అన్వేషించండి

Naga Panchami Serial Today January 26th: మోక్షకి మరో పెళ్లి చేస్తానన్న వైదేహి.. కరాళి ఆశ్రమంలో పంచమి, ఫణేంద్ర!

Naga Panchami Serial Today Episode మోక్షకి బలవంతంగా మరో పెళ్లి చేద్దామని వైదేహి ఇంట్లో వాళ్లకి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Naga Panchami Today Episode: వైదేహి ఇంట్లో మేఘన పూజ చేస్తుంది. అందరూ హాల్‌లో ఉంటే వచ్చి హారతి ఇస్తుంది. ఇక మేఘన అక్కా వాళ్లకి కూడా హారతి ఇస్తాను అంటుంది. దానికి వరుణ్, భార్గవ్‌లు వాళ్లకి ఉదయం పూజ కంటే ముందు ఫుడే తర్వాతే ఏదైనా అంటాడు. దాంతో చిత్ర అవును ముందు మాకు తిండే తర్వాతే ఏదైనా అంటుంది. 

వైదేహి: మేఘన మోక్షని పిలుస్తాను హారతి ఇవ్వు. మోక్షా.. హారతి తీసుకో.. మోక్ష హారతి తీసుకోకుండా చేతులు కట్టుకుంటాడు. మోక్ష ఈరోజు నుంచి నీకు కొత్త జీవితం.. నీ ప్రాణాలు కాపాడిన మేఘనకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆ భగవంతున్ని స్మరిస్తూ హారతి కళ్లకు అద్దుకో.. ఆ దేవుడి దయ తలచి నువ్వు చనిపోయి మళ్లీ బతికావ్. ఆ దేవుడు మేఘన రూపంలో వచ్చి నీకు ప్రాణం పోశాడు. మాకు పుత్ర భిక్ష, మీకు ప్రాణ భిక్ష పెట్టిన మేఘన చేతుల మీదుగా హారతి ఇస్తుంది. నిజం చెప్పాలి అంటే నీకు పునర్జన్మను ఇచ్చిన మేఘన నీకు దైవంతో సమానం. హారతి తీసుకో మోక్ష. మోక్ష నోటితో ఊది హారతి ఆర్పేస్తాడు. 
మోక్ష: ప్రాణం నాకు అక్కర్లేదు. ఈ దేవుడితో తిరిగి తీసుకోమని చెప్పండి. 
భార్గవ్: మోక్ష నువ్వు చేసింది కరెక్ట్ కాదు..
మోక్ష: నా భార్యను నాకు దూరం చేయడం కరెక్టా.. 
వైదేహి: ఎలాంటి అర్హత లేని పంచమిని ఈ ఇంటి కోడలిగా ఒప్పుకున్నాను. అందుకు కారణం తను నీ ప్రాణాలు కాపాడుతుందని నమ్మకంతో. మా తర్వాతే పంచమి నీ జీవితంలోకి వచ్చింది. అదృష్టం అని ఈ ఇంటికి తెచ్చుకుంటే మనకు దరిద్రంలా దాపరించింది. అది ఈ ఇంట్లో కాలు పెట్టినప్పటి నుంచి నీతో పాటు ఎవరికీ మనశ్శాంతి లేదు. అది ఈ ఇంట్లో ఉండగా ఎప్పడూ లేని చిత్ర విచిత్రాలు జరిగాయి. ఎటు చూసినా పాములు కనిపించేవి. భూతాలు  దెయ్యాలు అంటూ పూజలు చేయించాల్సి వచ్చేది. ఒక్క మాటలో చెప్పాలి అంటే మాకు పంచమి మీద చాలా అనుమానాలు ఉన్నాయి. నిన్నటితో మనకు ఆ దరిద్రం వదిలిపోయింది. ఇక నువ్వు ఆ పంచమి ప్రస్తావన తీసుకురాకూడదు. 
మోక్ష: మర్చిపోతాను.. మీరు ఈ మోక్షని మర్చిపోతే నేను పంచమిని మర్చిపోతాను. 
మోక్షతండ్రి: ఆవేశపడకు మోక్ష తల్లిదండ్రులు ఏం చేసినా పిల్లల సంతోషం కోసమే చేస్తారు. 
మోక్ష: నో అది అబద్ధం డాడీ.. పంచమి ఏమైపోయినా పర్లేదు మీ బిడ్డ బాగుండాలి అనుకోవడం స్వార్థం అవుతుంది డాడీ.. ప్రేమ అనిపించుకోదు. ఎవరి బిడ్డనైనా ప్రేమించగలగడమే నిజమైన ప్రేమ అవుతుంది. 
మోక్షతండ్రి: మోక్ష అమ్మ ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తుందిరా..
మోక్ష: నాకు ఆ మంచి అవసరం లేదు డాడీ. నన్ను నమ్మి పెళ్లి చేసుకున్న పంచమి నలుగురిలో అవమానపడితే అది నాకు మంచి జరిగినట్లా.. పాపం పంచమి. నేను ఈ రోజు తిరిగి బతకలేదు. చాలా కాలంగా పంచమినే బతికించుకుంటూ వస్తుంది. మీరు నాకు పోసిన ప్రాణం ఎప్పుడో పోయింది. ఇప్పుడు నాలో ఉన్న ప్రాణం పంచమిది. ఈ శరీరం, ఈ ప్రాణం పంచమికే సొంతం. వాటి మీద ఇంకెవరికీ హక్కులేదు. నా భార్య నాలోసగం కాదు. పూర్తిగా తనే నిండి ఉంటుంది. నాలో పంచమిని దూరం చేయడం అంటే నన్ను వదులుకోవడమే. 
మేఘన: మోక్ష ప్రాణం పోయినా పంచమిని వదులుకునేలా లేడు. పంచమిని మోక్షకి దూరం చేయాలి. 
శబరి: మనసులో.. పంచమి, మోక్ష విషయంలో మేం తప్పుగా ఆలోచిస్తున్నామేమో.. పంచమి అమాయకురాలు అయితే తనకు అన్యాయం చేయకు దేవుడా. 
 
మేఘన: నా కలల సౌధం కూలిపోయింది అన్నయ్య. నా జీవితం సర్వనాశనం అయిపోయింది. నేను కూడా చనిపోయి నీ దగ్గరకు వచ్చేస్తా.. నిన్ను మోసం చేశా అన్నయ్య. 
నంబూద్రీఆత్మ: బాధ పడకు కరాళి.. నువ్వు నాగమణిని తీసుకొచ్చినా నన్ను బతికించలేవు. నా భౌతికకాయం క్షీణత దశకు చేరింది. ఈ నంబూద్రీ ప్రాణం వదిలేసినప్పుడే సగం ఆశ చచ్చిపోయింది. ఇక ఆశ పడినా లాభం లేదు.  
మేఘన: మహాకాళి ప్రసాదించిన అన్ని శక్తులు పోయాయి. ఇక నేను ఏమీ సాధించలేను. బ్రహ్మచర్య శక్తులు ఉన్న మోక్షని బలి ఇస్తే కానీ మహాకాళి తిరిగి నాకు శక్తులు ఇవ్వను అని చెప్పేసింది.  
నంబూద్రీ: కరాళీ చేయాల్సినవన్నీ చేసి నా ఆత్మను సంతృప్తి పరిచి త్వరగా నాకు పరలోక ప్రాప్తి కలిగించు అమ్మా.. 
మేఘన: లేదు అన్నయ్య నేను మహా మాంత్రికురాలిగా మారాలి. నువ్వు ఆత్మగా నన్ను చూడాలి. ఆ తర్వాత నీ ఆత్మను సంతృప్తిగా పంపిస్తాను.  

మరోవైపు వైదేహి బాధ పడుతూ ఉంటుంది. ఇంట్లో అందరూ అక్కడికి వస్తారు. మీనాక్షి, శబరి పంచమి గురించి ఆలోచించమని చెప్తారు. దీంతో వైదేహి పంచమి మళ్లీ ఈ ఇంటికి రావడం జరగని పని అని అంటుంది. మోక్ష మాటకు ఎవరూ వంత పాడొద్దని గట్టిగా చెప్తుంది. అందరూ తలా ఓ మాట వేసి వాళ్లిద్దరినీ దూరం చేయమని అంటుంది. ఇక దీనికి భార్గవ్, వరుణ్‌లు మేం అలా చేయమని చెప్తారు.  దీంతో వైదేహి బలవంతంగా అయినా మోక్షకి మరో పెళ్లి చేద్దామని అంటుంది. మరోవైపు కరాళి ఆశ్రమానికి పంచమి, ఫణేంద్రలు వస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: కృష్ణ ముకుంద మురారి జనవరి 26th: తులసి కోటకి కలిసి పూజ చేసిన కృష్ణ, ముకుందలు.. ముహూర్తాలు పెట్టించేస్తారా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Embed widget