అన్వేషించండి

Satyabhama Serial Today October 31st: సత్యభామ సీరియల్: సత్య మాటలు నమ్మి మహదేవయ్య గాయం చెక్ చేసిన క్రిష్.. ఒక్క చూపుతో సత్యని చంపేశాడుగా!

Satyabhama Today Episode సత్య మహదేవయ్యకు గాయం కాలేదని క్రిష్‌తో చెప్పి తీసుకెళ్లి మహదేవయ్య కట్టు విప్పించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode తండ్రిని ఒంటరిగా వదిలేయడం వల్లే ఇలా జరిగిందని క్రిష్ చాలా బాధపడుతుంటాడు. సత్య క్రిష్‌ని ఫీలవొద్దని చెప్తుంది. నీ మనసుతో ఆలోచించి నేను బుద్ధి తక్కువ పని చేశానని జైలులా ఇంట్లోనే ఉండిపోయావ్ ముద్దు ముచ్చట లేదని అనుకొని ఒక బలహీనమైన క్షణంలో నువ్వు చెప్పినదానికి తలాడించి నీ కొంగు పట్టుకొని వచ్చానని క్రిష్ అంటాడు.

క్రిష్: బాపు గురించి ఆలోచించకుండా నీతో షీకార్లు చేయడానికి బయల్దేరా ఆ తప్పే ఇప్పుడు నెత్తి కొట్టుకునేలా చేసింది. ఆ తప్పే మా బాపు ప్రాణాలు తీసే పరిస్థితికి తెచ్చింది. ఆ తప్పే అందరూ నా గురించి తప్పుగా అనుకునేలా చేసింది. 
సత్య: అంటే తప్పు నాదా నా సంతోషం గురించి ఆలోచించడం తప్పా. నీ మంచి గురించి ఆలోచించే నాది తప్పు అంటున్నావా.
క్రిష్‌: ఎంత సేపు తప్పు నీది నాది అంటున్నావే కానీ మా బాపు  ప్రమాదం నుంచి తప్పించుకున్నారని నీకు ఆ ఫీలింగే ఉందా. 
సత్య: అసలు ప్రమాదం తప్పించుకున్న మనిషిలోనే బాధ లేదు అది నువ్వు గ్రహించావా.
క్రిష్: అంటే ఏంటి సత్య.
సత్య: వదిలేయ్ క్రిష్ ఇప్పుడు నేనే ఏం మాట్లాడినా నీకు అర్థం కాదు మన మధ్య దూరం పెరుగుతుంది.
క్రిష్: ఏం కాదు చెప్పు సత్య బంధం విలువ నీకే  కాదు నాకు కూడా తెలుసు. బంధం దూరం చేసే అంత మాట నువ్వు అన్నావు అంటే దాని వెనక బలమైన కారణం ఉంటుంది కదా అది ఏంటో నాకు తెలియాలి. 
సత్య: నీకు సమాధానం చెప్పను.
క్రిష్‌: చెప్పాల్సిందే మా బాపుని ఒక్క మాట అన్నా ఊరుకోను. 
సత్య: మీ అమ్మ అందరి ముందు నిలదీసింది అప్పుడు కోపం రాలేదు ఏంటి
క్రిష్: టాపిక్ మార్చకు.
సత్య: మీ బాపు అబద్ధం చెప్పాడు. అసలు మీ బాపు మీ ఎలాంటి అటాక్ జరగలేదు. నుదిటి మీద ఎలాంటి గాయం లేదు. కట్టుకట్టుకొని నాటకం ఆడుతున్నారు.
క్రిష్: చాలా డేంజరస్ నింద వేస్తున్నావ్ సత్య.
సత్య: ఇది నింద కాదు నిజం. నిజం తెలియాలి అంటే ఇప్పుడే వెళ్లి మీ బాపు కట్టు విప్పు చూడు
క్రిష్: చూస్తా సత్య మా బాపు మీ అనుమానంతో కాదు నీకు మా బాపు మంచితనం చూపించడానికి. 

క్రిష్ మహదేవయ్య దగ్గరకు వెళ్తాడు. ఆయింట్ మెంట్ తీసుకొచ్చి మందు రాస్తానని కట్టు విప్పమని అంటాడు. దానికి మహదేవయ్య ఎవరు ఇచ్చారు సత్యనా అంత అవసరం లేదు అని చెప్పు అంటాడు. ఇంతలో సత్య వస్తే అనవసరంగా చిన్నాని టెన్షన్ పెడుతున్నావ్ అంత అవసరం లేదు అని అంటాడు. ఉన్నట్టుండి నా ఆరోగ్యం మీద అంత బాధ ఎందుకో అని అంటాడు. సత్య క్రిష్‌ ఇద్దరూ బలవంతంగా మహదేవయ్యని ఒప్పిస్తారు. క్రిష్ కట్టు విప్పితే మహదేవయ్య తల మీద గాయం ఉంటుంది. దాంతో క్రిష్ సత్యని కోపంగా చూసి గదిలోకి వెళ్లిపోతాడు. సత్య షాక్ అయిపోతుంది. మహదేవయ్య కావాలనే నాకు నేనే దెబ్బ తగిలించుకొని నీ రాక కోసం ఎదురు చూస్తున్నా కోడలు కాని కోడలా అని అంటాడు. 

క్రిష్‌:  నీ నోటి నుంచి ఇంత దిగజారిన మాట వస్తుందని నేను ఊహించలేదు సత్య. నీ మాటకు నేను ఎంతో విలువ ఇస్తాను. ఎంతో మర్యాద ఇస్తాను అది అందరితోనూ చెప్పుకుంటాను. నీ కాళ్ల దగ్గర కూర్చొని నా అంత అదృష్టవంతుడు లేడు అని చెప్పుకుంటా నీకు నేను ఇష్టమే కదా మరి ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు. మనం ఒకర్ని ఇష్టపడితే వాళ్లకి ఇష్టమైనవి మనకు నచ్చాలి మరి నువ్వు ఏంటి నా ఒక్కడ్నే ఇష్టపడుతున్నావ్ మా బాపుని ద్వేషిస్తున్నావ్. మా బాపు మీద నువ్వు నింద వేయడం నాకు నచ్చడం లేదు. ఎన్ని చేస్తున్నా మా బాపు మనల్ని ఇష్టపడుతూనే ఉన్నాడు నీకు ఎందుకు మా బాపు మంచి తనం అర్థం కావడం లేదు. మా బాపు మీద ద్వేషం నింపుకున్నావ్. ఈ ద్వేషం పక్కకు పెట్టి చూడు సత్య. 

సత్య క్రిష్‌ని హగ్ చేసుకుంటుంది. మరోవైపు పంకజం భైరవితో పెద్దయ్యగారి పవర్ తగ్గుతుంది చిన్న కోడలు పవర్ పెరుగుతుందని అంటుంది. కనీసం చిన్న కోడలిని ఒక్క మాట కూడా అనలేదు అంటుంది. భైరవితో కనీసం మీరు కూడా ఏం అనలేదు అంటుంది. ఇంతలో సత్య అక్కడికి వస్తుంది. అన్ని పనులు చేసేశాను మీలా ముచ్చట్లు పెట్టుకోలేదు అంటుంది. ఇంతలో జయమ్మ వచ్చి నువ్వు అత్తగా నీ కోడలికి దబాయిస్తున్నావ్ ఇప్పుడు నేను నీఅత్తగా అడుగుతున్నా నువ్వేం చేశావ్ అంటుంది. ఇక క్రిష్ నిద్ర లేవలేదని చెప్పడంతో జయమ్మ అడుగుతుంది. క్రిష్ లేవగానే వేడి వేడిగా కావాలి అంటాడు అంటుంది సత్య దానికి సత్య కాదు అంటే ఛీ ఛీ అవన్నీ నువ్వే అలవాటు చేసుంటావ్ అంటుంది. దానికి సత్య అవును మరి అంటుంది. నా ప్రాబ్లమ్ కల్లారా చూద్దురు రండి అని బామ్మని లాక్కెత్తుంది. తాను దాక్కొని లేవమని అంటూ క్రిష్ పక్కనే జయమ్మని నిల్చొపెడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: మహదేవయ్య కొత్త ప్లాన్.. తండ్రి కాళ్ల మీద పడి ఏడ్చిన క్రిష్‌.. హర్షని దక్కించకోవడానికి మైత్రి స్కెచ్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Chairman: టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియామకం, కొత్త పాలకమండలి సభ్యులు వీరే
టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియామకం, కొత్త పాలకమండలి సభ్యులు వీరే
Mayonnaise Ban: స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కు బిగ్ షాక్, మయోనైజ్‌పై నిషేధం విధించిన ప్రభుత్వం
స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కు బిగ్ షాక్, మయోనైజ్‌పై నిషేధం విధించిన ప్రభుత్వం
Lucky Baskhar Review: లక్కీ భాస్కర్ రివ్యూ: దుల్కర్ లక్కీ అయ్యాడా? - ఈ ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?
లక్కీ భాస్కర్ రివ్యూ: దుల్కర్ లక్కీ అయ్యాడా? - ఈ ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?
KA Movie Review - క రివ్యూ: కిరణ్ అబ్బవరం 2.ఓ - సినిమా ఎలా ఉంది?  హిట్టా? ఫట్టా?
క రివ్యూ: కిరణ్ అబ్బవరం 2.ఓ - సినిమా ఎలా ఉంది? హిట్టా? ఫట్టా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

టీటీడీ ఛైర్మన్‌‌గా బీఆర్ నాయుడు, అధికారిక ప్రకటనబిర్యానీ తెప్పించాలన్న బోరుగడ్డ - జడ్జి స్ట్రాంగ్ కౌంటర్‌తో సైలెంట్SS Rajamouli Lion Update | వైల్డ్ సఫారీ ఫోటోలతో హింట్స్ ఇస్తున్న రాజమౌళి | ABP Desamవివాదంలో సాయి పల్లవి, పాత వీడియో తీసి విపరీతంగా ట్రోల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Chairman: టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియామకం, కొత్త పాలకమండలి సభ్యులు వీరే
టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియామకం, కొత్త పాలకమండలి సభ్యులు వీరే
Mayonnaise Ban: స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కు బిగ్ షాక్, మయోనైజ్‌పై నిషేధం విధించిన ప్రభుత్వం
స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కు బిగ్ షాక్, మయోనైజ్‌పై నిషేధం విధించిన ప్రభుత్వం
Lucky Baskhar Review: లక్కీ భాస్కర్ రివ్యూ: దుల్కర్ లక్కీ అయ్యాడా? - ఈ ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?
లక్కీ భాస్కర్ రివ్యూ: దుల్కర్ లక్కీ అయ్యాడా? - ఈ ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?
KA Movie Review - క రివ్యూ: కిరణ్ అబ్బవరం 2.ఓ - సినిమా ఎలా ఉంది?  హిట్టా? ఫట్టా?
క రివ్యూ: కిరణ్ అబ్బవరం 2.ఓ - సినిమా ఎలా ఉంది? హిట్టా? ఫట్టా?
Diwali 2024: దీపావళి రోజు ఈ ఒక్క వస్తువు కొనితెచ్చుకుంటే చాలు సిరి సంపదలకు కొదవు ఉండదు!
దీపావళి రోజు ఈ ఒక్క వస్తువు కొనితెచ్చుకుంటే చాలు సిరి సంపదలకు కొదవు ఉండదు!
Amaran Twitter Review - 'అమరన్' ట్విట్టర్ రివ్యూ: హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ కేక - ఆర్మీకి పర్ఫెక్ట్ ట్రిబ్యూట్... ఆ బ్లడ్ బాత్ - ఇంటర్వెల్ అయితే?
'అమరన్' ట్విట్టర్ రివ్యూ: హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ కేక - ఆర్మీకి పర్ఫెక్ట్ ట్రిబ్యూట్... ఆ బ్లడ్ బాత్ - ఇంటర్వెల్ అయితే?
Telangana Group 3 : తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ ఇదిగో
తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ ఇదిగో
Happy Diwali 2024 Wishes In Telugu: మీ బంధుమిత్రులకు దీపావళి శుభాకాంక్షలు ఈ శ్లోకాలతో తెలియజేయండి!
మీ బంధుమిత్రులకు దీపావళి శుభాకాంక్షలు ఈ శ్లోకాలతో తెలియజేయండి!
Embed widget