అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today October 30th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సుమతి పేరు చెప్పి ప్రీతి పెళ్లి ఆపేసిన మహాలక్ష్మీ.. రాకేశ్‌తోనే ప్రీతి పెళ్లి అని సీతతో ఛాలెంజ్!

Seethe Ramudi Katnam Today Episode సుమతి వచ్చి కన్యాదానం చేస్తేనే ప్రీతి పెళ్లి చేస్తానని మహాలక్ష్మీ అందరికీ షరతు పెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode ప్రీతిని సీత, విద్యాదేవి తీసుకొని వస్తారు. పెళ్లి వాళ్ల ముందు కూర్చొపెడతారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఒకర్ని ఒకరు చూసుకుంటారు. అమ్మాయి మాకు నచ్చిందని  మా వైపు నుంచి ఏ ప్రాబ్లమ్ లేదని మీరు ఏమైనా అడగాలి అనుకుంటే అడగండి అని అంటారు. విద్యాదేవి మనసులో మహాలక్ష్మీ ఏంటి సైలెంట్‌గా ఉందని చివరిలో ఏదో బాంబ్ పేల్చుతుందేమో అనుకుంటుంది. ఇక సీత పెళ్లికొడుకు పెళ్లి కూతురు పర్సనల్‌గా మాట్లాడుకోవాలి కదా అంటుంది. రామ్, సీతలు ఇద్దరినీ తీసుకెళ్తారు. 

మహాలక్ష్మీ: మనసులో ఈ పెళ్లి ముచ్చట్లకు కాసేపటిలో ఫుల్ స్టాప్ పెడతా.
సీత: ఏంటి మామ ఏదో మూకీ సినిమా చూసినట్లు ఉంది.
హేమంత్: చెప్పండి నాకు ఎదురుగా మాట్లాడటం సిగ్గు అటు తిరిగి మాట్లాడుతా.  
సీత: లాభం లేదు మామ మనం ఇన్వాల్వ్ అవ్వాల్సిందే.

సీత, రామ్‌లు ప్రీతి, హేమంత్ మాట్లాడినట్లు నాకు మీరు ఇష్టం ప్రీతి గారు మీరు ఊ అంటే తాళి కట్టేస్తా అని అంటాడు రామ్. ఇద్దరూ మాట్లాడుకోవడంతో ప్రీతి ఆపండి ఇది మా పెళ్లి చూపుల్లా లేవు మీ పెళ్లి చూపుల్లా ఉన్నాయని అంటుంది. రామ్ హేమంత్‌ని నెట్టేస్తే ఒకరిపై ఒకరు పడతారు. హేమంత్ రామ్‌తో బావ నాకు మీ చెల్లి నచ్చిందని చెప్తాడు. ప్రీతీ కూడా అబ్బాయి నచ్చాడని అంటుంది. ఇక శివకృష్ణ నిశ్చితార్థం వద్దని ఏకంగా పెళ్లి చేసేద్దాం అని అంటాడు. మహాలక్ష్మీకి కూడా మీ అందరికీ ఓకే అయితే ఈ పెళ్లి జరగడంలో నాకు ఏ అభ్యంతరం లేదు అని అంటుంది. మహాలక్ష్మీ ఇంత ఈజీగా ఒప్పుకుంది ఏంటి అని అనుకుంటుంది విద్యాదేవి. ఇక మహాలక్ష్మీ ప్రీతి తన కన్న కూతురు కాదని ఎంత బాగా పెంచినా తనకు నేను కన్న తల్లిని కాదు కదా అంటుంది. 

మహాలక్ష్మీ: మీ అమ్మ సుమతి బతికే ఉండగా నేను ప్రీతికి కన్యాదానం చేయడం న్యాయం కాదు రామ్. ప్రీతి తల్లి బతికే ఉందా ఇక్కడికి ఏం రాలేదు అని హేమంత్ తల్లిదండ్రులు ప్రశ్నిస్తారు. ప్రీతి పెళ్లి అయితే సుమతి వచ్చి నా కూతురి పెళ్లి నా అనుమతి లేకుండా జరిపిస్తే నేను ఏం సమాధానం చెప్పాలి అని మహాలక్ష్మీ  అడుగుతుంది.
విద్యాదేవి: సుమతి అలా గొడవ చేయరండి మంచి మనిషి.
మహాలక్ష్మీ: సుమతి గురించి మీకు తెలుసా మాకు తెలుసా. ప్రీతి తల్లిలా మీరు ఫీలవకండి. గెస్ట్ గెస్ట్‌లా ఉండండి. ఆవిడ గురించి మీకు ఏం తెలుసు. రామ్ పెళ్లి ఎలాగూ సుమతి చేతుల మీదగా జరగలేదు. ఇప్పుడు ప్రీతి పెళ్లి అయినా తన చేతుల మీద జరగాలి కదా. అందుకే సుమతి వస్తేనే ఈ పెళ్లి లేదు అంటే లేదు. ఇది ఒక్కటే నా కండీషన్.
సారధి: ఆవిడ చెప్పిందే కరెక్ట్ ప్రీతి తల్లి లేకుండా ఈ పెళ్లి చేయడం కరెక్ట్ కాదు.  
మాధవి: ఆవిడ ఎక్కడుందో పిలిపించి కన్యాదానం చేయిస్తే అందరికీ మంచిది. 

సీత, రామ్ ఇలా అందరూ తన తల్లి ఇప్పుడు రాలేదు అని చెప్పినా వస్తేనే పెళ్లి అని సారధి, మాధవిలు అంటారు. పిన తల్లి అయినా కన్న తల్లి గురించి చెప్పారు మీతో సంబంధం కలుపుకోవడం మాకు చాలా సంతోషం ఇక వెళ్తామండీ అని చెప్పి సారధి వాళ్లు వెళ్లిపోతారు. విద్యాదేవి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నన్ను ఇలా ఇరికిస్తావని ఊహించలేదు మహాలక్ష్మీ అని అనుకుంటుంది. సీత కూడా ఆలోచిస్తుంది. అత్తయ్య పెట్టిన షరతు వల్ల పెళ్లి ఆగిపోయేలా ఉందని బాధ పడుతుంది. ఇంతలో మహాలక్ష్మీ సీత దగ్గరకు వస్తుంది. నా కండీషన్‌తో ప్రీతి పెళ్లి ఆగిపోతుందని అంటుంది. ప్రీతి పెళ్లి సుమతి చేయడం నీకు ఇష్టం లేదా. మీ మేనత్త రావడం నీకు ఇష్టం లేదా అని అడుగుతుంది. ప్రీతి పెళ్లి మీరు చేయలేరు అని ప్రీతి పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరుగుతుందని మహాలక్ష్మీ అంటుంది. ఇంకా ప్రీతి పెళ్లి రాకేశ్‌తో జరుగుతుందని కలలు కంటున్నారా అని సీత అడిగితే ప్రీతి పెళ్లి రాకేశ్‌తోనే జరిపిస్తానని మహాలక్ష్మీ ఛాలెంజ్ చేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: గన్‌తో మహాలక్ష్మీకి ఎదురెళ్లిన రాకేశ్ కొత్త డీల్.. శివకృష్ణ ఇంట్లో పెళ్లి చూపుల సందడి, మహా ప్లాన్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Kawasaki Ninja ZX 4RR: మార్కెట్లోకి కొత్త నింజా బైక్ - రేటు చూస్తే మాత్రం షాకే!
మార్కెట్లోకి కొత్త నింజా బైక్ - రేటు చూస్తే మాత్రం షాకే!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Mulugu News: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Embed widget