అన్వేషించండి

Satyabhama Serial Today January 12th: ఉద్యోగం చేసి డబ్బు సంపాదించిన తర్వాతే పెళ్లి చేసుకుంటానన్న సత్య!

Satyabhama Serial Today Episode: తన పెళ్లి చేయడం కోసం ఇళ్లు తాకట్టు పెట్టేయాలి అని సత్య తల్లిదండ్రులు అనుకోవడం సత్య వినేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode: భైరవి అత్తయ్య ఎవరితోనూ మాట్లాడకుండా చేతిలో గంట పట్టుకొని ఊపుతూ ఉంటుంది. వాటిని గంట అనే పని వాడు విని అర్థాలు చెప్తాడు. ఇక భైరవి వచ్చి ఏంట్రా గంట నువ్వు చేస్తున్న పని అని అడిగితే.. అమ్మగారు నేను నిన్న ఓ తప్పు చేశాను అంట అందుకే క్షమాపణ చెప్తున్నాను అని అంటాడు. ఇక అప్పుడే వాళ్లింటికి ఇద్దరు ఆడవాళ్లు వస్తారు. అందులో ఒకఆమెకు మనవుడు పుట్టాడు అని బారసాల చేస్తున్నామని చెప్పి పిలుపు చేస్తారు. ఇక రేణుక ప్రెగ్నెంట్‌ కాలేదు అని వచ్చిన వాళ్లు తలా ఓ మాట అంటే రేణుక ఏడుస్తుంది. బామ్మ రేణుకని ఓదార్చుతుంది. 

మరోవైపు మహాదేవయ్య, రుద్రలతో కలిసి క్రిష్ కారులో వెళ్తుంటాడు. ఎమ్మెల్యే సీటుకోసం మినిస్టర్‌తో మాట్లాడటానికి వెళ్తారు. మీరు వెళ్లి మాట్లాడితే సరిపోయేది ఆయన దగ్గరకు నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు అని క్రిష్‌ అడిగితే నీకు ఇప్పుడు ఇంకేం పని ఉందని రుద్ర అడుగుతాడు. 

క్రిష్‌: పని గురించి కాదులే.. ఇలాంటి ముచ్చట్లు చేయాలి అంటే మనకు మస్తు టైం పడుతుంది.
మహాదేవయ్య: అంత టైం ఏం పట్టదులే చిన్నా. వెళ్లామా ముచ్చట చెప్పామా అంతే.. 
క్రిష్‌: బాబీతో ఫోన్‌లో.. అరే బాబీ చిన్న పడిపని బయటకు పోతున్నా నువ్వు బైక్‌తో  రెడీగా ఉండు అవసరం అయితే కాల్‌ చేస్తా వచ్చేద్దావు కానీ. 
రుద్ర: అరేయ్ పొద్దుగాల ఎప్పుడో బయటకు పోతావ్.. చీకటి పడ్డాక వస్తావ్. ఆ మినిస్టర్‌కి కూడా నీ అన్ని పనులు ఉండవురా.
క్రిష్‌: మనసులో.. నువ్వు కూడా నాలెక్క ఎవరికైనా దిల్ ఇచ్చుంటే అప్పుడు తెలిసేది.. మినిస్టర్ కంటే పోరీని పటాయించడం ఎంత కష్టమో.

విశాలాక్షి: ఏంటి లెక్కలు వేసుకుంటున్నారు.
విశ్వనాథం: ఆ తర్వాత లెక్కలు తప్పి చిక్కుల్లో పడకూడదు అని. రెండు జీవితాలను కూడటానికి మన దగ్గర దాచుకున్న డబ్బుని తీసేయడం సరిపోకపోతే పక్కన అప్పు తెచ్చుకోవడం.
విశాలాక్షి: సత్య పెళ్లి కోసమా.. ఇంతకీ లెక్కలు ఏం తేల్చారు. క్షేమంగా బయటపడతామా.. 
విశ్వనాథం: ఈదాల్సింది చెరువు కాదు సముద్రం అంత సులభంగా ఎలా బయటపడతాం. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్టాఫీసుకి కట్టిన డబ్బులు, రావాల్సిన చీటీ డబ్బులు అంతా కలిపి చూసినా పెళ్లి ఖర్చుకు చాలటం లేదు. వెలతి కనపడుతుంది. ఈ ఇళ్లు తాకట్టు పెట్టాలి అనుకుంటున్నాను. ఇది మనింట్లో జరగబోయే మొదటి పెళ్లి ఎక్కడా తగ్గకూడదు.
సత్య: అన్నీ చాటుగా విని అక్కడికి వస్తుంది. ఎందుకు దాస్తున్నావ్ నాన్న. 
విశ్వనాథం: ఇది నీకు సంబంధించిన విషయం కాదు సత్య అందుకే దాస్తున్నా.
సత్య: ఇది నా పెళ్లికి సంబంధించినది నాకు సంబంధం లేకపోవడం ఏంటి.
విశ్వనాథం: పెళ్లి మాత్రమే నీకు సంబంధించినది. పెళ్లి ఖర్చు మాకు సంబంధించినది.
సత్య: కూతురిగా మీ సంతోషంలోనే కాదు నాన్న కష్టాల్లోనూ భాగముంటుంది. నేను అంతా విన్నాను నాన్న. ఇన్నేళ్ల సర్వీస్‌లో మీరు దాచుకున్నదంతా నా కోసమే ఖర్చు పెట్టేస్తే ఆ తర్వాత మీ పరిస్థితి ఏంటి నాన్న. చెల్లెలి పరిస్థితి ఏంటి. నా పెళ్లి మీ కళ్లలో ఆనందం నింపాలి కానీ బాధ కాదు.
విశాలాక్షి: పెళ్లి సింపుల్‌గా ఎలా తేల్చేస్తాం అనుకున్నావే. పెళ్లి ఎంత గ్రాండ్‌గా జరిపిస్తే అత్తారింట్లో ఆ కూతురుకి అంత విలువ పెరుగుతుంది. నీ పుట్టింటి గురించి అంత గొప్పగా చెప్పుకుంటారు. మాకు కావాల్సింది అత్తింట్లో నువ్వు గౌరవంగా ఉంటడం. 
సత్య: నాకు అక్కడ గౌరవం దక్కొచ్చేమో.. కానీ పెళ్లి తర్వాత మీరు ఇక్కడ పడే కష్టాలు తలచుకుంటే మనసుకి బాధగా ఉంది. నేను ఉద్యోగం చేసి సంపాదించుకొని దాచిపెట్టుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడే పెళ్లి వద్దు. 
విశ్వనాథం: అందరి ముందు మీ నాన్నని కూతురి పెళ్లి చేయలేని చేతకాని వాడిలా నిలబెట్టాలి అనుకుంటున్నావా. అందరూ అలానే అనుకుంటారు అమ్మా. నా మొఖం మీదే అడుగుతారు. ఈ ఫ్యామిలీని నడపడం యజమానిగా నా బాధ్యత నువ్వు దాని గురించి మర్చిపో. 
విశాలాక్షి: చూడు సత్య రాబోయే పెళ్లి కొడుకు గురించి ఆలోచించు. ఈ సంబంధం గడప దాటకుండా వెళ్లకుండా ఏం చేయాలో అది ఆలోచించు మాకు గొప్ప సాయం చేసినట్లే. అర్థమైందా.. 

మరోవైపు రుద్ర, మహదేవయ్య, క్రిష్‌లు మినిస్టర్ ఇంటికి వస్తారు. మినిస్టర్ ధర్మ మహదేవయ్య వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక మహదేవయ్యకు చాలా భయపడతాడు. ఇక మహదేవయ్య ఇద్దరు కొడుకులు రుద్ర, క్రిష్‌లను పొగుడుతాడు. క్రిష్ బయటకు వెళ్లాలి అని ట్రై చేస్తాడు. గతంలో క్రిష్‌ చేసిన ఫైటింగ్ గురించి మాట్లాడుతాడు. ఇక బయటకు వచ్చేసిన క్రిష్ బాబీకి కాల్ చేసి మినిస్టర్ ఇంటికి బైక్ తీసుకొని వచ్చేయ్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: ‘గృహలక్ష్మీ’ సీరియల్‌: చందన ఆచూకి కనిపెట్టిన తులసి - విక్రమ్‌ను కూడా పిచ్చోణ్ణి చేయాలని ప్లాన్ చేసిన రాజ్యలక్ష్మీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu Latest News: హిందీ, ఇంగ్లీషు నేర్చుకుంటే తప్పేంటీ- నేరిస్తే ఢిల్లీతో కమ్యూనికేషన్ ఈజీ: ముఖ్యమంత్రి చంద్రబాబు
హిందీ, ఇంగ్లీషు నేర్చుకుంటే తప్పేంటీ- నేరిస్తే ఢిల్లీతో కమ్యూనికేషన్ ఈజీ: ముఖ్యమంత్రి చంద్రబాబు  
Andhra Pradesh Cabinet Decisions : చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం- కేబినెట్ కీలక నిర్ణయాలు 
చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం- కేబినెట్ కీలక నిర్ణయాలు 
TTD: తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గుడ్ న్యూస్ - మార్చి 24 నుంచి టీటీడీలో సిఫారసు లేఖలకు అనుమతి
తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గుడ్ న్యూస్ - మార్చి 24 నుంచి టీటీడీలో సిఫారసు లేఖలకు అనుమతి
Betting apps: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ - 11 మంది ఇన్‌ఫ్లూయన్సర్లపై కేసులు నమోదు  - వైసీపీ నేత శ్యామలపై కూడా
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ - 11 మంది ఇన్‌ఫ్లూయన్సర్లపై కేసులు నమోదు - వైసీపీ నేత శ్యామలపై కూడా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CM Revanth Reddy on Potti Sriramulu | పొట్టిశ్రీరాములకు అగౌరవం కలిగించాలనే ఉద్ధేశం లేదు | ABP DesamLeopard in Tirupati SV University  | వేంకటేశ్వర యూనివర్సిటీని వణికిస్తున్న చిరుతపులి | ABP DesamSunita Williams Return to Earth Process Explained | సునీతా విలియమ్స్ భూమ్మీదకు వచ్చే విధానం ఇలా| ABPSunita Williams Return to Earth | భూమ్మీద దిగనున్న సునీతా విలియమ్స్..ముహూర్తం అప్పుడే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandra Babu Latest News: హిందీ, ఇంగ్లీషు నేర్చుకుంటే తప్పేంటీ- నేరిస్తే ఢిల్లీతో కమ్యూనికేషన్ ఈజీ: ముఖ్యమంత్రి చంద్రబాబు
హిందీ, ఇంగ్లీషు నేర్చుకుంటే తప్పేంటీ- నేరిస్తే ఢిల్లీతో కమ్యూనికేషన్ ఈజీ: ముఖ్యమంత్రి చంద్రబాబు  
Andhra Pradesh Cabinet Decisions : చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం- కేబినెట్ కీలక నిర్ణయాలు 
చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం- కేబినెట్ కీలక నిర్ణయాలు 
TTD: తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గుడ్ న్యూస్ - మార్చి 24 నుంచి టీటీడీలో సిఫారసు లేఖలకు అనుమతి
తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గుడ్ న్యూస్ - మార్చి 24 నుంచి టీటీడీలో సిఫారసు లేఖలకు అనుమతి
Betting apps: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ - 11 మంది ఇన్‌ఫ్లూయన్సర్లపై కేసులు నమోదు  - వైసీపీ నేత శ్యామలపై కూడా
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ - 11 మంది ఇన్‌ఫ్లూయన్సర్లపై కేసులు నమోదు - వైసీపీ నేత శ్యామలపై కూడా
Chandrababu: గతంలో టీడీపీ ఓడిపోయింది నా వల్లే - మరి ఆ తప్పులు దిద్దుకుంటున్నారా?
గతంలో టీడీపీ ఓడిపోయింది నా వల్లే - మరి ఆ తప్పులు దిద్దుకుంటున్నారా?
Sunitha And Wilmore Latest News: సునీతా విలియమ్స్ భూమ్మీదకు వచ్చే ముహూర్తం ఫిక్స్‌
సునీతా విలియమ్స్ భూమ్మీదకు వచ్చే ముహూర్తం ఫిక్స్‌
Reverse Digital Arrest: డిజిటల్ అరెస్టు చేసి బుక్కయిపోయాడు - ఈ స్కామర్ బుక్కయిన వైనం తెలిస్తే నవ్వకుండా ఉండలేరు !
డిజిటల్ అరెస్టు చేసి బుక్కయిపోయాడు - ఈ స్కామర్ బుక్కయిన వైనం తెలిస్తే నవ్వకుండా ఉండలేరు !
TTD News:  శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆటలు - తిరుమలలో ధర్నా చేసిన బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్
శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆటలు - తిరుమలలో ధర్నా చేసిన బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్
Embed widget