అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial August 9th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: దొంగచాటుగా కలుసుకున్న రామ్‌, సీతలకు మహా ఝలక్.. విద్యాదేవిపై మహా మాస్టర్ ప్లాన్!

Seethe Ramudi Katnam Today Episode సీత రామ్‌లను కలపడానికి ప్రయత్నిస్తున్న విద్యాదేవి అడ్డు తొలగించుకోవాలని మహా అర్చనతో కలిసి ప్లాన్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode లలిత సీత, శివకృష్ణలకు కాఫీ ఇస్తుంది. నీ కోసం మీ నాన్న నెల రోజులు సెలవు పెట్టారని అంటుంది. నీ సమస్యలు నువ్వే పరిష్కరించుకుంటావని ఏవీ నీ పుట్టింటి వరకు తీసుకురాలేదని అంటుంది. మహాలక్ష్మీ ఇంటి నుంచి నిన్ను గెంటేయాలి అని ప్రయత్నించినా ఎదుర్కొని నిల్చొన్నావు కానీ వెనక్కి తగ్గలేదని పొగుడుతారు. ఇప్పటి వరకు నీకు మేం ఏం సాయం చేయలేదు అని అంతా నీ కష్టమే అని అందుకే ఈసారి నీతో ఉండాలని అనుకుంటున్నామని అంటారు. ఇక మధు కూడా తన కాపురాన్ని సరిదిద్దు కుంటే మేం సంతోషంగా ఉంటామని అంటారు. ఇక సీత తన అక్క కాపురం కూడా తానే సరిదిద్దుతాను అని అంటుంది. ఇక సీత శివకృష్ణ ఒడిలో పడుకుంటే లలిత సీత కాళ్లు నొక్కుతూ పడుకోపెడతారు. మరోవైపు మధు తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తనని తన చెల్లిని ఎంత ప్రేమగా చూసుకునేవాళ్లో గుర్తు చేసుకుంటుంది. 

జలజ: ఏంటి మధు ఆషాఢం పేరుతో మహాలక్ష్మి గారు మీ చెల్లిని పుట్టింటికి పంపిస్తే మీ అమ్మా నాన్నలతో కలిసి పక్కింటిలోనే మకాం పెట్టిందంట. ఆషాఢం అయిన నువ్వు నీ మొగుడితో దర్జాగా ఉంటున్నావ్. నీ బుద్ధులే మీ చెల్లికి వచ్చాయ్. అయినా మిమల్ని అని ఏం లాభంలే మీ తల్లిదండ్రులకు సిగ్గు ఉండాలి. అప్పుడు నిన్ను ఆ ఇంట్లో వదిలి వాళ్లు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మీ చెల్లితో అక్కడున్నారు. చాలా విచిత్రం అయిన కుటుంబం మీది. 
మధు: నేను తలచుకుంటే ఆ గిన్నేని కొట్టినట్లు నిన్ను కొట్టగలను. ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావ్. రోజు ఏదో ఒక వంకతో నాతో గొడవ పెట్టుకోవాలి అని చూడకు. ముఖం పచ్చడైపోతుంది. ఆషాఢంలో పుట్టింటికి వెళ్లడానికి నేను ఏమైనా అత్తారింట్లో ఉన్నానా ఈ ఇంట్లో నువ్వు ఎలా ఉన్నావో నేను అలాగే ఉన్నాను. మా చెల్లి పక్కింట్లో ఉంటే నీకేంటి. మా అమ్మానాన్నల గురించి మాట్లాడే అర్హత ఉందా నీకు.
జలజ: సూర్య వాళ్లు రావడంతో చూడు సూర్య నీ భార్య నా మీద ఎలా విరుచుకుపడుతుందో. ఏంటి సూర్య నేను ఇంతలా చెప్తుంటే నీ భార్యని నిలదీయవు.
మధు: నిలదీయడం కాదు నన్ను చంపేయ్‌మను అలా నాకు విముక్తి దొరుకుతుంది. తెలిసో తెలియకో తప్పు చేస్తే అక్క నన్ను ఇంత సాధించాలా. మా అమ్మానాన్నలు సాయం చేస్తే వద్దు అనుకున్నాను. సూర్య కూడా అసహ్యించుకుంటున్నాడు. అటు పుట్టింటికి వెళ్లలేక ఈ ఇంట్లో నరకం అనుభవిస్తున్నాను. అందుకే చేసిన తప్పులు ఒప్పుకొని చావుని శిక్షగా కోరుకుంటున్నాను. కన్నవారికి దూరమై కట్టుకున్న వాడికి భారమై నేను ఇంకా బతికుండాలా. 

పచ్చని కాపురంలో చిచ్చు పెట్టి వాళ్లని విడదీశావని అసలు నువ్వు చావాలని జలజని భర్త తిడతాడు. మధు లోపలికి వెళ్లి ఏడుస్తుంది. మధు దగ్గరకు సూర్య వచ్చి పక్కనే కూర్చొంటాడు. ఆకలేస్తుంది టిఫెన్ పెట్టమని అడుగుతాడు. నా చేత్తో పెడితే తింటావా అని మధు అడిగితే నీ చేతితో పెడితే తినాలని ఉందని అంటాడు. ఇక మధు టిఫెన్ తీసుకొస్తే మధుకి తినిపిస్తాడు. మధు చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ఇద్దరూ ఒకరికి ఒకరు తినిపించుకుంటారు. మరోవైపు రామ్ సీతని గుర్తు చేసుకుంటాడు. సీత కూడా రామ్‌ని గుర్తు చేసుకుంటాడు.

 రామ్ ధైర్యం చేసి తన దగ్గరకు వస్తే మహాలక్ష్మి వచ్చి మొత్తం నాశనం చేసిందని తిట్టుకుంటుంది. ఇక సీత రామ్‌ని చూడాలని ఇంటికి వెళ్లాలని వస్తుంది. మరో వైపు రామ్ సీత వస్తే బాగున్ను ఒక వేళ వస్తే ఎలా వస్తుందని అనుకుంటాడు. సీత గోడ ఎక్కి రామ్ గదికి వస్తుంది. రామ్ సీతని చూసి షాక్ అయిపోతాడు.  ఇద్దరూ కిస్ చేసుకుంటారు. ఇక మహాలక్ష్మీ పెద్దగా అరుస్తూ నిద్ర లేస్తుంది. జనార్థన్ అదంతా నీ కల అని చెప్తాడు. రామ్ సీతని కలవడానికి వెళ్తాడేమో అని టెన్షన్ పడుతుంది. ఇక రామ్ కూడా సీత గురించే ఆలోచిస్తూ కలవాలా వద్దా అని ఆలోచిస్తుంటాడు. రామ్‌ బాధ పడుతుండటం విద్యాదేవి చూస్తుంది. డోర్ కొట్టి లోపలికి వచ్చి ఏమైంది నిద్ర పట్టడం లేదా అని అడుగుతుంది. 

విద్యాదేవి: ఇవి మనుషులు పెట్టుకున్న ఆచారం బాబు. పల్లెటూరిలో ఎక్కువ పాటిస్తారు. ఈ కాలంలో వర్షాలు కురిసి పనులు ప్రారంభమవుతాయి కాబట్టి ఆ పొలం పనులకు ఆటంకం కలగకుండా ఇలాంటి ఆచారాలు పెట్టుకున్నారు. 
రామ్: మరి మా పిన్ని మేం కలవకూడదని చెప్పింది.
విద్యాదేవి: మీరు ఈ ఇంట్లో కలవకూడదు అని మీ పిన్ని చెప్పింది. మీరు బయట కలవొచ్చు. మీరు కలిస్తే ఏం కాదు.
రామ్: అర్థమైందమ్మా ఇప్పుడే వెళ్లి కలుస్తా.
విద్యాదేవి: భార్యభర్తలు గదిలో కలవాల్సింది బయట కలిసేలా చేసింది మహాలక్ష్మీ.

సీత, రామ్‌లు బయట కలుసుకుంటారు. ఇద్దరూ హగ్ చేసుకోవడానికి దగ్గరకు వెళ్తే మధ్యలో మహాలక్ష్మి వస్తుంది. ఇద్దరూ షాక్ అయిపోతారు. సీతతో నువ్వు ఇలా బరి తెగించి వస్తావని నాకు ముందే తెలుసని అంటుంది. దానికి సీత రామ్ బయటకు వచ్చాడని నీ భార్య కోసం వచ్చానని చెప్పు అని అంటుంది. ఇక మహా రామ్‌ని లోపలికి పంపేస్తుంది.  ఇక మహా సాంబని ఒక్కటిచ్చి నిద్ర పోతున్నావా అని తిడుతుంది. ఇక అర్చన మహాలక్ష్మీని ఏమైంది ఈ టైంలో ఎక్కడికి వెళ్లావని అడిగితే సీత నిజంగానే సినిమా చూపిస్తుందని అంటుంది. విద్యాదేవి వల్లే ఇదంతా జరుగుతుందని ఆమెని ఇంట్లో నుంచి తన్ని తరిమేసే ఐడియా ఉందని అర్చనకు ప్లాన్ చెప్పి ప్లాన్ అమలు చేయమని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

Also Read: కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్: చెల్లి చేతిలో ఆది కేశవ్ మోసపోతాడా.. కనక మహాలక్ష్మిని కోడల్ని చేసుకుంటుందా, విహారి అడుగుల్లో కనకం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS And Congress On Lagacherla Issue: లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
Google Chrome browser : క్రోమ్‌ బ్రౌజర్ అమ్మేయండి- గూగుల్‌పై అమెరికా ఒత్తిడి
క్రోమ్‌ బ్రౌజర్ అమ్మేయండి- గూగుల్‌పై అమెరికా ఒత్తిడి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS And Congress On Lagacherla Issue: లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
Google Chrome browser : క్రోమ్‌ బ్రౌజర్ అమ్మేయండి- గూగుల్‌పై అమెరికా ఒత్తిడి
క్రోమ్‌ బ్రౌజర్ అమ్మేయండి- గూగుల్‌పై అమెరికా ఒత్తిడి
TECNO POP 9: 6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Embed widget