అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today October 29th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: గన్‌తో మహాలక్ష్మీకి ఎదురెళ్లిన రాకేశ్ కొత్త డీల్.. శివకృష్ణ ఇంట్లో పెళ్లి చూపుల సందడి, మహా ప్లాన్!

Seethe Ramudi Katnam Today Episode సీత తండ్రి ఇంట్లో ప్రీతి పెళ్లి చూపులు ఏర్పాటు చేయడం మహాలక్ష్మీ పెళ్లి చూపులు ఆపడానికి ప్లాన్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ ఇంట్లో జరిగిన పరిస్థితులు అన్నీ తలచుకొని కారు డ్రైవ్ చేస్తూ వెళ్తుంటుంది. ఇంతలో రాకేశ్, తన తల్లిదండ్రులు కారు ఆపుతారు. రాకేశ్ గన్ తీస్తాడు. మహాలక్ష్మీ కారు ఆపి వాళ్ల దగ్గరకు వెళ్తుంది. నాకే గన్ పెట్టి ఆపుతున్నారు ఎంత ధైర్యం అని అడుగుతుంది. దానికి రాకేశ్ గన్‌లోని బులెట్ నీ గుండెలోకి దిగనందుకు సంతోషించమని అంటాడు.

మహాలక్ష్మీ: పెళ్లి నా వల్ల ఆగిపోలేదు. నా కోడలు సీత తన తండ్రి వల్ల ఆగిపోయింది. ఏం చేయలేని పరిస్థితి నాది.
రాకేశ్‌తల్లి: మీ పరిస్థితి అప్పుడు అర్థం చేసుకున్నాం కాబట్టే అప్పుడు వెళ్లిపోయి ఇప్పుడు వచ్చాం.
రాకేశ్: మొన్న మీరు వచ్చి మా ఇంట్లో జరిగిందంతా చూశారని మా రౌడీలు మీ వెంట పడటం మొత్తం మాకు తెలుసు మా ఇంటి బయట సీసీ కెమెరాలో చూశాం.
రాకేశ్‌తండ్రి: మా గురించి మీకు అంతా తెలిసినా పెళ్లి చేయాలి అనుకున్నారని మాకు అర్థమైంది. 
రాకేశ్: మా గురించి మీరు చెప్పలేదు అందుకే మాకు మీరు అంటే గౌరవం.
మహాలక్ష్మీ: నాకు కూడా మీరు అంటే గౌరవం కానీ ఈ పెళ్లి జరగదు. సీత తండ్రి ప్రీతికి మేనమామ ఆయన ప్రీతికి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు.
రాకేశ్‌తల్లి: ఏదో ఒకటి చేసి పెళ్లి ఆపండి మేం పక్కన ఉంటే మీకే మంచిది.
మహాలక్ష్మీ: వాళ్లు వెళ్లిపోయిన తర్వాత మీ కోసం కాకపోయినా ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి చూపులు ఆపుతా నాకు ఇష్టం లేదు. 

సీత, రామ్, ప్రీతి, విద్యాదేవిలు శివకృష్ణ ఇంటికి వస్తారు. మహాలక్ష్మీ బయటకు వెళ్లిందని వచ్చాక మిగతా వాళ్లు వస్తారని చెప్తారు. ప్రీతి విషయంలో బాధ్యత తీసుకున్నందుకు విద్యాదేవి అన్నయ్యకి థ్యాంక్స్ చెప్తుంది. మహాలక్ష్మీ పెళ్లి చూపులు ఆపాలని ప్రయత్నిస్తుందని చెప్తుంది. దానికి శివకృష్ణ నేను నీ మేనకోడలు ఉండగా నీకు భయం ఎందుకని ధైర్యం చెప్తాడు. ఇక మహాలక్ష్మీ ఎలాఅయినా పెళ్లి చూపులు ఆపాలని అనుకుంటుంది. అర్చన, గిరిధర్‌లు రెడీ అయితే మహాలక్ష్మీ వాళ్లని రావొద్దని చెప్తుంది. నేను అక్కడ కథ నడిపిస్తాను మీరు ఇక్కడ ఉండి కథ నడిపించడండని చెప్తుంది. తన ప్లాన్ మొత్తం గిరిధర్, అర్చనలకు చెప్తుంది. రెడీగా ఉండమని చెప్తుంది. ఇద్దరూ ఒకే చెప్తారు. జనార్థన్‌ని విషయం చెప్పొద్దని అంటుంది. జనార్థన్‌ రాగానే అర్చన వాళ్లు మేం రావడం లేదు ఆఫీస్‌లో పని ఉందని అంటారు. ఇక జనా, మహాలక్ష్మీ బయల్దేరుతారు. 

సీత, విద్యాదేవిలు ప్రీతిని రెడీ చేస్తారు. లలిత ప్రీతిని కుందనపు బొమ్మలా ఉన్నావని పొగుడుతుంది. తర్వాత అందరూ కలిసి సీతని పొగుడుతారు. పిన్ని వస్తుందో రాదో అని ప్రీతి అంటే వస్తుందని విద్యాదేవి చెప్తుంది. ఇక ప్రీతి దగ్గర లలితని ఉంచి సీత, విద్యాదేవిలు బయటకు వెళ్తారు. అందరూ మహాలక్ష్మీ వాళ్ల కోసం వెయిట్ చేస్తారు. ఇంతలో మహా, జనా వస్తారు. గిరి అర్చనల గురించి అడుగుతారు. వాళ్లకి పని ఉందని రాలేదని చెప్తుంది. ఇక మహాలక్ష్మీ ప్రీతి గురించి అడుగుతుంది. సంబంధం విషయంలో ఎవరూ శివకృష్ణని మోసం చేయలేరు అని అంటారు. ఇంతలో పెళ్లి వాళ్లు వస్తే శివకృష్ణ, లలిత ఎదురెళ్లి స్వాగతం పలుకుతారు. పెళ్లి వాళ్లకి శివకృష్ణ అందరినీ పరిచయం చేస్తాడు. ఇక రామ్‌ని చూసి సుమతి కొడుకా అని అడుతారు. అవును అని సీత చెప్తుంది. ఇక పెళ్లి కొడుకు హేమంత్‌ని ఆయన తల్లిదండ్రులు సారధి, మాధవిలను పరిచయం చేస్తాడు. ఇక ప్రీతిని తీసుకొని టీచర్, సీత వస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: సంజయ్ చెంప పగలగొట్టిన సత్య.. దెబ్బకు మాయం.. ఫుల్ జోష్‌లో క్రిత్య!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sandhya Theater Stampede: 'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Telangana DGP: 'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sandhya Theater Stampede: 'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Telangana DGP: 'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
Anantapur News: అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
Fake Court Order Scam: మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Embed widget