అన్వేషించండి

Mukku Avinash: ‘జబర్దస్త్’ వాళ్లు రూ.10 లక్షలు కట్టాలన్నారు - చచ్చిపోవాలనుకున్న టైమ్‌లో ‘బిగ్ బాస్’ రక్షించింది: ముక్కు అవినాష్

Mukku Avinash: ‘జబర్దస్త్’లో కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ముక్కు అవినాష్.. ఆ తర్వాత బిగ్ బాస్ షోలోకి కూడా వెళ్లాడు. తాజాగా అటు జబర్దస్త్‌పై, ఇటు బిగ్ బాస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Mukku Avinash About Jabardasth And Bigg Boss: ‘జబర్దస్త్’ వల్ల ఎంతోమంది స్టాండప్ కామెడియన్లు.. టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. అంతే కాకుండా ఆ కామెడియన్ల వల్లే ఆ షోకు కూడా పేరొచ్చింది. కానీ ఒక్కొక్కరిగా అందులోని కామెడియన్లు అందరూ షోను వదిలేసి వెళ్లిపోవడం మొదలయ్యింది. అలా బయటికి వచ్చేసిన చాలామంది ‘జబర్దస్త్’పై కామెంట్లు చేయడం కామన్ అయిపోయింది. అందులో ముక్కు అవినాష్ కూడా యాడ్ అయ్యాడు. తాజాగా ‘జబర్దస్త్’పై మాత్రమే కాకుండా తన కెరీర్ మొదట్లో ఎదుర్కున్న ఒడిదుడుకుల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అవినాష్.

మంచే జరిగింది..

‘జబర్దస్త్’లో తనను ఎవరైనా కిందకి లాగే ప్రయత్నం చేశారా అని అడగగా.. ఆ స్కోప్ ఎవరికీ ఇవ్వలేదని స్టేట్‌మెంట్ ఇచ్చాడు ముక్కు అవినాష్. ‘‘మనిషి బలహీనంగా ఉన్నప్పుడు, పరిస్థితులను ఎదుర్కోలేనప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు తన వెనుక రాజకీయాలు జరుగుతాయి. మనిషి మంచి స్థాయిలో ఉన్నప్పుడు వాడిని తొక్కేయాలి అనుకుంటారు. జబర్దస్త్‌లో డైరెక్టర్ ఏం చెప్పడు. రెండు స్క్రిప్ట్స్ గ్యాప్ ఇస్తే మన పని అయిపోయిందని అర్థం చేసుకోవాలి. నేను ఉన్నప్పుడు నాకు అంతా మంచే జరిగింది. నితిన్, భరత్ దర్శకులుగా వెళ్లిపోయిన ఏడాది తర్వాత నేను కూడా బిగ్ బాస్ కోసం బయటికి వచ్చేశాను’’ అని చెప్పుకొచ్చాడు ముక్కు అవినాష్.

ఇల్లు సీజ్ చేస్తామన్నారు..

లాక్‌డౌన్ సమయంలో తన పరిస్థితులను గుర్తుచేసుకుంటూ అదంతా దరిద్రం అన్నాడు అవినాష్. ‘‘2019లో జబర్దస్త్ చేస్తున్నాను. అప్పుడే ఇల్లు కొనుకున్నాను. దానికి డబ్బు సరిపోక అప్పు చేశాను. కొంచెం లోన్ తీసుకున్నాను అప్పుడే లాక్‌డౌన్. షూటింగ్లు లేవు. జబర్దస్త్ నుండి కొంత అమౌంట్ వచ్చేది ఉంది. డబ్బులు లేవు. ఈఎమ్‌ఐ కట్టాలి. అప్పటికే 3 నెలలు ఈఎమ్‌ఐ కట్టలేదు. బ్యాంక్ వాళ్లు వచ్చి సీజ్ చేస్తామంటున్నారు. అప్పటికీ ఇంకా పెళ్లి కాలేదు. కనీసం కూరగాయలకు కూడా డబ్బులు లేవు. ఏం అర్థం కాలేని పరిస్థితిలో ఉండిపోయాను. అప్పుడే బిగ్ బాస్ నుండి ఫోన్ వచ్చింది. కానీ బిగ్ బాస్‌లోకి వెళ్లాలంటే జబర్దస్త్‌ను మూడు నెలలు వదిలేయాలి. అలా 3 నెలలు నేను సినిమాలు, ఈవెంట్స్, జబర్దస్త్ అన్నీ వదులుకొని రావాలి. దాన్ని బట్టి నేను ఒక బడ్జెట్ చెప్తే వాళ్లు ఓకే అన్నారు ’’ అని చెప్పుకొచ్చాడు అవినాష్.

ఫ్రీగా జబర్దస్త్..

‘‘బిగ్ బాస్‌కు వెళ్తా అని వెళ్లి జబర్దస్త్ వాళ్లని పర్మిషన్ అడిగాను. కుదరదని కాంట్రాక్ట్ బ్రేక్ చేస్తున్నానని రూ.10 లక్షలు కట్టాలి అన్నారు. ఆ డబ్బులు లేకే బిగ్ బాస్‌కు వెళ్తున్నాను. అక్కడ నుండి నాకు డబ్బులు వస్తే నా సమస్యలు అన్నీ తీరిపోతాయి అనుకున్నాను కానీ వీళ్లు ఇలా అన్నారు. అక్కడ, ఇక్కడ అప్పులు చేసి, బిగ్ బాస్ నుండి కొంచెం అడ్వాన్స్ తీసుకొని జబర్దస్త్ వాళ్లకు అంతా క్లియర్ చేశాకే హౌజ్‌లోకి వెళ్లాను. దీన్ని బట్టి చూస్తే నేను ఫ్రీగా జబర్దస్త్ చేసినట్టే. అసలైతే నేను స్టార్ మాకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను జీరోలో ఉన్నప్పుడు నేను కొనుకున్న ఇల్లు బాల్కానీలో నుండి దూకి ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నాను. అప్పుడే బిగ్ బాస్ నాకు పునర్జన్మ ఇచ్చింది’’ అని బిగ్ బాస్‌ను ప్రశంసించాడు ముక్కు అవినాష్.

Also Read: అందుకే ‘జబర్దస్త్’ వదిలి ‘బిగ్ బాస్’కు వెళ్లా, ఆ రెమ్యునరేషన్ మొత్తాన్ని అలా ఖర్చు చేసేశా: ఫైమా

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 8th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
Godavari Serial Today August 8th: 'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
Nindu Manasulu Serial Today August 8th: నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 8th:చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
నువ్వులేక నేను లేను: చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Embed widget