అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today January 27th: సీతే రాముడి కట్నం సీరియల్: తమ మాటలతో తండ్రిని ఏడిపించేసిన సీత, మధు.. తిరగబడ్డ రేవతి!

Seethe Ramudi Katnam Serial Today Episode: సీత ఇంట్లో కనిపించకపోవడంతో రామ్ కంగారుగా అంతా వెతకడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Today Episode: సీత తన అక్కని తీసుకొని పోలీస్ స్టేషన్‌కు వస్తుంది. తన తండ్రి గురించి పోలీస్ అధికారికి చెప్తుంది. పక్కనే ఉన్న శివకృష్ణ షాక్ అయిపోతాడు. పరువు పోతే ఇక్కడ ప్రాణం పోయినట్లు ఫీలవుతారు అని శివకృష్ణ తన పై అధికారితో చెప్తాడు.

శివకృష్ణ: 20 ఏళ్లు కళ్లలో పెట్టుకొని పెంచుకున్న కూతురు లేచిపోతే ఆ తండ్రికి కోపం ఉంటుంది కాదా మేడమ్. తను తీసుకొచ్చిన సంబంధం కాదు అని పెళ్లి రోజే ఆ కూతురు వేరే వాడితో లేచిపోతే ఆ తండ్రి తల ఎక్కడ పెట్టుకోవాలి మేడం.
సీఐ: అలా అని కన్న కూతురుని వేధిస్తాడా..
శివకృష్ణ: ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురు ఎక్కడో ఉంటే ఆ తండ్రి మర్చిపోతాడు ఏమో కానీ కళ్ల ఎదుటే తిరుగుతూ ఉంటే ఆ తండ్రికి కోపం రాకుండా ఉంటుందా మేడం.
సీఐ: చూడమ్మా నువ్వు మేజర్‌వి చట్టపరంగా నీ పెళ్లి నీ ఇష్టం. నిన్ను బెదిరిస్తే నేరం అవుతుంది. మిస్టర్ శివకృష్ణ వీళ్లతో వెళ్లి వీళ్ల నాన్నతో మాట్లాడి రండి..
సీత: గట్టిగా వార్నింగ్ ఇవ్వమని చెప్పండి మేడం. ఈ ఎస్‌ఐ గారు చెప్తే మా నాన్న వింటారు. ఎస్‌ఐ గారు వెళ్దామా..
శివకృష్ణ: ఏంటి సీత నువ్వు చేసిన పని దీన్ని తీసుకొని నా మీద కంప్లైంట్ ఇవ్వడానికి నా స్టేషన్‌కే వస్తావా..
సీత: మరి మీరు ఏంటి మా అక్క వాళ్ల ఇంటికి వెళ్లి మా అక్కని బావని అనుమానిస్తారా.
శివకృష్ణ: ఇది చేసిన పనికి నీకు కోపం రావడం లేదా. 
సీత: నా గురించి మీరు అంత బాధ పడక్కర్లేదు ఎస్‌ఐ గారు నా గురించి నేను చూసుకోగలను. మీ జోక్యం అవసరం లేదు. మన మధ్య ఏమైనా ఉంటే మనం తర్వాత చూసుకుందాం. మీరు ముందు మాతో వచ్చి మా అక్క తప్పు ఏం లేదు అని మా బావతో చెప్పండి.
శివకృష్ణ: నేను వచ్చి వాడితో మాట్లాడాలా..
సీత: రాకపోతే లోపలికి వెళ్లి మేడంతో చెప్తా.. 

మరోవైపు రామ్ సీత కోసం ఇళ్లంతా వెతుకుతాడు. అందర్ని అడుగుతాడు. సీత కనిపించడం లేదు అని చెప్తాడు. 

మహాలక్ష్మి: వాళ్లని అడిగి ఏం ఉపయోగం రామ్. ఈ మధ్య సీత ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందో ఎవరికీ చెప్పడం లేదు.
రేవతి: సీత తన పుట్టింటికి వెళ్లింది. 
మహాలక్ష్మి: ఎవరికి చెప్పి వెళ్లింది. అయినా నీకు ఎలా తెలుసు.
రేవతి: నాతో చెప్పి వెళ్లింది. మీతో చెప్తే తనని వెళ్లనిస్తారా.. సీత వాళ్ల అక్క మధుమిత భర్త సూర్యకు యాక్సిడెంట్ అయినప్పుడు సీతని పంపించారా మీరు. తను వెళ్తుంటే ఆపడానికి ప్రయత్నించారు. సీతవాళ్ల అమ్మానాన్నలను రిసెప్షన్‌కు పిలవడానికి రామ్ వెళ్తుంటే తను వెళ్తానంటే మీరు ఆపేశారుకదా.. ఒక ఆడపిల్ల తన పుట్టింటికి దొంగతనంగా వెళ్లడం ఎంత దారుణం వదినా..
అర్చన: అయినా చీటికి మాటికి వెళ్లడం ఏంటి..
మహాలక్ష్మి: చాలు రేవతి ఈ మధ్య నీకు నోరు ఎక్కువ అవుతుంది. సీత నన్ను ఎదురిస్తుంది అని నీకు తెలిదా.. దానికి సపోర్ట్ చేస్తున్నావ్.. 
రేవతి: ఈ ఇంటికి సీత కరెక్ట్. 
మహాలక్ష్మి: మాట్లాడింది చాలు రేవతి.. రామ్ సీత నీకు కూడా చెప్పకుండా వెళ్లింది అంటే నీ మీద ఎంత గౌరవం ఉందో అర్థమవుతుంది. సీతకు నువ్వు సరిగా చెప్పలేకపోతున్నావా లేక నువ్వు చెప్పినా సీత నీ మాట వినడం లేదో నాకు అర్థంకావడం లేదు.  

సీత: తండ్రితో.. ఎస్ఐ గారు మా నాన్నకు కొడుకులు లేరు. కొడుకులు అయినా కూతురులు అయినా మేమే. మేం అంటే మా నాన్నకి ఎంత ఇష్టం అంటే మా ఇద్దరిని అల్లారుముద్దుగా పెంచారు. ఆయనకు ఎన్ని ప్రమోషన్లు వచ్చినా మా కోసం వదులుకున్నారు. మేం అంటే అంత ఇష్టం మా నాన్నకి మాకు కూడా నాన్న అంటే ప్రాణం. నాన్న కోసం నేను పెళ్లి కూడా చేసుకోకూడదు అనుకున్నా కానీ నాన్నే బలవంతంగా నా పెళ్లి చేశారు. అయినా సరే మా నాన్న మా ఇద్దరికీ దేవుడు. 
మధుమిత: అవును సీత ఆరోజుల్ని తలచుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో.. కానీ ఇప్పుడు మా నాన్న మారిపోయారు. మా మీద కోపం చూపిస్తున్నారు.  దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: త్రినయని సీరియల్ జనవరి 27th: దొంగతనం నింద తన మీద వేసుకున్న హాసిని.. సుమనకు షాకిచ్చిన విక్రాంత్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Kantara Chapter 1 Release Date: గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Embed widget