అన్వేషించండి

Satyabhama Serial Today October 30th: సత్యభామ సీరియల్: మహదేవయ్య కొత్త ప్లాన్.. తండ్రి కాళ్ల మీద పడి ఏడ్చిన క్రిష్‌.. హర్షని దక్కించకోవడానికి మైత్రి స్కెచ్!

Satyabhama Today Episode మహదేవయ్య తన మీద రౌడీలు అటాక్ చేశారని తలకు కట్టు కట్టుకొని ఇంట్లో ఉండటం క్రిష్‌ని భైరవి తిట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode సత్య కార్ డ్రైవ్ చేస్తానని అనడంతో క్రిష్‌ పక్కన కూర్చొంటాడు. ఎందుకు అలా అంటే నువ్వు తాగావు కదా అంటుంది. దానికి క్రిష్‌ సూది ఎలా గుచ్చుతుందో అలాగే పెళ్లం కూడా అని అంటాడు. ఇక క్రిష్ సత్యకి థ్యాంక్స్ చెప్తాడు. రోజంతా చాలా సంతోషంగా ఉందని ఇన్ని రోజులు మహదేవయ్య కొడుకుగా బతికా ఈ రోజు సత్యభామ భర్తగా బతికాను అంటాడు. 

సత్య: నీకు మహదేవయ్య కొడుకుగా బతకడం ఇష్టమా.. సత్యభామ భర్తగా బతకడం ఇష్టమా.
క్రిష్: మహదేవయ్య లేకపోతే క్రిష్‌కి జన్మలేదు. సత్యభామ లేకపోతే క్రిష్‌ జీవితమే లేదు. 
సత్య: మందు కొట్టినా తెలివిగానే మాట్లాడుతున్నావ్. 
క్రిష్: ఎప్పుడూ నా చేయి వదలొద్దు నేను బతకలేను ప్లీజ్.
సత్య: నేను నీ చేయి పట్టుకుంది జీవితాంతం నీతో కలిసి బతకడానికి క్రిష్‌.

ఇద్దరూ ఇంటికి వచ్చేస్తారు. సత్య క్రిష్‌ని పట్టుకుంటుంది. క్రిష్ సత్యతో తాగనోడి పెళ్లాం భర్తకి దూరంగా ఉంటుంది. తాగినోడి పెళ్లాం భర్తని అంటిపెట్టుకొని ఉంటుంది అని అంటాడు. ఇక క్రిష్ సత్యతో నువ్వే నా జిందగీ అంటాడు. దానికి ఇదే విషయం గతంలో మీ బాపుతో కూడా అన్నావ్ కదా అంటుంది. అన్నానా అప్పుడు మా బాపుతో చెప్పా ఇప్పుడు నీతో చెప్పా అంతే అంటాడు. మా ఇద్దరిలో కచ్చితంగా ఒకర్నే కాపాడాల్సి వస్తే ఎవరిని కాపాడుతావ్ అని సత్య అడిగితే రేపు సమాధానం చెప్తాలే అంటాడు. ఇద్దరూ లోపలికి వెళ్లేసరికి మహదేవయ్య తలకు కట్టుతో ఉంటాడు. భైరవి, రేణుక, జయమ్మ ఆయన దగ్గర కూర్చొని ఉంటారు. క్రిష్‌, సత్యలు లోపలికి వెళ్తారు. బాపు అని దగ్గరకు వెళ్లబోతే భైరవి క్రిష్‌ని ఆపేస్తుంది. వాడి మీద ఎందుకు అరుస్తున్నావ్ అని మహదేవయ్య అంటాడు. 

భైరవి: నలుగురు కలిసి కర్రలతో అటాక్ చేయడంతో తప్పించుకొని వచ్చావ్ అదే కత్తులతో అయితే. నేను ఉన్నా అని మీ బాపు తోడు వెళ్లావ్ మధ్యలో వదిలేశావ్ కనీసం ఇంటికి జాగ్రత్తగా వచ్చారా లేదా అని ఒక ఫోన్ అయినా చేశావా. ఇదేనా బాధ్యత అంటే. బాపు పాణం కంటే పెళ్లాం ముచ్చటే ఎక్కువనా మీ అన్న జైలుకి వెళ్తే బాపుని చూసుకుంటా అన్నావ్ నీకు కుదురదు అంటే కుదరదు అని చెప్పాలి కదా. మీ అన్న ఉంటే ఇలా చేసేవాడా. 
క్రిష్‌: బాపు ఎవరు మీ మీద అటాక్ చేసింది. వాడి చేతిని విరక్కొట్టి వస్తా.
 
భైరవి సత్యని తుడుతుంది. నీ వల్ల నా పసుపు కుంకుమలు పోయే పరిస్థతి వచ్చింది కనీసం నీకు చీమ కుట్టినట్లు ఉంది కదా అంటుంది. ఇంత జరిగినా నీ పెళ్లాం కనీసం పట్టించుకోవడం లేదు అయినా నువ్వు ఏం అనలేదు అంటే క్రిష్ మహదేవయ్య కాళ్ల దగ్గర కూర్చొని ఏడుస్తూ ఇదంతా నావల్లే జరిగింది బాపు క్షమించు ఇంకెప్పుడు నిన్ను వదలను అంటాడు. దానికి మహదేవయ్య ఏం కాదురా మీ అమ్మ బాధతో అంటుంది. ఇందులో నీ తప్పు నీ భార్య తప్పు ఏం లేదు అని వెళ్లమంటాడు. సత్యతో మహదేవయ్య మాట్లాడి తన నాటకం బయట పెడతాడు. తన తలకు ఉన్న కట్టు తీస్తే సత్య షాక్ అవుతుంది. నీ మొగుడిని నా కంట్రోల్‌లో ఉంచుకోవాలి అంటే ఈ దొంగనాటకం తప్పదు అంటాడు.

మరోవైపు నందిని వాళ్లు ఇంటికి వస్తారు. నందిని ఇంట్లో వాళ్లకి తీర్థయాత్రలకు వెళ్లినట్లు ఉందని హర్ష చేయి నా చేతిలో కంటే వేరే వారి చేతిలో ఉందని అంటుంది. ఇక సంధ్య ఎంజాయ్ చేసిన విషయం చెప్తుంది. సత్య, బావ వచ్చారని హర్ష చెప్తాడు. మైత్రి వీసా పని జరిగినందుకు సంతోషంగా ఉందని ఇంట్లో వాళ్లకి చెప్తారు. ఇక నందిని ఇంట్లో వాళ్లకి నేను దగ్గరుండి మైత్రిని పంపేస్తా అంటుంది. మరోవైపు మైత్రి తన ఫ్రెండ్తో నేను అస్సలు వెళ్లను. ఫారెన్ వెళ్లాల్సి వస్తే హర్షతో హనీమూన్‌కి వెళ్తా అంటుంది. ఇక తన ఫ్రెండ్‌కి ఏదో ప్లాన్ చెప్తుంది. ప్లాన్ రివర్స్ అయితే హర్ష నీ ముఖం చూడడని మైత్రితో తన ఫ్రెండ్‌ అంటుంది. క్రిష్‌ తండ్రికి నిజంగానే గాయం అయిందనుకొని గదిలో ఏడుస్తూ ఉంటాడు. తనని తాను గోడకు కొట్టుకుంటాడు. సత్య చెప్పినా వినడు. నాకు మా బాపుకి మధ్య ఉన్న బంధం నీకు తెలీదు సత్య. బాపు సంతోషం వస్తే నాకు చెప్పుకుంటాడు. కష్టం నాతో చెప్పుకుంటాడు. దేనికైనా బాపు నుంచి వచ్చే మొదటి పేరు చిన్నా అని ఎమోషనల్ అవుతాడు. ఎందుకు బతికి ఉన్నానా అని ఏడుస్తాడు. సత్య దోషిలా ఫీలవకు అని చెప్తుంది. క్రిష్‌ని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: సంజయ్ చెంప పగలగొట్టిన సత్య.. దెబ్బకు మాయం.. ఫుల్ జోష్‌లో క్రిత్య!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
RCB News: డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
Gautham Krishna - Bigg Boss Telugu: సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతితండ్రి ఆరోపణలపై మంచు మనోజ్ ఫైర్Manchu Manoj vs Mohan babu | కరిగిన మంచు...ముదిరిన వివాదం | ABP DesamPushpa Day 4 Collections | రోజు రోజుకూ కలెక్షన్లు పెంచుకుంటున్న పుష్ప 2 | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
RCB News: డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
Gautham Krishna - Bigg Boss Telugu: సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
Pushpa 2: ఇండియా అంతటా పూనకాలే... కానీ కేరళలో మాత్రం ఎందుకిలా? 'పుష్ప 2' విషయంలో మల్లు అభిమానం ఏమైంది?
ఇండియా అంతటా పూనకాలే... కానీ కేరళలో మాత్రం ఎందుకిలా? 'పుష్ప 2' విషయంలో మల్లు అభిమానం ఏమైంది?
Manoj: మోహన్‌బాబు ఇంటి గేటు తోసేసుకుని లోపలికి వెళ్లిన మంచు మనోజ్ దంపతులు - తీవ్ర ఉద్రిక్తత
మోహన్‌బాబు ఇంటి గేటు తోసేసుకుని లోపలికి వెళ్లిన మంచు మనోజ్ దంపతులు - తీవ్ర ఉద్రిక్తత
Fastest Mobile Internet: ప్రపంచంలో ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ అందించే టాప్-10 దేశాలు ఇవే!
ప్రపంచంలో ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ అందించే టాప్-10 దేశాలు ఇవే!
CSIR UGC NET 2024: సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ (డిసెంబరు) - 2024 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం - పరీక్ష ఎప్పుడంటే?
సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ (డిసెంబరు) - 2024 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం - పరీక్ష ఎప్పుడంటే?
Embed widget