Satyabhama Serial Today May 15th : సత్యభామ సీరియల్: కట్టలు తెంచుకున్న మహదేవయ్య ఆగ్రహం, కొడుకు కోడళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్!
Satyabhama Serial Today Episode : రేణుక పిల్లలు పుట్టకుండా మందులు వాడుతుందని ఇంట్లో తెలియడంతో మహదేవయ్య కొడుకు, కోడళ్ల మీద ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Today Episode : రేణుక దగ్గరకు భైరవి వస్తుంది. రేణుక రెడీ అవుతుంటే తిడుతుంది. ఇక రేణుక భైరవికి క్షమాపణ చెప్తుంది. అయితే గర్భం రాకుండా వాడిన ట్యాబ్లెట్స్ అక్కడే ఉండటంతో భైరవి చూస్తుందేమో అని రేణుక కంగారు పడుతుంది. చాటుగా దాచడానికి ప్రయత్నిస్తుంది కానీ భైరవి చూసేస్తుంది.
రేణుకని నిలదీస్తే తలనొప్పి మాత్రలు అంటుంది. అయినా భైరవి రెట్టించి అడగడంతో చెమటలు పట్టేసిన రేణుకని చూసి అవి పిల్లలు పుట్టకుండా వాడే ట్యాబ్లెట్సా అని అడిగితే అవును అనేస్తుంది. దీంతో రేణుకని లాక్కుంటూ భైరవి హాల్‌లో అందరి ముందు తోసేస్తుంది. ఏమైందని అందరూ అడుగుతారు.
రుద్ర: ఏమైంది అమ్మ ఇది మళ్లీ ఏం తప్పు చేసింది. నీ మాటకు ఎదురు తిరిగిందా.. రోజు రోజుకు దీని వేషాలు ఎక్కువ అవుతున్నాయి. దీన్ని..
భైరవి: తప్పు చేసింది అది ఒక్కర్తే కాదు నువ్వు కూడా. ఇద్దరికి ఇద్దరూ తోడు దొంగలు అయ్యారు.
మహదేవయ్య: ఆ ట్యాబ్లెట్స్ ఏందే..
భైరవి: ఏం చెప్పమంటావయ్యా.. మనం వారసుల కోసం ఆరాట పడుతుంటే వీళ్లేమో మన వెనక గోతులు తీస్తున్నారు. మన కళ్లు కప్పి మనకు ఏం చెప్పకుండా పిల్లలు పుట్టకుండా ఈ గోలీలు వేసుకుంటున్నారు. నేనేమో పిచ్చిదాన్నిలా దీన్ని వెనక వేసుకొని చెట్లు పుట్టలు గుడులు గోపురాలు తిరుగుతుంటే వీళ్లు ఇలాంటి వేషాలు వేస్తున్నారు.
మహదేవయ్య: రుద్ర గొంతు పట్టుకొని.. బద్మాష్.. వారసుల కోసం నేను ఇంత ఆరాట పడుతుంటే నువ్వు నీ పెళ్లాం కలిసి ఇంత పని చేస్తారా.. ఏమనుకుంటున్నార్రా నన్ను.
రుద్ర: బాపు నా మాట విను.. ఆ దరిద్రపు గొట్టిది ఈ గోలీలు వేసుకుంటున్నట్లు నాకు తెలీదు బాపు. అమ్మ చెప్తే తెలిసింది. చెప్పవే చెప్పు. ఎందుకు వద్దు అనుకున్నావ్ పిల్లల్ని. ఏం రోగం వచ్చిందే బాపునే మోసం చేస్తావా. చెప్తావా చెప్పవా. అంటూ కొట్టడానికి చేయి ఎత్తుతాడు.
సత్య: బావగారు ఆగండి.. ఏం చేస్తున్నారు బావగారు.
క్రిష్: సత్య.. అది మా అన్నవదినలకు సంబంధించిన ముచ్చట వాళ్లు తేల్చుకోని నువ్వు ఆగు.
సత్య: అక్కని కొడుతున్నారు.
మహదేవయ్య: కొట్టుడు కాదు ఇది చేసిన పనికి చంపి పాతరేయాలి.
సత్య: నిజా నిజాలు తెలుసుకోకుండా ఈ ఇంటి కోడలి మీద చేయి వేయడం తప్పు మామయ్య. అక్క టెన్షన్‌లో ఉంది. తేరుకోనివ్వండి. తనే నిజం చెప్తుంది. ఓపిక పట్టండి.
మహదేవయ్య: ఏంటి ఓపిక పట్టేది కళ్లు ముందు ట్యాబ్లెట్స్ కనిపిస్తున్నాయి. అది వేసుకుంటున్నా అని ఒప్పుకుంది. ఇంకేం కావాలి.
సత్య: మామయ్య అక్క అసలు ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుందో అడిగి తెలుసుకోవాలి కదా.
రుద్ర: అప్పుడు ఆలోచించి చెప్తుంది నా మొగుడు వేసుకోమంటే వేసుకున్నాను అని. తప్పించుకోవడానికి వేయి అబద్ధాలు అడుతుంది. తప్పు నా మీద వేస్తుంది నమ్మేస్తారా..
సత్య: పొరపాటు పడుతున్నారు బావగారు ఏ ఆడది తెలిసి తెలిసి సంతానం వద్దు అనుకోదు. మాతృత్వం కాదు అనుకోదు. అలా అనుకోవాలి అంటే దాని వెనక పెద్ద కారణం ఉండే ఉంటుంది.
భైరవి: ఆహా.. నీకేం కారణం ఉందని నువ్వు పిల్లల్ని వద్దు అనుకుంటున్నావ్. నీ మొగుడితో కాపురం చేస్తలేవు.
మహదేవయ్య: ఏంటే నువ్వు అనేది.. చెప్పు నిన్నే అడుగుతున్నా. సత్య పిల్లల్ని కాదు అనుకోవడం ఏంటి.
భైరవి: చిన్న కోడలు ఇంత వరకు మొగుడితో కాపురం చేస్త లేదయ్యా. ఇద్దరూ కలిసి ఒక రూంలోనే ఉన్నారు. కానీ ఇద్దరివి వేరు వేరు పడకలు.
మహదేవయ్య: ఫ్లవర్ వాజ్ కిందకి విసిరి కొట్టి గట్టిగా.. ఏం జరుగుతుంది ఈ ఇంట్లో.. రేయ్ అసలు నువ్వు మగాడివేనారా.. నాకు ఇష్టం లేకపోయినా పది మెట్లు కిందకి దిగి ఇద్దరికీ పెళ్లి చేశా. సగం చచ్చిపోయి వాళ్ల కండీషన్లకు ఒప్పుకున్నాను. ఇప్పుడు గాలికి ఎగిరే ఆకు వచ్చి సింహాసనం మీద కూర్చొంది. అలాంటప్పుడు నీ పెళ్లాం ఎలా ఉండాలి. అనిగి మనిగి ఉండాలి. కాపురం చేసి నవ్వు చెప్పినట్లు ఉండాలి. అలాంటిది నీ పెళ్లాం నిన్ను దూరం పెట్టడం ఏంట్రా. దానికి బుద్ధి లేదు సరే నీ బుద్ధి ఏమైంది. అది కాపురం చేయను అంటే రెండు పీకి మాట వినేలా చేసుకోవాలి. పిచ్చోడు లెక్క దూరం పడుకోవడం ఏంట్రా. నువ్వు నా కొడుకు అంటేనే సిగ్గేస్తుంది. ఏమైంది నీకు పెద్దింటి కోడలు అవ్వగానే కొమ్ములు వచ్చాయా. కావాలి అనే కదా నా కొడుకుని పెళ్లి చేసుకున్నావ్. ఏం తక్కువ అయింది వాడికి ఎందుకు దూరంగా ఉంచుతున్నావ్. మీ అయ్య ట్రైనింగ్ ఇచ్చాడా.
భైరవి: అట్లా అడుగయ్యా..
మహదేవయ్య: నోర్ముయ్.. ఇదంతా నీ వల్లే నిజం తెలిశాక నాతో చెప్పాలి కదా.
భైరవి: ఏం చెయ్యాలి అయ్యా. ఆడ మన పిల్ల కష్టాలు పడుతుందని చెప్పా. స్వీట్ ప్యాకెట్ డబ్బులు చేతిలో పెట్టి వచ్చావ్. వీళ్ల సంగతి చెప్పినా నవ్వుకుంటూ ఊరుకుంటావ్ అని చెప్పలే.
మహదేవయ్య: దానికి దీనికి ముడి పెడతావ్ ఏంటే. అసలు తప్పు అంతా నీ పెంపకానిది. ఇంట్లో తల్లి సక్రమంగా ఉంటే పిల్లలు తప్పుగా ఉంటారు.
సత్య: బాపు వీళ్ల మాటలు విని దిమాక్ కరాబు చేసుకోకు. అమ్మ ఎప్పటి ముచ్చటో చెప్తుంది. అది మా ఫస్ట్ నైట్ ముచ్చట. నిజంగా ఆ రోజు అలా జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. కొట్లాట నడుమ మా పెళ్లి అయింది. టెన్షన్ పడింది. సరే తీ అర్థం చేసుకొని మనతో కలుస్తుంది అని ఓపిక పట్టా. తర్వాత అంతా సెట్ అయింది. మంచిగా కాపురం చేసుకుంటున్నాం. కదా సత్య.
సత్య: హా..
మహాదేవయ్య: నాకు మీ ఇద్దరి మీదా నమ్మకం పోయింది. ఏం చేయాలో మీ ఇద్దర్ని ఎట్లా దారిలో పెట్టాలో నేను చూసుకుంటా.
మరోవైపు విశ్వనాథం ఇంటికి రొయ్యల బిర్యాని ఆర్డర్ వస్తుంది. అయితే నందిని ఆర్డర్ పెట్టిందని అంటారు. ఇక నాన్ వెజ్ తినము అని రివర్స్ పంపేస్తాడు హర్ష. దీంతో సంధ్య అన్నయ్య నువ్వే మీ అత్తారింటికి తీసుకెళ్లి ఇవ్వు అని చెప్తుంది. ఇక విశ్వనాథం నందిని దగ్గరకు వెళ్లమని హర్షకు చెప్తాడు. దీంతో హర్ష రేపు వెళ్తాను అని చెప్పి లోపలికి వెళ్లిపోతాడు.
మరోవైపు రుద్ర తన తండ్రి తన గొంతు పట్టుకున్న సీన్ గుర్తు చేసుకొని రగిలిపోతాడు. పెళ్లాం గదిలోకి రాగానే ఆమె జుట్టు పట్టుకొని భయపెడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.