Satyabhama Serial Today June 20th Episode: సత్యభామ సీరియల్: సత్య కోసం బుక్స్ తెచ్చి అడ్డంగా బుక్ అయిపోయిన క్రిష్.. తండ్రిని చంపడమే తన టార్గెట్ అంటోన్న రుద్ర!
Satyabhama Serial Today Episode సంధ్యని పెళ్లి చేసుకొని నరకం చూపించి విశ్వనాథం ఫ్యామిలీతో పాటు సత్య, క్రిష్‌ల మీద పగ తీర్చుకోవాలి అని కాళీ ప్లాన్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Today Episode రుద్ర తన తండ్రి మహదేవయ్య ఫొటో ముందు కూర్చొని మందు తాగుతూ తండ్రిని తిడతాడు. రోషం తగ్గించుకో అని కాళ్లదగ్గర కుక్కలా పడి ఉన్నానని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ అందరి ముందు అవమానిస్తూ తప్పు మీద తప్పు చేస్తున్నావ్ బాబు అని అనుకుంటావు. నీ పెద్ద కొడుకు రుద్రాని తక్కవంచనా వేస్తున్నావ్ అని అనుకుంటాడు.
రుద్ర: ఇంట్లో అందరి ఇష్టాలు పట్టించుకుంటావ్. చిన్న కొడుకుని నెత్తిన పెట్టుకున్నావ్. నా దగ్గరకు వచ్చే సరికి కాలికి వేసుకొనే చెప్పలెక్క చూస్తావ్. నాకు ఇష్టం లేని పెళ్లి చేశావ్.. ఆ చిన్నా గాడికి నచ్చిన పెళ్లి చేశావ్. నన్ను చిల్లర పనులకు వాడుతున్నావ్ కానీ ఆ చిన్నాగాడిని తోక లెక్క వెంటేసుకొని తిప్పుతావ్. అంత పనికిమాలినోడినా. అంత చేతకానివాడిని. నా పెళ్లం ముందు నా మీద చేయి వేశావ్. నా పరువు పోయింది. అది నా మాట వింటుందా. ఎట్లా కాపురం చేయాలి. అంత ఆశపడుతున్నావ్ కదా వారసుడి కోసం ఎట్లా అయినా చేసి భూమ్మీద పడనివ్వను. ఆ తర్వాత నిన్ను కూడా ఎక్కువ దినాలు ఉండనివ్వను. ఈ సామ్రాజ్యానికి నేనే వారసుడిని. ఎట్లా అడొస్తావో చూస్తా. ఏం చేస్తావో చూస్తా. నేను నీ కొడుకుని కాదు. నీ మృత్యువుని. అని కోపంగా తండ్రి ఫొటో మీదకు మందు గ్లాస్ విసిరేస్తాడు.
సత్య వంట గదిలో ఉంటే రేణుక అక్కడికి వస్తుంది. రెండు చేతులు జోడించి సత్యకు దండం పెడుతుంది. తన జీవితం మొత్తం కష్టాల పాలు చేశాడని అనుకుంటే నీ రూపంతో దేవుడు తనని ఆదుకున్నాడని అంటుంది. ఇప్పటికీ రుద్ర మనసు మారలేదు అని అవకాశం ఎదురు చూస్తుంటాడు అని ప్రతి నిమిషం జాగ్రత్త పడాలి అని అంటుంది సత్య. నీకు నేను అండ కడుపులో బిడ్డకు రక్షగా ఉంటాను క్రిష్ కూడా సపోర్ట్ చేస్తాడని చెప్తుంది. ఇద్దరూ సరదాగా నవ్వుకుంటూ హగ్ చేసుకుంటారు.
క్రిష్ తన ఫ్రెండ్స్ దగ్గర ఉంటాడు. సత్య మాటలు తలచు కొని సత్యను అనుకొని బాబీ చేతికి ముద్దు పెట్టేస్తాడు. బాబీ క్రిష్‌తో వదిన అనుకున్నావా అని సెటైర్లు వేస్తాడు. సత్య తనని తెగ పొగిడిందని తన మనసు గెలుచుకున్నావ్ అని చెప్పిందని క్రిష్ అంటాడు. దానికి బాబీ కల కన్నావా అన్న అంటాడు. క్రిష్ బాబీని ఒక్కటి కొడతాడు. ఇక క్రిష్‌కి మందుని బాబీ ఇస్తే వద్దని బయట తాగడం మానేశాను అని ఇంట్లో సత్య పెగ్ ఏర్పాటు చేస్తుందని అంటాడు. ఇక క్రిష్ ఇంటికి వెళ్లిపోతాడు.
మరోవైపు కాళీ తన ఫ్రెండ్స్‌తో ఫుల్లుగా తాగుతూ క్రిష్ చేసిన అవమానం గుర్తుచేసుకుంటాడు. క్రిష్‌ని ఎదురించలేవని పారిపోయి వచ్చావని కాళీని తన ఫ్రెండ్స్ రెచ్చ గొడతారు. కాళీ తన పగ తన ప్రాణం ఉన్నంత వరకు ఉంటుందని క్రిష్‌ని చంపేస్తా అంటాడు. దానికి కాళీ క్రిష్‌ని చంపాల్సిన అవసరం లేదని సత్య ఫ్యామిలీని టార్గెట్ చేస్తే సత్య కుమిలిపోతుందని దానికి క్రిష్ పని అయిపోతుందని అంటాడు. ఈ సారి విశ్వనాథానికి 20 లక్షలు అడుగుతాను అని వాడు ఇవ్వకపోతే సంధ్యని ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి సంధ్యని పెళ్లి చేసుకొని తనకు జీవితాంతం నరకం చూపిస్తాను అని దాని ద్వారా సత్య క్రిష్‌లు గొడవపడతారు అని అంటాడు. ఇక తనని ఏమైనా చేయాలి అంటే సంధ్య అన్యాయం అయిపోతుంది కాబట్టి తనని ఏం చేయలేడని అంటాడు. సత్య తన పెళ్లి ఫొటోలు చూస్తూ ఉంటుంది. తన పెళ్లి నుంచి విడాకుల కోసం సంతకం పెట్టిన వరకు మొత్తం జరిగింది తలచుకుంటుంది. తన జీవితంలో ఏం జరుగుతుంది ఎటు వెళ్తుందని అనుకుంటుంది. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.
సత్య: నిజంగానే నేను విడాకులకు ముందే నెల తప్పితే పెద్ద వాళ్లకి ఏం చెప్పను. ఒంటరిగా నా బిడ్డ బాధ్యత నా వల్ల అవుతుందా. అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నానానేమో. జరిగిందో జరగలేదో తెలుసుకోకుండా టెన్షన్ పడుతున్నాను. ఇంకా కొన్ని నెలలు ఆగితే ఈ మనిషితో ఈ ఇంటితో నాకు సంబంధం తెగిపోతుంది. అప్పుడు నేను నాకు నచ్చినట్లు సంతోషంగా బతుకుతాను. ఈ ఫొటో దాచుకోవడం ఎందుకు డిలీట్ చేసేస్తాను. ఇంతలో క్రిష్ సత్యా అనుకుంటూ వస్తే సత్య చేతిలో ఫోన్ కింద పడేస్తుంది. క్రిష్ వచ్చి ఫోన్ తీసుకొని అందులో వాళ్ల పెళ్లి ఫోటో చూస్తాడు.
క్రిష్: ఈ ముచ్చటైన ఫొటో ఈ నీ ఫొన్‌లో ఉన్నంత కాలం నువ్వు నా మనసులో ఉన్నంత కాలం నాకు నువ్వు నీకు నేను పరాయి వాళ్లం కాదు సత్య. అయినా నీకు పుస్తకాలు అంటే ఇష్టం కదా సత్య అందుకే నీ కోసం తీసుకొని వచ్చా తీసుకో.
సత్య: 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ఈ బుక్ ఇవ్వడంతో నీ ఉద్దేశం ఏంటి. నాకు ఇలాంటి పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు తీసుకో.
క్రిష్: అరే నీ కోసం కాదు నా కోసం చదువు. నాకు ఏమైనా లాభం ఉంటుందని.
సత్య: 30 రోజుల్లో భర్తని లొంగదీసుకోవడం ఎలా.
క్రిష్: నీకు ఏమైనా లాభం ఉంటుందేమో అని. లొంగిపోవడానికి నేను రెడీగా ఉన్నాను నువ్వు ట్రై చేయడం లేదు. నీకు అయితే 30 రోజులు పట్టదు. 10 రోజులు చాలు. నేను కోపరేట్ చేస్తా కదా.
సత్య: బుద్ధున్నోడు ఎవరూ ఇలాంటి విషయాలు బుక్స్‌లో చదివి నేర్చుకోరు. నీకు ఇలాంటి ఐడియా ఎవరు ఇచ్చారు.
క్రిష్: ఆ షాప్ వాడు. పెళ్లానికి గిఫ్ట్ ఇవ్వాలి మంచి పుస్తకాలు ఇవ్వయ్యా అన్నాను. ఇవి ఇచ్చాడు. తీసుకొచ్చా. మేడంకి ఈ పుస్తకాలు ఇవ్వగానే నా జాతకం మారిపోతుంది అని అన్నాడు.
సత్య: ఈ బుక్స్ తీసుకెళ్లి వాడి ముఖాన కొట్టు.
క్రిష్: నీ మూడ్ మారడానికి ఇంకో గిఫ్ట్ తీసుకొచ్చా. అంటూ మళ్లెపూలు ఇస్తాడు.
సత్య కోపంతో క్రిష్‌ని చూస్తుంది. ఇంకో మూడు నెలలే మనం కలిసి ఉంటాం కదా హ్యాపీగా ఉండాలని క్రిష్ అంటాడు. దానికి సత్య పూలు తీసుకొని మంచం మీద విసిరేస్తుంది. క్రిష్‌ని రెండు తిట్టి బయటకు వెళ్లిపోతుంది. క్రిష్ సత్యని చూసి ఆడదాని మనసు నిజంగానే అర్థం చేసుకోవడం కష్టం అని పొద్దున్న ఇంద్రుడు చంద్రుడు అని పొగిడిందని ఇప్పుడు తిడుతుందని తల పట్టుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.