Sowmya Rao: అలా కనిపించాలన్నారు, చాలా ఇబ్బందిపడ్డా - ఆ స్టార్ హీరో సినిమా ఒక్కటీ తెలీదు: సౌమ్య రావు కామెంట్స్
Sowmya Rao: జబర్దస్త్ షోలో ఇప్పటికే ఎన్నో లవ్ ట్రాక్స్ నడిచాయి. అందులో సౌమ్య రావు, హైపర్ ఆదిది కూడా ఒకటి. తాజాగా ఈ ట్రాక్‌పై సౌమ్య స్పందించింది. హైపర్ ఆదిపై తన అభిప్రాయాన్ని కూడా బయటపెట్టింది.
Sowmya Rao about Hyper Aadi: ఒకప్పుడు బుల్లితెరపై ఎక్కువగా తెలుగు వచ్చిన యాంకర్సే కనిపించేవారు. ఒకే భాష కాబట్టి వారు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. కానీ ఇప్పట్లో బుల్లితెరపై కూడా ఎక్కువగా భాష రాని యాంకర్లే కనిపిస్తున్నారు. అందులో సౌమ్య రావు కూడా ఒకరు. తెలుగుపై మాత్రమే కాదు.. అసలు తెలుగు నటీనటులపై కూడా ఏ మాత్రం అవగాహన లేకుండా తను తెలుగు షోలో యాంకర్‌గా చేయడానికి ముందుకొచ్చిందని ఇప్పటికే పలు సందర్భాల్లో అర్థమయ్యింది. దానిపై సౌమ్య తాజాగా స్పందించింది. అంతే కాకుండా హైపర్ ఆది.. తనపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం వెనుక కారణమేంటో కూడా బయటపెట్టింది.
ఎంజాయ్ చేస్తారు..
తనకు అసలే డ్యాన్స్ రాదని, పైగా తనకు తెలుగులో పాటలు కూడా తెలియకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చింది సౌమ్య రావు. అలాగే తెలుగులో తనకు నటీనటుల గురించి తెలియకపోవడం వల్ల ఒక సందర్బంలో సాయి ధరమ్ తేజ్ పేరును మార్చి చెప్పేసింది. అప్పట్లో ఈ వీడియో కామెడీగా వైరల్ కూడా అయ్యింది. దానిపై సౌమ్య ఇటీవల స్పందించింది. ‘‘వాళ్ల పేర్లు నేను గుర్తుపెట్టుకోవడానికి చాలా ప్రయత్నించాను. ఆయన పెద్ద స్టార్ హీరోనే. కానీ ఆయన చేసిన సినిమాలు, పాటలు ఒక్కటి కూడా నాకు తెలియదు. దాని వల్ల మొత్తం కామెడీ అయిపోతుంది. అందరూ అది ఎంజాయ్ చేస్తారు’’ అని పాజిటివ్‌గా స్పందించింది.
అదే మెయిన్ టార్గెట్..
హైపర్ ఆదితో ఆన్ స్క్రీన్ సౌమ్య రావు ఎక్కువగా క్లోజ్‌గా ఉండడంపై కూడా సౌమ్య రావు స్పందించింది. ‘‘ఆయన అందరితో అలాగే చేస్తారు. నాతో మాత్రమే కాదు. స్టేజ్ అంటే ఒక అమ్మాయి కావాలి. కామెడీగా ఉండాలంటే అవతల ఇంకొక వ్యక్తి కావాలి కదా. వాళ్ల కాన్సెప్ట్‌లో అమ్మాయి వర్కవుట్ అవుతుంది. అందుకే అలా చేస్తారు అంతే. జబర్దస్త్‌లోకి నేను వచ్చిన మొదట్లో మా కాంబినేషన్ చాలామందికి నచ్చింది. కానీ ఆయన ఇప్పుడు జబర్దస్త్‌లో లేరు. ఉండుంటే ఆ ట్రాక్ నడిచేదో ఏమో. కానీ ఆయన బాగా సపోర్ట్ చేస్తారు. ప్రేక్షకులకు ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వాలి అన్నదే మెయిన్ టార్గెట్’’ అని సౌమ్య తెలిపింది.
అలా కనిపించమని అడుగుతారు..
బుల్లితెర యాంకర్లు అంటే ట్రెడీషినల్‌గా ఉండడంతో పాటు కాస్త మోడర్న్‌గా కూడా కనిపించాలి. అలా మోడర్న్‌గా ఉండడంపై కూడా సౌమ్య తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. ‘‘అందులో కొంచెం గ్లామర్‌గా కనిపించమని అడుగుతారు. నేను అంతకంటే ముందు సీరియల్స్ చేశాను కాబట్టి మీరు అలాగే వస్తే సీరియల్ లుక్‌లాగానే ఉంటుంది. కొంచెం డిఫరెంట్‌గా రండి అని చెప్తారు. నాకు మరీ అంత మోడర్న్‌గా ఉండే అలవాటు లేదు. నేను ముందు నుంచి అయినా మామూలుగానే ఉన్నాను’’ అంటూ మోడర్న్‌గా కనిపించడంలో కాస్త ఇబ్బందిపడ్డానని తెలిపింది సౌమ్య రావు. ఇక తను యాంకర్‌గా వచ్చిన కొన్నాళ్లకే జబర్దస్త్ నుంచి తప్పుకొని ప్రస్తుతం కొన్ని షోలలో అక్కడక్కడ మాత్రమే కనిపిస్తోంది ఈ భామ.
Also Read: నా భార్య నన్ను వదిలేయాలని చూస్తోంది - ‘OG’ విలన్ ఇమ్రాన్ హష్మీ