Chiranjeevi Lakshmi Sowbhagyavathi September 11th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: తండ్రిని ముద్దాడిన కొడుకు ఎమోషనలైన మిత్ర.. ఈసారి తండ్రీకొడుకులకు గండం!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మిత్ర కొడుకుగా ఈ సారి జున్నుకి గండం వస్తుందని దీక్షితులు గారు లక్ష్మీ, అరవిందతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మిత్ర టిఫెన్ తిననని వెళ్లిపోతుంటే జున్ను కూడా తినను అంటాడు. ఇక లక్కీ కూడా తినను అంటుంది. లక్కీ కోసం మిత్ర టిఫెన్ చేయడానికి అంగీకరిస్తాడు. అమ్మ నాన్నకి నువ్వే టిఫెన్ వడ్డించని జున్ను అంటాడు. లక్ష్మీ మిత్రకు వడ్డిస్తుంది. మిత్ర మాట్లాడకుండా సైగలు చేస్తాడు. అది చూసిన దేవయాని, మనీషా మిత్రని రెచ్చగొడితే లక్ష్మీతో గొడవ పడకుండా తినడానికి కూర్చొన్నాడని అనుకుంటారు.
జున్ను మిత్రతో నాన్న మీకు అమ్మ చేసిన చట్నీ అంటే చాలా ఇష్టం కదా అంటే మిత్ర గతంలో లక్ష్మీ వడ్డించిన చట్నీ లొట్టలేసుకొని తినడం గుర్తు చేసుకుంటాడు. ఆ టైంలో ముద్దు కోసం లక్ష్మీతో చేసిన సరసం కూడా గుర్తు చేసుకుంటాడు. లక్ష్మీ ముద్దు పెడుతుంది. ఇప్పుడు మిత్ర లక్ష్మీ తనని ముద్దు పెట్టుకున్నట్లు ఫీలవుతాడు. అది చూసిన జున్ను నాన్నకి ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చిందేమో అని అంటాడు.
లక్కీ: అవునా నాన్న నీకు అప్పట్లో అమ్మ చేసిన చట్నీ గుర్తొచ్చిందా.
జున్ను: నాన్నకి చట్నీతో పాటు అది చేసిన అమ్మ కూడా గుర్తొచ్చుంటుంది.
దేవయాని: ఈ జున్ను గాడు మామూలోడు కాదు మనీషా. చనిపోయిన శవంతో కూడా డ్యాన్స్‌లు వేయించేస్తాడు.
మనీషా: ఇన్నాళ్లు వీడు లక్ష్మీ కొడుకు అయితే బాగున్ను అనుకున్నా కానీ ఇప్పుడు కాకపోతే బాగున్ను అనిపిస్తుంది.
లక్ష్మీ: (మిత్ర ఏం మాట్లాడకుండా టిఫెన్ తినేసి వెళ్తుంటే..) మిత్ర గారు మీతో కొంచెం మాట్లాడాలి.
మిత్ర: మన మధ్య మాట్లాడటానికి ఇంకేం లేదు. త్వరలోనే విడాకుల నోటీసులు పంపిస్తాను సంతకం పెట్టేసి వెళ్లిపో.
లక్ష్మీ: మరి మీ సంతకాలు.
మిత్ర: నా సంతకాలు ఏంటి.
లక్ష్మీ: జేఎమ్మార్ ప్రాజెక్ట్ విషయంలో మీరు సంతకం చేశారు కదా. అర్జున్ గారు వచ్చింది ఆ పని మీదే.
అర్జున్: అవును మిత్ర నువ్వు నేను కలిసి ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి.
మిత్ర: అది మీ ఇద్దరూ చేసుకోండి.
లక్ష్మీ: మీ ప్రజెంటేషన్ కూడా బాగుంది అనే కదా మిమల్ని ఇందులో ఇన్వాల్స్ అవ్వమని చెప్పాం.
మిత్ర: ఓ ఆ మాట ఇప్పుడు చెప్తున్నావా ఇలా చెప్పి నాతో మంచి అనిపించుకోవాలి అనుకుంటున్నావ్ కదా. నీ ప్లాన్ నాకు అర్థమైంది.
అర్జున్: ఈ ప్రాజెక్ట్‌లో నువ్వు కచ్చితంగా ఉండాలి మిత్ర ఇది నా రిక్వెస్ట్
మిత్ర: ఇదంతా తన కోసమా.
లక్ష్మీ: జేఎమ్మార్ గారి కోసం.
మిత్ర: అందుకు మీరు ఉన్నారు కదా. అయినా నాకు అంత తీరిక లేదు. అయినా తనకు నువ్వు అండగా ఉన్నావు కదా. తన కోసం నా పెళ్లి కూడా ఆపావ్ కదా తన కోసం నువ్వే ప్రాజెక్ట్ పూర్తి చేయ్. మీ అవసరాలతో నాకు అవసరం లేదు. అయినా ఈమె చేతిలో మోసం పోవడానికి నేను రెడీగా లేను. నువ్వు నా జీవితంలో ఉండటమే నాకు ఇష్టం లేదు ఇక ప్రాజెక్ట్‌లో ఎలా ఉంటాను.
అర్జున్: లక్ష్మీ మిత్రని ఎలా అయినా ఈ ప్రాజెక్ట్‌లో పార్టిసిపేట్ చేసేలా చేస్తాను.
మిత్ర లక్కీని తీసుకొని వెళ్తాడు. జున్ను కూడా వెళ్తాడు. ఇక ముందు సీటులో జున్ను కూర్చొంటాడు. లక్కీ వెనక్కి కూర్చొంటుంది. మిత్ర లక్కీని ముందు రమ్మని చెప్తే రాను అంటుంది. జున్ను మిత్రతో నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నాన్న అంటాడు. దాంతో ఇన్నాళ్లు తనతో గొడవ పడి ఇప్పుడు ఇష్టం అంటున్నావ్ ఏంటని అడుగుతాడు. దానికి జున్ను గతంలో మిత్ర గొడవ పడిన సంఘటనలు గుర్తు చేస్తాడు. ఇక జున్ను సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి ట్రై చేస్తే మిత్ర ఆగురా అని తాను సీట్ బెల్ట్‌పెడతాడు. అప్పుడు సడెన్‌గా జున్ను మిత్రని కిస్ చేస్తాడు. మిత్ర ఎమోషనల్ అయిపోయి కంట్రోల్ చేసుకుంటాడు. ఇక తాను జున్ను మాయలో పడకూడదు అని అలా పడితే లక్ష్మీకి దగ్గరైపోతానని అనుకుంటాడు.
అరవింద, లక్ష్మీలు దీక్షితులు గారి దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్తారు. లక్ష్మీ సంతోషంతో ఉండాలి అని అనుకుంటున్నావ్ కానీ అలా ఎప్పుడూ లేదు అని లక్ష్మీ సగం జీవితం కష్టాల్లోనే సాగిపోయిందని అంటారు. ఇప్పటికీ కష్టాలు తప్పవని దీక్షితులు గారు అంటారు. ఈసారి నీ కొడుకుకి గండం రాబోతుందని అంటాడు. తండ్రి వారసత్వంగా కొడుకుకి గండం వచ్చిందని తండ్రితో పాటు కొడుకుకి గండం వస్తుందని అంటాడు. ఇన్నాళ్లు భర్తని కాపాడినట్లు ఇక ఇప్పుడు కొడుకుని కాపాడుకోవాలని అందుకోసం భార్య, భర్త, కొడుకు కలిసి పూజ చేయాలని అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.