అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today September 11th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: త్వరలోనే ఇంటికి వస్తానంటూ సుమతి లెటర్.. టీచర్ మీద సీతకు డౌట్! 

Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మీ రాఖీ ప్లాన్ వినేసిన విద్యాదేవి తన వదిన లలితతో కలిసి జనార్థన్‌కి ఫోన్ చేయించి లటర్ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode  సుమతి వస్తే మీ పని అయిపోతుందని సీత మహాలక్ష్మీతో అంటుంది. పైకి నటిస్తున్నారు కానీ సుమతి అత్తమ్మ వస్తుందని భయంతో వణికిపోతున్నారని అంటుంది. రేవతి మనసులో ఇది నిజం అని అనుకుంటుంది. సుమతి వస్తే మీ పని అయిపోతుందని ఆవిడ పట్ల మీరు ఏమైనా తప్పు చేసి ఉంటే మీకు దబిడదిబిడే అని వెళ్లిపోతుంది. 

మహాలక్ష్మీ: దీని సంగతి తర్వాత చూద్దాం ముందు సుమతి సంగతి చూడాలి. జనాకి కాల్ చేసి ఒక్కడికే రమ్మని చెప్పిందంటే నాకు ఏదో అనుమానంగా ఉంది. 
అర్చన: ఈపాటికి బావ అక్కడికి చేరుకొని ఉంటారు. అక్క ఏం బాంబు పేలుస్తుందో ఏంటో. 

సుమతి చెప్పిన అడ్రస్‌కి జనార్థన్ చేరుకుంటాడు. సుమతి కోసం మొత్తం వెతుకుతాడు కానీ కనిపించదు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి ఓకావిడ లెటర్ ఇచ్చిందని జనార్థన్కి ఇస్తాడు. ఇంటిలో అందరూ సుమతి కోసం ఎదురు చూస్తుంటారు. సీత, రామ్లు సుమతి వస్తుందని అనుకుంటారు. ఇంతలో జనార్థన్ ఇంటికి వస్తాడు. సుమతి ఎక్కడ అని అందరూ అడుగుతారు.

జనార్థన్: నేను అక్కడికి వెళ్లే సరికి సుమతి వెళ్లిపోయింది. లెటర్ ఇచ్చిందని చెప్తే రామ్ తీసుకుంటాడు.
రామ్: లెటర్ చదువుతాడు. జనార్థన్ గారికి  మిమల్ని కలవాలని మీతో కలిసి జీవించాలి అని ఆశగా ఉంది. నా పిల్లల్ని మన ఇంటిని నేను గమనిస్తూనే ఉన్నాను. మీతో మాట్లాడాలి అని పిలిచాను. కానీ మీరు వచ్చేలోపు ఆలోచించి మీమల్ని కలవాల్సిన సందర్బం ఇదికాదు అని లెటర్ రాసి వెళ్తున్నాను. కానీ ఒక రోజు నేను మీ ముందుకు పిల్లల ముందుకు రావాల్సి ఉంటుంది. ఆ పరిస్థితి వస్తుంది. అప్పుడు తప్పకుండా వస్తాను. అంత వరకు మన ఇంట్లో జరిగే ప్రతీది నేను తెలుసుకుంటూనే ఉంటాను. మిమల్ని మన పిల్లల్ని కలిసే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. సుమతి. 
సీత: అంటే అత్తమ్మ ఇంటికి వచ్చే రోజు కోసం ఎదురు చూస్తుందన్నమాట.
రామ్: అవును సీత అమ్మ తొందర్లోనే వస్తుంది.
అర్చన: అసలు ఆ లెటర్ సుమతి అక్కనే రాసిందా.
జనార్థన్: అది సుమతి రాసిన లెటరే ఆ సంతకం తనదే.
 
ఇక మహాలక్ష్మీ జనార్థన్‌కి రాఖీ కట్టమని అంటుంది. సుమతి కనిపించలేదు అన్న చిరాకులో ఉన్నానని నాకు రాఖీ వద్దు ఏం వద్దు అని జనార్థన్ అనేసి వెళ్లిపోతాడు. శివకృష్ణ కూడా వెళ్లిపోతాడు. మహాలక్ష్మీ తల పట్టుకొని కూర్చొంటుంది. ఇంట్లో పరిస్థితులు చూస్తుంటే పిచ్చి పడుతుందని అంటుంది. సుమతి కనిపిస్తే తన చేతులతో చంపేసి పగ తీర్చుకోవాలని అంత కోపం వస్తుందని మహా అర్చనతో చెప్తుంది. 

జనాకి ఆ లెటర్ రాసింది నిజంగా సుమతి ఏనా ఎవరు అని మహాలక్ష్మి ఆలోచిస్తుంది. ఇక శివకృష్ణ లలిత దగ్గరకు వెళ్లి కరెక్ట్ టైంకి సుమతిలా ఫోన్ చేసి లెటర్ ఇచ్చి పెద్ద గండం నుంచి కాపాడావని అంటాడు. ఇదంతా సుమతి చెప్పడం వల్లే అయిందని లలిత అంటుంది. ఇక లలితకు విద్యాదేవి టీచర్‌ కాల్ చేస్తుంది. మహా ప్లాన్ ముందే విన్నాను కాబట్టి మీకు ముందే ప్లాన్ చెప్పానని అంటుంది. ఇక విద్యాదేవి ఎమోషనల్ అవ్వడం సీత చూస్తుంది. మాట్లాడాలి అని సీత విద్యాదేవిని పిలుస్తుంది. మీకు వేరే గతం ఉందని అది చెప్పమని అంటుంది. తన తండ్రితో ఏం మాట్లాడారు అని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: తండ్రిని ముద్దాడిన కొడుకు ఎమోషనలైన మిత్ర.. ఈసారి తండ్రీకొడుకులకు గండం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ? ప్రభుత్వ నిర్ణయంపై కేటీఆర్ ఫైర్
రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ? ప్రభుత్వ నిర్ణయంపై కేటీఆర్ ఫైర్
Sajjala Bhargava Reddy: సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
Delhi Ganesh: తమిళ చిత్ర పరిశ్రమకు షాక్ - ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత!
తమిళ చిత్ర పరిశ్రమకు షాక్ - ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత!
Ministry of Sex: రష్యాలో శృంగార శాఖ- రాత్రి 10 తర్వాత కరెంట్ కట్, హోటళ్లలో గడిపే జంటలకు మనీ ఆఫర్
రష్యాలో శృంగార శాఖ- రాత్రి 10 తర్వాత కరెంట్ కట్, హోటళ్లలో గడిపే జంటలకు మనీ ఆఫర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ? ప్రభుత్వ నిర్ణయంపై కేటీఆర్ ఫైర్
రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ? ప్రభుత్వ నిర్ణయంపై కేటీఆర్ ఫైర్
Sajjala Bhargava Reddy: సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
Delhi Ganesh: తమిళ చిత్ర పరిశ్రమకు షాక్ - ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత!
తమిళ చిత్ర పరిశ్రమకు షాక్ - ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత!
Ministry of Sex: రష్యాలో శృంగార శాఖ- రాత్రి 10 తర్వాత కరెంట్ కట్, హోటళ్లలో గడిపే జంటలకు మనీ ఆఫర్
రష్యాలో శృంగార శాఖ- రాత్రి 10 తర్వాత కరెంట్ కట్, హోటళ్లలో గడిపే జంటలకు మనీ ఆఫర్
KCR: త్వరలో ప్రజల్లోకి కేసీఆర్- మొదట కాంగ్రెస్ ప్రభుత్వ బాధితుల వద్దకే !?
త్వరలో ప్రజల్లోకి కేసీఆర్- మొదట కాంగ్రెస్ ప్రభుత్వ బాధితుల వద్దకే !?
Tiger Tension: రెండు రాష్ట్రాల ప్రజల్ని వణికిస్తున్న పులి, సాయంత్రం నుంచి ఒంటరిగా వెళ్లవద్దని ప్రజలకు సూచనలు
Tiger Tension: రెండు రాష్ట్రాల ప్రజల్ని వణికిస్తున్న పులి, సాయంత్రం నుంచి ఒంటరిగా వెళ్లవద్దని ప్రజలకు సూచనలు
Jagan vs Lokesh: నిక్కర్ మంత్రి నారా లోకేష్! కట్ డ్రాయర్ ఎమ్మెల్యే జగన్! టీడీపీ, వైసీపీ ట్వీట్స్ వార్
నిక్కర్ మంత్రి నారా లోకేష్! కట్ డ్రాయర్ ఎమ్మెల్యే జగన్! టీడీపీ, వైసీపీ ట్వీట్స్ వార్
Madanapalli News: ఆర్డీవో మురళీపై ప్రభుత్వం వేటు- ఆ కేసులో కాదు, అక్రమ ఆస్తుల కేసులో చర్యలు
ఆర్డీవో మురళీపై ప్రభుత్వం వేటు- ఆ కేసులో కాదు, అక్రమ ఆస్తుల కేసులో చర్యలు
Embed widget