనిలో విక్రమ్!

టాప్ స్టోరీస్

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల - రెండు భాగాలుగా 'దేవర', రిలీజ్ ఎప్పుడంటే?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల - రెండు భాగాలుగా 'దేవర', రిలీజ్ ఎప్పుడంటే?

Flipkart iPad Offer: కొత్త ట్యాబ్ కొనాలనుకుంటున్నారా? - రూ.20 వేలలోపే యాపిల్ ఐప్యాడ్!

Flipkart iPad Offer: కొత్త ట్యాబ్ కొనాలనుకుంటున్నారా? - రూ.20 వేలలోపే యాపిల్ ఐప్యాడ్!

Lokesh : స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ పొడిగింపు - లోకేష్‌కు మరోసారి ఊరట !

Lokesh : స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ పొడిగింపు - లోకేష్‌కు మరోసారి ఊరట !

Malkajgiri News: ఎమ్మెల్యే మైనంపల్లిని చర్లపల్లి జైలుకు పంపుతా - ఆయన ప్రత్యర్థి హెచ్చరికలు

Malkajgiri News: ఎమ్మెల్యే మైనంపల్లిని చర్లపల్లి జైలుకు పంపుతా - ఆయన ప్రత్యర్థి హెచ్చరికలు