Trinayani Serial Today May 15th Episode : 'త్రినయని' సీరియల్: విశాలాక్షి బట్టలు దాచేసి ఘోరంగా అవమానించిన తిలోత్తమ, సుమనలు.. గాయత్రీ సాయం!
Trinayani Serial Today Episode : తిలోత్తమ, సుమనలు చేసిని పనికి విశాలాక్షి శాపం పెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Today Episode : విశాలాక్షి మీద పగ తీర్చుకోవాలని తిలోత్తమ, సుమన, వల్లభ అనుకుంటారు. అందుకు విశాలాక్షి స్నానం చేస్తున్న గది దగ్గరకు వస్తారు. స్నానానికి వెళ్లిన విశాలాక్షి టవల్ చుట్టుకొని వచ్చిన తర్వాత తను వేసుకోవడానికి ఒక్క డ్రస్ కూడా ఉండకుండా చేయాలని అనుకుంటారు.
వల్లభ.. విశాలాక్షి బట్టలన్నీ దాచేస్తాడు. ఇక నయని చీరలు కట్టకూడదు అని నయని బీరువాకు తాళం వేసేస్తాడు వల్లభ. ఇక కింద హాల్‌లో మిగతా వాళ్లు ఉంటారు. డమ్మక్క వెటకారంగా నవ్వుతుంది. ఏమైందని అడిగితే అల్పులు చేసే పనికి నవ్వు వస్తుంది అని అంటుంది. ఇక తిలోత్తమ, వల్లభ, సుమనలు హాలులోకి వచ్చేస్తారు.
గాయత్రీ పాప డమ్మక్క దగ్గర ఉన్న వేపాకులు పట్టుకొని విశాలాక్షి దగ్గరకు వెళ్తుంది. అందులోని ఒక వేపాకు బాత్‌రూమ్‌లో ఉన్న విశాలాక్షి దగ్గరకు ఎగురుతూ వెళ్తుంది. ఇక ఇంట్లో విపరీతంగా గాలి వీస్తుంది. దాంతో విశాలాక్షి గది నుంచి వేపాకులు హాల్‌లోకి ఎగురుకుంటూ వస్తాయి. అందరూ షాక్ అయిపోతారు. విశాలాక్షి వేపాకులనే బట్టలుగా ఒంటి మొత్తం వేసుకుంటుంది.
విశాలాక్షి గెటప్ చూసి అందరూ షాక్ అయిపోతారు. తిలోత్తమ, వల్లభ, సుమనలు బిత్తర పోతారు. హాసిని, నయనిలు తెలీకుండానే చేతులు జోడించి దండం పెట్టుకుంటారు. ఇక విశాలాక్షి ముగ్గురి వైపు సీరియస్‌గా చూస్తుంది.
నయని: విశాలాక్షి ఏంటమ్మ వేపాకులు చుట్టుకొని వచ్చావు.
విశాలాక్షి: గాయత్రీ పాప వచ్చి నాకు వేపాకులు ఇచ్చిందమ్మ దాంతో ఇవాళ నేను కట్టాల్సింది దళాలతో కూడిన వస్త్రం అని అర్థమైందమ్మ. ఏంటి సుమన బాగుందా.
సుమన: బ.. బ.. బాగుంది.
వల్లభ: అరే బట్టలు లేకపోతే గది నుంచి బయటకు రాలేదు అన్నారు కదా మమ్మీ.
తిలోత్తమ: రేయ్ నువ్వు నోర్మయ్‌రా.
విశాల్: అమ్మా అంటే ఇది మీ పనేనా..
నయని: అర్థమైంది కదా బాబుగారు విశాలాక్షి స్నానానికి వెళ్తే బట్టలు లేకుండా చేశారని..
హాసిని: మానం మర్యాద తెలీని మీరు మనుషులే కాదు.
విశాలాక్షి: నిజంగానే మీరు మనుషులు కారు. మీరు ఏమన్నా చివరి మాటకు మనుషుల కాదన్నా అనుమానం వచ్చేలా చేస్తాను.
తిలోత్తమ: ఏం చేస్తావ్..
విశాలాక్షి: నేను వేపాకులు వస్త్రంగా కట్టుకొని వచ్చినందుకు నన్ను అవమానించినందుకు నువ్వు మేకలా అరుస్తూ ఉంటావ్. ఇందులో సూత్రధారి అయిన నువ్వు(సుమన) కుక్కలా మొరుగుతూ.. సాయం చేసిన నువ్వు (వల్లభ) పిల్లిలా కూతలు పెడుతూ మానం మర్యాదలు పొగొట్టుకుందురు గాక.
డమ్మక్క: అమ్మ శపించేసింది అనుభవిస్తారు మీరు.
తిలోత్తమ: ఏది ఎక్కడ నేను మేకను అయ్యానా.. ఏదో కోపంతో అలా అంటే అయిపోతామా..
నయని: విశాలాక్షి కోపాన్ని నేను ఎప్పుడూ చూడలేదు అత్తయ్య. మీరు అనుభవిస్తారు అత్తయ్య.
విశాల్: నయని నువ్వూ శపనార్థాలు పెట్టకు వదిలేయ్.
విక్రాంత్: ఎవరు చేసిని పనికి వాళ్లు అనుభవిస్తారు.
తిలోత్తమ: గారడి పిల్ల మమల్ని అవమానించినప్పుడు ఏమైంది.
సుమన: వీళ్లతో మనకేంటి అత్తయ్య పదండి.
రాత్రి సుమన దగ్గరకు హాసిని, నయనిలు వస్తారు. విశాలాక్షి శాపం పెట్టింది కదా సుమన ఇంకా మారలేదు ఎందుకని అనుకుంటారు. విశాలాక్షిని అవమానించినందుకు సుమనను హాసిని, నయనిలు తిడతారు.
నయని: విశాలాక్షి కోపంలో అలా అన్నదేమో కానీ ఇప్పటి వరకు ఎవరికీ ఏం కాలేదు. భయపడాల్సిన పని లేదు.
సుమన: రేపు పొద్దున్న రండి బాగున్నానో విశ్వాసం గల జంతువులా మారానో తెలుస్తుంది.
విక్రాంత్: కుక్క పరువు తీయకు ప్లీజ్.
సుమన: అలా అంటే బాగోదు చెప్తున్నా.
మరోవైపు హాల్‌లో పావనామూర్తి కసరత్తులు చేస్తుంటాడు. హాసిని సెటైర్లు వేస్తుంది. దురంధర కూడా తిడుతుంది. నయని గాయత్రీ పాపని తీసుకొని వస్తుంది. ఇక హాసిని పాటలు పెడుతుంది. డ్యాన్స్ వేస్తే తగ్గుతామని చెప్పి డ్యాన్స్ వేస్తుంది. పావనామూర్తిని కూడా డ్యాన్స్ వేయమని అంటుంది. ఇక సుమన వచ్చి పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తే ఉలూచి ఇబ్బంది పడుతుందని ఆపమని చెప్తుంది. అయితే సుమన మాట్లాడుతూ మధ్య మధ్యలో విశాలాక్షి శాపం వల్ల భౌ భౌ అని కుక్కలా మొరుగుతుంది. అందరూ షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.