Trinayani Serial Today January 27th: దొంగతనం నింద తన మీద వేసుకున్న హాసిని.. సుమనకు షాకిచ్చిన విక్రాంత్!
Trinayani Serial Today Episode: గాయత్రీ పాపను రక్షించేందుకు దొంగతనం నింద హాసిని తన మీద వేసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Today Episode: తిలోత్తమ ఎద్దులయ్యని పిలిచి విశాలాక్షి మీద ప్రమాణం చేసి ఆ నగలు నువ్వు చూడనే లేదు అని అడుగుతుంది. దాంతో ఎద్దులయ్య అంత మాట ఎందుకు మాతా ఆ నగలు నేను చూశాను. ఒకరు తీయడం చూశాను అని అంటాడు. అందరూ ఎవరు అని అడిగితే.. ఎలా చెప్పాలి.. ఏ విధంగా చెప్పాలి అంటాడు. నయని, విశాల్‌లు పర్లేదు చెప్పండి అని అంటే.. ఎవరో కాదు మాతలు గాయత్రీ అమ్మ తీసింది. అని చెప్తాడు. దీంతో అందరూ షాక్ అవుతారు.
తిలోత్తమ: గాయత్రీ అక్క ఎలా వచ్చి నగలు తీసిందా అని ఆమె ఫొటో చూస్తున్నాం.
హాసిని: మనసులో.. పాప తీసింది అంటున్నాడు ఏంటి విశాల్ దొరికిపోయేలా ఉంది.
విశాల్: ఎద్దులయ్య అమ్మ ఎలా తీస్తుంది. మీ అమ్మ మీద ఒట్టు అనగానే బంగారు భారం మా అమ్మ మీద పెట్టావ్ ఎందుకు.
ఎద్దులయ్య: సత్యం అదే కదా బాబు.
విక్రాంత్: పెద్దమ్మ రావాలి అంటే పసిపిల్లగా రావాలి కదా..
ఎద్దులయ్య: తెలిసిందే చెప్పాను పుత్రా కావాలి అంటే గాయత్రీని అడగండి.
నయని: మాట రాని పసిపిల్లలు ఏం చెప్తారు.
ఎద్దులయ్య: పాపాతో.. ఏంటి అమ్మా నువ్వు కదా దాచుకున్నది.
సుమన: ఏయ్ ఎక్కడ దాచావే నగలు..
నయని: ఏయ్ నీకు ఏమైనా పిచ్చా.. పిల్లలకు బంగారం అంటే కూడా తెలీదు ఎందుకు అలా అరుస్తావ్..
సుమన: చెప్పలేం అక్క ఈ కాలం పిల్లలు ముదిరి పోయారు. ఏయ్ చెప్పవే అంటూ గాయత్రీ పాపను తడిమి చూస్తుంది. షర్టులో నగలు చూస్తుంది. అందరూ షాక్ అవుతారు.
వల్లభ: గాయత్రీ దగ్గర నగలు ఉన్నాయి ఏంటి అంటే ఆ నగలు..
ఎద్దులయ్య: నేను చెప్పాను కదా..
సుమన: అమ్మో అమ్మో నా నగలను పిల్ల దొంగలు కొట్టేశారు.
ఎద్దులయ్య: పిల్ల అనుకుంటే పొరపాటే.
విశాల్: పెద్ద వాళ్లే తీసుంటారు. చిన్న పిల్లలను అనడం ఎందుకు.
నయని: వాళ్లు తీసుకొని అలా దాచుకోగలరా. వాళ్లకి విలువైనా తెలుస్తుందా పాపం.
ధురందర: ఆ పాపం చేసింది ఎవరో చెప్పండి..
హాసిని: నేనే అలా చేశాను. అవును విక్రాంత్ నేను నీ కోసం ఆ నగలు తీశాను.
సుమన: నా మొగుడు కోసం నువ్వు దొంగతనం చేయాల్సిన అవసరం ఏంటి అక్క.
తిలోత్తమ: సరిగ్గా చెప్తావా పళ్లు రాలగొట్టాలా.
ఎద్దులయ్య: నువ్వు..
హాసిని: నువ్వు ఇంకా ఏం మాట్లాడకు ఎద్దులయ్య. నేను ఈవిషయాన్ని పెద్దది చేయదలచుకోలేదు.
నయని: నగలు తీసి పిల్లలకు ఎందుకు పెట్టావు అక్క.
విక్రాంత్: నా కోసం ఇలా ఎందుకు చేశావ్ వదినా.
హాసిని: సుమన దగ్గర ఉండే నగలు మీ అమ్మకి ఇచ్చింది కదా. ఆ నగలు తీసి తాకట్టు పెట్టి నేను నీకు ఇస్తే వ్యాపారం చేసుకుంటావు అని ఇలా ప్లాన్ చేశాను.
నయని: డబ్బు కావాలి అంటే నన్ను అడగొచ్చు కదా అక్క నువ్వు ఇలా చేస్తావు అని నేను అనుకోలేదు.
విశాల్: వదిన ఎందుకు ఇలా చేసిందో నాకు అర్థమైంది. ఇంక వదిలేయండి.
తిలోత్తమ: అలా ఎలా వదిలేస్తాం విశాల్. పిల్లలకు టీకాలు వేయించుకురమ్మని మీరు హాసినిని అడుగుతారు అని తనుకు ముందే తెలిసే ఆ నగలను పిల్లలకు కట్టి ఇళ్లు దాటించాలి అనుకుంది. నిలదీస్తే విక్రాంత్‌ను ఉద్దరించడానికి ఇలా చేశానని బుకాయిస్తుంది.
సుమన: మరిది మీద అంత జాలి ఉంటే నీ ఆస్తి ఇవ్వొచ్చు కదా అక్క నా నగలే దొరికాయా. మీకు సొమ్ము ఉండాలి నేను మాత్రం బికారి అయిపోవాలి అంతేనా..
విశాల్: అబ్బా వదిలేయ్ సుమన.
సుమన: ఇంకా చాలా నగలు ఉండాలి బావగారు. మూడుకోట్ల నగలు అంటే ఎన్ని ఉంటాయ్. అవునులే దొంగే దొరికాక అవిమాత్రం ఎక్కడికి పోతాయి. పిల్లలకు హాస్పిటల్‌కి తీసుకెళ్లాలనే నెపంతో నగలు అమ్మేయాలి అని పెద్ద ప్లానే వేశావు అక్క. చూడ్డానికి అమాయకంగా ఉంటావ్ కానీ పెద్ద కోడలే పెద్ద దొంగ అని తెలుస్తుంది.
విశాల్: సుమన ప్లీజ్ ఇక చాలు.. వదినా వాక్సినేషన్ కోసం రేపు డాక్టర్‌ని ఇంటికే పిలుస్తాను ఎవరూ ఎక్కడికి వెళ్లక్కర్లేదు.
తిలోత్తమ: సుమన లాకర్‌లు వద్దు ఏం వద్దు నీకు నచ్చిన చోట దాచుకో దొంగలు ఎక్కువ అయిపోయారు.
సుమన: అక్క మొత్తం నగలు తెచ్చి ఇవ్వు.
విక్రాంత్: నిజం చెప్పాలి అంటే నిన్ను ఈ రోజు హాసిని వదిన కాపాడింది.
తిలోత్తమ: దొంగతనం చేసింది తెలిసి కాపాడింది అంటావ్ ఏంట్రా.
విక్రాంత్: అమ్మా కాసేపు వదిన ఆ పని చేయలేదే అనుకుందాం.
వల్లభ: మేం తీసుకెళ్లి ఆ నగలను లాకర్‌లో భద్రంగా దాచేవాళ్లం.
విక్రాంత్: ఓహో ఏ లాకర్‌లో పెడతారు.
సుమన: అలా అంటారేంటి అత్తయ్య వాళ్ల అకౌంట్ బ్యాంక్ లాకర్‌లో పెట్టేవాళ్లు.
విక్రాంత్: నీకు పెట్టేవారు పంగనామాలు..
తిలోత్తమ: మా గురించి నెగిటివ్‌గా చెప్తే నీకు ఏం వస్తుందిరా.
సుమన: మీ కడుపున పుట్టిన మీ కొడుకు మిమల్ని ఎందుకు ద్వేషిస్తారో నాకు ఇప్పటికీ తెలీదు.
విక్రాంత్: నేను చెప్తాగా.. చూడు సుమన నీకు అకౌంట్ ఉంది కానీ దానిలో అమౌంట్ లేదు. మా మమ్మీ వాళ్లకి అమౌంట్ ఎంత ఉందో తెలీదుకానీ అకౌంటే లేదు. ఏయ్ అవాక్కయ్యావు కదూ..
సుమన: మరి అకౌంట్ లేకపోతే లాకర్ సదుపాయం ఎలా ఇస్తారు.
విక్రాంత్: పాపం కరెక్ట్‌గా చెప్పింది.
తిలోత్తమ: అకౌంట్ ఉండేది సుమన కానీ గాయత్రీ అక్క పునర్జన్మ ఎత్తాక వాటిని ఫ్రీజ్ చేశారని చెప్పారు.
సుమన: మర్చిపోయాను నేను అలాంటప్పుడు నా నగలు మీరు ఎలా దాస్తారు.
విక్రాంత్: చెప్పాను కదా బోడిగుండు కొట్టే ప్లేస్‌లో అని..
తిలోత్తమ: కోడలు సొమ్ము తినే వాళ్లలా కనిపిస్తున్నామా.. సుమన నీ నగలు నీ దగ్గరే భద్రంగా దాచుకో.
సుమన: థ్యాంక్స్ బుల్లిబావగారు మీరే కనక..
విక్రాంత్: చాలు చాలు పొగడ్తలు నాకు పడవు..
మరోవైపు హాసిని ఇళ్లు క్లీన్ చేస్తుంటుంది. హాసిని దగ్గరకు విశాల్, నయని చెరోవైపు నుంచి ఇద్దరూ ఒకేసారి వచ్చ ఒకేసారి పిలుస్తారు. ఒకరికి తెలీకుండా ఒకరు ఇదేంటి ఇప్పుడే వచ్చారు అనుకుంటారు. ఇక ఒకర్ని ఒకరు నువ్వు అడుగు అంటే నువ్వు అడుగు అని చెప్పుకుంటారు.
విశాల్: అదే వదినా అందరూ నిన్ను అంత తిట్టుకున్నా మీరు మాత్రం ఇంత హ్యాపీగా దుమ్ము దులుపుకుంటున్నారు.
హాసిని: ఎవరు ఏమన్నా సరే వాళ్ల మాటలను దుమ్ములా దులిపేయాలి. అప్పుడే హ్యాపీగా ఉంటామ్.
నయని: నగలు ఎందుకు తీసుకున్నావా అని బాధగా ఉంది.
విశాల్: వదిన అలా చేయదు నయని.
నయని: తెలుసు బాబుగారు.
విశాల్: ఏది ఏమైనా చాలా థ్యాంక్స్ వదినా.
నయని: అదేంటి బాబుగారు అలా అన్నారు.
హాసిని: నువ్వు ఉన్నావని మర్చిపోయాడులే.
నయని: నేను ఉండకూడదా వెళ్లాలా.. మరి దొంగతనం చేయడం మంచి అంటారేంటి బాబుగారు. నాకు ఇంకో విషయం అర్థం కాలేదు. గాయత్రీ అమ్మగారు తీశారని ఎద్దులయ్య ఎందుకు అన్నాడు.
హాసిని: సపరేట్‌గా మాట్లాడాలి అనుకున్న భార్య భర్తలు జంటగా వస్తే ఇలానే ఉంటుంది మరి.
మరోవైపు తిలోత్తమ, వల్లభ హాల్ లోకి వస్తారు. నయనిని ఇరికించాలి అని రకరకాల ప్లాన్‌లు వేస్తారు. నయని ఆరు బయట బొగ్గులు రెడీ చేస్తుంటుంది. ఏం చేస్తుంది అంటే సుమన వచ్చి పిల్లల మీద హాసిని అక్క నగలు వేయడం వల్ల కనక దిష్టి తగిలిందని దిష్టి తీయడానికి రెడీ చేస్తుంది అంటుంది.
తిలోత్తమ: ఇక్కడ ఓ కిటుకు ఉంది సుమన. పిల్లలు తినే గోరు ముద్దలు అయినా కింద పడితే చేతితోనే తీయాలి అలాగే మీ అక్క తెచ్చే నిప్పులు కింద పడేలా చేస్తే..
వల్లభ: కింద పడిన నిప్పులు చేతితోనే ఎత్తాలి. పెద్దమరదలి పిల్లలు నీ ఒళ్లు కాలేలా నీ నగలు వేసుకున్నారు.
సుమన: మా అక్క చేతులు కాలాలి..
తిలోత్తమ: మా వల్ల ఎక్కడ అవుతుంది అమ్మ ఆ పని చేయగలిగే సామర్ధురాలివి నువ్వే. ఇక మరోసారి అందరూ హాసిని మరోసారి తిడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: నాగ పంచమి సీరియల్ జనవరి 26th: మోక్షకి మరో పెళ్లి చేస్తానన్న వైదేహి.. కరాళి ఆశ్రమంలో పంచమి, ఫణేంద్ర!