Trinayani September 16th Written Update: మాయమైన చిన్నారి - నయని మీద నింద వేసిన సుమన!
సుమన బిడ్డ కనిపించట్లేదని కంగారుపడుతూ ఆ నిందని నయని మీద, విక్రాంత్ మీద వేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
Trinayani September 16th Written Update: ఈరోజు ఎపిసోడ్ లో సుమన ఆడంబరంగా తయారై ఉంటుంది. అప్పుడు అక్కడికి విక్రాంత్ వస్తాడు
విక్రాంత్: నువ్వు పురిటి స్నానానికి తయారైనట్టు లేదు ఏదో ఫంక్షన్ కి తయారైనట్టున్నది. అయినా స్నానం చేపిస్తున్నప్పుడు ఇంత ఘనంగా తయారవడం ఎందుకు?
సుమన: ఫోటోలు తీసుకోవడానికి. ఎలాగా ఆస్తి నాకే వస్తుంది కదా ఈ చీర మీద పసుపు పెట్టి రుద్దినా సరే మహా అయితే 5000 చీర పోతుంది అంతే కదా అని ఫోన్ తీసుకొని సెల్ఫీలు తీసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఫోన్ ని విక్రాంత్ లాక్కుంటాడు.
విక్రాంత్: నీ ఫోన్ తీసుకొని కిందకి వెళ్తున్నాను నువ్వు మర్యాదగా ఈ చీరని మార్చి పాత చీరని కట్టుకొని కిందకి రా. అప్పటివరకు నీ ఫోన్ ఇచ్చే ప్రసక్తే లేదు పూజ అయిన తర్వాత నీ ఫోన్ తీసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
సుమన: నాకు ఆస్తి వస్తుందని వీళ్ళందరికీ కుళ్ళు అని అనుకుంటుంది సుమన. ఆ తర్వాత సీన్లో కింద పురిటి స్నానానికి కావాల్సిన వస్తువులన్నీ కుటుంబ సభ్యులందరూ ఏర్పరచుకుంటూ ఉంటారు. ఇంతలో తిలోత్తమ వల్లభ లు కూడా అక్కడికి వస్తారు. నయని అక్కడ కావాల్సినవన్నీ ఉన్నాయో లేదో చూస్తూ ఉంటుంది. అప్పుడు సుమన అక్కడికి వస్తుంది.
Also Read: కేసు గెలిచిన ఆర్య - వార్నింగ్ ఇద్దామనుకున్న ఛాయాదేవి, మాన్సీలకు షాకిచ్చిన అను!
సుమన: బావగారి వల్లే నాకు లేట్ అయింది. మంచి చీర కట్టుకునీ నగలు వేసుకుంటే వాటన్నిటినీ బలవంతంగా ఇప్పించి పాత చీర కట్టుకోమన్నారు.
దురంధర: మంచి పని చేశాడు లేకపోతే ఇదేమైనా ఫంక్షన్ అనుకుంటున్నావా అంత గ్రాండ్ గా రెడీ అవ్వడానికి. పురిటి స్నానం ఎంత నిరాడంబరంగా ఉంటే అంత మంచిది. అని చెప్పి సుమన నీ పసుపు పెట్టిన పీట మీద కూర్చోబెడతారు. అప్పుడు సుమనకి పసుపు, సున్ని పిండిలనీ చేతి మీద రాయడానికి సిద్ధమవుతారు నయని వాళ్ళు.
సుమన: ఇప్పుడు ఇవన్నీ రాయడం అవసరమా?
నయని: ఒకప్పుడు సబ్బు లేకుండా కూడా స్నానం చేసిన రోజులు గుర్తు లేవా చెల్లి?
సుమన: టైం మారింది ఇప్పుడు చాలా ప్రొడక్ట్స్ వచ్చాయి కదా?
నయని: వాదనలాపి సైలెంట్ గా కూర్చో. ఇది సాంప్రదాయంగా అయితేనే మంచిది. అని చెప్పి సుమన చేతి మీద సున్నిపిండి పసుపు కలిపి రాస్తారు. అప్పుడు వల్లభ పాపని కూడా కిందకి తెండి అని అంటాడు.
డమ్మక్క: అవును పాపని కిందకి తెస్తే ఇంటి పెద్ద అయిన తిలోత్తమ్మ గారు పాపకి స్నానం చేయించాల్సి ఉంటుంది.
తిలోత్తమ: నాకేమీ ఇబ్బంది లేదు. సుమన పాప అంటే నాకు ద్వేషం ఏమీ లేదు హాయిగా నా ఒళ్ళో కూర్చోబెట్టుకొని స్నానం చేపిస్తాను తనని కిందకి తీసుకొని రండి.
దురంధర: ఆగండి ఇప్పుడే వెళ్లి చిన్ని పాపని తీసుకుని వస్తాను అని పైకి వెళ్లి చూసేసరికి అక్కడ ఎంత వెతికినా పాప కనబడదు. రెండోసారి కూడా వెతుకుతుంది ఎంతకీ కనపడకపోయేసరికి కిందకి వచ్చి పాప కనబడట్లేదు అని చెప్తుంది. ఆ విషయానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. వెంటనే సుమన పరిగెట్టుకొని పైకి వెళ్లి చూస్తుంది. సుమనకి కూడా పాప కనిపించదు మరోవైపు కిందన ధురందర నీ అందరూ పాప గురించి సరిగ్గా వెతికావా లేదా అని అడగగా సరిగ్గా వెతికాను అని అంటుంది.
తిలోత్తమ: మరి పాపను ఎవరు దాచిపెట్టి ఉంటారు? ఎవరి మీద అయినా అనుమానం ఉన్నదా అని అనగా ఇంతలో సుమన అక్కడికి వచ్చి మా అక్క మీదే నాకు అనుమానం ఉన్నది అని అంటుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: సుమనకి ఆస్తి రాసిస్తానన్న విశాల్ - పాపని కిడ్నాప్ చేసిన తిలోత్తమ?
సుమన: మా అక్కే నా బిడ్డని దాచి ఉంటాది. నాకు ఆస్తి వస్తుంది అని తను కుళ్ళుకుంటుంది.
విశాల్: షట్ అప్. నీకైనా నాకైనా అలాంటి మంచి వాళ్ళ మీద నిందలు మోపితే జీవితం అర్ధాంతరంగా ఆగిపోతుంది.
తిలోత్తమ: ఇంకెవరి మీదైనా అనుమానం ఉందా?
సుమన: నా మొగుడు మీద అని అనే లోగా ఏ చెప్పుతో కొడతానో తెలీదు నా పేరు మాత్రం చెప్తే చెంప చెల్లుమనిపిస్తాను అని కోపంగా అంటాడు విక్రాంత్. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ పాపని వెతుకుదాం అని అంటారు
డమ్మక్క: మీరు ఎంత వెతికినా పాప కనిపించదు. పాపని మీరు గుర్తుపట్టలేరు కూడా.
సుమన: నా సొంత బిడ్డని కూడా నేను వెతుక్కోలేను అని ఈ డమ్మక్క అంటుంది. ఎవరు నా పాపను దాచారో నాకు తెలియదు కానీ సాయంత్రం ఆరు లోగా నా పాప నా చేతిలోకి రాకపోతే కుటుంబ పరువును అంతటిని పోలీస్ స్టేషన్లో నిలపెడతాను జాగ్రత్త అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత సీన్లో విశాల్ సుమని ఒక మూలకు తీసుకొని వస్తాడు.
విశాల్: చెప్పు నయని నువ్వు ఆ పాపని తీసావా?
నయని: నేనెందుకు అలా చేస్తాను బాబు గారు. ఒకవేళ నిజంగా సుమనకి బుద్ధి చెప్పాలని అనుకున్న సరే నేను పాప జోలికి వెళ్ళను. కుక్కతోక ఎప్పుడు వంకరే. సుమన కూడా ఎంత చెప్పినా ఇంక మారదు. అందుకే నేను ఇంకా సుమనని వదిలేసాను.
విశాల్: మరి విక్రాంత్ ఏమైనా చేసుంటాడా?
సుమన: లేదు విక్రాంత్ బాబు కోపగ్రస్తుడే కానీ చిన్నపిల్లకు హాని చేయాలని ఎప్పుడూ అనుకోడు. పాపకి ఏ ప్రమాదం వచ్చినా నాకు ముందే తెలుస్తుంది. నాకు అలాంటి సందేశాలు ఏవి రాలేదంటే పాప సురక్షితమైన చేతుల్లోనే ఉన్నది
విశాల్: పాప సురక్షితంగా ఉంటే చాలు అయిన పాపని ఎవరు దాచి ఉంటారు? నేను ఇప్పుడే ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేస్తాను
నయని: ఒద్దు బాబు గారు అని అంటుంది.. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది...
Join Us On Telegram: https://t.me/abpdesamofficial