అన్వేషించండి

Trinayani September 15th: 'త్రినయని' సీరియల్: సుమనకి ఆస్తి రాసిస్తానన్న విశాల్ - పాపని కిడ్నాప్ చేసిన తిలోత్తమ?

తిలోత్తమ, వల్లభలు కలిసి సుమన పాపని కిడ్నాప్ చేస్తారు.. అతర్వాత ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

Trinayani September 15th Written Update: ఈరోజు ఎపిసోడ్ లో ఓల్డ్ ఏజ్ బాగా ఎక్స్పీరియన్స్ అయినట్టుంది మనోడికి అని వల్లభ విశాల్ తో అంటాడు.

విశాల్: అన్నయ్య నేను ఎలా ఉన్నా నన్ను ఏమన్నా నేను బాధపడను. ఎందుకంటే నన్ను తిరిగి ఈ స్థితికి తేవడానికి పడిన కష్టాలు ఏంటో నాకు తెలుసు. అందుకే ఇప్పటినుంచి జీవితంలో ఉన్న ప్రతిక్షణాన్ని ఆనందించాలనుకుంటున్నాను. ఏ బాధలు లేకుండా నయని తో జీవితాన్ని గడపలనుకుంటున్నాను ఇంక మిగిలింది సుమనకి ఆస్తి రాసి ఇవ్వడం మాత్రమే. అది కూడా రేపు ఇచ్చేస్తాను.

సుమన: ఇంతకీ బావగారు మీరు శాపానికి ఎలా గురయ్యారు? అని అనగా వల్లభ, త్రిలోత్తమలు కంగారు పడతారు.

విశాల్: దానంతటికీ కారణం నన్ను పెంచిన తల్లి అని తిలోత్తమ వైపు చూపిస్తాడు.

ఎద్దులయ్య: కుతూహలమైనా కాని తొందరపాటుతనమైనా కానీ నిన్ను ఆపదలోకి నెట్టేస్తుంది. అని విశాల్ తో అంటాడు.

విక్రాంత్: అమ్మ నిన్ను చెరువులోకి నెట్టేసిందా? 

విశాల్: నేను అలా అనలేదు. గాయనికి అమ్మ ఆవు పాలు తెచ్చింది. వాటిని నేను అనుమానంగా చూస్తున్నాను అని అన్నయ్య అన్నాడు. అందుకే ఆ పాలని అమ్మ తాగుతాను అని అంది. అమ్మ దగ్గర తీసుకొని నేను తాగాను. ఆ పాలని నేను తాగిన తర్వాత పొరపాటున నా కాళ్లు పక్కనున్న దీపాన్ని తాకాయి దానివల్ల దీపం పాడైపోయింది. అందుకే శాపగ్రస్తుడిని అయ్యాను.

వల్లభ: ఇంకా చెప్పు నేనే చెరువులోకి తోసేసాము అని కూడా చెప్పు.

విశాల్: లేదు. నేను అలా అనలేదు. అలా జరిగిన సంఘటనలు ఏవి నాకు గుర్తులేదు.

తిలోత్తమ: హా నిన్నే గుర్తుపట్టలేనంతగా తయారయ్యావు. ఇలా గుర్తు తెలియని, వయసు మీద పడిన వ్యక్తి లా ఉన్నావని రోడ్డున పోయే వాళ్ళు ఎవరో అలా చేసి ఉంటారు.

సుమన: అలా కూడా ఇవ్వచ్చు కదా.

నయని: అది సరే బాబు గారు, గురువుగారు చెప్పినట్టు మీ రక్తం కోసం మీరు త్యాగం చేస్తే శాపగ్రస్తుల అవుతారు కదా. మరి మీ చేతిలో ఉన్నది గానవి కాదు గాయత్రీ కదా. అని అనగా విశాల్ టెన్షన్ పడతాడు.

ఎద్దులయ్య: అందుకే ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారు, తొందరపాటు పనికిరాదు అని చెప్పాను. అని అంటాడు. అదే సమయంలో హాసిని ఏవేవో మాట్లాడుతూ తన బిడ్డని కూడా తెచ్చి పాలు ఇవ్వమని చెప్పాను మధ్యలో బిడ్డలు కలిసిపోయారు అని నోటికి వచ్చింది అంతా చెప్తుంది.

వల్లభ: నువ్వు ఇలా చెప్పి ఇక్కడ ఉన్నవాళ్ళని కన్ఫ్యూజ్ చేయొద్దు.

నయని: అదంతా కాదు రేపు మంచి రోజు నాకు ఇవ్వాల్సిన ఆస్తి నాకు ఇస్తే మంచిది.

విక్రాంత్: ఆస్తి ఎప్పటికైనా నీకే వస్తుంది అన్నారు కదా. అప్పటివరకు అయినా పిల్లని సరిగ్గా చూసుకో. అన్న తర్వాత విశాల్ హాసినితో గాయత్రి విషయాన్ని మేనేజ్ చేసినందుకు థాంక్స్ అన్నట్టుగా సైగ చేస్తాడు.

ఆ తర్వాత సీన్లో ఒక బాస్కెట్ పట్టుకొని వల్లభ, తిలోత్తమలు వాళ్ల గదిలో నుంచి హాల్లోకి వస్తూ ఉండగా విశాల్ వాళ్ళని చూస్తాడు.

విశాల్: ఎక్కడికి వెళ్తున్నావ్ అన్నయ్య? అని అనగా విశాల్ ని చూసిన వల్లభ ఒకేసారి హాడలిపోతారు.

వల్లభ: ఈరోజు మంగళవారం కదా పక్కనే మార్కెట్ ఉంటుంది. అక్కడికి వెళ్లి కావాల్సినవన్నీ తేడానికి బయలుదేరాను. అని అనగా విశాల్ పిల్లలు ముగ్గురికి ఏంటి కావాలో కూడా లిస్ట్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పటివరకు దాక్కున్న తిలోత్తమ విశాల్ వెళ్లిపోవడంతో బయట కి వస్తుంది.

వల్లభ: సుమన పాపని కిడ్నాప్ చేయడం ఏంటో కానీ అందరికీ దొరికిపోయేటట్టు ఉన్నాం మమ్మీ.

తిలోత్తమ: అలా గట్టిగా మాట్లాడి నువ్వే అందరికీ చెప్పేటట్టున్నావు. అయినా సుమన గదిలో లేదు ఆస్తి వస్తుంది అని తన ఫ్రెండ్స్ తో ఫోన్లో మాట్లాడుతుంది ఇదే మంచి సమయం. అని అనే లోగా నయని అక్కడికి వస్తుంది. నయని ని చూసిన వాళ్లభ సోఫా వెనుక దాక్కొని ఉంటాడు. అప్పుడు తిలోత్తమా పక్కనే ఉన్న కర్చీఫ్లు, మాసిన గుడ్డలన్నీ ఆ బకెట్లో వేస్తూ ఉంటుంది.

నయని: ఇక్కడ ఏం చేస్తున్నారు?

తిలోత్తమ: పిల్లలకి ముక్కు చీముడు తీసి అలాగ ఉండిపోయినా గుడ్డలన్నీ ఏరి వాషింగ్ మిషన్లో వేద్దామని వెళుతున్నాను. ఖాళీగా ఉండి అలసిపోయాను.

నయని: అయితే ఇవ్వండి నేనే వేస్తాను. అయినా మీ చేతిలో ఉన్న బాస్కెట్ ఏంటి కొత్తగా ఉంది?

తిలోత్తమ: బాస్కెట్ గురించి అంత ముఖ్యమేమీ కాదు అయినా పర్లేదు నేనే వెళ్లి వాషింగ్ మిషన్ లో వేస్తాను పని ఇష్టంతో చేస్తే కష్టంగా ఉండదు. అని చెప్పగా నయని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో తిలోత్తమ, వల్లభలు అలా సుమన గదిలోకి వెళ్తారు.

తిలోత్తమ: ఈ బిడ్డ మూలంగానే సుమనకు ఆస్తి వస్తుంది అని అదే ఈ పిల్లనే దాచిపడితే భయపెట్టి డబ్బులు సంపాదించొచ్చు అని కిడ్నాప్ చేస్తున్నాం అని చెప్పి అక్కడ ఉన్న సుమన బిడ్డని తన బాస్కెట్ లో వేసేస్తాడు వల్లభ. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు విశాల్ హాల్లో కూర్చుని ఉండగా నయని అక్కడికి వస్తుంది. విశాల్ పక్కన ఒక గుడ్డ పడి ఉంటుంది.

నయని: ఇప్పుడు మీ పక్కన గుడ్డను చూస్తే తిలోత్తమ అత్తయ్య గారు వచ్చి మళ్ళీ బుట్టలో వేసేస్తారు.

విశాల్: అదేంటి బుట్ట వల్లభ అన్నయ్య దగ్గర ఉంది కదా ఈరోజు మంగళవారం మార్కెట్ కి వెళ్తాను అన్నాడు.

నయని: మార్కెట్ రేపు కదా అని అనే లోగా తిలోత్తమా అక్కడికి ఒక బాస్కెట్ పట్టుకొని వచ్చి అక్కడ ఉన్న గుడ్డను తీసుకొని బుట్టలో వేస్తుంది.

విశాల్: ఎందుకమ్మా ఇలాంటి పనులు చేయడం?

తిలోత్తమ: ఇలాగే చిన్నచిన్న పనులు కూడా నాకు చెయ్యి ఇవ్వకుండా ఉంటున్నారు. ఏమి చేయకుండా ఉంటే నాకు బోర్ కొడుతుంది. అందుకే నేనే పనిచేస్తున్నాను అని చెప్పి ఆ బుట్టని అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది.

తిలోత్తమ: మీకు ఇలా అనుమానం వస్తుందని తెలిసి ఇటువైపు వచ్చాను. ఎందుకైనా మంచిది అని రెండు బాస్కెట్లు కొనుక్కొని వచ్చాను మీకే అని తెలివితేటలు ఉంటే నాకు ఎన్ని ఉండాలి అని మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత వల్లభ పాప ఉన్న బుట్టని తిలోత్తమతో పాటు బయటకు తీసుకొని వస్తాడు. అదే సమయంలో ఇంటి బయట హాసిని ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. హాసినికి కనిపించకుండా వల్లభ ఆ పాపను పక్కనే ఉన్న వ్యాన్లో పెట్టేస్తాడు. ఈ విషయాన్ని ఒక మూల నుంచి పెద్దబొట్టమ్మ చూస్తుంది. అది గమనించని వల్లభ పాపని అక్కడి పెట్టి తిరిగి వెళుతుండగా హాసిని అదే సమయంలో ఫోన్ పెట్టేసి వెనక్కి తిరగగా వీళ్ళిద్దరిని చూస్తుంది.

హాసిని: మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు?

తిలోత్తమ: ఊరికే వచ్చాము కానీ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు?

హాసిని: మన పిన్ని వాళ్ళ తోటి కోడలికి అనుకుంటూ ఒక పెద్ద లిస్ట్ చెప్తుంది హాసిని. ఇంతలో పాపని పెట్టిన వ్యాన్ కదిలిపోవడంతో మమ్మీ వ్యాన్ వెళ్ళిపోతుంది అని వల్లభ తిలోత్తమతో అంటాడు.

హాసిని: ఆ వాన్ మీకు తెలిసిందా? మరి ఎందుకు అలా అడుగుతున్నారు? సరేగాని రండి అత్తయ్య అలా కబుర్లు చెప్పుకుందాం.

తిలోత్తమ: నీతో నాకు కబుర్లు ఏంటి?

హాసిని: ఏనాడైనా మనసు విప్పి ఒక మనిషితో అయినా మాట్లాడారా? అన్ని పాపాలు చేశారు ఎక్కడికి పోతారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

వల్లభ: వ్యాన్ వెళ్ళిపోయింది ఏం చేద్దాం మమ్మీ?

తిలోత్తమ: మనం సుమన బిడ్డని దాయాలి అనుకున్నాము దాచేసాము ఏం జరుగుతుందో రేపు చూద్దాము. అని అంటుంది. ఆ తర్వాత సీన్లో నయని లలితకి ఫోన్ చేస్తుంది. విశాల్ తిరిగి మామూలు స్థితికి వచ్చాడు అని జరిగిన విషయం అంతా చెప్పుకొస్తుంది.

లలిత: చాలా సంతోషమమ్మా ఇప్పుడే విశాల్ ఎలా ఉన్నాడు అని అడుగుదాం అనుకున్నాను. ఇంతలోనే శుభవార్త చెప్పావు.

నయని: మీలాంటి వాళ్ళ చల్లని దీవెనలు చాలు. అయినా మీరు ఇంటికి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక మంచి జరుగుతూనే ఉంటుంది.

లలిత: అలాగని మీ ఇంట్లోనే ఉండిపోమంటావా ఏంటి?

నయని: వచ్చేయండి అమ్మగారు. మా అత్తగారికి సేవలు చేసుకోలేకపోయాను మీకైనా మనసారా సేవలు చేసుకుంటాను.

లలిత: ఈ మాట అన్నావు చూడు అది చాలు నయని నాకు. ఎప్పుడైనా వీలు చూసుకుని విశాల్ చూడడానికి వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది లలిత. ఆ తర్వాత సీన్లో నగలన్నీ మంచం మీద పేర్చి ఉండగా సుమన గ్రాండ్ గా రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి విక్రాంత్ వస్తాడు.

విక్రాంత్: ఏం చేస్తున్నావే?

సుమన: చూశారా మీరు అలాగన్నారంటే నా అందానికి మైమరిచిపోయి ఉంటారు. ఈ నగలు తిలోత్తమ అత్తయ్యవి, ఈ చీర నాది అని అనగా నేను అడుగుతుంది అది కాదు. అసలు ఈరోజు జరగాల్సిన పని ఏంటి? నువ్వు చేస్తున్నదేంటి? అని విక్రాంత్ అడుగుతాడు.

సుమన: బిడ్డని కన్నదాని నాకు తెలీదా . పాపని కన్న పడకుండవ రోజున పురుటు స్నానం చేపిస్తారు కదా అని అంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.

Also Read: Prema Entha Madhuram September 14th: అభయ్ కీ రాఖీ కట్టిన అక్కి ఛాయాదేవికి వార్నింగ్ ఇచ్చిన జెండే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
Vizag Crime News: వీడియోలతో బెదిరించి లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం, హోం మంత్రి అనిత సీరియస్
వీడియోలతో బెదిరించి లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం, హోం మంత్రి అనిత సీరియస్
RAPO 22: మహేష్ దర్శకత్వంలో రామ్ పోతినేని... ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు
మహేష్ దర్శకత్వంలో రామ్ పోతినేని... ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు
YS Viveka Case: బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?-  అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?- అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Marquee players list IPL 2025 Auction | ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల చూపు వీరి మీదే | ABP DesamRishabh pant IPL 2025 Auction | స్పైడీ రిషభ్ పంత్ కొత్త రికార్డులు సెట్ చేస్తాడా.? | ABP DesamRishabh Pant Border Gavaskar Trophy Heroics | ఒక్క ఇన్నింగ్స్ తో టెస్ట్ క్రికెట్ క్రేజ్ మార్చేశాడుPujara Great Batting at Gabba Test | బంతి పాతబడటం కోసం బాడీనే అడ్డం పెట్టేశాడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
Vizag Crime News: వీడియోలతో బెదిరించి లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం, హోం మంత్రి అనిత సీరియస్
వీడియోలతో బెదిరించి లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం, హోం మంత్రి అనిత సీరియస్
RAPO 22: మహేష్ దర్శకత్వంలో రామ్ పోతినేని... ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు
మహేష్ దర్శకత్వంలో రామ్ పోతినేని... ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు
YS Viveka Case: బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?-  అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?- అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
Pushpa 2 Chennai Event Date: ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
Sabarimala Special Trains: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, మరో 26 ప్రత్యేక రైళ్లు ఇవే
శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, మరో 26 ప్రత్యేక రైళ్లు ఇవే
Amaran OTT Release Date: 'అమరన్' ఓటీటీ రిలీజ్ ఈ నెలలోనే... అనుకున్న తేదీ కంటే ముందుగానే Netflixలో... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'అమరన్' ఓటీటీ రిలీజ్ ఈ నెలలోనే... అనుకున్న తేదీ కంటే ముందుగానే Netflixలో... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Telangana News: కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణ హైకోర్టు షాక్, జీవో 16 కొట్టివేస్తూ ఉత్తర్వులు
కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణ హైకోర్టు షాక్, జీవో 16 కొట్టివేస్తూ ఉత్తర్వులు
Embed widget