అన్వేషించండి

Karthika Deepam 2 Serial Today May 15th : కార్తీకదీపం 2 సీరియల్ : దండలు మార్చుకొని గుమ్మం ముందు కార్తీక్, దీపలు.. జ్యోత్స్నని పూర్తిగా మార్చేసిన పారిజాతం!

Karthika Deepam 2 Serial Today Episode : శౌర్య తెలివి తేటలకు తనని మంచి స్కూల్‌లో జాయిన్ చేయమని దశరథ్ కార్తీక్‌కు చెప్పి పంపడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode : కార్తీక్‌ దీప వాళ్ల హోటల్‌కి వచ్చి ఉప్మా తిని చాలా బాగుందని చెప్తాడు. కార్తీక్ ఏదైనా సాయం కావాలి అంటే తనని అడగమని దీపతో చెప్తాడు. కస్టమర్ల దగ్గర సాయం తీసుకోనని చెప్తుంది. కార్తీక్‌ని వెళ్లిపోమని అంటుంది. కార్తీక్ వెళ్తూ నువ్వు వద్దన్నా ఏదో ఒక రకంగా సాయం చేస్తానని అంటాడు.

ఇక జ్యోత్స్న తన తల్లి దీపని తన కూతురు అని అన్నమాటలు పారిజాతం చెప్పిన మాటలు తలచుకుంటుంది. తన తల్లి పాలు తీసుకొని వస్తే జ్యోత్స్న సారీ చెప్తుంది. 

సుమిత్ర: పర్లేదు జ్యోత్న్న నేను నిన్ను అర్థం చేసుకున్నాను.

జ్యోత్స్న: నన్ను అర్థం చేసుకున్నప్పుడు నాలా నువ్వు ఎందుకు ఆలోచించడం లేదమ్మా. నేను ఏదైనా మాట్లాడితే నన్ను కరెక్ట్ చేయడానికి చూస్తున్నావ్ కానీ అర్థం చేసుకోవడం లేదు. 

సుమిత్ర: ఇక ఆ గొడవను వదిలేయ్ జ్యోత్స్న. వాటిని గుర్తు పెట్టుకోవాల్సినంత విలువ కూడా లేదు. దీప తప్పు చేసే మనిషి కాదు. 

జ్యోత్స్న: బావ తప్పు చేసిన వాడా. వాడు అన్నది అదే కదా మమ్మీ. ఎంత మర్చిపోదాం అనుకున్నా నా వల్ల కావడం లేదు. వాడు నా ముందే ఉండి మాట్లాడుతున్నట్లుంది. బావ దీప విషయంలో చేస్తున్నది నాకు నార్మల్‌గా అనిపించడం లేదు. దీప మీద నాకు ఏ కోపం లేదు మమ్మీ కానీ ఇంత జరిగిన తర్వాత తనంటే ఏంటో నాకు అర్థమైంది. కానీ మీకే అర్థం కావడం లేదు.

సుమిత్ర: ఒకే విషయాన్ని ఎక్కువ ఆలోచిస్తే ఇలాగే ఉంటుంది. నేను నీ కంటే ఎక్కువగా దీపని సపోర్ట్ చేస్తున్నాను అని నువ్వు ఫీలవుతున్నావ్. నాకు నీ కంటే ఎవరు ఎక్కువ కాదు. కానీ దీప కూడా నాకు కూతురే. అలా అని దీప కన్న కూతురు కాలేదు కదా. ఈ వ్యత్యాసం నీకు అర్థమైతే బాధ పడాల్సిన అవసరం లేదు.

జ్యోత్స్న: తనలో తాను.. ఇప్పుడేం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు. అప్పుడు దీపని ఇంట్లోకి తీసుకొచ్చి తప్పు చేశానా. 

దశరథ్ రుబిక్ క్యూబ్‌ ఆడుతుంటాడు. శౌర్య అక్కడికి వస్తుంది. తాను ఆ రుబిక్ క్యూబ్ సాల్వ్ చేస్తా అంటుంది. దీంతో దశరథ్ కనీసం దీని పేరు అయినా నీకు తెలుసా అని అంటాడు. ఇక శౌర్య క్యూబ్ తీసుకొని అన్నీ కలర్స్ సెట్ చేసేస్తుంది. దశరథ్ షాక్ అయిపోతాడు. ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు. 

దశరథ్‌.. శౌర్య చాలా తెలివైనదని మంచి స్కూల్‌లో జాయిన్ చేయమని కార్తీక్‌తో అంటాడు. ఇక్కడి స్కూల్‌ పిల్లలతో శౌర్య పోటీ పడలేదని అంటాడు. దాని తెలివి నీకు తెలీదని అంటూ దశరథ్ క్యూబ్ మొత్తం మార్చేసి శౌర్యకి ఇస్తాడు. శౌర్య మళ్లీ సాల్వ్ చేయడంతో కార్తీక్ షాక్ అయిపోతాడు. ఇక దశరథ్ ఈరోజే మంచి స్కూల్‌లో జాయిన్ చేయమంటాడు. ఇక కార్తీక్ దీపని ఇమిటేట్ చేస్తాడు. దశరథ్, శౌర్య నవ్వుకుంటారు. ఇక కార్తీక్ శౌర్యని తీసుకొని స్యూల్‌లో జాయిన్ చేయడానికి వెళ్తాడు. ఇంతలో దీప వచ్చేస్తుంది.  

కార్తీక్: స్కూల్‌లో జాయిన్ చేయడానికి తీసుకెళ్తున్నా.

దీప: మిమల్నీ తీసుకెళ్లమని నేను చెప్పలేదు కదా బాబు. 

కార్తీక్: అత్తయ్య చెప్పింది.

దీప: శౌర్యని స్యూల్‌లో జాయిన్ చేయమని సుమిత్రమ్మ నాతో కూడా చెప్పలేదు. కానీ ఇప్పుడు మీరు చెప్పకుండా తీసుకెళ్తున్నారు.

కార్తీక్: పాప చాలా తెలివైనది. ఇలాంటి వాళ్లని మంచి స్కూల్‌లో జాయిన్ చేస్తే వాళ్ల భవిష్యత్‌ బాగుంటుంది. అందులోనే రౌడీని జాయిన్ చేయమని అత్తయ్య చెప్పింది.

దీప: వద్దు బాబు నేనే తీసుకెళ్తాను. నా మీద కానీ నా బిడ్డ మీద కానీ ఎవరూ జాలి చేయడం నాకు ఇష్టం లేదు బాబు. 

ఇక దీప కార్తీక్‌లు మాట్లాడుకోవడం పారిజాతం, జ్యోత్స్న చూస్తారు. 

పారిజాతం: వాళ్లని అలా చూస్తుంటే వాళ్లిద్దరికీ పెళ్లియి ఆరేళ్లు అయినట్లు, ఆ పిల్ల వాళ్ల పిల్ల అయినట్లు ఉంది.

జ్యోత్స్న: గ్రానీ..

పారిజాతం: అరవకే.. నాకు కనిపించింది నీకు ఎందుకు కనిపించదా.. అది జాలి కాదు బాధ్యత అంటుంటే నీకు అర్థం కావడం లేదా.. నువ్వు అలా కిటికీల నుంచి చూస్తూ ఉండు ఏదో ఒక రోజు దండలు మార్చుకొని గుమ్మం ముందు నిలబడతారు.

జ్యోత్స్న: బావని దీపని వాడు ఎవడో ఒకటి చేసి మాట్లాడితేనే తట్టుకోలేకపోయాను. తనని నువ్వు కూడా వాడిలా మాట్లాడావు అంటే నేను ఊరుకోను.

పారిజాతం: అసలు అక్కడ ఏం జరుగుతుందో చూడవే. అక్కడ నిల్చొని మాట్లాడాల్సిన అవసరం ఏముందే. నీ బావ మగాడు ఆ దీపకు అవసరం ఏముంది. మామూలు రోజుల్లో  అయితే తప్పుగా దాన్ని చూడాల్సిన అవసరం లేదు. కానీ దాని మొగుడే వచ్చి వాళ్లిద్దరికీ అక్రమ సంబంధం అంటకట్టాడు. ఆ తర్వాత అయినా జనం వాళ్లని ఎలా చూస్తారో వాళ్లకి అర్థంకాదా. అయినా వాకిట్లో నిల్చొని మాట్లాడితే ఎలా ఉంటుంది. ఈ రోజు కూతుర్ని చదివిస్తా అంటాడు. తర్వాత తల్లిని ఆదుకుంటా అంటాడు. దీని వల్ల నష్టపోయేది నువ్వే. 

ఇక దీప కార్తీక్‌ సాయాన్ని వద్దు అనేస్తుంది. దీంతో కార్తీక్ వెళ్లిపోతాడు. శౌర్యని ఆ స్కూల్‌లో చేర్పించకపోతే వాళ్లే చేర్పిస్తారని ఎంత కష్టమైనా భరించి ఆ స్కూల్‌లో చేర్పించాలి అనుకుంటుంది. పారిజాతం మళ్లీ జ్యోత్స్నని రెచ్చగొడుతుంది. దీపని ముందు వెళ్లమని తర్వాత కార్తీక్ వెళ్తాడని చెప్తుంది. 24 గంటలు వాళ్లని కనిపెట్టాలని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.

Also Read: 'త్రినయని' సీరియల్: విశాలాక్షి బట్టలు దాచేసి ఘోరంగా అవమానించిన తిలోత్తమ, సుమనలు.. గాయత్రీ సాయం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Mulugu News: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
Embed widget